vistara airlines
-
గుడ్‌బై విస్తారా! విమాన సిబ్బంది భావోద్వేగ ప్రకటన
ఎయిరిండియాలో విలీనానికి ముందు నడిచిన చివరి విస్తారా ఎయిర్‌లైన్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో విమాన సిబ్బంది ‘గుడ్‌బై విస్తారా’ అంటూ భావోద్వేగ ప్రకటన చేశారు. ఇటీవల నడిచిన చివరి విస్తారా ఎయిర్‌లైన్స్ ఎయిర్‌క్రాఫ్ట్ కెప్టెన్ చేసిన ప్రకటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.కెప్టెన్ సుధాన్షు రైక్వార్, నేహల్ చేసిన ప్రకటనకు సంబంధించిన షార్ట్ క్లిప్‌ను ఎక్స్ వేదికలో పంచుకున్నారు. ‘చివరి విస్తారా సర్వీస్ బ్రాండ్‌గా మీకు అత్యుత్తమ భద్రత, సేవలను అందించే అవకాశం దక్కినందుకు సంతోషిస్తున్నాం. కొన్నేళ్లుగా విస్తారా వివిధ ఖండాల్లో విస్తరించి, విభిన్న సంస్కృతులు కలిగిన ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసింది. ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. అంకితభావం, భద్రత, విశ్వసనీయతతో మీకు సేవ చేయడం మా లక్ష్యం. విస్తారా చివరి సర్వీస్ ఈ రోజు మేము అదే ఉన్నత ప్రమాణానికి కట్టుబడి ఉన్నాం. గుడ్‌బై విస్తారా. మేము ఎంతో మిస్ అవుతాం’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.Captain Capt Sudhanshu Raikwar and First Officer @Nehal_404 made an emotional yet confident announcement yesterday, marking their final flight as cockpit crew with @airvistara . #Aviation #Avgeek #Pilot #vistaraflight #Vistara https://t.co/G3rvMkTSRE pic.twitter.com/OvmZSmA2JT— Aman Gulati 🇮🇳 (@iam_amangulati) November 12, 2024ఇదీ చదవండి: ఇంటర్లో 39% మార్కులు! కట్ చేస్తే కంపెనీకి సీఈఓపదేళ్లుగా కార్యకలాపాలు సాగించిన విమానయాన సంస్థ విస్తారా నవంబర్ 11 నుంచి తన సేవలు నిలిపేసింది. నవంబర్ 12 నుంచి సంస్థ విమానాలు, సిబ్బంది ఎయిరిండియాకు బదిలీ అవుతారని గతంలో కంపెనీ సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. విలీన డీల్‌లో భాగంగా ఎయిరిండియాలో రూ.2,058.50 కోట్ల మేర సింగపూర్ ఎయిర్‌లైన్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెట్టే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గతంలో ఆమోదముద్ర వేసింది. దీనితో విలీనానికి మార్గం సుగమమైంది. విలీనానంతరం ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కి 25.1 శాతం వాటా లభిస్తుంది. -
ఒకే సంస్థ.. ఒకే హోదా.. రిటైర్మెంట్ వయసులో తేడా!
టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంయుక్త యాజమాన్యంలోని విస్తారా నవంబర్ 11 నుంచి ఎయిరిండియా ఎయిర్‌లైన్స్‌లో విలీనం అవుతుంది. ఈ విలీనం వల్ల ఇప్పటివరకు ఎయిరిండియా సర్వీసులో ఉన్న పైలట్లు మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. విస్తారా, ఎయిరిండియాలో పనిచేస్తున్న పైలట్ల రిటైర్మెంట్ వయసే అందుకు కారణమని తెలియజేశారు.నవంబర్ 11 నుంచి విస్తారా ఎయిర్‌లైన్స్ ఎయిరిండియాలో విలీనం అవుతుంది. ఈమేరకు గతంలోనే ఇరు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. అయితే ఎయిరిండియా పైలట్లు మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నట్లు కొందరు అధికారులు తెలిపారు. ఎయిరిండియా పైలట్ల రిటైర్మెంట్ వయసు 58 ఏళ్లుగా ఉంది. ఇప్పటివరకు విస్తారాలో పని చేసిన పైలట్లు రిటైర్మెంట్ వయసు మాత్రం 60 ఏళ్లుగా ఉంది. ఒకే సంస్థలో, ఒకే స్థానంలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసులో తేడా ఉండడంపై ఎయిరిండియా పైలట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎయిరిండియా యాజమాన్యం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. డీజీసీఏ నిబంధనల ప్రకారం పైలట్లు తమకు 65 ఏళ్లు వచ్చేవరకు సేవ చేయవచ్చు. ఈ ఏడాది ఆగస్టులో ఎయిరిండియా ఎంపిక చేసిన పైలట్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన పదవీ విరమణ తర్వాత 65 ఏళ్ల వరకు సర్వీసు పొడిగించే పాలసీని ప్రకటించింది.ఇదీ చదవండి: పెళ్లిరోజున భార్యను బాధపెట్టిన నారాయణమూర్తి!రూ.2,058.50 కోట్ల డీల్పదేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న విమానయాన సంస్థ విస్తారా ఈరోజు నుంచి కనుమరుగు కానుంది. నవంబర్ 11 నుంచి విస్తారా సేవలు నిలిపేయనుంది. నవంబర్ 12 నుంచి సంస్థ విమానాలు, సిబ్బంది ఎయిరిండియాకు బదిలీ అవుతారని గతంలో కంపెనీ సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. విలీన డీల్‌లో భాగంగా ఎయిరిండియాలో రూ.2,058.50 కోట్ల మేర సింగపూర్ ఎయిర్‌లైన్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెట్టే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గతంలో ఆమోదముద్ర వేసింది. దీనితో విలీనానికి మార్గం సుగమమైంది. విలీనానంతరం ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కి 25.1 శాతం వాటా లభిస్తుంది. -
మరో 25 విమానాలకు బాంబు బెదిరింపు
ముంబై/న్యూఢిల్లీ: విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఆదివారం దేశీయ విమానయాన సంస్థలకు చెందిన 25 సర్వీసులకు బాంబు పెట్టామనే హెచ్చరికలు అందాయి. దీంతో, ఈ వారంలో ఇప్పటి వరకు విమానాలకు అందిన బాంబు బెదిరింపుల సంఖ్య 90 దాటింది. అయితే ఇవన్నీ వట్టివేనని తేలిందని అధికారులు వివరించారు. ఆదివారం హెచ్చరికలు అందిన వాటిలో ఇండిగో, విస్తార, ఆకాశ ఎయిర్, ఎయిరిండియా విమానాలున్నాయి. తమ జెడ్డా–ముంబై, కోజికోడ్–దమ్మమ్, ఢిల్లీ–ఇస్తాంబుల్, ముంబై–ఇస్తాంబుల్, పుణె–జోధ్‌పూర్ సర్వీసులకు ఆన్లైన్లో బెదిరింపులొచ్చాయని ఇండిగో తెలిపింది. ఢిల్లీ–ఫ్రాంక్ఫర్ట్, సింగపూర్–ముంబై, బాలి–ఢిల్లీ, సింగపూర్–ఢిల్లీ, సింగపూర్–పుణె విమానాలకు బెదిరింపులందాయని విస్తార వెల్లడించింది. అహ్మదాబాద్–ముంబై, ఢిల్లీ–గోవా, ముంబై–బగ్డోగ్రా, ఢిల్లీ–హైదరాబాద్, కొచ్చి–ముంబై, లక్నో–ముంబై విమాన సర్వీసులకు బాంబు పెట్టామనే హెచ్చరికలు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఆన్లైన్లో వచ్చాయని ఆకాశ ఎయిర్ వివరించింది. అదేవిధంగా, ఎయిరిండియాకు చెందిన ఏడు విమానాలకు కూడా బెదిరింపులు వచ్చాయని అధికారులు తెలిపారు. వీటిపై ఆ సంస్థ స్పందించలేదు. -
విస్తారా విమానానికి బాంబు బెదిరింపు..
-
టాటా.. గుడ్‌బై.. విస్తారా ఇక కనుమరుగు..
న్యూఢిల్లీ: పదేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న విమానయాన సంస్థ విస్తారా ఇక కనుమరుగు కానుంది. నవంబర్ 12 నుంచి టాటా గ్రూప్‌లో భాగమైన మరో సంస్థ ఎయిరిండియాలో విలీనం కానుంది. విస్తారా సేవల నిలిపివేతకు నవంబర్ 11 ఆఖరు తేదీగా నిర్ణయించారు. నవంబర్ 12 నుంచి సంస్థ విమానాలు, సిబ్బంది ఎయిరిండియాకు బదిలీ అవుతారని కంపెనీ సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. నవంబర్ 12 లేదా ఆ తర్వాత చేసే ప్రయాణాలకు సంబంధించి సెపె్టంబర్ 3 నుంచి బుకింగ్స్ నిలిచిపోతాయని విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాత నుంచి తమ వెబ్సైట్లో బుకింగ్స్ అన్ని ఎయిరిండియా సైటుకు రీడైరెక్ట్ అవుతాయని పేర్కొంది. నవంబర్ 12 తర్వాత ప్రయాణాలకు బుక్ చేసుకున్నవారి ఫ్లయిట్ నంబర్లను సెపె్టంబర్లో దశలవారీగా ఆటోమేటిక్‌గా ఎయిరిండియాకు మారుస్తారు. కస్టమర్లకు ఆ వివరాలు తెలియజేస్తారు. మరింత విస్తృత నెట్వర్క్, విమానాలతో మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు ఈ విలీనం తోడ్పడగలదని విస్తారా సీఈవో వినోద్ కణ్ణన్ తెలిపారు. ఎయిరిండియాలో ఎస్‌ఐఏకి 25.1 శాతం వాటా.. విలీన డీల్‌లో భాగంగా ఎయిరిండియాలో రూ. 2,058.50 కోట్ల మేర సింగపూర్ ఎయిర్‌లైన్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెట్టే ప్రతిపాదనకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీనితో విలీనానికి మార్గం సుగమమైందని, ఈ ఏడాది ఆఖరు నాటికి ప్రక్రియ పూర్తి కావచ్చని సింగపూర్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. విలీనానంతరం ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కి 25.1 శాతం వాటా లభిస్తుంది. ఫిట్మెంట్ ప్రక్రియ ప్రారంభం.. ఎయిరిండియా, విస్తారా విలీన ప్రక్రియపై ప్యాసింజర్లకు స్పష్టతనిచ్చేందుకు ఇప్పటికే ఎఫ్ఏక్యూలను (సందేహాలు, సమాధానాలు) సిద్ధం చేశారు. అలాగే ఫిట్మెంట్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్‌గా విస్తారా 2015 జనవరిలో కార్యకలాపాలు ప్రారంభించింది. విస్తారాకు 70 విమానాలు ఉండగా, 50 పైచిలుకు గమ్యస్థానాలకు సరీ్వసులు నిర్వహిస్తోంది. ఎయిరిండియాలో కంపెనీ విలీనాన్ని 2022 నవంబర్‌లో ప్రకటించారు. 2023 సెపె్టంబర్లో ఈ డీల్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. నష్టాల్లోనే కొనసాగుతున్న ఎయిరిండియా, విస్తారాలో 23,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం ఎయిరిండియా గ్రూప్ గొడుగు కింద ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్ (గతంలో ఎయిర్ఏషియా ఇండియా) కార్యకలాపాలు సాగిస్తున్నాయి. -
ప్యారిస్–ముంబై విమానానికి బాంబు బెదిరింపు
ముంబై: పారిస్ నుంచి 306 మందితో ముంబై బయల్దేరిన విస్తారా విమానానికి ఆదివారం బాంబు బెదిరింపు వచ్చింది. ‘బాంబు పెట్టాం’ అని రాసిన నోట్ ఎయిర్ సిక్నెస్ బ్యాగ్‌లో కనిపించింది. దాంతో ముంబైలో లాండవగానే అందరినీ హుటాహుటిన దించేసి తనిఖీలు చేపట్టారు. బాంబు సహా అనుమానాస్పద వస్తువులేవీ లేవని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
భారీ వర్షం.. నిలిచిన విమానాలు
ప్రపంచంలోనే రద్దీగా ఉండే ఎయిర్‌పోర్ట్‌ల్లో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తడంతో భారత్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో ఎయిర్ ఇండియా, ఇండిగో తమ సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించాయి. దిల్లీ విమానాశ్రయంలో దుబాయ్‌కి వెళ్లే పది విమానాలు, దుబాయ్ నుంచి వచ్చే తొమ్మిది విమానాలను రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. భారత్‌లోని వివిధ నగరాల నుంచి ఎయిరిండియా దుబాయ్‌కి వారానికి 72 విమానాలను నడుపుతోంది. #6ETravelAdvisory: Flights to/fro #Dubai stand canceled until 12 PM on Apr 18, due to Airport restrictions and operational challenges caused by bad weather and road blockages. Do explore our alternate flight options or request for a full refund by visiting https://t.co/xe8o6KQdpT — IndiGo (@IndiGo6E) April 17, 2024 ‘రాబోయే కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో విమానాలను నడిపేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం బాధిత ప్రయాణికులకు వసతి కల్పించడానికి కృషిచేస్తున్నాం. 16, 17 తేదీల్లో ప్రయాణాలకోసం టికెట్ బుక్చేసినవారు ఒకసారి తేదీ మార్చుకునేందుకు అవకాశం కల్పించనున్నాం. దాంతో వారు తమ గమ్యస్థానాలు చేరేలా ఏర్పాటు చేస్తున్నాం’అని ఒక ప్రతినిధి చెప్పారు. #TravelUpdate: SpiceJet flights to/from Dubai (DXB) are affected due to adverse weather conditions in Dubai. Please refer link https://t.co/rNJZcxc6Wo for an alternate flight, or a full refund. You may also get in touch with our 24/7 Customer Care Helpline Numbers at +91 (0)124… — SpiceJet (@flyspicejet) April 17, 2024 ఇదీ చదవండి: ఎన్పీసీఐ సమావేశం..గూగుల్‌పే, ఫోన్‌పేకు లేని ఆహ్వానం! ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా, ఇండిగో, స్పైస్‌జెట్‌తో సహా ఇతర విమానయాన సంస్థలు దుబాయ్‌కి వెళ్లే మార్గంలో అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దుబాయ్‌కి వెళ్లే అన్ని సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ప్రకటించింది. 2023 ఏడాదికిగాను ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రెండో విమానాశ్రయంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. -
పైలట్ల కొరత.. సమస్య పరిష్కారానికి చర్చలు!
పైలట్ల సమస్యల పరిష్కారానికి ఇటీవల విస్తారా ఉన్నతాధికారులు సమావేశమై కొత్త కాంట్రాక్టులు, రోస్టరింగ్ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సవరించిన వేతన విధానాన్ని వ్యతిరేకిస్తూ.. కొంత మంది పైలట్లు రాజీనామాలకు తెరతీసిన సంగతి తెలిసిందే. తగినంత సంఖ్యలో పైలట్లు అందుబాటులో లేకపోవడంతో గత 2-3 రోజుల్లోనే 100కి పైగా విమానాలను విస్తారా రద్దు చేసింది. బుధవారం సుమారు 26 విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. తాజా పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మరోవైపు విమానాల రద్దు, ఆలస్యంపై రోజువారీ నివేదికను సమర్పించాల్సిందిగా విస్తారాకు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ సూచించింది. ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుల జాబితాలో తెలుగువారు ఎక్కడంటే.. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి పైలట్లతో విస్తారా సీఈఓ వినోద్ కన్నన్ సహా ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైనట్లు తెలిసింది. ఈ సమావేశంలో మానవ వనరుల విభాగం, ఇతర విభాగం అధికారులు పాల్గొన్నారని కంపెనీలు వర్గాలు తెలిపాయి. అయితే సమావేశ వివరాలకు సంబంధించి కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. విమాన సర్వీసుల నిర్వహణ తిరిగి సాధారణ స్థితికి వస్తోందని కంపెనీ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
పైలట్ల కొరత.. సమస్య పరిష్కారానికి చర్చలు!
పైలట్ల సమస్యల పరిష్కారానికి ఇటీవల విస్తారా ఉన్నతాధికారులు సమావేశమై కొత్త కాంట్రాక్టులు, రోస్టరింగ్ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సవరించిన వేతన విధానాన్ని వ్యతిరేకిస్తూ.. కొంత మంది పైలట్లు రాజీనామాలకు తెరతీసిన సంగతి తెలిసిందే.తగినంత సంఖ్యలో పైలట్లు అందుబాటులో లేకపోవడంతో గత 2-3 రోజుల్లోనే 100కి పైగా విమానాలను విస్తారా రద్దు చేసింది. బుధవారం సుమారు 26 విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. తాజా పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మరోవైపు విమానాల రద్దు, ఆలస్యంపై రోజువారీ నివేదికను సమర్పించాల్సిందిగా విస్తారాకు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ సూచించింది.ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుల జాబితాలో తెలుగువారు ఎక్కడంటే..ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి పైలట్లతో విస్తారా సీఈఓ వినోద్ కన్నన్ సహా ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైనట్లు తెలిసింది. ఈ సమావేశంలో మానవ వనరుల విభాగం, ఇతర విభాగం అధికారులు పాల్గొన్నారని కంపెనీలు వర్గాలు తెలిపాయి. అయితే సమావేశ వివరాలకు సంబంధించి కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. విమాన సర్వీసుల నిర్వహణ తిరిగి సాధారణ స్థితికి వస్తోందని కంపెనీ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
ప్రయాణికులకు క్షమాపణ చెప్పిన ప్రముఖ సంస్థ
విస్తారా ఎయిర్‌లైన్స్ తాత్కాలికంగా తన విమాన కార్యకలాపాలను తగ్గించుకోనుంది. పైలెట్లు, ఫస్ట్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడం ఇందుకు కారణమని తెలుస్తుంది. వేతన సవరణకు వ్యతిరేకంగా వీరంతా అనారోగ్య సెలవులో ఉండడంతో, సోమవారం దాదాపు 50 సర్వీసులు రద్దు అయినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. మంగళవారం ఈ సంఖ్య 70కి చేరొచ్చని అంచనా. తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో పాటు పలు కారణాల వల్ల విమానాల రద్దు, ప్రయాణాల్లో ఆలస్యం చోటు చేసుకుంటోందని విస్తారా ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. విమాన సర్వీసుల రద్దుపై ప్రయాణికులకు సంస్థ క్షమాపణలు తెలిపింది. సర్వీసుల రద్దుకు కారణాలను వెల్లడించలేదు. త్వరలోనే సాధారణ స్థాయిలో కార్యకలాపాలను చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. రద్దు అయిన సర్వీసులకు చెందిన ప్రయాణికులకు ఛార్జీలు రీఫండ్ చేస్తామని చెప్పారు. విస్తారా ఎయిర్ ఇండియాతో విలీనానికి ముందు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుండడం గమనార్హం. విస్తారా 300 కంటే ఎక్కువ దేశీయ, అంతర్జాతీయ విమానాలను నడుపుతుంది. ప్రయాణాల్లో అవాంతరాలు ఎదుర్కొంటున్న ప్యాసింజర్లను తమ గమ్యస్థానం చేర్చడానికి వైడ్-బాడీ డ్రీమ్లైనర్లు, ఎయిర్‌బస్ A321లను వాడుతున్న కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: యాపిల్ కొత్త ఆవిష్కరణల గురించి తెలుసుకోవాలా..? గత 2-3 రోజులుగా ప్యాసింజర్ల ప్రయాణాల్లో మరింత ఆలస్యం అవుతుందని, సోషల్ మీడియాలో ఫిర్యాదులు వచ్చినట్లు తెలిసింది. దానికితోడు సోమవారం ప్రధాని మోదీ ముంబై నగర పర్యటన ఉండడంతో వీవీఐపీలు రాకపోకలు సాగించారు. దాంతో విస్తారాతోపాటు ఇతర సంస్థల విమానాలు కూడా సోమవారం 30-40 నిమిషాలు ఆలస్యం అయ్యాయి. -
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘోరప్రమాదం తప్పింది
ఢిల్లీ: బుధవారం మధ్యాహ్నాం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘోరప్రమాదం తప్పింది. విస్తారా ఎయిర్‌లైన్స్‌కే చెందిన రెండు విమానాలు ఒకే రన్‌వేలో ఎదురెదురుగా వచ్చాయి. కాస్తుంటే అవి రెండూ ఢీ కొట్టుకుని పెను విషాదం చోటు చేసుకునేది. అయితే ఓ విమానంలోని మహిళా పైలట్ అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి చేరిన విస్తారా విమానం.. బుధవారం ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పర్యవేక్షణలో పార్కింగ్ బే వైపు చేరుకునేందుకు సిద్ధమైంది. సరిగ్గా అదే సమయంలో ఢిల్లీ-బాగ్డోగ్రా(పశ్చిమ బెంగాల్) విస్తారా విమానానికి అదే రన్‌వే నుంచి టేకాఫ్‌కు అనుమతిచ్చారు. అయితే రెండు విమానాలు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉండగా.. అహ్మదాబాద్-ఢిల్లీ ఫ్లైట్‌లో ఉన్న కెప్టెన్ సోనూ గిల్(45) జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థను అప్రమత్తం చేశారు. దీంతో.. ఘోర ప్రమాదం తప్పింది. ఆ వెంటనే టేకాఫ్ రద్దు చేసి.. ఢిల్లీ-బాగ్డోగ్రా విమానాన్ని తిరిగి పార్కింగ్ వైపు మళ్లించారు. రెండు విమానాల్లో కలిపి 300 మంది దాకా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు.. అది ఈ మధ్యే ప్రారంభమైన రన్‌వే. ఒకవేళ ఆమె(సోనూ గిల్) గనుక అప్రమత్తం చేయకుండా ఉండి ఉంటే ఘోర ప్రమాదమే జరిగి ఉండేదని అధికారులు అంటున్నారు. ఏటీసీ అధికారి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని డీజీసీఏ(పౌర విమానయాన శాఖ) ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు సంబంధిత అధికారిని విధుల నుంచి తప్పించినట్లు ప్రకటించింది. A potentially catastrophic incident was narrowly averted at #Delhiairport on Wednesday morning when a #Vistara Airlines plane was cleared for take-off while another aircraft was in process of landing. The incident involved Flight UK725 en route from #Delhi to #Bagdogra,… pic.twitter.com/5GnT7RixLF — Thomas Nahar (@Thomasnahar_gfx) August 23, 2023 -
31 శాతం తగ్గిన విస్తారా నష్టాలు
ముంబై: గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో ప్రయివేట్ రంగ విమానయాన కంపెనీ విస్తారా నష్టాలు భారీగా తగ్గాయి. రూ. 1,393 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది(2021–22) లో నమోదైన రూ. 2,031 కోట్లతో పోలిస్తే 31 శాతంపైగా రికవర్ అయ్యాయి. కార్పొరేట్ వ్యవహారాల శాఖకు దాఖలు చేసిన సమాచారం ప్రకారం టాటా ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్(విస్తారా) మొత్తం ఆదాయం రెట్టింపై రూ. 11,784 కోట్లను తాకింది. దీంతో నష్టాలు భారీగా తగ్గినట్లు కంపెనీ పేర్కొంది. అయితే నెట్‌వర్త్ రూ. 1,250 కోట్ల నుంచి రూ. 502 కోట్లకు నీరసించింది. దేశీ విమానయాన పరిశ్రమ గతేడాది పటిష్ట వృద్ధిని సాధించినట్లు విస్తారా తెలియజేసింది. కోవిడ్ ముందుస్థాయిని సైతం అధిగమించినట్లు వెల్లడించింది. గత ఆరు నెలల్లో సగటున ప్రతిరోజూ 4 లక్షల మంది ప్రయాణికులు నమోదవుతున్నట్లు తెలియజేసింది. ఉమ్మడి నష్టం ఇలా.. టాటా గ్రూప్ వెలువరించిన 2022–23 వార్షిక నివేదిక ప్రకారం గతేడాది గ్రూప్‌లోని ఎయిరిండియా, ఎయిరేíÙయా, విస్తారాల ఉమ్మడి నష్టం రూ. 15,532 కోట్లుగా నమోదైంది. వెరసి 2021–22లో నష్టం రూ. 13,838 కోట్లు మాత్రమే. అయితే ఈ కాలంలో మూడు సంస్థల ఆదాయం పుంజుకున్నప్పటికీ ఎయిరిండియా విమానాలు, ఇంజిన్ల నిలుపుదల కారణంగా రూ. 5,000 కోట్లమేర అదనపు ప్రొవిజనింగ్ చేపట్టడంతో ఉమ్మడి నష్టాలు పెరిగాయి. టాటా సన్స్ వార్షిక నివేదిక ప్రకారం గతేడాది ఎయిరిండియా ఆదాయం రూ. 31,377 కోట్లను దాటగా.. రూ. 11,388 కోట్ల నష్టం నమోదైంది. ఎయిరేíÙయా టర్నోవర్ రూ. 4,310 కోట్లుకాగా.. రూ. 2,750 కోట్ల నష్టం ప్రకటించింది. అయితే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ మాత్రం గతేడాది రూ. 5,669 కోట్ల ఆదాయం సాధించింది. అంతేకాకుండా రూ. 117 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
మారిషస్‌కు విస్తారా సర్వీస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ విస్తారా తాజాగా మారిషస్‌కు సర్వీసును ప్రారంభిస్తోంది. ముంబై నుంచి వారంలో అయిదు సర్వీసులు మార్చి 26 నుంచి మొదలు కానున్నాయి. ముంబై నుంచి విస్తారా ఇప్పటికే 11 దేశాలకు విమాన సర్వీసులను నడుపుతోంది. -
ప్లేస్ ఏదైనా, క్లాస్ ఏదైనా.. విస్తారా బంపర్ ఆఫర్ ఉందిగా!
సాక్షి, ముంబై: టాటా యాజమాన్యంలోని ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా ఎయిర్ లైన్స్ తమ ప్రయాణికులకు తక్కువ ధరల్లో విమాన టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశీయ, అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో 4 రోజుల ఫెస్టివ్ సేల్‌ను ప్రకటించింది. ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్ అనే మూడు క్యాబిన్ తరగతులకు ఈ సేల్ ఛార్జీలపై తగ్గింపులను అందిస్తుంది. అక్టోబర్ 17, 2022 నుంచి అక్టోబర్ 20, 2022 వరకు జరిగే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్లపై అక్టోబర్ 23, 2022 నుంచి మార్చి 31, 2023 వరకు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. దేశీయంగా అన్ని చార్జీలు కలుకుపుని 1499లకే విమాన టికెట్‌ను అందిస్తోంది. వన్-వేలో అన్నీ కలిపిన దేశీయ ఛార్జీలు ఎకానమీకి రూ. 1,499, ప్రీమియం ఎకానమీకి రూ. 2,999, బిజినెస్ క్లాస్‌కు రూ. 8,999 (సౌకర్యపు రుసుములు వర్తిస్తాయి) నుండి ప్రారంభమవుతాయి. ఇక అంతర్జాతీయ రూట్లలో, అన్నీ కలిపిన రిటర్న్ ఛార్జీలు ఎకానమీకి రూ. 14,149, ప్రీమియం ఎకానమీకి రూ. 18,499, బిజినెస్ క్లాస్‌కు రూ. 42,499 నుండి ప్రారంభం. ఇటీవలి కాలంలో విమాన ప్రయాణానికి డిమాండ్ పెరగడం చాలా ప్రోత్సాహకరంగా ఉందని, ఈ పండుగ సందర్భంగా తమ కస్టమర్లకు సంతోష కరమైన క్షణాలను ఎంజాయ్ చేసి, ఆ జ్ఞాపకాలను గుర్తుంచుకునేలా చేయడమే తమ లక్క్ష్యమని విస్తారా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ దీపక్ రజావత్ తెలిపారు. అత్యుత్తమ సేవలను అందించే ఎయిర్‌లైన్ విస్తారా కస్టమర్ల ఇష్టమైన ఎంపికగా కొనసాగుతుందనే విశ్వాసాన్ని ప్రకటించారు. Let your travel plans take flight with the Festive Sale! Enjoy discounted fares across different cabin classes on our international network. Book until 20-Oct-22 for travel between 23-Oct-22 and 31-Mar-23: https://t.co/rbWxAfgtNJ pic.twitter.com/Zs8ASBibng — Vistara (@airvistara) October 18, 2022 Travelling home for the festive season? Enjoy discounted fares across different cabin classes on our domestic network. Book now for travel between 23-Oct-22 and 31-Mar-23: https://t.co/rbWxAfgtNJ pic.twitter.com/oMhYkA5WQU — Vistara (@airvistara) October 17, 2022 -
విస్తారాపై టాటా గ్రూపు కన్ను, విలీన చర్చలు
న్యూఢిల్లీ: విస్తారాను ఎయిరిండియాలో విలీనం చేయడంపై టాటా గ్రూపుతో రహస్య చర్చలు నిర్వహిస్తున్నట్టు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. విస్తారాలో టాటాలకు 51 శాతం వాటా ఉంటే, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 49 శాతం వాటా ఉంది. టాటాలతో చర్చలు కొనసాగుతున్నాయని, ఇంకా కచ్చితమైన నిబంధనలపై అంగీకారానికి రాలేదని సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్కుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ సమాచారం ఇచ్చింది. టాటా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ మధ్య ప్రస్తుత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా ఈ చర్చలు నడుస్తున్నట్టు తెలిపింది. ఎయిర్ ఇండియాను టాటాలు కొనుగోలు చేసిన తర్వాత.. అప్పటికే తమ నిర్వహణలోని విస్తారా, ఎయిరేషియా ఇండియా కార్యకలాపాలను ఒకే గొడుగు కింద కు తీసుకురావాలన్న ప్రణాళికలతో ఉన్న విషయం తెలిసిందే. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్ర శేఖరన్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఎయిర్ ఇండియా-విస్తారా విలీనంపై చర్చలు నడుస్తున్నట్టు అధికారికంగా ప్రకటన రావడం ఇదే మొదటిసారి. ఎయిరేషియా ఇండియాలో టాటాలకు 83.67 శాతం వాటా ఉంది. -
మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌కు చేదు అనుభవం!
ఇండియన్ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. విస్తారా ఎయిర్‌లైన్స్ సిబ్బంది తనపట్ల అనుచితంగా ప్రవర్తించారని మండిపడ్డారు. సంబంధిత అధికారులపై విస్తారా ఎయిర్‌లైన్స్ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు. పఠాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబై నుంచి దుబాయ్‌కి విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించారు. ఈ ప్రయాణం సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్ తన భార్య పిల్లలతో కలిసి కౌంటర్ వద్ద పడికాపులు కాయాల్సిన పరిస్థితి ఎదురైనట్లు చెప్పారు. గ్రౌండ్ స్టాఫ్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు,నేను ముంబై నుండి విస్తారా ఫ్లైట్ యూకే -201లో దుబాయ్‌కి ప్రయాణిస్తున్నాను. చెక్ ఇన్ కౌంటర్లో చేదు అనుభవం ఎదురైంది. విస్తారా ఫ్లైట్‌లో నా టికెట్ క్లాస్ కాన్ఫామ్ అయ్యింది. కానీ విస్తారా డౌన్‌గ్రేడ్ (అంటే బుక్ చేసుకున్న క్లాస్ వేరే..వాళ్లు కాన్ఫామ్ చేసిన సీటు వేరు) చేసింది. దాన్ని ధృవీకరించేందుకు నన్ను వెయిట్ చేయించింది. కౌంటర్ వద్ద అరగంటకు పైగా ఎదురు చూశా. Hope you notice and rectify @airvistara pic.twitter.com/IaR0nb74Cb — Irfan Pathan (@IrfanPathan) August 24, 2022 "గ్రౌండ్ స్టాఫ్ దురుసుగా ప్రవర్తించారు. సాకులు చెప్పారు. వాస్తవానికి, ఇద్దరు ప్రయాణికులకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. మేనేజ్మెంట్ను ఉద్దేశిస్తూ..వారు ఫ్లైట్ టికెట్లను ఇలా ఎందుకు అమ్ముతున్నారు. మేనేజ్మెంట్ ఎలా ఆమోదిస్తుందో? నాకు అర్థం కావడం లేదు. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు కోరుతున్నా. నాకు ఎదురైన అనుభవం.. ఇంకెవరూ అనుభవించకూడదు" అని ట్వీట్లో పేర్కొన్నారు. అయితే పఠాన్ ట్వీట్‌పై మాజీ క్రికెటర్ ఆకాష్ చౌప్రా స్పందించారు. ఎయిర్‌లైన్స్ నుండి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదని రిప్లయి ఇచ్చారు. Hey @airvistara, totally unexpected from you. https://t.co/7w9YnHMo89 — Aakash Chopra (@cricketaakash) August 24, 2022 -
తప్పిన ప్రమాదం.. ముంబై విమానం అత్యవసర ల్యాండింగ్
లక్నో: దేశంలో వివిధ కారణాలతో విమానాలు దారి మళ్లించటం, అత్యవరంగా ల్యాండింగ్ చేస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా వారణాసి నుంచి ముంబయి వెళ్తున్న విస్తారా విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ఓ పక్షి విమానాన్ని ఢీకొట్టినట్లు డీజీసీఏ పేర్కొంది. దాంతో విమాన్ని వెనక్కు మళ్లించి ల్యాండింగ్ చేసినట్లు తెలిపింది. ‘విస్తారా ఏ320 ఎయిర్‌క్రాఫ్ట్ వీటీ-టీఎన్సీ ఆపరేట్ చేస్తున్న యూకే622 విమానం సురక్షితంగా వారణాసిలో ల్యాండింగ్ అయింది. విమానం దిగినట్లు విమానయాన సంస్థ స్పష్టం చేసింది. పక్షి ఢీకొట్టటంతో ఎయిర్‌క్రాఫ్ట్ ముందుభాగం దెబ్బతిన్నది.’ అని ట్విట్టర్లో వెల్లడించింది డీజీసీఏ. ఇదీ చదవండి: Go First Airlines: పక్షి ఢీ కొట్టడంతో విమానం అత్యవసర ల్యాండింగ్! -
మా లగేజ్ ఎక్కడ ?.. ఎయిర్‌పోర్టులో హీరోయిన్‌కు చేదు అనుభవం
బాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ దియా మీర్జాకు చేదు అనుభవం ఎదురైంది. శనివారం (మే 21) జైపూర్ ఎయిర్‌పోర్టులో లగేజీ లేకుండా చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెబుతూ తెలియజేసింది. దియా ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఆమె ప్రయాణిస్తున్న విమానాన్ని జైపూర్‌కు మళ్లించారు. దియా మీర్జా అక్కడ ఎయిర్‌పోర్టులోనే సుమారు 3 గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. తర్వాత తన లగేజ్ గురించి ఎయిర్పోర్ట్ సిబ్బందిని అడిగితే ఎవరు ఎలాంటి సమాధానం, కానీ సహాయం అందించలేదట. ఈ విషయాన్ని ట్విటర్ హ్యాండిల్లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, విస్తారాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ఇందులో 'ఢిల్లీకి వెళ్లాల్లిన యూకె904 విమానం జైపూర్‌లో ల్యాండ్ అయింది. మేము 3 గంటలు విమానంలోనే వేచి ఉండాల్సి వచ్చింది. అప్పుడు ఫ్లైట్ రద్దు అయిందని, ఇక్కడ దిగమని చెప్పారు. కానీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు, సహాయం చేసేందుకు అక్కడ ఎవరూ లేరు. మా లగేజ్ బ్యాగులు ఎక్కడా ?' అని పేర్కొంది. దియా ట్వీట్ తర్వాత అనేక మంది ప్రయాణికులు ఆ ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యాన్ని ట్వీటర్ ద్వారా తెలిపారు. ఇంతలో వాతావరణం బాగా లేనందునే ఫ్లైట్‌ను జైపూర్‌కు మళ్లించినట్లు ఎయిర్‌లైన్స్ సంస్థ విస్తారా ట్వీట్ చేసింది. చదవండి: ఓటీటీలతో సినీ ఇండస్ట్రీకి ముప్పుపై దీపికా సమాధానం.. UK904 to Delhi, is diverted to land in Jaipur. We wait inside the aircraft for 3hrs. Then we are told the flight is cancelled and are asked to disembark. NO ONE for the airport authority or Vistara to offer any help or answers. Where are our bags? @airvistara @AAI_Official — Dia Mirza (@deespeak) May 20, 2022 -
విస్తారా ఎయిర్‌లైన్స్ అదిరిపోయే ఆఫర్.. రూ.977కే ఫ్లయిట్ జర్నీ!
విస్తారా ఎయిర్‌లైన్స్ కంపెనీ విమానయాన ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. నేటి(జనవరి 6) నుంచి 48 గంటల స్పెషల్ సేల్‌ను ప్రయాణికుల కోసం ముందుకు తీసుకొచ్చింది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఐఏల జాయింట్ వెంచర్ అయిన విస్తారా ఎయిర్‌లైన్స్ తన 7వ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా సంస్థ ఈ ఆఫర్లను ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ మార్గాలలో విమాన ప్రయాణాలపై స్పెషల్ ధరలను ప్రకటించింది. దేశీయ విమాన టిక్కెట్ ధర ఎకానమీ క్లాస్‌కి కేవలం రూ.977 నుంచే ప్రారంభిస్తున్నట్టు విస్తారా ఎయిర్‌లైన్స్ తెలిపింది. జనవరి 6, 2022 నుంచి జనవరి 7, 2022 అర్ధరాత్రితో ముగిసే 48 గంటల స్పెషల్ సేల్‌లో ప్రయాణికులు పాల్గొని టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అని పేర్కొంది. అంతర్జాతీయ విమానాలకు కూడా ఈ సరికొత్త ఆఫర్ ధరలను ప్రకటించింది. కానీ, ప్రస్తుతం ఈ ఆఫర్ బుకింగ్ కోసం అందుబాటులో ఉన్న టిక్కెట్స్ మీద మాత్రమే వర్తిస్తాయి. 7వ వార్షికోత్సవ ఆఫర్లో భాగంగా అందిస్తోన్న ఈ టిక్కెట్ల ప్రయాణ కాలం ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఉండనుంది. విస్తారా ఎయిర్‌లైన్స్‌లో టాటా సన్స్ కి 51 శాతం మెజారిటీ వాటా ఉంది. విస్తారా వెబ్సైట్ ప్రకారం.. దేశీయ ప్రయాణానికి వన్ వే ఆల్ ఇన్ ఛార్జీలు కలిపి ఎకానమీ క్లాస్ కోసం ధర రూ. 977, ప్రీమియం ఎకానమీ కోసం ధర రూ. 2677, బిజినెస్ క్లాస్ కోసం ధర రూ. 9777 వద్ద నుంచి ప్రారంభం అవుతున్నాయి. అంతర్జాతీయం ప్రయాణానికి రిటర్న్ ఆల్-ఇన్ ఛార్జీలు కలిపి ఎకానమీ క్లాస్(ఢిల్లీ-ఢాకా) ధర రూ.13880, ప్రీమియం ఎకానమీ(ముంబై-మాల్దీవులు) ధర రూ. 19711, బిజినెస్ క్లాస్ (ముంబై-సింగపూర్) ధర రూ. 47981 వద్ద నుంచి ప్రారంభం అవుతున్నాయి. సంస్థ పేర్కొన్నట్లు రూ.977 టిక్కెట్ ధర జమ్ము-శ్రీనగర్ మార్గంలో ఉంది. విస్తారా వెబ్సైట్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ ద్వారా ఈ ఆఫర్ కింద టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. లేదంటే విస్తారా టిక్కెట్ ఆఫీసులు, కాల్ సెంటర్లు, ఆన్ లైన్ ట్రావెల్ ఏజెన్సీలు, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా కూడా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని కంపెనీ ప్రయాణికులకు సూచించింది. (చదవండి: 2022 సీఈఎస్ టెక్ షోలో హైదరాబాద్ కంపెనీ అదిరిపోయే ఆవిష్కరణ!) -
విస్తారా బంపరాఫర్: వారికి ఉచితంగా విమానయానం
ముంబై: కోవిడ్ విస్తరిస్తున్న వేళ వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి.. కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విమానాయన సంస్థ విస్తారా వైద్య సిబ్బందికి బంపరాఫర్ ప్రకటించింది. వైద్యులు, నర్సులు తమ విమానాల్లో దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. విస్తారా ఎయిర్‌లైన్స్ ఆదివారం ఈ ఆఫర్‌ను ప్రకటించింది. పౌర విమానయాన శాఖకు ఈ విషయాన్ని తెలియజేసింది. దేశవ్యాప్తంగా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ప్రభుత్వ సంస్థలకు చెందిన డాక్టర్లు, నర్సులు ఉచితంగా తమ విమానంలో ప్రయాణించొచ్చు అని విస్తారా ప్రకటించింది. ఈ మేరకు విస్తారా ఎయిర్‌లైన్స్ పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పఢీకి లేఖ రాసింది. ప్రభుత్వ సంస్థలు, హాస్పిటల్స్‌కు తక్షణ సాయం అందించేందుకు రెడీగా ఉన్నామని విస్తారా తెలిపింది. ఎయిర్ లాజిస్టిక్స్ సర్వీసులు కూడా పొందొచ్చని పేర్కొంది. ఇక ఉచిత ప్రయాణం ఆఫర్లో విస్తారా ఒక కండీషన్ పెట్టింది. సీట్ల లభ్యత ప్రాతిపదికన ముందుగా వచ్చే మెడికల్ ప్రొఫెషనల్స్‌కు ముందు సీట్ల కేటాయింపు ఉంటుందని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ఇక ఈ ఆఫర్ పొందాలనుకునే వైద్య సిబ్బంది తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డులను చూపించాలని తెలిపింది. చదవండి: యూఎస్‌కు నాన్‌స్టాప్ ఫ్లైట్స్: విస్తారా కన్ను -
ముఖానికి మాస్కులు.. షీల్డులు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడిపరమైన ఆంక్షలతో దేశీయంగా నిల్చిపోయిన విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమైన తర్వాత సిబ్బంది డ్రెస్ కోడ్‌లో కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. వారు కూడా ముఖానికి మాస్కులు, ఫేస్ షీల్డులు, గౌన్లు వంటి వ్యక్తిగత భద్రత సాధనాలను (పీపీఈ) ఉపయోగించనున్నారు. విధుల నిర్వహణలో ప్రయాణికులకు దగ్గరగా తిరిగే సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త ఆహార్యాన్ని అమలు చేయాలని ఇండిగో, ఎయిరిండియా, విస్తార, ఎయిర్ఏషియా ఇండియా తదితర సంస్థలు నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 27న ఫిలిప్పీన్స్ ఎయిర్ఏషియా ఆవిష్కరించిన డ్రెస్ కోడ్ తరహాలోనే ఇది కూడా ఉండవచ్చని వివరించాయి. ఫేస్ షీల్డు, ఫేస్ మాస్కుతో పాటు శరీరాన్ని పూర్తిగా కప్పేసే ఎరుపు రంగు ఫుల్ బాడీ సూట్‌ను ఫిలిప్పీన్స్ ఎయిర్ఏషియా రూపొందించింది. ఎయిర్ఏషియా తమ సిబ్బంది.. పీపీఈ కిట్ కింద ఫేస్ షీల్డులు, మాస్కులు, గౌన్లు, ఆప్రాన్స్, గ్లౌజులు ధరించవచ్చని తెలుస్తోంది. విస్తార సంస్థ సిబ్బంది కొత్త డ్రెస్ కోడ్‌లో ల్యాప్ గౌన్, ఫేస్ మాస్క్, ఫేస్ షీల్డులు ఉండవచ్చని సమాచారం. అటు ఇండిగో సిబ్బంది గౌను లేదా బాడీ సూట్‌తో పాటు సర్జికల్ మాస్కు, గ్లౌజులు, ఫేస్ షీల్డు ధరించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి. ఎయిరిండియా ఉద్యోగులు కూడా బాడీ సూట్, గ్లౌజులు, ఫేస్ షీల్డు, ఫేస్ మాస్క్ ఉపయోగించనున్నారని తెలిపాయి. -
ప్రముఖ కమెడియన్‌పై ప్రయాణ నిషేధం
ముంబై: ప్రముఖ కమెడియన్ కునాల్ కమ్రాపై విమానయాన సంస్థ విస్తారా నిషేధం విధించింది. ఏప్రిల్ 27 వరకు కునాల్ తమ విమానాల్లో ప్రయాణించేందుకు వీల్లేదని పేర్కొంది. ఈ ఏడాది జనవరి 28న ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రైవేటు చానల్‌కు చెందిన న్యూస్ యాంకర్‌పై కునాల్ వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డాడు. దీంతో కునాల్‌పై ఇండిగో సంస్థ ఆరు నెలల నిషేధం విధించింది. తర్వాత దానిని మూడు నెలలకు కుదించింది. ఆరోపణల విషయంపై విచారణ చేపట్టేందుకు అంతర్గత కమిటీని నియమించింది. కమిటీ విచారణలో కునాల్ ఆరోపణలు చేసిన విషయం వాస్తవమేనని తేలడంతో మూడు నెలల నిషేధం విధించినట్లు ఎయిర్‌లైన్ సంస్థ అధికారి ఒకరు వెల్లడించారు. ఇండిగో నిషేధం విధించిన తర్వాత ఎయిరిండియా, గోఎయిర్, స్పైస్ జెట్ సంస్థలు కూడా కునాల్‌పై నిషేధాజ్ఞలు విధించాయి. విస్తారా నిషేధంపై కునాల్ కమ్రా ట్విటర్ స్పందించారు. ఈ నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించలేదని, తాను క్షమాపణ చెప్పబోనని స్పష్టం చేశారు. విస్తారా విధించిన ప్రయాణ నిషేధంతో ఇబ్బందులు పడబోనని పేర్కొన్నారు. (చదవండి: కామ్రాను అనుమతించేది లేదు) -
విస్తారా విమానాల్లో డేటా సర్వీసులు
న్యూఢిల్లీ: విస్తార ఎయిర్‌లైన్స్ కంపెనీ త్వరలోనే తన విమానాల్లో డేటా సర్వీసులను అందించనున్నది. భారత్‌లో విమానాల్లో డేటా సర్వీసులను అందించనున్న తొలి విమానయాన సంస్థ విస్తార కానున్నది. విమానాల్లో డేటా సర్వీసులను అందించడం కోసం విస్తార కంపెనీ టాటా గ్రూప్‌నకు చెందిన నెల్కోతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని కోసం ఈ సంస్థలు ఇస్రో నుంచి ఒక ట్రాన్స్‌పాండర్‌ను తీసుకున్నాయని, దీనికి అవసరమైన స్పెక్ట్రమ్‌ను కేటాయించాలని తమను కోరాయని టెలికం కార్యదర్శి అన్షు ప్రకాశ్ తెలిపారు. ఈ సంస్థలు కోరిన స్పెక్ట్రమ్‌ను కేటాయించామని, వీలైనంత త్వరలోనే విస్తార విమానయాన సంస్థ, తన విమానాల్లో డేటా సర్వీసులను అందించనున్నదని ఆయన వివరించారు. డేటా సర్వీసులే ముందు... వాయిస్ కాల్స్ కంటే ముందు డేటా సేవలు అందుబాటులోకి వస్తాయని, దీంతో ఓవర్–ద–టాప్(ఓటీసీ) సేవలు పొందవచ్చని, వాట్సాప్ కాల్స్ చేసుకోవచ్చని ప్రకాశ్ పేర్కొన్నారు. వీటి టారిఫ్‌ల నియంత్రణ ప్రభుత్వ పరిధిలో ఉండదని తెలిపారు. ఈ సేవలను ఉచితంగా అందించాలో, లేదా డబ్బులు వసూలు చేయాలో ఆ యా సంస్థలే నిర్ణయిస్తాయని వివరించారు. కాగా విమానాల్లో డేటా సర్వీసులను ఎప్పటి నుంచి అందుబాటులోకి తెచ్చేది ఇంకా ఖరారు చేయలేదని విస్తార ప్రతినిధి పేర్కొన్నారు. 2015లో కార్యకలాపాలు ప్రారంభించిన విస్తార ప్రస్తుతం 39 విమానాలతో రోజుకు 200 విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. ఈ కంపెనీలో టాటా సన్స్‌కు 51% వాటా, మిగిలింది సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు ఉంది. -
కర్ణాటక సంక్షోభం : రతన్ టాటాను తప్పుపడతారా?
బెంగళూరు : కర్ణాటకలోని జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా లేదు. శాసన సభ్యుల తిరుగుబాటు వెనక బీజేపీ హస్తం ఉందంటూ జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. అయితే వీటిని బీజేపీ కేంద్ర నాయకత్వం ఖండించడమూ తెల్సిందే. పది మంది రెబెల్ శాసన సభ్యులు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ కంపెనీకి చెందిన విమానంలో ముంబైకి వెళ్లినట్లు కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు రాజీవ్ చంద్రశేఖర్. ‘విమానంలో ప్రయాణించింనంత మాత్రాన ప్రభుత్వం కూలిపోతుందా.. అలానే జరిగితే ప్రభుత్వాన్ని కూలదోయడానికి అందరూ అలానే చేస్తారు కదా. ఎమ్మెల్యేలు విస్తారా విమానంలో ప్రయాణించారు. అంటే ఈ సంక్షోభానికి రతన్ టాటాను కూడా బాధ్యుడిని చేస్తారా’ అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు ప్రయాణించింది చార్టెడ్ ప్లైట్‌లో.. ఇంతకు ముందు ఈ విమానాన్ని కాంగ్రెస్ నాయకులు కూడా ఉపయోగించారు. కాబట్టి జరగుతున్న పరిణామాలకు విమానాన్ని నిందించడం మాని కూటమిలోని అస్థిరత్వాన్ని విమర్శించుకుంటే మంచిందన్నారు రాజీవ్. ఈ సమస్యను బీజేపీ మీద నెట్టాలని సంకీర్ణ కూటమి నాయకులు ప్రయత్నించారు. కానీ వారి మాటలను ప్రజలు నమ్మరని తెలిపారు రాజీవ్ తెలిపారు. -
విస్తారా విమానాలకు తప్పిన ప్రమాదాలు
సాక్షి, న్యూఢిల్లీ : విస్తారా విమానాలకు తృటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విస్తారా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. 128 మంది ప్రయాణికులతో బయలు దేరిన కాసేపటికే సమస్య ఎదురైంది. దీంతో విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్నితిరిగి సేఫ్‌గా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వ్యవహారంపై విమానాశ్రయ అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. మరోవైపు 120మంది ప్రయాణికులతో బయలు దేరిన మరో విస్తారా విమానానికి కూడా దాదాపు ఇలాంటి సమస్యే ఉత్పన్నమైంది. ఎయిర్‌బస్ ఎ320 విమానం ఇంజన్లో సమస్య కారణంగా గాల్లోనే చక్కర్లు కొట్టింది. చెన్నై నుంచి కోలకత్తా విమానంలో ల్యాండింగ్ సందర్భంగా సోమవారం ఉదయం ఈ ఉదంతం చోటు చేసుకుంది. అయితే పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి, కోలకతా అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా విమానాన్ని లాండ్ చేశారు. దీంతో అటు ప్రయాణీకులు, ఇటు సిబ్బంది సహా ఎయిర్‌లైన్స్ అధికారులు ఊరట చెందారు. విమానంలో తలెత్తిన ఈ సమస్యను పరిష్కరించేందుకు తగిన పరీక్షలు జరుగుతున్నాయని విస్తారా అధికారులు ప్రకటించారు.