vivekananda
-
ఎమ్మెల్యే వివేకానందపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్
-
హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కామెంట్స్
-
Viveka case : ఇవిగో ఆధారాలు.. ఇప్పుడేం చెబుతావు సునీత? అవినాష్ ప్రశ్నలు
సాక్షి, కడప: వివేకా కూతురు సునీత ఏ రకంగా అబద్దాల ప్రచారం చేస్తుందో.. పూర్తి వివరాలు, ఆధారాలతో బయటపెట్టారు. ఇష్టానుసారంగా బురద జల్లి.. కేసు విచారణను పక్కదోవ పట్టించేలా సునీత ఏ రకంగా ప్రయత్నిస్తుందో కడప ఎంపీ అవినాష్ రెడ్డి వివరించారు. ఈ కేసులో మాట్లాడకూడదని భావించినా.. రోజురోజుకి పెరుగుతున్న అబద్దాలను, అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ వివరణ ఇస్తున్నట్టు వెల్లడించారు. ఆయన వెల్లడించిన అంశాల్లో అతి ముఖ్యమైన అంశాలు చూద్దాం. పాయింట్ 1 : పన్నింటి రాజశేఖర్‌ను బయటకెందుకు పంపించారు? వివేకా ఇంట్లో పని చేసే వ్యక్తి పన్నింటి రాజశేఖర్. హత్యకు ఒక రోజు ముందు పన్నింటి రాజశేఖర్‌కు సౌభాగ్యమ్మ ఫోన్ చేసింది. సిబిఐ విచారణలో పన్నింటి రాజశేఖర్‌ను సుదీర్ఘంగా విచారించారు. లిఖితపూర్వకంగా పన్నింటి ఇచ్చిన స్టేట్మెంట్ను అవినాష్ చదివి వినిపించారు. పన్నింటి రాజశేఖర్‌ను సిబిఐ వాళ్లు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు.. ప్రశ్న, సమాధానాలు ఇలా ఉన్నాయి సిబిఐ : నీకు సెలవు ఎవరు మంజూరు చేశారు? పన్నింటి రాజశేఖర్ : నాకు సౌభాగ్యమ్మ సెలవు ఇచ్చింది సిబిఐ : నీవు సెలవుపై వెళ్లాలని ఎవరైనా ఒత్తిడి తెచ్చారా? పన్నింటి రాజశేఖర్ : నాకు రెండు, మూడు సార్లు సౌభాగ్యమ్మ, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఫోన్ చేశారు, తక్షణం నువ్వు కాణిపాకం వెళ్లాలని ఒత్తిడి తెచ్చారు. సరేనని నేను సెలవు తీసుకున్నా.. పన్నింటి రాజశేఖర్ : సునీల్ యాదవ్, ఉమా శంకర్, గంగిరెడ్డి ముగ్గురు కూడా వివేకానందరెడ్డికి చాలా క్లోజ్. చనిపోక ముందు వివేకాతో కలిసి ప్రయాణాలు చేసేవారు. వాళ్లకు వివేకాతో ఎంత సాన్నిహిత్యం ఉందంటే.. అంతా కలిసి తరచుగా అంటే రెండు మూడు రోజులకోసారి టేబుల్ మీద కూర్చుని భోజనాలు చేసేవారు. రెండు రోజుల ముందు కూడా వివేకాతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. అవినాష్ అభ్యంతరం : ఇంట్లో ఉన్న పన్నింటి రాజశేఖర్‌ను నర్రెడ్డి రాజశేఖర్, సౌభాగ్యమ్మ (తమ్ముడు, అక్క) ఎందుకు బయటకు పంపించారు? కాణిపాకం వెళ్లమని ఎందుకు ఒత్తిడి తెచ్చారు? వివేకానందరెడ్డికి సునీల్ యాదవ్, ఉమాశంకర్, గంగిరెడ్డి తెలియదని సునీత ఎందుకు ప్రకటనలు చేస్తోంది? ఇంట్లో కలిసి కూర్చుని బ్రేక్ ఫాస్ట్ చేసే సాన్నిహిత్యం ఉందని పని వాళ్లంతా చెబుతుండగా.. సునీత ఎందుకు మాట మారుస్తోంది? --- పాయింట్ 2 : గుండెపోటు థియరీ ఎక్కడినుంచి వచ్చింది? గుండెపోటు థియరీ గురించి సునీతతో చాలా మాట్లాడుతోంది. అసలు ఈ థియరీ ఎక్కడి నుంచి మొదలయింది. దీని గురించి వివరంగా మాట్లాడుదాం. సిట్‌కు సునీత ఇచ్చిన స్టేట్మెంట్లో స్పష్టంగా ఏమని పేర్కొన్నారంటే..! "మాకు ఉదయం కృష్ణారెడ్డి ఫోన్ చేశాడు, ఇంట్లోకి వెళ్లగానే ఏం జరిగిందో చెప్పాడు. మా నాన్న డెడ్‌బాడీ బాత్రూంలో పడి ఉంది. మా నాన్న ఒంటిపై గాయాలున్నాయని చెప్పాడు, అయితే మా నాన్నకు గతంలో గుండె సమస్య ఉంది, బహుశా గుండె పోటు వచ్చి బాత్రూంలో కింద పడి మా నాన్నకు గాయాలయ్యాయేమో అని ఊహించి ఆ విధంగా ఫిర్యాదు చేయమని కృష్ణారెడ్డికి మేం సూచించాం" అని నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి తాము ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. ఇది నేను చెప్పిన విషయం కాదు. సిట్‌కు సునీత ఇచ్చిన స్టేట్మెంట్. అంటే కృష్ణారెడ్డితో ఏమేం మాట్లాడారో సునీత ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. పైగా ఘటన జరిగిన వారంలోపు అంటే.. ఆలస్యం కాకుండా బయటికొచ్చే విషయాలు పక్కగా ఉంటాయని ఢిల్లీలో ప్రెస్ మీట్లో చెప్పింది సునీత. అవినాష్ పాయింట్ : గుండెపోటు కాదు, శరీరం మీద గాయాలున్నాయన్న విషయం సునీతకు అందరికంటే ముందే.. కృష్ణారెడ్డి ఫోన్ చేయగానే తెలిసింది. అయినా సునీత మధ్యాహ్నం వరకు ఈ విషయాన్ని బయటపెట్టలేదు. హైదరాబాద్ నుంచి సునీత, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సౌభాగ్యమ్మ.. అంతా బయల్దేరి కలిసి వచ్చారు. అక్కడ లెటర్ ఉందని తెలిసి, దాన్ని దాచి పెట్టమని చెప్పి, వివేక హత్యకు గురయ్యాడన్న విసయాన్ని దాచిపెట్టింది సునీత. అందరికంటే ముందు డెడ్‌బాడీ ఫోటోలు కూడా తెప్పించుకున్నారు, అయినా పోలీసులకు చెప్పలేదు. ఉద్దేశపూర్వకంగా అసలు నిజాలను దాచిపెట్టింది సునీత, ఆమె భర్త. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం.. ఏంటంటే.. నన్ను ఇరికించే కుట్ర జరిగిందని. శివప్రకాష్ రెడ్డి..అంటే వివేకా సొంత బావమరింది నేను ఉదయం లేచి రాజకీయ పర్యటన కోసం బయటకు వెళ్తోంటే.. నాకు ఫోన్ చేసి ఏం చెప్పినాడంటే.. "బావ చనిపోయాడు.. అర్జంటుగా ఇంటికి వెళ్లాలని చెప్పాడు". అదే విషయం నేను నా వాంగ్మూలంలో చెప్పాను. నేను అదుర్తాతో వివేకానంద ఇంటికి వెళ్లగానే అక్కడ తేడా ఉందన్న విషయాన్ని గమనించి పోలీసులకు ఫోన్ చేసి చెప్పాను. అనుమానం ఉందని చెప్పాను. మరి ఉదయమే హత్య అని తెలిసినా.. సునీత గానీ, నర్రెడ్డి గానీ, శివప్రకాష్ రెడ్డి గానీ.. పోలీసులకు ఎందుకు చెప్పలేదు? పైగా ఏమి తెలియనట్టు నాకు ఫోన్ చేసి ఇంటికి వెళ్లాలని ఎందుకు చెప్పినట్టు? మీరు ఇదే అంశంలో టిడిపి నేత ఆదినారాయణ రెడ్డి ఇచ్చిన ప్రకటన చూడాలి (వీడియో క్లిప్ ప్లే చేసి వినిపించారు) సిట్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఆదినారాయణ ఏమన్నాడంటే... "మార్చి 15 నాడు నేను విజయవాడలో ఉన్నప్పుడు వివేకానందరెడ్డి బావమరిది శివప్రకాష్‌రెడ్డి ఫోన్ చేసినాడు, గుండెపోటుతో చనిపోయాడని నాకు చెప్పినాడు, ఆ రోజు మా కజిన్, కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి కూడా నాతో ఉన్నాడు. ఎందుకని నేను అడిగినప్పుడు.. ఎక్కువగా సిగరేట్లు తాగుతాడని, గుండె పోటు వచ్చి స్టంట్ కూడా వేశారని చెప్పాడు. అదే విషయాన్ని నేను మీడియాకు చెప్పాను. నన్ను దర్యాప్తులో నీకు పరమేశ్వర్ రెడ్డి తెలుసా? అంటూ రకరకాల ప్రశ్నలు వేశారు." అవినాష్ పాయింట్ : గుండెపోటు అన్న తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించిందెవరు? ఎక్కడి నుంచి మొదలయ్యిందో ఈ ఆధారాలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. --- పాయింట్ 3 : ఎంపీ టికెట్ కోసం హత్య చేశారని తప్పుడు ప్రచారం అటు సునీత, ఇటు షర్మిల.. హఠాత్తుగా రాజకీయాలను తీసుకొచ్చారు. ఏంటంటే.. కడప ఎంపీ టికెట్ కోసం హత్య జరిగిందట. ఎంపీ టికెట్ మోటివ్ అన్న దాంట్లో నిజమెంత? ఒక్కసారి జరిగిన ఘటనలను మీరే చూడండి. "తాను చనిపోయే చివరి క్షణం వరకు నా కోసం ప్రచారం చేశారు, మూడు గంటల ర్యాలీ సభలో వివేకా మాట్లాడారు. అవినాష్‌ను గెలిపించమని పది సార్లు చెప్పారు. అంతెందుకు సునీత కూడా ఢిల్లీలో ఏం మాట్లాడారు..? అవినాష్ గెలుపు కోసం వివేకా ప్రచారం చేశాడని చెప్పింది." మరి.. అప్పటికే ఎంపీ టికెట్‌ను నాకు కేటాయించారు. 2019 టికెట్ ఒక్కటే కాదు.. 2014లోనూ నేను ఎంపీగా గెలిచాను. నా కోసం వివేకానంద ప్రచారం కూడా చేశారు. మరి ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం హత్య జరిగింది అని ఎలా చెబుతారు? పైగా అప్పుడు మీ నాన్నకు ప్రత్యర్థి బీటెక్ రవి ఇప్పుడు మీకు సన్నిహితుడు అవుతాడా? మీ నాన్న మీద అక్రమంగా, అనైతికంగా గెలిచిన బీటెక్ రవి కాకుండా.. మా మీద బురద వేస్తున్నారా? కనీసం అవగాహనతో మాట్లాడుతున్నారా? మీ కోసం ఎన్నో ఎన్నికల్లో కష్టపడితే మాపై ఆరోపణలు చేస్తారా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లేసిన ఏ ఒక్కరినీ సిబిఐ ఎందుకు ప్రశ్నించలేదు? సిబిఐ దర్యాప్తులో ఇన్ని లోపాలుంటాయా? ఇక సునీత, సిబిఐ చాలా మందితో తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించారు. ఇంకా చాలా ప్రయత్నాలు జరిగాయి. లక్ష్మీదేవమ్మ, జగదీష్ రెడ్డి, లక్ష్మీ దేవి కొడుకుతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించే ప్రయత్నాలు చేశారు. శశికళ & కోతో కూడా తప్పుడు వాంగ్మూలాలు తీసుకునే ప్రయత్నాలు చేశారు. అవినాష్ రెడ్డి పేరు చెప్పాలని ఒత్తిడి తెచ్చారు. ఆ రోజు గేటు దగ్గర ఇప్పకుంట్ల వాసి ఒకరు ఉంటే.. ఆయన ఇంటికి సునీత, రాజశేఖర్ వెళ్లారు. "మా నాన్న దగ్గరి వాడివి, సిబిఐ దగ్గర వాంగ్మూలం ఇవ్వాలి, మేం చెప్పినట్టు మాత్రమే నువ్వు చెప్పాలంటూ ఒత్తిడి తెచ్చారు, ఏం చెప్పారంటే.. అవినాష్ గుండెపోటు అని చెప్పమన్నాడని నువ్వు చెప్పాలి" అని ఒత్తిడి తెచ్చారు. అవినాష్ పాయింట్ : సునీత లాంటి వాళ్లు దస్తగిరి లాంటి వారిని కూడా అప్రూవర్‌గా చేయగలరు, ఇందులో చంద్రబాబు కుట్ర, కుతంత్రాలు కావొచ్చు, అందులో భాగంగానే పస లేని విమర్శలు, కనికట్టు చేసే అబద్దాలు ఉన్నాయి. రాజకీయంగా దీన్ని ముడిపెట్టి అవినాష్‌ను లక్ష్యంగా చేసుకునేందుకు ఇంత కుట్ర చేస్తారా? గుండెపోటు అని ప్రచారం మొదలెట్టిన వాళ్లు... దాన్ని నా మీద రుద్దుతారా? పైగా ఇంటింటికి వెళ్లి నేను చెప్పమన్నారంటూ ఒత్తిడి తెస్తారా? ఈ కేసులో కోర్టులమీద నమ్మకం ఉందని, చంద్రబాబు, బీజేపీలోని టిడిపి పెద్దలు దీని వెనక ఉన్నారని విమర్శించారు అవినాష్. చంద్రబాబు చేతిలో పావులుగా మారి నన్ను, మా నాన్నను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్విచ్ మీన్టైంకు ఇండియన్ స్టాండర్డ్ టైంకు తేడా లేకుండా తప్పుడు ప్రకటనలు చేసిన సిబిఐ.. తర్వాత నాలుక కర్చుకుని హైకోర్టులో కౌంటర్ వేసిన విషయాన్ని గుర్తు చేశారు. READ THIS ARTICLE IN ENGLISH : YS Avinash Reddy’s Sensational Comments on Sunitha in YS Viveka’s Murder ఎంపీ అవినాష్ ప్రెస్మీట్లో ముఖ్యాంశాలు -
నిజం దాచి పెట్టింది సునీతే.. అసత్య ప్రచారం చేస్తోంది సునీతే
-
డబ్బులు లేక చివరి రెండేళ్లు పెదనాన్న నరకం చూశాడు..!
-
పాఠశాల నుంచే దాడి?
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడ సింగ్‌నగర్ డాబాకొట్ల సెంటర్లో వివేకానంద సెంటినరీ హైస్కూల్ నుంచే ఎయిర్‌గన్‌తో దాడికి పాల్పడి ఉంటారని పోలీసు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దాడి సమయంలో ఈ పాఠశాల వెనుక వైపున రోడ్డులోనే సీఎం జగన్ యాత్ర సాగుతోంది. సీఎం జగన్ ఉన్న బస్సుకు, పాఠశాల కేవలం 20 అడుగుల దూరంలోనే ఉంది. పాఠశాల ఉన్న రామకృష్ణ సమితికి చెందిన ఈ జీ+2 భవనం మొదటి అంతస్తులో 6వ కిటికీ, రెండో అంతస్తులో 4వ కిటికీ తెరిచి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. పాఠశాలకు వాచ్మెన్ భద్రత లేదు. దీంతో గేటు దూకి ఎవరైనా సులభంగా లోపలికి ప్రవేశించే అవకాశం ఉంది. అక్కడి నుంచే దాడికి పాల్పడి, సులభంగా తప్పించుకొని పోయే అవకాశం ఉంది. ఈ పాఠశాలకు 200 మీటర్ల దూరంలోనే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ ఆఫీసు ఉండటం కూడా అనుమానాలకు బలం చేకూరుస్తోంది. 59వ డివిజన్‌కు చెందిన ఓ టీడీపీ నాయకుడి అనుచరుల్లో బ్లేడ్ బ్యాచ్, ఎయిర్గన్లు, క్యాటర్‌బాల్, ఇతర మారణాయుధాలు వాడేవాళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. దాడి జరిగిన సమయంలో సీఎం జగన్ రోడ్‌షోను చిత్రీకరించిన స్థానికుల నుంచి వీడియోలు సేకరించి పోలీసులు పరిశీలిస్తున్నారు. -
వివాదాస్పదమైన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద తీరు
-
ఓటమి భయంతోనే వివేకానంద దాడి
కుత్బుల్లాపూర్: ఓడిపోతామనే భయం, అసహ నంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద బీజే పీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌పై దాడి చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఓ న్యూస్ చానల్ నిర్వహించిన ఎన్నికల చర్చలో వివేకానంద, శ్రీశైలంగౌడ్ మధ్య వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం శ్రీశైలంగౌడ్ను షాపూర్‌నగర్‌లోని నివాసంలో సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ బీఆర్ఎస్ నేతలు ఇష్టారాజ్యంగా దాడులకు తెగబడు తున్నారని.. తమ సహనాన్ని చేతగాని తనంగా భావించొద్దని హెచ్చరించారు. ’’పేరేమో వివేకానంద కానీ చేష్టలేమో ఔరంగజేబును తలపిస్తున్నా యని’ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఉద్దేశించి విమర్శించారు. భౌతిక దాడులు జరిగే అవకాశముందని ముందే సమాచారం వచ్చినా పోలీసులు ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్ధి కూన శ్రీశైలంగౌడ్‌కు ఎందుకు భద్రత ఇవ్వడం లేదని నిలదీశారు. వివేకానందను ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. -
చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషాన్ పై ముగిసిన వాదనలు
-
కుత్బుల్లాపూర్ ప్రజలు ఎవరిని ఎన్నుకోబోతున్నారు?
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన వివేకానందగౌడ్ మరోసారి గెలిచారు. 2014 ఎన్నికలలో ఆయన టిడిపి పక్షాన గెలిచి, ఆ తర్వాత కాలంలో టిఆర్ఎస్లో చేరిపోయారు. ఈసారి టిఆర్ఎస్ టిక్కెట్‌పై పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మీద 41500 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. వివేక్ కు 154500 ఓట్లు రాగా, శ్రీశైలంకు 113000 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నుంచి పోటీచేసిన బిజెపి అభ్యర్ధి కాసాని వీరేష్‌కు 9800 పైచిలుకు ఓట్లు వచ్చాయి. వివేక్ సామాజికవర్గ పరంగా గౌడ వర్గానికి చెందినవారు. 2014లో వివేకానంద గౌడ్ టిఆర్ఎస్ అభ్యర్ధి కె.హనుమంతరెడ్డిపై 39021 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. వివేకానందగౌడ్ 2009లో టిఆర్ఎస్ తరపున పోటీచేసి ఓడిపోయి, 2014లో టిడిపి-బిజెపి కూటమి అభ్యర్దిగా విజయం సాదించడం విశేషం. తదుపరి ఆయన టిఆర్ఎస్లో చేరిపోయారు. 2009లో ఇండిపెండెంటుగా పోటీచేసి గెలుపొందిన శ్రీశైలం గౌడ్ 2014లో కాంగ్రెస్ ఐ తరపున పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఇక్కడ ఇంతవరకు గెలిచినవారంతా బీసి గౌడ్ వర్గం వారే. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
SC on Viveka Case : పోలీస్ ఫైల్ ఒరిజినల్ రికార్డు ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ : వివేకా హత్య కేసుకు సంబంధించి సునీత వేసిన పిటిషన్ ఇవ్వాళ సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. కేసును విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం.. ఈ వ్యవహారంలో పూర్వపరాల గురించి అడిగింది. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు గడువు ముగియడంతో.. సిబిఐ తన కౌంటర్ దాఖలు చేయలేదు. సునీత ఏం కోరింది? ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు సిబిఐ చేసిన దర్యాప్తుకు సంబంధించిన కేసు డైరీ వివరాలను తనకు ఇవ్వాలంటూ పిటిషనర్ సునీత సుప్రీంకోర్టును అడిగింది. పిటిషనర్ విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కీలకమైన ఈ వ్యవహారంలో ఈ పరిస్థితుల్లో కేసు డైరీ వివరాలను పిటిషనర్‌కు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చిచెప్పింది. గంగిరెడ్డి లాయర్ ఏం కోరారు? ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సిబిఐ దర్యాప్తు పూర్తయిందని, ఈ నేపథ్యంలో గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ వేరుగా వినాలని ఆయన తరపు లాయర్ కోరారు. ఈ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. వివేకా హత్య కేసు చాలా సీరియస్ అంశం అని పేర్కొన్న సుప్రీం కోర్టు, సునీత పిటిషన్ తో పాటు గంగిరెడ్డి బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ఏపీ పోలీసులు ఏం కనుగొన్నారు? సిబిఐ ఏం తేల్చింది? వివేకానందరెడ్డి హత్య 15 మార్చి, 2019న జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ కేసును ప్రత్యేకంగా దర్యాప్తు చేసేందుకు ఓ బృందాన్ని కూడా నియమించింది. ఆ కేసును క్షుణ్ణంగా విచారణ చేసిన నాటి ఏపీ పోలీసులు.. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో తమ నివేదికను CBIకి అప్పగించారు. ఈ నేపథ్యంలో అసలు అప్పటి పోలీసులు ఏమని నివేదించారు? ఇప్పుడు తాజాగా CBI దర్యాప్తులో ఏం కనిపెట్టిందన్న అంశాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వివేకానంద రెడ్డి హత్య కేసు పోలీస్ ఫైల్ ఒరిజినల్ రికార్డులను సీల్డ్ కవర్లో ఇవ్వాలని సిబిఐకి ఆదేశించింది. CBIకి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలేంటీ? ఈ కేసులో రెండు వారాల్లో రిప్లై పిటిషన్ దాఖలు చేయాలి నోటీసులపైన రిజాయిండర్లు మూడు వారాల్లో దాఖలు చేయాలి జూన్ 30న దాఖలు చేసిన చార్జిషీట్ కాపీని తమ ముందు ఫైల్ చేయాలి వివేకానంద రెడ్డి హత్య కేసు పోలీస్ ఫైల్ ఒరిజినల్ రికార్డులను సీల్డ్ కవర్లో ఇవ్వాలి అనంతరం ఈ కేసులో తర్వాతి విచారణను సెప్టెంబర్ 11 కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ కేసులో ఇతర ప్రతివాదులందరికీ నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. -
గవర్నర్‌ది పూర్తిగా పోలిటికల్ దర్బార్: ఎమ్మేల్యే వివేకా
-
జేపీ నడ్డాతో వివేక్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు గడ్డం వివేకానంద శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలోని తాజా రాజకీ యాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో బీజేపీ చేపడుతున్న పలు కార్యక్రమాలను నడ్డాకు వివరించాను. సీఎం చేస్తున్న అవినీతిని వివరించాను. అన్ని ప్రాజెక్టుల్లో సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. కేసీఆర్ అవినీతిపై విచారణ జరగాల్సిన అవసరం ఉంది. బీజేపీ పైన, కేంద్ర ప్రభుత్వంపైన కేసీఆర్ తప్పుడు విమర్శలు చేస్తున్నారు. బీజేపీ అంటే ఆయనకు భయం పుడుతోంది. రాష్ట్రంలో బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతంగా అయిందని వివరించాను. రాబోయే మున్సిపల్ ఎన్నికలపై జేపీ నడ్డాతో చర్చించాను..’ అని తెలిపారు. -
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
-
మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరూ వైరస్ బారరినపడక తప్పడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా.. తాజగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయన భార్య సౌజన్య, కుమారుడు విధాత్‌లకు సైతం కోవిడ్ సోకినట్లు ఆదివారం వైద్యులు వెల్లడించారు. దీంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తమ ఇంట్లోనే వేర్వేరు గదుల్లో హోం క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వివేకానంద్‌ను ‘సాక్షి’ఫోన్లో పలకరించగా వైద్యుల సూచన మేరకు 14 రోజులు హోం క్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందుతానని, ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ మాస్క్‌లు, శానిటైజర్లతో శుభ్రంగా ఉండాలని సూచించారు. (ఇప్పట్లో వదలదు!) -
ఢిల్లీపై కన్నేసిన కారు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ తనకు కలిసొచ్చిన కరీంనగర్ పూర్వ జిల్లానే తొలి టార్గెట్‌గా ఎంచుకున్నారు. ఈ జిల్లాలో ఉన్న ప్రత్యేక పరిస్థితులతోపాటు మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇక్కడి రెండు సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేశారు. కరీంనగర్లో భారీ మెజార్టీని లక్ష్యంగా నిర్ధేశించిన ఆయన పెద్దపల్లిలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు లేకుండా అభ్యర్థిని గెలిపించే బాధ్యతను స్థానిక మంత్రి, ఇతర ఎమ్మెల్యేలపై ఉంచారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు నియోజకవరాల్లో పార్టీ యంత్రాంగం పాదయాత్రలు, ప్రచారంతో ఇతర పార్టీల కన్నా ముందంజలో ఉన్నారు. కేటీఆర్, కేసీఆర్ పర్యటనలతో పరిస్థితి పూర్తిగా తమకు అనుకూలంగా మారుతుందనే నమ్మకంతో ఉన్నారు. పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశం పేరుతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ఈనెల 6న కరీంనగర్లో తొలి సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఎన్నికల ప్రచార సభలా సాగడంతో ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌కు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లయింది. అదే ఊపుతో మరుసటి రోజు నుంచే గ్రామాల్లో ప్రచారానికి తెరలేపిన వినోద్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే పూర్తిగా రంగంలోకి దిగారు. ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి రాగా, అప్పటికే అభ్యర్థిత్వం ఖరారైన వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. సీఎం సభకు భారీగా జనం రావడంతో అభ్యర్థి వినోద్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. నామినేషన్ ప్రక్రియ మొదలైన నాటి నుంచి ఆయన పూర్తిగా జనం మధ్యలోనే ఉంటున్నారు. మంత్రి ఈటల రాజేందర్ వ్యూహకర్తగా వ్యవహరిస్తూ అన్నీ తానై చూసుకుంటున్నారు. కరీంనగర్ పట్టణంలో శనివారం నిర్వహించిన కేటీఆర్ రోడ్‌షోకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఈ నేపథ్యంలో వినోద్‌కుమార్, ఇతర టీఆర్ఎస్ శ్రేణులు భారీ మెజారిటీ అంచనాలతో రెట్టించిన ఉత్సాహంలో పనిచేస్తుండడం గమనార్హం. కేసీఆర్ సభతో మోగనున్న పెద్దపల్లి ప్రచార భేరి పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, ఇతర సహచరులతో కలిసి ఆడిన గేమ్‌లో మాజీ ఎంపీ వివేకానంద పోటీలో లేకుండా పోయారు. వెన్నుపోటు ఆరోపణలతో వివేక్‌ను పెద్దపల్లి అభ్యర్థిత్వం నుంచే కాకుండా ఏకంగా పార్టీ నుంచే పంపించడంలో వీరంతా సక్సెస్ అయ్యారు. అయితే వివేక్ స్థానంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 28వేల ఓట్ల తేడాతో సుమన్ చేతిలో ఓడిపోయిన బొర్లకుంట వెంకటేశ్ నేతకు టికెట్ ఇప్పించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయి, టీఆర్ఎస్లో చేరిన రోజే పార్టీ టికెట్ సాధించుకున్న వెంకటేశ్ నేత పట్ల పార్టీలో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు ముందుండి నడిపిస్తుండడంతో పరిస్థితి మారుతోంది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెంకటేశ్ నేత పర్యటిస్తూ ప్రచారం జరుపుతున్నారు. కాగా, ఈనెల 1న ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపైనే వెంకటేశ్ నేత ఆశలు పెట్టుకున్నారు. సీఎం ప్రచారంతో పరిస్థితి పూర్తిగా తమ వైపుకు తిరుగుతుందని భావిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎ.చంద్రశేఖర్ స్థానికేతరుడు కావడాన్ని వెంకటేశ్‌నేత తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో ఉన్నారు. కాగా రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లిలో టీఆర్ఎస్ విజయాన్ని పూర్తిగా తన భుజాలపై వేసుకున్నారు. ఆయనకు ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కోరుకంటి చందర్ అన్నీ తామై సహకరిస్తున్నారు. మిగతా ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ఓట్లు వెళ్లకుండా తమ వంతు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. -
సలహాదారు పదవికి వివేక్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి జి.వివేకానంద రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శుక్రవారంరాత్రి సీఎం కేసీఆర్ కు ఆయన పంపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ టికెట్ ఇస్తానని చెప్పి టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నారని, కానీ తనకు టికెట్ నిరాకరించారని పేర్కొన్నారు. ఈ కారణంగానే ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆ లేఖలో వెల్లడించారు. అయితే, టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి మాత్రం రాజీనామా చేయలేదు. శనివారం తన అనుచరులతో భేటీ అయి వివేక్ భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తారని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. వివేక్ బీజేపీ అగ్రనేతలతో టచ్‌లో ఉన్నారని సమాచారం. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశముంది. కాంగ్రెస్ నేతలు కూడా వివేక్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. -
నా దేశం ఒక సందేశం
అంతటి రసస్ఫోరకమైన, ఉన్నత స్థితిలో దేశాన్ని చూడగలగడం అంటే.. దేశంపై ఇష్టం, ప్రేమ మాత్రమే కాదు.. దేశాన్ని గౌరవించడం, దేశాన్ని పూజించడం కూడా. అందుకే ఈ గణతంత్ర దినోత్సవం నాడు మనం మరొకసారి ప్రతిన పూనుదాం.దేశభక్తి అంటే ఏంటి? దేశాన్ని ఇష్టపడటమా? దేశాన్ని ప్రేమించటమా? స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా దేశభక్తి అర్థాన్ని, ఔన్నత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివేకానంద ఓ దశలో నాలుగేళ్ల పాటు పాశ్చాత్యదేశాలలో పర్యటించారు. ఆ దేశాల్లోని సిరిసంపదలను, విజ్ఞానాన్ని, అభివృద్ధిని, వారు అవలంబిస్తున్న విధానాలను, ఆధునికతను, ఆ దేశాల అగ్రగామితనాన్ని, ఆధునిక టెక్నాలజీని స్వయంగా పరిశీలించారు. ఆ సుదీర్ఘ పర్యటనను ముగించుకుని, భారతదేశానికి వచ్చేందుకు అక్కడి విమానాశ్రయంలో వేచి ఉండగా ఓ పత్రికా విలేకరి ఆయన్ని.. ‘‘ఇక్కడికి, అక్కడికి తేడా ఏమిటని మీ అనుభవంలో తెలుసుకున్నారు?’’ అని అడిగారు. అందుకు వివేకానంద ఇలా సమాధానం ఇచ్చారు. ‘‘ఇక్కడి సంపదను, వైభోగాలను స్వయంగా చూశాను. ఇప్పుడు పర్యటన ముగించుకుని నా మాతృభూమికి వెళుతున్నాను. ఈ దేశాలకు రాక ముందు నా దేశాన్ని నేను ఇష్టపడేవాడిని. ఇప్పుడు నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. అంతే తేడా. అంతేకాదు, నా దేశంలోని ధూళి, నీరు, నేల పవిత్రంగా అనిపిస్తున్నాయి. చెట్టూ చేమ, రాయి రప్పా, పుట్టా గుట్టా అంతా నాకు పరమ పవిత్రంగా కనిపిస్తోంది. మొత్తం మీద నా భారతదేశం నాకు ధగధగాయ మానమైన ఓ సువర్ణ దేవాలయంలా సాక్షాత్కారం అవుతోంది’’ అన్నారు వివేకానంద. స్వచ్ఛమైన, నిత్యమైన, దేశభక్తికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉంటుందా? – డా. రమాప్రసాద్ ఆదిభట్ల -
వివేకానంద గౌడ్- లీడర్‌తో
-
కాంగ్రెస్ పని ఖతం ఎమ్మెల్యే వివేకానంద
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. శుక్రవారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ, రాహుల్‌గాంధీ పర్యటనతో ఊపు వచ్చిందని కాంగ్రెస్ నాయకులు ఊహల్లో ఉన్నారని అన్నారు. రాహుల్‌గాంధీ ఇక్కడే అడ్డా వేసినా..టీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరని చెప్పారు. రాహుల్‌గాంధీ సభావేదికపై ఉన్న నాయకులంతా ఎవరికి వారే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులకు కామన్ ఎజెండా లేదని విమర్శించారు. ఒక నాయకుడు ఎన్నికలకు సిద్ధమంటే, మరొకరు ఇప్పుడే ఎందుకు ఎన్నికలు అంటున్నారని పేర్కొన్నారు. ఏ ఇద్దరు నాయకుల మధ్య ఏకాభిప్రాయం, సఖ్యత లేదన్నారు. అసెంబ్లీలో మాట్లాడటానికి సమస్యలు, అంశాలు ఏమీ లేక సభ నుంచి కాంగ్రెస్ నేతలు పారిపోతున్నారని విమర్శించారు. ప్రాజెక్టులపై వందల కేసులు వేసి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ మీద విమర్శలు చేస్తున్న వారికి లోకజ్ఞానం లేదన్నారు. టీవీల్లో, పేపర్లలో కనిపించడానికే కాంగ్రెస్ నాయకులు ప్రెస్మీట్లు పెట్టుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. -
వదిలేస్తున్నారా? వెంట తెచ్చుకుంటున్నారా?
నలుగురు శిష్యులతో కలకత్తాలో ఒక వీధిలో వివేకానందుడు భిక్షకు బయలుదేరాడు. ఒక మోస్తరు ధ్వనితో గంట కొడుతూ –భవతి భిక్షామ్ దేహి – అని అడుగుతున్నారు. ఒక ఇంట్లో నుండి – చేయి ఖాళీ లేదు పొమ్మని సమాధానం వచ్చింది. ఒకామె సగం పాడయిపోయిన అరటిపండు వేసింది. మరొకామె ‘‘చూడడానికి దుక్కల్లా ఉన్నారు. పని చేసుకుని బతకలేరా?’ అంటూ ఒంటికాలిమీద లేచి తిట్టింది. శాపనార్థాలు పెట్టింది. ఒకరిద్దరు భిక్షాపాత్రల్లో బియ్యం పోశారు. పాడయిపోయిన భాగాన్ని తొలిగించి – బాగున్నంతవరకు దారిలో కనపడిన ఆవుకు అరటిపండును తినిపించారు. ఆవు వారి చేతిని ప్రేమగా నాకింది. సన్యాసులందరూ మఠం చేరుకుని, వారి వారి పనుల్లో మునిగిపోయారు. మధ్యాహ్నం భోజనానంతరం ఒక శిష్యుడు గుమ్మానికి ఆనుకుని కూర్చుని కుమిలిపోతుండడాన్ని వివేకానందుడు గమనించాడు. నెమ్మదిగా అతడిదగ్గరికి వెళ్లి కారణం ఏమిటని అడిగాడు. ‘‘పొద్దున భిక్షకు వెళ్ళినప్పుడు ఒక ఇంటావిడ తిట్టిన తిట్లు, పెట్టిన శాపనార్థాలు, ప్రదర్శించిన కోపం నాకు పదే పదే గుర్తుకొచ్చి ముల్లులా గుచ్చుకుంటోంది. ఆ బాధను తట్టుకోలేకపోతున్నాను స్వామీ’’ – అన్నాడు. అతని కళ్ల నిండా నీరు. వివేకానందుడు అతన్ని ‘‘పొద్దున మనకు భిక్షలో ఏమేమి వచ్చాయి?’’ అనడిగాడు. ‘‘సగం పాడయిపోయిన అరటి పండు, కొద్దిగా బియ్యం వచ్చాయి’’ – చెప్పాడతను. ‘‘అవును కదూ, వాటిలో మనం మఠానికి ఏమి తెచ్చుకున్నాం?’’ అడిగాడు మళ్లీ. బాగున్న అరటిపండును అవుకు పెట్టేసి, బియ్యాన్ని మాత్రం తెచ్చుకున్నాం’’‘‘మనం తెచ్చుకున్నవాటిలో తిట్లే లేవు కాబట్టి అవి నీవి కావు. నీతో రాలేదు. మనం తీసుకున్నది అరటిపండు, బియ్యమే కానీ, తిట్లను తీసుకోలేదు – వాటిని ఇక్కడికి మోసుకురాలేదు. రానిదానికి – లేనిదానికి ఎందుకని బాధపడుతున్నావు?’’ అనునయంగా అడిగాడతన్ని. అతనిలో ఆవరించిన దిగులు ఏదో తొలగిపోయినట్లయి, ‘‘నిజమే స్వామీ!’’ అంటూ తలపంకించాడు సంతోషంగా. – డి.వి.ఆర్. -
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా కొనసాగవద్దు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జి.వివేకానంద్‌కు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా వివేక్ కొనసాగడానికి వీల్లేదంటూ అంబుడ్స్‌మన్ జస్టిస్ నర్సింహా రెడ్డి ఇచ్చిన తీర్పు అమలును నిలిపేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం రద్దు చేసింది. అంబుడ్స్‌మన్ తీర్పుపై తిరిగి విచారణ చేపట్టాలని సింగిల్ జడ్జికి సూచించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. హెచ్‌సీఏతో వాణిజ్యపరమైన ఒప్పందం ఉన్న విశాక ఇండస్ట్రీస్‌కు వివేక్ డైరెక్టర్‌గా వ్యవహరించడం విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని, అందువల్ల ఆయన హెచ్‌సీఏ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అనర్హుడిగా ప్రకటించాలంటూ అంబుడ్స్‌మన్ ముందు భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్, బాబూరావు తదితరులు ఫిర్యాదులు దాఖలు చేశారు. విచారణ జరిపిన అంబుడ్స్‌మన్ జస్టిస్ నర్సింహా రెడ్డి ఈ ఏడాది మార్చి 8న తీర్పునిస్తూ... విశాక ఇండస్ట్రీస్‌కు డైరెక్టర్‌గా కొనసాగుతూ, అదే కంపెనీతో ఒప్పందం ఉన్న హెచ్‌సీఏకు అధ్యక్షుడిగా ఉండటం విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని తేల్చారు. అందువల్ల హెచ్‌సీఏ అధ్యక్షుడిగా కొనసాగడానికి వీల్లేదంటూ పేర్కొన్నారు. ఈ తీర్పును సవాలు చేస్తూ వివేక్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి మార్చి 15న అంబుడ్స్‌మన్ తీర్పు అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను మళ్లీ సవాలు చేస్తూ అంబుడ్స్‌మన్ ముందు ఫిర్యాదుదారులైన అజహరుద్దీన్, బాబూరావులు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి మంగళవారం తీర్పు వెలువరిస్తూ... సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. అంబుడ్స్‌మన్ తీర్పుపై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని విచారణ జరపాలని సింగిల్ జడ్జికి సూచించింది. తీర్పును స్వాగతిస్తున్నాం... హైకోర్టు ఉత్తర్వులపై పిటిషనర్ బాబూరావు సంతోషం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏ పనితీరు సక్రమంగా లేకనే బీసీసీఐ నుంచి నిధులు రావడం లేదని... వివేక్ వర్గానికి చిత్తశుద్ధి ఉంటే లోధా కమిటీ సిఫారసులను అనుగుణంగా పూర్తి స్థాయి ఎన్నికలకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. -
ఉత్తముణ్ని కాకపోవచ్చు...
‘నేను అందరికంటే ఉత్తముణ్ని కావచ్చు, కాకపోవచ్చు. చాలామంది కంటే ఉత్తముణ్ని అయ్యే అవకాశం ఉంది. ఎవరికంటే అధముణ్ని మాత్రం కాదు’ అనేది నచికేతుని తత్వం. ఆయనే నాకు స్ఫూర్తి, ఆదర్శం. ఎదుటివారిని గౌరవించడం మన మొదటి కర్తవ్యం. ఇతరుల పట్ల గౌరవ భావాన్ని వ్యక్తం చేయడంలో ప్రతిబింబించేది మన సంస్కారమే కాని చిన్నతనం కాదు. ఆత్మగౌరవానికి భంగం అంతకంటే కాదు. సున్నితంగా వ్యవహరించడం అంటే ఆత్మగౌరవాన్ని ఫణంగా పెట్టడం అని అర్థం కాదు. సరళమైన జీవితం కొనసాగించే వారికి దృఢచిత్తం లేదు అనుకుంటే పొరపాటే. ఇంద్రధనుస్సులో మనకు పైకి కనిపించేవి మూడు రంగులే కానీ, అది ఏడు రంగుల సమ్మేళనం. అలాగే మనిషిలోనూ తన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడంతోపాటు సంస్కారయుతంగా వ్యవహరించడం వంటి అన్ని లక్షణాలూ ఉండి తీరాలి. ఇదే విషయాన్ని స్వామి వివేకానందుడికి అతడి తల్లి బోధించింది. ‘పవిత్రంగా ఉండు, స్వచ్ఛమైన జీవితాన్ని జీవించు. ఆత్మగౌరవాన్ని సంరక్షించుకో, ఇతరులను గౌరవంగా చూడు, సరళ స్వభావంతో నిరాడంబరంగా మెలుగు. అవసరమైన చోట్ల దృఢత్వాన్ని ప్రదర్శించడానికి వెనుకాడకు’ అని ఆమె హితబోధ చేశారు. ఆ ప్రభావం అతడి మీద ఎల్లవేళలా పని చేసింది. ఆ సూక్తులు ఆయనను సన్మార్గంలో నడిపించాయి. దాంతో ఇతరులను గౌరవించడానికి ఎప్పుడూ వెనకాడేవాడు కాదు. ఇతరులు తనను అవమానపరచదలిస్తే సహించేవాడుకాదు. అందుకు అతడి బాల్యంలో జరిగిన సంఘటనే నిదర్శనం. ఒకరోజు ఇంటికి వివేకానందుడి తండ్రి స్నేహితుడు వచ్చాడు. అతడు వివేకానందుడిని తేలికగా మాట్లాడాడు, అంతే... వివేకానందుడు కోపంతో తోకతొక్కిన తాచులాగా స్పందించాడు. ‘నా తండ్రి కూడా నన్ను చిన్న చూపు చూడడు, అతడి స్నేహితుడు నన్ను అహేతుకంగా కించపరచడాన్ని సహించ’నన్నాడు. ఆ తర్వాత ఆ స్నేహితుడు జరిగిన దానికి పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ‘మనం ఎవరికంటే ఎక్కువ కాకపోయినా తక్కువ మాత్రం కాదు’ అని వివేకానందుడి నమ్మకం. దానికి నచికేతుడిని ఉదహరించేవాడు. కఠోపనిషత్తులోని నచికేతుని వృత్తాంతంలో ఆయన ధీరత్వం, ఆత్మస్థైర్యం అర్థమవుతాయి. ఆయనే నాకు స్ఫూర్తి, ఆదర్శం అనేవాడు వివేకానందుడు. -
కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యేకు మాతృవియోగం
సాక్షి, హైదరాబాద్ : కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద తల్లి శ్యామల మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో ఎమ్మెల్యే కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మంగళవారం శ్యామల అంత్యక్రియలు జరుగనున్నాయి. -
వివేకానందుడు స్ఫూర్తి ప్రదాత
తానా అధ్యక్షుడు సతీశ్ వేమన కకందుకూరు : లల్ని సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమించు అన్న స్వామి వివేకానందుని స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు సతీశ్ వేమన అన్నారు. స్టెప్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి యువజనోత్సవాలను శుక్రవారం స్థానిక ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అమెరికాలో ఉన్నత చదువులతో పాటు సంపాదనకు సైతం అవకాశం ఉంటుందన్నారు. యువత దీన్ని ఉపయోగించుకుని తిరిగి మాతృభూమి సేవ చేయాలని ఆకాంక్షించారు. సమాజ సేవా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. అమెరికాలోని తెలుగువారి సంక్షేమం కోసం తానా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, తెలుగు రాష్ట్రాల్లో సైతం పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. గ్రామీణ ప్రాంతంలో యువత ఉపాధి కోసం ఎయిర్టెల్ కాల్ సెంటర్ ప్రారంభించిన ప్రకాశం యాజమాన్యాన్ని అభినందించారు. స్టెప్ సీఈఓ రవి మాట్లాడుతూ యువతలో దాగి ఉనన నైపుణ్యాలను వెలికి తీయడానికి నిర్వహిస్తున్న యువజనోత్సవాల్లో పాల్గొని తమ ప్రతిభను మెరుగుపర్చుకోవాలని కోరారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ట్రెజరర్ కంచర్ల శ్రీకాంత్, తానా సభ్యులు వడ్లమూడి విష్ణు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.