votes counting
-
భారత్‌లో ఓట్ల లెక్కింపుపై మస్క్ ఆసక్తికర ట్వీట్
వాషింగ్టన్: భారత్‌లో ఓట్ల లెక్కింపును అమెరికా బిలియనీర్,టెస్లా కార్ల కంపెనీ అధినేత ఇలాన్ మస్క్ ప్రశంసించారు. భారత్‌లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 64 కోట్ల ఓట్లను ఒకేరోజు లెక్కించారని, కాలిఫోర్నియాలో అధ్యక్ష ఎన్నికల ఓట్ల కౌంటింగ్ మాత్రం ఇంకా పూర్తవలేదని మస్క్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు మస్క్ ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి కాలిఫోర్నియాలో ఫలితాలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.కాలిఫోర్నియా అమెరికాలోనే అత్యంత జనాభా ఉన్న రాష్ట్రం. ఇక్కడ కోటి 60 లక్షల మంది ఓటర్లు నవంబర్ 5న జరిగిన అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.కాలిఫోర్నియాలో ఎన్నికలను మెయిల్ పద్ధతిలో కూడా నిర్వహించారు.మెయిల్ ద్వారా పడ్డ ఓట్లను లెక్కించడమే కాకుండా అవి అసలువేనని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన వాళ్లకు ఓటింగ్‌లో ఏవైనా తప్పులు చేస్తే సరిదిద్దుకునే అవకాశం డిసెంబర్ 1 వరకు కల్పించారు.దీంతో ఇక్కడి ఫలితం అధికారంగా వెలువడలేదు.కాలిఫోర్నియా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్ ఖాతాలో పడ్డాయి. కాలిఫోర్నియాలో హారిస్ 50 శాతానికిపైగా ఓట్లు సాధించారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ట్రంప్‌నకు కేవలం 36 శాతం మాత్రం ఓట్లు మాత్రమే వచ్చాయి.India counted 640 million votes in 1 day. California is still counting votes 🤦♂️ https://t.co/ai8JmWxas6— Elon Musk (@elonmusk) November 24, 2024 ఇదీ చదవండి: హష్ మనీ కేసులో ట్రంప్‌నకు ఊరట -
Telangana: కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. ఫస్ట్ రిజల్ట్ అక్కడే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపును పగడ్బంధీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.కాగా, తెలంగాణ వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 49 మంది అబ్జర్వర్లు ఉంటారు. తెలంగాణ వ్యాప్తంగా కౌంటింగ్‌కు 10వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అలాగే, మరో 50 శాతం మంది అడిషనల్‌గా అందుబాటులో ఉండనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2440 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని.. ప్రతీ టేబుల్ వద్ద అధికారులు పరిశీలిస్తారని ఈసీ తెలిపింది.కౌంటింగ్‌లో భాగంగా మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్‌లో అత్యధికంగా చొప్పదండి, యాకూత్‌పుర, దేవరకొండలో 24 రౌండ్లు ఉండగా.. అత్యల్పంగా ఆర్మూర్, భద్రాచలం, అశ్వరావుపేటలో 13 రౌండ్లు ఉన్నాయి. ఇక, చేవెళ్ల, మల్కాజ్‌గిరిలో పోస్టల్ బ్యాలెట్ ఈ- కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో 2లక్షల 80వేల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని ఈసీ పేర్కొంది.అలాగే, కౌంటింగ్ కేంద్రాల వద్ద 12 కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ వరకు సీసీటీవీలో మానిటరింగ్ చేయనున్నారు. కౌంటింగ్ పూర్తి అయ్యాక ఈవీఎంలను స్టోరేజ్ రూమ్‌లలో పెడతామని.. భారీ బందోబస్తు ఉంటుందని ఈసీ వెల్లడించింది. -
కవ్వించి.. కలబడాలి!
సాక్షి, అమరావతి: పోలింగ్ రోజు రాష్ట్రవ్యాప్తంగా సృష్టించిన విధ్వంస కుట్రలకు చంద్రబాబు మరింత పదును పెడుతున్నారు! అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియను హైజాక్ చేసేందుకు పక్కా పన్నాగం పన్నుతున్నారు. ఓట్లు లెక్కించే జూన్ 4వతేదీన దాడులు, దౌర్జన్యాలు, హింసాకాండకు తెగబడేందుకు టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పుతున్నారు.ప్రధానంగా కౌంటింగ్ కేంద్రాల్లో కవ్వింపులకు దిగి ఘర్షణలతో ఉద్రిక్తత రేకెత్తించేందుకు పథకం రూపొందించారు. వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లను కవ్వించి కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు వెళ్లగొట్టడమే టీడీపీ దుష్ట పన్నాగం. అందరినీ ఏమార్చి ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడాలన్నదే చంద్రబాబు కుతంత్రం. పోస్టల్ బ్యాలెట్ల నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు వరకు ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తూ పచ్చ ముఠాలు బరితెగించడం ఆందోళనకరంగా మారింది. ఈసీని ప్రభావితం చేసి తమ చెప్పుచేతల్లో నడుచుకునేలా నియమించుకున్న పోలీసు అధికారుల ద్వారా ఈ కుట్రలను అమలు చేసేందుకు చంద్రబాబు ఉద్యుక్తమైనట్లు స్పష్టమవుతోంది.ఎంతకైనా తెగించేందుకు వెనుకాడొద్దు..కౌంటింగ్ సందర్భంగా ఏదో ఒక సాంకేతిక అంశాన్ని సాకుగా చూపించి అధికారులతో వాగ్వాదంతోపాటు వైఎస్సార్సీపీ ఏజెంట్లతో ఘర్షణకు దిగాలని టీడీపీ ఏజెంట్లకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. మొదట లెక్కించే పోస్టల్ బ్యాలెట్ల నుంచే ఈ వ్యూహాన్ని అమలు చేయాలని ఆదేశించడం ద్వారా ఎంత పకడ్బందీగా కుట్ర పన్నారో స్పష్టమవుతోంది.మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈమేరకు చంద్రబాబు ఉపదేశించారు. ఇక సాధారణ కౌంటింగ్ ఏజంట్లతో శనివారం నిర్వహించే సమావేశంలోనూ ఇవే అంశాలు పునరుద్ఘాటించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఎంత తీవ్రస్థాయిలో ఘర్షణకు అయినా సిద్ధం కావాలని అందుకోసం ఎంతకైనా తెగించాలని కౌంటింగ్ ఏజెంట్లను పురిగొల్పడం ద్వారా చంద్రబాబు తన కుతంత్రాన్ని బహిర్గతం చేశారు.పోలింగ్ రోజు మోడల్ అమలుపోలింగ్ సందర్భంగా పాల్పడిన కుట్రలనే కౌంటింగ్ రోజు కూడా పునరావృతం చేయాలని చంద్రబాబు స్కెచ్ వేశారు. ఎన్నికల కమిషన్ (ఈసీ) ద్వారా తాము నియమించుకున్న పోలీసు యంత్రాంగం ఇందుకు పూర్తిగా సహకరిస్తుందనే ధీమాతో ఉన్నారు. రాష్ట్రంలో పోలింగ్ నిర్వహించిన ఈ నెల 13వతేదీన టీడీపీ రౌడీమూకలు దాడులతో భయానక వాతావరణం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రధానంగా పల్నాడు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో అల్లరి మూకలు యథేచ్ఛగా దౌర్జన్యకాండకు పాల్పడ్డాయి. టీడీపీ రౌడీ మూకలు పోలింగ్ కేంద్రాలతోపాటు నడి వీధుల్లో స్వైర విహారం చేస్తున్నా పోలీసు యంత్రాంగం చోద్యం చూసింది. అదే అదనుగా మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ వర్గాలను ఓటింగ్‌కు దూరం చేయడమే లక్ష్యంగా పచ్చ ముఠాలు కత్తులు, కర్రలు, రాడ్లు చేతబట్టుకుని బీభత్సం సృష్టించాయి.బాంబు దాడులతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అదే విధ్వంసకాండ మోడల్‌ను ఓట్ల లెక్కింపు రోజు కూడా అమలు చేయాలని చంద్రబాబు పథకం వేశారు. కౌంటింగ్ కేంద్రాల బయట దాడులతో దృష్టి మళ్లించి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో తమ ఏజెంట్లతో కవ్వింపు చర్యలకు దిగాలని కుట్ర పన్నారు.వైఎస్సార్సీపీ ఏజెంట్లను వెళ్లగొట్టండి...!వైఎస్సార్ సీపీ ఏజెంట్లే లక్ష్యంగా కౌంటింగ్ కేంద్రాల్లో కవ్వింపు చర్యలతో ఘర్షణలకు దిగాలని, దాడులకూ వెనకాడొద్దని చంద్రబాబు ఆదేశించారు. అదే అదనుగా తమకు అనుకూలంగా వ్యవహరించే కొందరు పోలీసు అధికారులను రంగ ప్రవేశం చేయించి వైఎస్సార్సీపీ ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రాల నుంచి బలవంతంగా బయటకు పంపేలా చంద్రబాబు ఇప్పటికే కీలక అధికారులతో మంతనాలు జరిపారు. ఆ తరువాత ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడాలన్నది ఆయన లక్ష్యం. ఈమేరకు పోస్టల్ బ్యాలెట్ల నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు వరకూ ప్రతి దశలోనూ కౌంటింగ్ కేంద్రాల్లో వాగ్వాదం, ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. చంద్రబాబు, పురందేశ్వరి ఒత్తిడితో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న ఈసీ, కొందరు పోలీసు అధికారులు కౌంటింగ్ ప్రక్రియలోనూ అదే రీతిలో వ్యవహరించే అవకాశాలున్నాయని ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాల్సిన ఈసీ, అధికార యంత్రాంగం ఉదాశీనంగా, నిస్తేజంగా వ్యవహరించడంపై సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. -
ఓట్ల లెక్కింపు ఇలా
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతోంది. జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను కల్పించనున్నారు. మే 13న పోలింగ్ అనంతరం పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే 25 కంపెనీల బలగాలను రాష్ట్రానికి పంపింది. మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 25 వేల మందికిపైగా ఉద్యోగులు పాల్గొననున్నారు. వీరందరికీ రెండు రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ర్యాండమైజేషన్ ద్వారా ఉద్యోగులను నియోజకవర్గాలకు కేటాయిస్తారు. మొత్తం ఈ ఓట్ల ప్రక్రియను నిశితంగా పరిశీలించడానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఒక్కొక్కరు చొప్పున మొత్తం 200 మంది కేంద్ర పరిశీలకులతోపాటు 200 మంది రిటరి్నంగ్ ఆఫీసర్లను నియమించారు. ఈవీఎంల తరలింపు మే 13న పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి ఈవీఎంలను, వీవీ ప్యాట్లను స్ట్రాంగ్ రూమ్‌ల్లో భద్రపర్చారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు మొదలయ్యే అరగంట ముందు స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి ఈవీఎంలను ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలిస్తారు. ముందుగా ఆర్వో టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలవుతుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలైన అరగంట తర్వాత కూడా ఆ ప్రక్రియ కొనసాగుతుంటే అప్పుడు ఇక ఈవీఎంల లెక్కింపును మొదలుపెట్టడం మొదలు పెడతారు. అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఒకేసారి ఎన్నికలు జరగడంతో ఈవీంఎలు తారుమారు కాకుండా ఉండటం కోసం స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి తీసుకువచ్చే సిబ్బందికి వేర్వేరు రంగుల్లో యూనిఫామ్ కేటాయించి ఈవీఎంలను తరలిస్తారు. వీరు ఈవీఎంల సీరియల్ నంబర్ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి కౌంటింగ్ టేబుళ్లపైకి చేరుస్తారు. కౌటింగ్ సమయంలో కేవలం ఈవీఎం కంట్రోల్ యూనిట్ మాత్రమే తీసుకువస్తారు. ఓటు వేసిన ఈవీఎం మెషీన్‌తో అవసరం లేదు. కౌంటింగ్ హాల్లో టేబుళ్లు ఎన్ని ఉంటే అన్ని ఈవీఎంలను మాత్రమే తీసుకురావాలి. ఒక రౌండ్ పూర్తయిన తర్వాతే మరుసటి రౌండ్‌కు సంబంధించిన కంట్రోల్ యూనిట్‌ను తీసుకురావాల్సి ఉంటుంది. పోలైన ఓట్ల ఆధారంగా ఎన్ని రౌండ్లు కౌంటింగ్ అన్నది లెక్కించి.. దాని ప్రకారం టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఈవీఎంలో నమోదైన ఓట్లు, వీవీ ప్యాట్‌లో నమోదైన ఓట్లు సరిగా ఉన్నాయా.. లేదా.. అన్నదాన్ని పరిశీలించడం కోసం ర్యాండమ్‌గా మూడు వీవీప్యాట్లు ఎంపిక చేసి మూడింటిని లెక్కిస్తారు. ఇది కూడా ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తర్వాత మాత్రమే చేస్తారు. పోలింగ్ ముగిసిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కకుండా ఉన్న (క్లోజ్ రిజల్ట్ క్లియర్–సీఆర్సీ) ఓటింగ్ యంత్రాలతో పాటు మాక్ పోలింగ్ ఓట్లను తీసివేయకుండా అలాగే ఉంచిన ఓటింగ్ యంత్రాలను పక్కకు పెట్టి వాటిని చివర్లో మాత్రమే లెక్కిస్తారు. అది కూడా పోటీ హోరాహోరీగా ఉంటేనే. మెజార్టీ భారీగా ఉంటే ఇలా అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఓటింగ్ యంత్రాలను లెక్కించకుండా పక్కకు పెట్టేస్తారు. ప్రతీ రౌండ్ ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చిన సువిధ యాప్‌లో నమోదు చేసిన తర్వాతనే ఆర్వో ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది. -
Pakistan Elections: పాకిస్తాన్లో ఓట్ల లెక్కింపు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ తీవ్ర ఆరోపణలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నెమ్మదిగా సాగుతోంది. దీంతో ఫలితాల వెల్లడి మరింత ఆలస్యం కానుంది. అయితే ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ ఆరోపిస్తోంది. ఎన్నికలకు ముందు రిగ్గింగ్, అణచివేత సంఘటనలు ఎదురైనప్పటికీ పాకిస్థాన్ ప్రజలు తమవైపే నిలిచినట్లు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పేర్కొంది. ప్రతి ఫలితం తామే అఖండ మెజారిటీతో గెలవబోతున్నట్లు సూచిస్తున్నాయంది. ప్రతి పోలింగ్ స్టేషన్లో తమ పోలింగ్ ఏజెంట్లు అందుకున్న ఫారం 45 కాపీల ప్రకారం తాము అధిక మెజారిటీతో గెలుపొందబోతున్నట్లు పీటీఐ పార్టీ పేర్కొంది. అయితే, రిటర్నింగ్ అధికారులు ఇప్పుడు ఫారం 47 ఉపయోగించి ఫలితాలను తారుమారు చేస్తున్నారని ఆరోపించింది. ఈమేరకు పీటీఐ పార్టీ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక ప్రకటన విడుదల చేసింది. "పాకిస్తాన్ ప్రజల స్పష్టమైన తీర్పును తారుమారు చేస్తున్నారని ప్రపంచమంతా తెలుసుకోవాలి. ఎన్నికలకు ముందు రిగ్గింగ్, అణచివేత సంఘనలు జరిగిప్పటికీ, పోలింగ్ రోజున భారీ ఓటింగ్ జరిగింది. ప్రతి ఫలితం పీటీఐ భారీ గెలుపును సూచిస్తోంది. ఫారం 45లే ఎన్నికల ఫలితాలకు ప్రాథమిక మూలం. మా పోలింగ్ ఏజెంట్లు అందుకున్న ఆ ఫారం కాపీలు మేము భారీ మెజారిటీతో గెలిచినట్లు చూపుతున్నాయి. అయితే రిటర్నింగ్ అధికారులు ఇప్పుడు ఫారం 47లతో ఫలితాలను తారుమారు చేస్తున్నారు" అని పేర్కొంది. పోలింగ్ ఏజెంట్లను కిడ్నాప్ చేసి నకిలీ ఫారం 45లపై సంతకం చేయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని పీటీఐ పార్టీ ఆరోపించింది. రిగ్గింగ్‌కు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ తెలిపింది. రిగ్గింగ్ ఎన్నికలను పాకిస్థాన్ ప్రజలు అంగీకరించరని పేర్కొంది. ఫలితాల ట్రెండ్స్‌లో ఇమ్రాన్‌ఖాన్ పార్టీ జోరు నెమ్మదిగా విడుదలవుతున్న ఎన్నికల ఫలితాల్లో ఇమ్రాన్ పార్టీ జోరు కనబరుస్తోంది. ప్రస్తుతానికి విడుదలైన ఫలితాల్లో ఇమ్రాన్ ఖాణ్ పార్టీ ఐదు స్థానాల్లో గెలిచి ముందంజలో ఉంది. నవాజ్ షరీఫ్ పీఎంఎల్ నాలుగు స్థానాల్లో విజయం సాధించగా, ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ ఒక స్థానం ఆధిక్యంలో ఉంది. కాగా, పాక్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉండగా, 266 స్థానాలకు మాత్రమే నేరుగా ఎన్నికలు నిర్వహించగా 265 చోట్లే పోలింగ్ జరిగింది. కనీసం 133 సీట్లు గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుంది. మిగతా 70 సీట్లను మైనార్టీలు, మహిళలకు కేటాయించారు. -
MP Election Results 2023: మధ్యప్రదేశ్‌లో బీజేపీ భారీ గెలుపు
Live Updates.. 160 సీట్లలో బీజేపీ విజయం, మరో 3 చోట్ల ఆధిక్యం 63 చోట్ల కాంగ్రెస్ విజయం, 2 స్థానాల్లో ముందంజ 163 స్థానాల్లో బీజేపీ.. మధ్యప్రదేశ్‌లో 155 సీట్లలో బీజేపీ విజయం, మరో 12 చోట్ల ముందంజ 61 చోట్ల కాంగ్రెస్ విజయం, 5 స్థానాల్లో ముందంజ ఒక సీటు గెలిచిన భారత్ ఆదివాసీ పార్టీ 152 స్థానాల్లో బీజేపీ విజయం మధ్యప్రదేశ్‌లో 152 సీట్లలో గెలుపొందిన బీజేపీ, మరో 12 చోట్ల ఆధిక్యం 56 చోట్ల కాంగ్రెస్ విజయం, 9 స్థానాల్లో ముందంజ ఒక చోట భారత్ ఆదివాసీ పార్టీ గెలుపు మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ 122 స్థానాలలో బీజేపీ విజయం. మరో 42 చోట్ల ఆధిక్యం 36 చోట్ల కాంగ్రెస్ గెలుపు. 29 నియోజకవర్గాల్లో ముందంజ. 60 దాటిన బీజేపీ విజయాలు ఇప్పటివరకూ 61 స్థానాల్లో బీజేపీ గెలుపు. 105 స్థానాల్లో కాషాయ పార్టీ ఆధిక్యం. 15 చోట్ల కాంగ్రెస్ విజయం, 48 స్థానాల్లో ముందంజ. ► మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. #WATCH | A clash broke out between BJP and Congress workers in Madhya Pradesh's Shajapur; police used lathi charge to disperse them. More details awaited. pic.twitter.com/lXBEtzumme — ANI (@ANI) December 3, 2023 మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకు బీజేపీ ఆరు స్థానాల్లో గెలుపొందింది. 159 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో గెలుపొంది. 62 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. భారతీయ ఆదివాసీ పార్టీ ఒక స్థానంలో గెలుపొంది. బీజేపీ తొలి విజయం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలి విజయం నేపానగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మంజు రాజేంద్ర దాదు 44,805 ఓట్ల మెజార్టీతో గెలుపు. మంజు రాజేంద్ర దాదుకు మొత్తం 1,13,400 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన గెందూ బాయికి 68,595 ఓట్లు. ► మధ్యప్రదేశ్‌లో భారీలో లీడింగ్‌లో ఉన్న బీజేపీ. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. కేంద్రమంత్రి ఆశ్విణి వైష్ణవ్, పార్టీ నేతలతో సంబరాలు చేసుకుంటూ స్వీట్లు పంచుకున్నారు. #WATCH | Madhya Pradesh CM Shivraj Singh Chouhan and Union Minister and BJP leader Ashwini Vaishnaw exchange sweets as the party leads in #MadhyaPradeshElection2023 pic.twitter.com/H2zbIatcn5 — ANI (@ANI) December 3, 2023 ►మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. ఇప్పటివరకు బీజేపీ 164 స్థానాల్లో ముందంజ. కాంగ్రెస్ 63 స్థానాల్లో లీడింగ్ బీఎస్పీ 2 స్థానాల్లో లీడింగ్ ► మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్‌లో దూసుకుపోంది. సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్తో కలిసి బీజేపీ నేతలు నరేంద్రసింగ్ తోమర్, జ్యోతిరాదిత్య సిందియా ఇతర పార్టీ నేతలు.. సీఎం చౌహాన్ నివాసంలో కౌంటింగ్ తీరును పరిశీలిస్తున్నారు. #WATCH | Madhya Pradesh CM Shivraj Singh Chouhan along with party leaders Narendra Singh Tomar and Jyotiraditya Scindia observes election results as the counting of votes continues, in Bhopal As per ECI, the BJP is leading on 153 seats in MP. pic.twitter.com/frlpg9rpdv — ANI (@ANI) December 3, 2023 ► మధ్యప్రదేశ్‌లో బీజేపీ భారీ లీడింగ్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ ముందంజలో దూసుకుపోతోంది. ఇప్పటివరకు బీజేపీ 158 స్థానాల్లో ముందంజ. కాంగ్రెస్ 69 స్థానాల్లో లీడింగ్ బీఎస్పీ 2 స్థానంలో లీడింగ్ ► బీజేపీకి భారీ విజయం లభిస్తుందని నమ్మకం: అశ్విని వైష్ణవ్ బీజేపీకి భారీ విజయం లభించిందని, దానిపై తాము నమ్మకంగా ఉన్నామని కేంద్ర మంత్రి, బీజేపీ నేత అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్యప్రదేశ్ ప్రజలు మోదీ నాయకత్వాన్ని ఆశీర్వదించారని పేర్కొన్నారు. #WATCH | Madhya Pradesh: Union Minister and BJP leader Ashwini Vaishnaw says, "BJP has got a big victory and we were confident about it...Modi ji MP ke mann mein hain aur Modi ji ke mann mein MP hai..." pic.twitter.com/uR44egMD7V — ANI (@ANI) December 3, 2023 ► ప్రేమతో బీజేపీకి గ్రాండ్ మెజారిటీ వస్తుంది: సీఎం శివరాజ్ మధ్యప్రదేశ్ మనసులో మోదీ.. మోదీ మనసులో మధ్యప్రదేశ్ ఉన్నట్లు సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో బహిరంగ సభలు నిర్వహించి ప్రజలను ఆకట్టుకున్నారని తెలిపారు. ఆయన ప్రజల హృదయాలను కదిలించారని, దాని ఫలితం ఇదేనని తెలిపారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేసి, మధ్యప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన పథకాలు కూడా ప్రజల హృదయాలను హత్తుకున్నాయని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ ఒక కుటుంబంగా మారిందని, ప్రజలు తమపై ఉన్న ప్రేమతో బీజేపీకి గ్రాండ్ మెజారిటీ వస్తుందని తాను ముందే చెప్పినట్లు తెలిపారు. అది ప్రతిచోటా స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. #WATCH | #MadhyaPradeshElections2023 | Incumbent CM Shivraj Singh Chouhan says, "Modi ji MP ke mann mein hain aur Modi ji ke mann mein MP hai. He held public rallies here and appealed to the people and that touched people's hearts. These trends are a result of that. Double-engine… pic.twitter.com/MHOUthgsR — ANI (@ANI) December 3, 2023 ► మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. ఇప్పటివరకు బీజేపీ 150 స్థానాల్లో ముందంజ. కాంగ్రెస్ 64 స్థానాల్లో లీడింగ్ బీఎస్పీ 1 స్థానంలో లీడింగ్ ► మధ్యప్రదేశ్ మనసులో మోదీ.. మోదీ మనసులో మధ్యప్రదేశ్: వీడి శర్మ మధ్యప్రదేశ్ ఎన్నికల్లో మరోసారి మోదీ నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి చెందిన బూత్ స్థాయి కార్యకర్తల కృషితో ప్రతి బూత్‌లో 51% ఓటింగ్ తీర్మానాన్ని నెరవేరుస్తున్నందుకు తాను గర్విస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ కార్యకర్తలను చూసి ప్రజలు ప్రధాని మోదీని ఆశీర్వదించారని తెలిపారు. #WATCH | #MadhyaPradeshElections2023 | As BJP crosses the halfway mark and leads on 133 seats in the state as per official EC trends, Madhya Pradesh BJP president VD Sharma says, "We had said 'Madhya Pradesh ke mann mein Modi aur Modi ke mann mein Madhya Pradesh' - people blessed… pic.twitter.com/EWl9zYkijP — ANI (@ANI) December 3, 2023 ► మధ్యప్రదేశ్‌లో బీజేపీ ముందంజ మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు బీజేపీ 148 స్థానాల్లో ముందంజ. కాంగ్రెస్ 60 స్థానాల్లో లీడింగ్ బీఎస్పీ 1 స్థానంలో ముందంజ. ► ఇలాంటి విషాదం ఎప్పుడూ పునరావృతం కాకూడదు: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన వంటి విషాదం ఎప్పుడూ పునరావృతం కావొద్దని సీఎం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన వార్షికోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి విషాదం పునరావృతం కావొద్దని, దానిని నిర్ధారించడానికి, అభివృద్ధి, పర్యావరణం మధ్య సమతుల్యత ఉండాలని పేర్కొన్నారు. బాధితులకు నివాళులు అర్పిస్తున్నానని ఆయన తెలిపారు. #WATCH | On the anniversary of the 1984 Bhopal Gas tragedy, Madhya Pradesh CM SS Chouhan says, "Such a tragedy should never get repeated. To make sure of this, there should be a balance between development and the environment. I pay my tributes to the victims of this tragedy." pic.twitter.com/NjGJ39iN6x — ANI (@ANI) December 3, 2023 ► బీజేపీ 125-150 సీట్లు గెలుస్తుంది: నరోత్తమ్ మిశ్రా మధ్యప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి, దతియా సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ.. బీజేపీ 125-150 సీట్లు గెలుస్తుందని తెలిపారు. మధ్యప్రదేశ్‌లోనే కాదు, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. #WATCH | #MadhyaPradeshElections2023 | State Home Minister and BJP candidate from Datia, Narottam Mishra says, "BJP will win 125-150 seats. Not only in Madhya Pradesh but the BJP will also form government in Rajasthan and Chhattisgarh..." pic.twitter.com/wzmOtoxTYc — ANI (@ANI) December 3, 2023 ► మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు బీజేపీ 133 స్థానాల్లో ముందంజ. కాంగ్రెస్ 52 స్థానాల్లో లీడింగ్. ► మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్ కొనసాతున్న క్రమంలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సిందియా భోపాల్‌లోని సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ నివాసానికి చేరుకున్నారు. ఇప్పటివరకు బీజేపీ 73 స్థానాల్లో లీడింగ్. కాంగ్రెస్ 28 స్థానాల్లో ముందంజ. #WATCH | Madhya Pradesh | Union Minister and BJP leader Jyotiraditya Scindia arrives at the residence of incumbent Chief Minister Shivraj Singh Chouhan, in Bhopal. As per the latest official EC trends, BJP is leading on 73 seats and Congress on 28 in the state. pic.twitter.com/q9beNm7ybh — ANI (@ANI) December 3, 2023 ► మధ్యప్రదేశ్‌లో మళ్లీ బీజేపీకే అధికారం: ప్రహ్లాద్ సింగ్ పటేల్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ భారీ ఆధిక్యతతో మళ్లీ అధికారంలోకి వస్తుందని తాను ఎప్పటినుంచో చెబుతున్నానని కేంద్రమంత్రి, నర్సింగపూర్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గతం కంటే ఈసారి మెరుగ్గా పనిచేస్తామని ముందే చెప్పినట్లు పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో వస్తున్న ట్రెండ్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. #WATCH | Union Minister and BJP candidate from Narsinghpur says, "I have always said that in Madhya Pradesh, the BJP will come to power with a huge mandate... I had already said that we would perform better in the elections in five states than last time. The trends that are… pic.twitter.com/tr0oy3kRp7 — ANI (@ANI) December 3, 2023 ► మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్‌తో దూసుకుపోతుంది. ఇప్పటివరకు బీజేపీ 73 స్థానాల్లో లీడింగ్. కాంగ్రెస్ 28 స్థానాల్లో ముందంజ. In initial trends, BJP leading on 73 seats, Congress on 28 seats in Madhya Pradesh pic.twitter.com/ESwsSQqkwy — ANI (@ANI) December 3, 2023 ►మధ్యప్రదేశ్‌లో బీజేపీ ముందంజ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కమల్ నాథన్ భోపాల్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో సమావేశమై కౌంటింగ్ ట్రెండ్‌ను పరిశీలిస్తున్నారు. ►బీజేపీ 37 స్థానాల్లో లీడింగ్. ► కాంగ్రెస్ 7 స్థానాల్లో ముందంజ. #WATCH | Madhya Pradesh Congress president Kamal Nath and other leaders of the party gather at the state party office in Bhopal. As per the latest official EC trends, BJP is leading on 37 seats and the Congress on 7 seats in the state. pic.twitter.com/MNGpStJQcN — ANI (@ANI) December 3, 2023 ►మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడ్ మధ్యప్రదేశ్ కౌంటింగ్ కొనసాగుతోంది ఇప్పటి వరకు బీజేపీ.. 13 కాంగ్రెస్.. 2 #WATCH | Counting of votes underway for #MadhyaPradeshElections2023. Visuals from a counting centre in Chhatarpur. As per the latest official EC trends, BJP is leading on 13 and Congress on 2 seats here. pic.twitter.com/cWxKEWo6eF — ANI (@ANI) December 3, 2023 ► పోస్టల్ బ్యాలెట్లో సాగర్ జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు గానూ ఐదు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. షాజాపూర్‌లో బీజేపీ 5,645 ఓట్ల ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్లో కాంగ్రెస్‌కు 4,392 ఓట్లు వచ్చాయి. శివపురిలో బీజేపీకి చెందిన దేవేంద్ర జైన్ 2,322 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. దామోలోని జబేరా అసెంబ్లీ స్థానం నుంచి ధర్మేంద్ర సింగ్ 2000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్లో ధర్మేంద్ర సింగ్‌కు 4,272 ఓట్లు, ప్రతాప్ సింగ్‌కు 2,425 ఓట్లు, వినోద్ రాయ్‌కు 1,431 ఓట్లు వచ్చాయి. జైత్‌పూర్‌లోని షాదోల్ నుంచి కాంగ్రెస్ ముందంజలో ఉంది. అలీరాజ్‌పూర్‌లో బీజేపీ 2,200 ఓట్ల ఆధిక్యంలో ఉంది. జోబాట్‌లో కాంగ్రెస్ 1,100 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఖర్గోన్లో బీజేపీ అభ్యర్థి బాలకృష్ణ పటీదార్ ఆధిక్యంలో ఉన్నారు. భగవాన్పురా కాంగ్రెస్‌కు చెందిన కేదార్ డాబర్ ముందంజలో ఉన్నారు. కస్రవాడలో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి సచిన్ యాదవ్ వెనుకంజలో ఉన్నారు. షాదోల్ జిల్లా జైసింగ్ నగర్లో బీజేపీ ముందంజలో ఉంది. సాంచిలోని రైసన్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. భోజ్‌పూర్‌లో బీజేపీ ముందంజలో ఉంది. ఉదయపురాలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. సిల్వానీలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ► జబల్పూర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తన నివాసంలో.. విజయం సాధించాలని కోరుకుంటూ ప్రార్థనలు చేశారు. ► మధ్యప్రదేశ్‌లో తొలి ట్రెండ్స్‌లో బీజేపీకి భారీ మెజారిటీ వచ్చేలా కనిపిస్తోంది. ఇక్కడ 216 సీట్ల ప్రారంభ ట్రెండ్ వచ్చింది. బీజేపీ 126 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 89 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ► జబల్పూర్ జిల్లాలోని పటాన్ స్థానంలో బీజేపీ 2811 ఓట్ల ఆధిక్యంలో ఉంది. నార్త్ సెంట్రల్ అసెంబ్లీలో బీజేపీ 3311 ఓట్ల ఆధిక్యంలో ఉంది. బార్గీలోనూ బీజేపీ ముందంజలో ఉంది. చింద్వారాలో బీజేపీకి చెందిన మోనికా బట్టీ అమరవారా ముందంజలో ఉన్నారు. చౌరాయ్‌లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా.. సౌసర్‌లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. చింద్వారాలో కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ముందంజలో ఉన్నారు. పాంధుర్ణంలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. బుర్హాన్పూర్లో బీజేపీ అభ్యర్థి అర్చన చిట్నీస్ తొలి రౌండ్లో ముందంజలో ఉన్నారు. ఖర్గోన్ జిల్లాలోని కస్రావాడ్ నుంచి బీజేపీ 821 ఓట్ల ఆధిక్యంలో ఉంది. నర్సింగపూర్‌లో తొలి రౌండ్లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ ఒక బూత్‌లో 47 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ► తొలి ట్రెండ్‌లో మధ్యప్రదేశ్‌లో బీజేపీ మెజారిటీ సాధిస్తుందని తెలుస్తోంది. ఇక్కడ 208 సీట్ల ప్రారంభ ట్రెండ్ వచ్చింది. బీజేపీ 118 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 90 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ► సెహోర్‌లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయింది. సెహోర్ అసెంబ్లీలో బీజేపీ 163 ఓట్ల ఆధిక్యంలో ఉంది. అష్టాలో కాంగ్రెస్ 341 ఓట్ల ఆధిక్యంలో ఉంది. బుద్నీలో సీఎం శివరాజ్ ముందంజలో ఉన్నారు. ఇచ్ఛావర్‌లో తొలి రౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ► గ్వాలియర్‌లోని దబ్రా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఇమర్తి దేవి ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ రాజే వెనుకంజలో ఉన్నారు. గ్వాలియర్ రూరల్ స్థానంలో బీజేపీకి చెందిన భరత్ సింగ్ కుష్వాహ వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సాహిబ్ సింగ్ గుర్జార్ ముందంజలో ఉన్నారు. గ్వాలియర్-ఈస్ట్ స్థానంలో బీజేపీకి చెందిన మాయా సింగ్ వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన డాక్టర్ సతీష్ సికార్వార్ ముందంజలో ఉన్నారు. పన్నాలో పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ముందంజలో ఉంది. పొవాయ్ స్థానం నుంచి బీజేపీ ముందంజలో ఉంది. షాదోల్‌లోని బియోహరి స్థానం నుంచి బీజేపీ ముందంజలో ఉంది. బర్వానీలోని సెంద్వా స్థానంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ► మధ్యప్రదేశ్‌లో బీజేపీ సంచలనం సృష్టిస్తొంది. 137 సీట్ల ప్రారంభ ట్రెండ్ వచ్చింది. బీజేపీ 83 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 54 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గుణ జిల్లా రఘోఘర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జైవర్ధన్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు. కాగా ప్రజానీకం తమ వెంటే ఉన్నారని మాజీ సీఎం కమల్‌నాథ్ అన్నారు. ఎన్ని సీట్లు వస్తాయనేది నేనేమి చెప్పాలేను. మేమైతే విజయంపై నమ్మకంగా ఉన్నామన్నారు. ► మధ్యప్రదేశ్‌లో 113 సీట్ల తొలి ట్రెండ్‌లో బీజేపీ 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 66 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గ్వాలియర్‌లో పోస్టల్ బ్యాలెట్ పత్రాల లెక్కింపు పూర్తయింది. ఇక్కడ కాంగ్రెస్ 4 స్థానాల్లో, బీజేపీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ► మధ్యప్రదేశ్‌లో తొలుత 42 సీట్ల ట్రెండ్ వెలువడింది. బీజేపీ 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దాతియాకు చెందిన నరోత్తమ్ మిశ్రా ప్రారంభ ట్రెండ్స్‌లో వెనుకంజలో ఉన్నారు. ► మధ్యప్రదేశ్‌లో తొలి ట్రెండ్ మొదలైంది. ఈ ధోరణి కాంగ్రెస్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతోంది. ముందుగా మొరెనా పోస్టల్ బ్యాలెట్ పత్రాలు తెరిచారు. రాష్ట్రంలోని వికలాంగులు, వృద్ధులు, ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. మధ్యప్రదేశ్‌లో తొలి ట్రెండ్‌లోని 29 స్థానాల్లో బీజేపీ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ►కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది. ముందు నుంచి నేను ఇదే చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. ఎన్నికల్లో 130కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. బీజేపీ గెలిచే అవకాశమే లేదు. #WATCH | Counting of votes | Bhopal, Madhya Pradesh: Senior Congress leader Digvijaya Singh says, "...I had said this earlier and I say it today as well - 130 plus. We are getting 130 seats, rest is to be seen." On incumbent CM Shivraj Singh Chouhan, he says, "Not only is his… pic.twitter.com/y1NhF5f36R — ANI (@ANI) December 3, 2023 ►మధ్యప్రదేశ్‌లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. Counting of votes for Chhattisgarh, Madhya Pradesh, Rajasthan and Telangana Assembly elections begins. pic.twitter.com/Raj87zBuaI — ANI (@ANI) December 3, 2023 ►కౌంటింగ్ వేళ కాంగ్రెస్ నేతల హంగామా.. #WATCH | Music, dance and celebrations outside the Congress headquarters in Delhi, ahead of the counting of votes for the four-state elections. pic.twitter.com/ex9OmkBwFQ — ANI (@ANI) December 3, 2023 ►మధ్యప్రదేశ్‌లో విజయం తమదంటే తమదేనని కాంగ్రెస్, బీజేపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. Counting of votes in 4 States today Congress leader PC Sharma in Bhopal says, "The party will win 135-175 seats in Madhya Pradesh." pic.twitter.com/ObENIXU1x3 — ANI (@ANI) December 3, 2023 #WATCH | Bhopal, Madhya Pradesh: On counting of votes, BJP candidate Rameshwar Sharma says, "There will be a shower of blessings & BJP government will be formed...What has Congress given to the people in its 62 years of politics?..." pic.twitter.com/9Q6VjqY7um — ANI (@ANI) December 3, 2023 #WATCH Bhopal, Madhya Pradesh: On counting of votes, BJP leader Arvind Singh Bhadoria says, "With the blessings of the public, the BJP government is going to be formed in Madhya Pradesh under the leadership of Shivraj Singh. If there was anyone who stood in the interests of the… pic.twitter.com/03LqAO9ftk — ANI (@ANI) December 3, 2023 ►మధ్యప్రదేశ్‌లో 52 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇక్కడ 2,533 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. గురువారం నాటి ఎగ్జిట్ పోల్స్‌లో మూడు బీజేపీకి ఘనవిజయం ఖాయమని పేర్కొన్నాయి. ►2018 మాదిరిగా రెండు పార్టీలూ విజయానికి దగ్గరగా వస్తాయని మరికొన్ని అంచనా వేశాయి. ఒకట్రెండు కాంగ్రెస్ విజయాన్ని సూచించాయి. భారీ మెజారిటీతో బీజేపీ అధికారాన్ని నిలుపుకుని తీరుతుందని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శనివారం ధీమా వ్యక్తంచేశారు. ప్రజలు ఈసారి మార్పుకే ఓటేశారని పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ చెప్పుకొచ్చారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు సాధించగా బీజేపీ 109 స్థానాలతో సరిపెట్టుకుంది. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 230 మెజారిటీ మార్కు: 116 -
కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. ఈసారి ఉల్లంఘన కేసులు ఎన్నంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఇక, ఓట్ల లెక్కింపు ఈనెల మూడో తేదీన(ఆదివారం) జరుగనుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. దీంతో, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. నలభై కంపెనీల బలగాలతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. అలాగే, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో 1,766 లెక్కింపు టేబుళ్లు ప్లాన్ చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో 131 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లను ఏర్పాటు చేయగా.. ఆరు నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుందని అధికారులు వెల్లడించారు. అలాగే, ఉదయం 10 గంటలకు మొదటి ఫలితం వెల్లడవుతుందన్న ఈసీ పేర్కొంది. ప్రతీ టేబుల్‌పై మైక్రో అబ్జర్వర్.. కౌంటింగ్ సూపర్ వైజర్.. ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. ఇక, ఎన్నికల నిబంధనలపై 2023లో 13 వేల కేసులు నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక, 2018 ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘనలపై 2,400 కేసులు అయినట్టు స్పష్టం చేశారు. -
ఇక కౌంటింగ్‌కి రెడీ.. నాయకులకు పార్టీల ట్రైనింగ్
Madhya Pradesh assembly elections 2023: మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల ముగిశాయి. 230 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో నవంబర్ 17న పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. కౌంటింగ్‌కి ఇక కొన్ని రోజులే ఉండటంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఆదివారం తమ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు వేర్వేరుగా శిక్షణా సమావేశాలను నిర్వహించాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ భోపాల్‌లో శిక్షణా సమావేశాన్ని నిర్వహించగా, అధికార బీజేపీ తన అభ్యర్థులతో వర్చువల్‌గా ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేసింది. భోపాల్‌లో రెండు షిఫ్టుల్లో 230 మంది అభ్యర్థులకు శిక్షణ తరగతులు నిర్వహించినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎం లెక్కింపు ప్రక్రియ గురించి అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన తొలి సెషన్లో రేవా, షాహదోల్, జబల్పూర్, గ్వాలియర్-చంబల్ డివిజన్ల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు. ఇండోర్, ఉజ్జయిని, నర్మదాపురం, భోపాల్, సాగర్ డివిజన్ల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు మధ్యాహ్నం 2.30 గంటలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ పార్టీ అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లతో వర్చువల్‌గా మాట్లాడారు. ఇక అధికార భారతీయ జనతా పార్టీ వీడియో లింక్ ద్వారా శిక్షణా సమావేశాన్ని నిర్వహించింది. కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు వర్చువల్ వర్క్ షాప్ నిర్వహించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ మీడియాకు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన కొత్త నిబంధనలు, సాంకేతిక విషయాలను వారికి తెలియజేసినట్లు చెప్పారు. నవంబర్ 29, 30 తేదీల్లో అసెంబ్లీ సెగ్మెంట్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. -
Gujarat Election Results: గుజరాత్ ప్రజలకు నమస్కరిస్తున్నా: మోదీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. 07:00PM గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తిరుగులేని మెజారిటీని సాధించింది. 182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజరాత్లో బీజేపీ 156 చోట్ల విజయం కేతనం ఎగురవేసింది. 54శాతం ఓట్లను దక్కించుకుంది. మోదీ- షా సొంత రాష్ట్రంలో వరుసగా ఏడోసారి అధికారాన్ని దక్కించుకుంది. దీంతో పశ్చిమ బెంగాల్లో సీపీఎం రికార్డును బీజేపీ సమం చేసింది. కాగా 1977 నుంచి 2011 వరకు 34 సంవత్సరాల పాటు సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ పశ్చిమ బెంగాల్‌ను పాలించింది. 06:30PM గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీ విజయం సాధించారు. వడ్గమ్ అసెంబ్లీ స్థానం నుంచి మరోసారి గెలుపొందారు. అనంతరం తనకు విజయాన్ని అందించినందుకు వడ్గాం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని తెలియజేస్తుందన్నారు. ఇది సమాజంలోని పేద, అట్టడుగు వర్గాలను మరింత ముందుకు తీసుకొచ్చే బాధ్యతను కూడా తనకు అందిస్తుందని మేవానీ ట్వీట్ చేశారు. Thank you Gujarat. I am overcome with a lot of emotions seeing the phenomenal election results. People blessed politics of development and at the same time expressed a desire that they want this momentum to continue at a greater pace. I bow to Gujarat’s Jan Shakti. — Narendra Modi (@narendramodi) December 8, 2022 05:15PM గుజరాత్లో బీజేపీ ఘన విజయంపై ప్రధాని మోదీ స్పందించారు. అద్భుతమైన ఎన్నికల ఫలితాలు చూసి భావోద్వేగాని లోనైనట్లు తెలిపారు. అభివృద్ధి రాజకీయాలను ప్రజలు ఆశీర్వదించారని పేర్కొన్నారు.. ఇదే జోరును మరింత ముందుకు తీసుకెళ్లాలని వారు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. గుజరాత్ ప్రజలకు నమస్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ విజయం కోసం కష్టపడి పనిచేసిస గుజరాత్ బీజేపీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. మీరందరూ ఛాంపియన్స్. పార్టీకి నిజమైన బలం అయిన కార్యకర్తల అసాధారణమైన కృషి లేకుండా ఈ చారిత్రాత్మక విజయం ఎప్పటికీ సాధ్యం కాదు.’ అని ట్వీట్ చేశారు. To all hardworking @BJP4Gujarat Karyakartas I want to say - each of you is a champion! This historic win would never be possible without the exceptional hardwork of our Karyakartas, who are the real strength of our Party. — Narendra Modi (@narendramodi) December 8, 2022 04:15PM అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం చవిచూడటంతో గుజరాత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రఘు శర్మ రాజీనామా చేశారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల కోత వెనుక ఆప్, అసదుద్దీన్ ఒవైసీ ఓ కారణమన్నది నిజమని గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ జే ఠాకూర్ పేర్కొన్నారు. తమ లోటుపాట్లను విశ్లేషించేందుకు త్వరలో సమావేశం కానున్నట్లు తెలిపారు. రాబోయే ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 2012, 2017, 2022 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. 03:45PM గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదన్ గధ్వి పరాజయం పొందారు. ఖంభాలియా నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి హర్దాస్‌భాయ్ బేరాపై 18వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. 03:15PM గుజరాత్లో కాంగ్రెస్ ఓట్లకు చీల్చేందుకు బీజేపీ ఆప్‌కి నిధులు సమకూర్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఆరోపించారు. ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ భారీగా డబ్బు వెదజల్లిందని విమర్శించారు. ఆప్ పోటీలోకి రావడంతో తాము వెనకబడిపోయామని అన్నారు. ఈ ఎన్నికల్లో ఆప్‌కు 10 శాతం ఓట్లు రావడంతో కాంగ్రెస్ ఓట్లు తగ్గాయని పేర్కొన్నారు. మోర్బి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీ అభ్యర్థి కాంతిలాల్ అమృతీయ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన జయంతిలాల్ పటేల్‌పై 61,5000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 03:00PM గుజరాత్ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీపై, బీజేపీ నాయకత్వంపై మరోసారి విశ్వాసం ప్రదర్శించారని రాఫ్ట్ర సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు. ఈ ఎన్నికల్లో గుజరాత్ ప్రజలు దేశ వ్యతిరేక శక్తులను తిరస్కరించారని అన్నారు. ప్రజల అభిష్టాన్ని స్వీకరిస్తున్నామని, బీజేపీకి చెందిన ప్రతి కార్యకర్త ప్రజాసేవకే కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు.. 02:30PM గుజరాత్లో బీజేపీ ఘన విజయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. బూటకపు వాగ్దానాలు చేసిన వారిని ప్రజలు తిరస్కరించారని.. ప్రధాని మోదీ అభివృద్ధి, పాలనపై నమ్మకంతో బీజేపీకి అపూర్వమైన విజయాన్ని అందించారని తెలిపారు. మహిళలు, యువకులు, రైతులు అనే తేడా లేకుండా అన్ని వర్గాలూ బీజేపీ వెంటే ఉన్నాయనడానికి ఈ భారీ విజయం సాక్ష్యంగా నిలిచిందన్నారు. गुजरात ने हमेशा इतिहास रचने का काम किया है। पिछले दो दशक में मोदी जी के नेतृत्व में भाजपा ने गुजरात में विकास के सभी रिकॉर्ड तोड़े और आज गुजरात की जनता ने भाजपा को आशीर्वाद देकर जीत के सभी रिकॉर्ड तोड़ दिये। यह @narendramodi जी के विकास मॉडल में जनता के अटूट विश्वास की जीत है। — Amit Shah (@AmitShah) December 8, 2022 01:53PM ► గుజరాత్ జామ్‌నగర్ నార్త్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా గెలుపొందారు. 61 వేలకుపైగా భారీ మెజార్టీ సాధించినట్లు తెలుస్తోంది. గెలుపుపై ఆమె స్పందిస్తూ.. ఇది అందరి విజయం అన్నారు. 12:45 PM ► గుజరాత్లో బీజేపీ ఘన విజయంతో సీఎంగా అధికారం చేపట్టనున్న భూపేంద్ర పటేల్. కాగా, డిసెంబర్ 10 లేదా 11వ తేదీన ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. Gujarat CM Bhupendra Patel and state BJP chief CR Paatil have sweets in celebration as the party sweeps the #GujaratAssemblyPolls The Chief Minister is also leading from his constituency Ghatlodia by a margin of 1,07,960 votes. pic.twitter.com/9CAGPjMLsM — ANI (@ANI) December 8, 2022 ► గుజరాత్లో కాంగ్రెస్ ఓట్ షేర్.. 26శాతం, ఆప్ ఓట్ షేర్.. 12.7 శాతం 12:10 PM ► గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ విజయం సాధించారు. గట్లోదియా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన పటేల్ ఘన భారీ విజయాన్ని అందుకున్నారు. 11:40 AM ► గుజరాత్లో భారీ విజయం నేపథ్యంలో గురువారం సాయంత్రం ఆరు గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ కార్యాలయానికి వెళ్లనున్నారు. 11:18 A ► బీజేపీ ఘన విజయంతో గాంధీనగర్‌లో బీజేపీ శ్రేణులు డ్యాన్స్ చేస్తూ సంబురాలు జరుపుకుంటున్నాయి. #WATCH | Women BJP workers in Gandhinagar celebrate by dancing as the party heads towards a landslide victory in Gujarat BJP leading on 152 of the 182 seats, as per the official EC trends. pic.twitter.com/XlajLlNlYd— ANI (@ANI) December 8, 2022 #WATCH | Celebrations at Gandhinagar BJP office as the party sweeps Gujarat elections BJP leading on 149 seats of total 182 seats, as per ECI trends pic.twitter.com/rfuAusbO3z — ANI (@ANI) December 8, 2022 10:35 AM ► బీజేపీకి బంపర్ మోజార్టీ. బీజేపీ 54 శాతం ఓట్ షేర్ సాధించింది. వరుసుగా ఏడో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. గుజరాత్‌లోని అన్ని ప్రాంతాల్లో బీజేపీ మెజార్టీలో నిలిచింది. గుజరాత్లో అన్ని రికార్డులను బీజేపీ బ్రేక్ చేస్తోంది. ఇప్పటికి 153 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. 9:52 AM ► గాంధీనగర్ సౌత్‌లో అల్పేష్ ఠాకూర్ ముందంజ. మోర్టీలో కూడా బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. విరంగాం స్థానంలో పాటిదార్ నేత హార్ధిక్ పటేల్ లీడ్‌లో ఉన్నారు. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతుండటంతో కాషాయ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. Gandhinagar, Gujarat | Bharatiya Janata Party workers celebrate as party crosses majority mark of 95 in early trends as per ECI. BJP is leading in 99 seats in the State pic.twitter.com/ylar3cPblB — ANI (@ANI) December 8, 2022 9:33 AM ► ఘాట్లోడియాలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ముందంజలో ఉన్నారు. In Gujarat, BJP -123; Congress-22; AAP-10 - in early trends as per ECI BJP has crossed the halfway mark of 92 in the State in early trends pic.twitter.com/VVmyA1SZUq — ANI (@ANI) December 8, 2022 9: 25 AM ► 130కి పైగా స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. సౌరాష్ట్రలోని కచ్ ప్రాంతంలో బీజేపీ భారీ సీట్లలో ఆధిక్యంలో ఉంది. 8:53 AM. మోర్బీలో బీజేపీ వెనుకంజ ► మోర్బీలో బీజేపీ వెనుకంజ. కాగా, మోర్బీలో ఇటీవలే తీగల వంతెన కూలిపోయి దాదాపు 135 మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే. దీంతో, ఎన్నికల ఫలితాలపై ఈ ఘటన ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. 8:47 AM ► జామ్‌నగర్ నార్త్‌లో లీడ్‌లో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజా. 8:30 AM ► పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ దూసుకుపోతోంది. బీజేపీకి భారీ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు దక్కాయి. దీంతో, ముందంజలో కొనసాగుతోంది. ► మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. #GujaratElections2022 | Counting of votes begin, visuals from Government Commerce College in Gandhinagar. pic.twitter.com/PmcIXC1rS8 — ANI (@ANI) December 8, 2022 ► ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ► బీజేపీ ఘన విజయం సాధిస్తుంది. బీజేపీ విజయంలో ఎలాంటి సందేహం లేదు. 20 ఏళ్లుగా గుజరాత్లో ఎలాంటి దాడులు, టెర్రరిస్టుల దాడుల జరగలేదు. గుజరాత్ ప్రజలకు బీజేపీ ప్రభుత్వంపై నమ్మకం ఉంది. అందుకే మా పార్టీని గెలిపిస్తారు. 135-145 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుంది.- హర్దిక్ పటేల్ 135-145, we are definitely going to form the Govt. Do you have any doubts?: BJP candidate from Viramgam, Hardik Patel when asked how many seats will his party get #GujaratElection2022 pic.twitter.com/dfekGSJtBB — ANI (@ANI) December 8, 2022 ► ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. అధికారులు, పార్టీ నేతలు కౌంటింగ్ సెంటర్లకు చేరుకుంటున్నారు. Ahmedabad, Gujarat | The counting of votes for the Gujarat Assembly elections will begin at 8 am. Outside visuals from counting centre at LD Engineering College pic.twitter.com/YPS7tIh2Jn — ANI (@ANI) December 8, 2022 ► గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. గుజరాత్లో 182 శాసనసభ స్థానాలుండగా డిసెంబర్ 1న, డిసెంబర్ 5న రెండు విడతల్లో ఎన్నికలు పూర్తయాయి. 27 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న కాషాయ పార్టీ తిరిగి ‘పవర్’పంచ్ విసరాలని తీవ్రంగా శ్రమించింది. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడంతో ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా చర్చనడుస్తోంది. ► అయితే, పలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు గుజరాత్లో బీజేపీకి అనుకూలంగా తీర్పునిచ్చాయి. తర్వాతి స్థానంలో కాంగ్రెస్ ఉంది. ఆప్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక, ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ విజయం సాధిస్తే రికార్డు స్థాయిలో ఏడోసారి బీజేపీ విజయకేతనం ఎగురవేయనుంది. -
Election Results 2022: కచ్చితమైన సమాచారం కోసం..
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఉత్తరప్రదేశ్‌లో 7 దశల్లో, మణిపూర్‌లో 2 దశల్లో, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్‌లలో ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. ఫలితాల కోసం ఆయా రాష్ట్రాల ప్రజలతో పాటు దేశంలోని వారంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వార్తా చానళ్లు, వెబ్సైట్లు తమ అందించిన సమాచారం ఆధారంగా ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తుంటాయి. అయితే కచ్చితమైన, అధికారిక సమాచారం కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ లేదా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎలా చూడాలి? ► ముందుగా ఎన్నికల సంఘం వెబ్సైట్ (results.eci.gov.in)లోకి వెళ్లాలి. ► 'అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ ఎన్నికలు - మార్చి 2022' లింక్‌పై క్లిక్ చేయండి. ► క్లిక్ చేయగానే మీరు కొత్త వెబ్‌పేజీకి మళ్లించబడతారు ► ఎన్నికల ఫలితాలను చూడాలనుకుంటున్న రాష్ట్రం పేరుపై క్లిక్ చేయండి. ► క్లిక్ చేయగానే ఎన్నికల ఫలితాల ట్రెండ్ పేజీ ఓపెనవుతుంది. ► పార్టీల వారీగా, నియోజకవర్గాల వారీగా, అభ్యర్థులు అందరూ, నియోజకవర్గాల వారీగా ట్రెండ్స్.. ఆప్షన్లలో దేనినైనా ఎంచుకోండి. ► ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత తుది ఫలితం వెల్లడిస్తారు. ► దీంతో పాటు sakshi.comలోనూ ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. -
Kuppam: ప్రజల మద్దతు ఫలితమే కుప్పంలో ఘన విజయం: పెద్దిరెడ్డి
-
టీడీపీని ఎన్టీఆర్ కుటుంబానికి అప్పగించు బాబూ!
సాక్షి, అమరావతి: టీడీపీని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు అప్పగించి, చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటే ప్రజలు సంతోషిస్తారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ప్రజలు ఛీత్కరించడంతో టీడీపీ శాశ్వతంగా భూస్థాపితమైందన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనకు ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రంలో పాలన సాగుతోందన్నారు. టీడీపీ చంద్రబాబు సొంత పార్టీ కాదని, ఎన్టీఆర్ స్థాపిస్తే వెన్నుపోటు పొడిచి లాక్కున్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ప్రాణాలు పోవటానికి కారణమైన వ్యక్తి.. ఇప్పుడు పార్టీని కూడా అసమర్థతతో నాశనం చేశాడని విమర్శించారు. ‘ఇప్పటికే చంద్రబాబుకు 72 ఏళ్లు వచ్చాయి. తక్షణమే కుప్పం ఫలితాలతోనైనా చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలని, తనయుడు లోకేశ్‌తో కలిసి హైదరాబాద్‌కు వెళ్లి ఆరోగ్యం కాపాడుకోవాలని హితవు పలికారు. కుప్పం మునిసిపల్ కౌంటింగ్‌ను స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో రికార్డు చేయాలంటూ హైకోర్టు నుంచి అనుమతులు తెచ్చుకుని, తీరా ఫలితాలను చూసి వైఎస్సార్సీపీ మ్యానిప్యులేట్ చేసిందంటూ చంద్రబాబు దిగజారుడు రాజకీయానికి పాల్పడ్డారని మండిపడ్డారు. చంద్రబాబు ఇక కుప్పంలో పోటీ చేస్తాడనుకోవడం లేదు వైఎస్సార్ తనయుడు జగన్మోహన్రెడ్డి సొంతంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం చూసిన చంద్రబాబు తన కొడుకు లోకేశ్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారని మదనపడుతున్నారని పెద్దిరెడ్డి అన్నారు. కుప్పంలో ఓటమి భయంతోనే పోలింగ్‌కు ముందు తమను దుర్భాషలాడారన్నారు. ‘లోకేశ్ అయితే పెద్దిరెడ్డి గాడు అని మాట్లాడారు. మా నాన్న చాలా సాఫ్ట్. నేను పెద్ద రౌడీని’ అంటూ వ్యాఖ్యలు చేశారు. రౌడీలు కాబట్టే కుప్పంలో పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, మునిసిపల్ ఎన్నికల్లో వారిని ప్రజలు పూర్తిస్థాయిలో తిరస్కరించారన్నారు. మరోసారి చంద్రబాబు, లోకేశ్, ఆయన అనుచరులు ఇష్టానుసారం మాట్లాడితే తగిన విధంగా స్పందిస్తానంటూ మంత్రి హెచ్చరించారు. మీడియా ప్రశ్నలకు బదులిస్తూ.. ఈ ఓటమితో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో పోటీ చేస్తాడని అనుకోవటం లేదన్నారు. తనను టార్గెట్ చేస్తూ పుంగనూరులో పోటీ చేయాలనుకుంటే ఆహ్వానిస్తామన్నారు. తామెప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు కాబట్టే చంద్రబాబు కుప్పంలో గెలుస్తున్నారన్నారు. కాలేజీలో చదువుతున్నప్పుడు చంద్రబాబు తనకు సీనియర్ అని, తాము వేర్వేరు గ్రూపులకు నాయకులుగా ఉన్నామని గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లోనే తాను యూనివర్సిటీకి ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ అయ్యానని, అప్పుడు పోటీ ఎందుకు పెట్టలేదో చంద్రబాబునే అడగాలని పెద్దిరెడ్డి చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి, పార్టీ నేతలకు సీఎం జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, చిత్తూరు జిల్లా పార్టీ నేతలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం అభినందించారు. ఎన్నికల ఫలితాల అనంతరం మంత్రి పెద్దిరెడ్డి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అభినందనలు తెలిపారు. -
కుప్పంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫోటోలు
-
నెల్లూరులో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
-
నెల్లూరు కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్
AP Municipal Elections 2021 Results Live Updates: 04: 57PM ► కృష్ణా: జగ్గయ్యపేట మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ కైవసం ► మొత్తం 31 వార్డుల్లో.. వైఎస్సార్సీపీ-17, టీడీపీ-14 వార్డుల్లో విజయం సాధించాయి. 04: 20PM ► జగ్గయ్యపేట మున్పిపాలిటీని కైవసం చేసుకునే దిశంగా వైఎస్సార్సీపీ ► రెండో రౌండ్లో 11 వార్డుల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ► ఇప్పటికే 8 వార్డులను గెలుచుకున్న వైఎస్సార్సీపీ ► కాకినాడలో ఉప ఎన్నిక జరిగిన 4 డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ► కాకినాడలోని 3, 9, 16, 30వ డివిజన్లలో వైస్సార్సీపీ గెలుపొందింది. 03: 54PM ► రాజంపేట మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ కైవసం ► మొత్తం 29 వార్డుల్లో వైఎస్సార్సీపీ-24, టీడీపీ-4, ఇండిపెండెంట్-1 వార్డులో విజయం సాధించాయి. ► గురజాల నగర పంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం ► మొత్తం 20 వార్డుల్లో వైఎస్సార్సీపీ 16, టీడీపీ-3, జనసేన-1 వార్డులో విజయం సాధించాయి. ►ఆకివీడు నగర పంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం ► మొత్తం 20 వార్డుల్లో వైఎస్సార్సీపీ-12, టీడీపీ-4, జనసేన-3 వార్డుల్లో విజయం సాధించాయి. 03:32PM కృష్ణా: కొండపల్లిలో ముగిసిన కౌంటింగ్ ► కొండపల్లిలో 29 స్థానాల్లో వైఎస్సార్సీపీ-14 స్థానాల్లో విజయం, టీడీపీ- 14 స్థానాల్లో విజయం, ఇండిపెండెంట్-1 స్థానంలో గెలుపు 03:15PM ► నెల్లూరు కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ ► నెల్లూరు కార్పొరేషన్లో టీడీపీ ప్లాప్ షో ► బొక్కబోర్లాపడ్డ సైకిల్ ► 54కి గాను 54 డివిజిన్లలో వైఎస్సార్సీపీ గెలుపు ►కార్పొరేషన్ ఎన్నిక జరిగిన 46 డివిజన్లలో 46 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం ►ఏకగ్రీవాలతో కలిపి 54 డివిజన్లను కైవసం చేసుకొన్న వైఎస్సార్సీపీ ►క్లీన్ స్వీప్‌తో మరో చరిత్ర సృష్టించిన వైఎస్సార్సీపీ 02:29PM విశాఖపట్నం: జీవీఎంసీ 31వ వార్డు కార్పొరేటర్‌గా వైఎస్సార్సీపీ అభ్యర్థి బీపిన్ కుమార్ జైన్ విజయం సాధించారు. జీవిఎంసీలో 61వ డివిజన్లో వైఎస్సార్సీపీ విజయం ► 2028 ఓట్ల మెజార్టీతో కొణతాల సుధ(వైఎస్సార్సీపీ) గెలుపొందారు. కృష్ణాజిల్లా: ► కొండపల్లి మున్సిపాలిటీ 19వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి జోగిరాము గెలుపొందారు. ► 26వ వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి గుంజా శ్రీనివాసు విజయం సాధించారు. ► కొండపల్లి మున్సిపాలిటీ 1వ వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి మండే చంద్రశేఖర్ బాబు గెలుపొందారు. 01:40PM కుప్పం గెలుపుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అభినందించిన సీఎం వైఎస్ జగన్ 01:36PM మొదటి రౌండ్లోనే కుప్పం మున్సిపల్ ఫలితం రాష్ట్రంలో అత్యంత ఉత్కంఠగా ఎదురుచూసిన కుప్పం మున్సిపల్ ఎన్నిక ఫలితం మొదటి రౌండ్లోనే తేలిపోయింది. మొదటి రౌండ్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ 15 వార్డులకు గాను 13 వార్డులను కైవసం చేసుకున్నారు. దీంతో 25 వార్డులున్న కుప్పం మున్సిపాలిటీలో మొదటి రౌండ్లోనే వైఎస్సార్సీపీ 13 స్థానాలను గెలుచుకొని మున్సిపాల్టీని తమ ఖాతాలోకి వేసుకున్నారు. టీడీపీ కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. 01:00PM నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. ఇప్పటికే 20 డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించగా, మరో 24 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే 8 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. 12:50PM ►నెల్లూరు కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం ►నెల్లూరు కార్పొరేషన్ 27 డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయం ►ఇప్పటి వరకు 9 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న వైఎస్సార్సీపీ ►కుప్పం, ఆకివీడు, పెనుకొండ, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, గురజాల, బుచ్చిరెడ్డిపాలెం, దాచేపల్లిలో వైఎస్సార్సీపీ గెలుపు 12:40PM ►నెల్లూరు కార్పొరేషన్ 7 డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయం ►14,27,28,33,39,41,53 డివిజన్లలో వైఎస్సార్సీపీ గెలుపు ►మరో 32 డివిజన్లలో వైఎస్సార్సీపీ ఆధిక్యం 12:15PM ►కుప్పంలో రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రారంభం ►16 వార్డు నుంచి 25 వార్డుల ఓట్ల లెక్కింపు ►హైకోర్టు ఆదేశాలతో కొనసాగుతున్న కుప్పం కౌంటింగ్ ప్రక్రియ 11:55AM వైఎస్సార్ జిల్లా కమలాపురం రౌడీలకు ప్రజలు బుద్ధి చెప్పారు కమలాపురం మున్సిపల్ ఎన్నికల విజయంపై ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్పందించారు. 'ఈ ఎన్నికల్లో కమలాపురం రౌడీలకు ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరిగాయి, ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి ఓటు చేశారు. వైఎస్సార్సీపీకి ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు. 15 వార్డుల్లో గెలుపొందాం. ఓడిన 5 వార్డుల్లో కూడా స్వల్ప మెజారిటీతో ఓడిపోయాము. ఛైర్మెన్ అభ్యర్థి ఖరారుపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం' అని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. 11:45AM నెల్లూరు జిల్లా ►బుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయితీ వైఎస్సార్సీపీ కైవసం ► మొత్తం 20 వార్డుల్లో.. 18 వార్డుల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించగా.. టీడీపీ రెండు స్థానాలకే పరిమితమైంది. 11:15AM నెల్లూరు ►కార్పొరేషన్ ఎన్నికల్లో తొలి ఫలితం విడుదల ►39వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్థి సన్ను నాగమణి 1390 ఓట్లతో విజయం ►టీడీపీ కంచుకోట డివిజన్లలోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థుల ముందంజ కుప్పంలో వైఎస్సార్సీపీ హవా ►మొదటి రౌండ్లో 14 వార్డులకుగాను 12 వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. 11:05AM ►రాజంపేట మున్సిపల్ వైఎస్సార్సీపీ కైవసం ►రాజంపేటలో 24వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ►దాచేపల్లి, కమలాపురం, ఆకివీడు, గురజాల, పెనుగొండలో నగర పంచాయతీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. దర్శి మున్సిపాలిటీలో టీడీపీ విజయం ► దర్శి మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ-7, టీడీపీ- 13 వార్డుల్లో విజయం సాధించింది. ► దాచేపల్లి నగర పంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం ► దాచేపల్లిలో 11 వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం, టీడీపీ-7 వార్డులు, ఇండిపెండెంట్-1, బీజేపీ-1 వార్డులో గెలుపొందాయి. 10:50AM ►గురజాల నగరపంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం ► గురజాల 16 వార్డుల్లో వైఎస్సార్సీపీ కైవసం ► గురజాల 3 వార్డుల్లో టీడీపీ, ఒక వార్డులో జనసేన విజయం ► కమలాపురం నగరపంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం ►కమలాపురంలో 15 వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం ►మొత్తం 20 వార్డుల్లో.. వైఎస్సార్సీపీ-15, టీడీపీ-5 వార్డుల్లో విజయం సాధించాయి. ► బేతంచర్ల నగరపంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం ► 14వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం కుప్పంలో వైఎస్సార్సీపీ హవా ►మొదటి రౌండ్లో 14 వార్డులకుగాను 14 వార్డుల్లోనూ వైఎస్సార్సీపీ ఆధిక్యం.. ఇందులో ఇప్పటికే వైఎస్సార్సీపీ ఐదు వార్డుల్లో విజయం సాధించింది. నెల్లూరు జిల్లా ►కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌లో వైఎస్సార్సీపీ హవా ►37 డివిజన్లలో ముందంజ 10:40AM ►ఆకివీడు నగర పంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం మొత్తం 20 వార్డుల్లో 12 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం ► పెనుకొండ మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ కైవసం ►మొత్తం 20 వార్డుల్లో వైఎస్సార్సీపీ-18, టీడీపీ-2 వార్డుల్లో విజయం సాధించాయి. 10:30AM బుచ్చి నగరపంచాయితీలో దూసుకు పోతున్న వైఎస్సార్సీపీ ►డిఎల్ఎన్ఆర్ పాఠశాలలో కొనసాగుతున్న ఎన్నికల కౌంటింగ్ ఇప్పటి వరకు విడుదలైన ఫలితాలు. ►ఒకటో వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి కత్తి నాగరాజు 273 ఓట్ల మెజార్టీతో విజయం.. ►మూడో వార్డు లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ప్రత్యూష విజయం.. ►నాలుగో వార్డ్ లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మాచర్ల సుప్రజా విజయం.. ►7వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి షకీలా విజయం.. ►18వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి జయంతి విజయం.. ►9వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి యరటపల్లి శివారెడ్డి విజయం.. ►14 వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి చీర్ల ప్రసాద్ ముందంజ.. ►15 వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి కంట అనంతమ్మ ముందంజ.. అనంతపురం ►పెనుకొండ నగర పంచాయతీలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం ►మొత్తం 20 వార్డులకుగాను 18 వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం 10:25AM కుప్పంలో వైఎస్సార్సీపీ హవా ►మొదటి రౌండ్లో 14 వార్డులకుగాను 10 వార్డుల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►దాచేపల్లి నగర పంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం 10:20AM ►పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ఫ్యాన్ జోరు ►మొత్తం 20 వార్డులకుగానూ 13 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 10:18AM కర్నూలు జిల్లా ►బేతంచర్ల నగర పంచాయితీ ఎన్నికల్లో 14 వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి మధుసూదన్ రావు గెలుపు ►బేతంచర్ల నగర పంచాయితీ ఎన్నికల్లో 20 వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి జి శకుంతల గెలుపు అనంతపురం జిల్లా ►పెనుకొండ నగర పంచాయతీ లో వైఎస్సార్ సీపీ హవా ►మొత్తం 20 వార్డుల్లో 10 వార్డులు వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ఆధిక్యత 10:12AM వైఎస్సార్ జిల్లా.. కమలాపురం 2 వార్డు వైసీపీ అభ్యర్థి షేక్ మోహమ్మద్ సాదిక్ 324 ఓట్లతో భారీ విజయం ►18 వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి కుప్పూరి సుదర్శన్ రెడ్డి 18 ఓట్లతో విజయం ►3 వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి షేక్ నూరి 134 ఓట్లతో విజయం ►కమలాపురం 13 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం ► రాజంపేట 4వ వార్డులో వైసీపీ అభ్యర్థి మర్రి రవి కుమార్ విజయం ►21వ వార్డులో పోలా రమణా రెడ్డి వైఎస్సార్సీపీ విజయం 10:02AM గురజాల ►నగర పంచాయతీలో 2 వార్డు లో 377 మెజార్టీ వైసిపి గెలుపు ►గురజాల 15వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మన్యం కన్యాకుమారి 101 ఓట్లతో గెలుపు 10.02AM: చిత్తూరు జిల్లా: ►కుప్పం 1,2,7 వార్డుల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం 9:50AM గుంటూరు: ►దాచేపల్లి 13వ వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి వందనపు లక్ష్మి 159 ఓట్లమెజార్టీతో గెలుపు ►దాచేపల్లి 6వ వార్డు టీడీపీ అభ్యర్థి 94 ఓట్లతో గెలుపు ►గురజాల ఒకటో వార్డువైఎస్సార్సీపీ అభ్యర్థి లింగా చారి 456 ఓట్లతో గెలుపు ►అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీ లోని 17వ వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి రామాంజనేయులు విజయం ►18 వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నందిని విజయం 9:45 AM అనంతపురం: ►పెనుకొండ నగర పంచాయతీ లో వైఎస్సార్ సీపీ బోణీ ►14, 18 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల ఆధిక్యత వైఎస్సార్ జిల్లా.. కమలాపురం ►17 వార్డు వైసీపీ అభ్యర్థి కలవ నాగమణి 27 ఓట్ల మెజార్టీతో విజయం వైఎస్సార్ జిల్లా.. కమలాపురం ►9 వార్డు లో వైసీపీ అభ్యర్థి మారుజోళ్ళ శ్రీనివాసులు రెడ్డి 42 ఓట్లతో విజయం.. ►10 వార్డులో వైసీపీ అభ్యర్థి గెంటెమ్ సుగంధి 81 మెజార్టీతో విజయం.. వైఎస్సార్ జిల్లా.. కమలాపురం ►16 వార్డు వైసీపీ అభ్యర్థి కొప్పు షాహీనా బేగం 144 ఓట్లతో విజయం 9.40AM వైఎస్సార్ జిల్లా ►కమలాపురం మునిసిపాలిటీ వైఎస్సార్ కాంగ్రెస్ కైవసం 09:22AM చిత్తూరు జిల్లా ►కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో మొదటి రౌండ్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఆధిక్యంలో ఉన్నారు. ►14వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మునిస్వామి ఏకగ్రీవ ఎన్నిక ►నగిరి మున్సిపాలిటీ 17వ వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి గంగాధరం ఏకగ్రీవం 09:14AM బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో వార్డుల వారీగా పార్టీలకు వచ్చిన పోస్టల్ బ్యాలెట్ వివరాలు మొత్తం పోస్టుల బ్యాలెట్ లు - 114 వైఎస్సార్సీపీ - 66 టీడీపీ - 20 బీజేపీ - 27 సీపీఎం - 1 వైఎస్సార్ జిల్లా ►కమలాపురం 11 వార్డులో 83 ఓట్లతో వైఎస్సార్సీపీ అభ్యర్థి కొప్పోలి సలీల విజయం ►కమలాపురం 15వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి చవారెడ్డి సంధ్యారాణి 129 ఓట్ల మెజారిటీతో విజయం 08:44AM గుంటూరు జిల్లా ►ప్రారంభమైన గురజాల, దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ►ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసిన అధికారులు ►ఓట్లను కట్టలు కడుతున్న అధికారులు 08:40AM నెల్లూరు జిల్లా ►ప్రారంభమైన కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ►పోస్టల్ బ్యాలెట్లు లెక్కస్తున్న సిబ్బంది 08:37AM తూర్పుగోదావరి జిల్లా ►కాకినాడ నగరపాలక సంస్థ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం ►3,9,16,30. డివిజన్లకు ఈ నెల 15 న జరిగిన పొలింగ్ ►మొత్తం 15 మంది అభ్యర్ధులు పోటి, 51.46 % పోలింగ్ నమోదు ►రంగరాయ మెడికల్ కళశాలలో కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు ►8 టేబుళ్ళు ఏర్పాటు, మధ్యహన్నం కల్లా వెలువడనున్న ఫలితాలు 08:31AM ప్రకాశం జిల్లా ►దర్శి నగర పంచాయతీకి సంబంధించి ఏపీ మోడల్ స్కూల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం.. ►19 వార్డులకు కౌంటింగ్ కోసం 38 టేబుల్స్ ఏర్పాటు ►100 మంది సిబ్బందిని ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారులు 08:21AM కృష్ణా జిల్లా ►తెరుచుకున్న స్ట్రాంగ్ రూమ్ లు ►స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి కౌంటింగ్ హాల్ కు బ్యాలెట్ బాక్సులు తరలింపు ►మొదటగా ఓట్లను వేరు చేసి కట్టలు కట్టనున్న కౌంటింగ్ సిబ్బంది ►తొలిఫలితం 11 గంటలకు తెలిసే అవకాశం ►16 టేబుళ్ల పై కౌంటింగ్ ►రెండు రౌండ్లలో ముగియనున్న కౌంటింగ్ ►ఏజెంట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కౌంటింగ్ హాల్ లోకి అనుమతిస్తున్న పోలీసులు ►కౌంటింగ్‌కు పకడ్భందీ చర్యలు.. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు 08:17AM కర్నూలు జిల్లా ►ప్రారంభమైన బేతంచర్ల నగర పంచాయతీ ఎన్నికలకు కౌంటింగ్ ►మొత్తం 20 వార్డులకు సంబంధించి కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ ►20 వార్డులకు గాను 20 టేబుళ్ల ఏర్పాటు ►ఒకటే రౌండ్లో ముగియనున్న ఓట్ల లెక్కింపు. ►11 గంటలలోపే వెలువడనున్న ఫలితాలు 08:10AM చిత్తూరు జిల్లా ►కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం ►పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మూడుకు గానూ ఒక్కటి కూడా నమోదు కాలేదు. 08:00AM నెల్లూరు కార్పొరేషన్ సహా 13 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు, మరో 10 మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్ సహా 13 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు, మరో 10 మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. ఆయా మునిసిపాలిటీల్లో 325 డివిజన్లు, వార్డులకు సోమవారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 325 స్థానాలకు 1,206 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. మొత్తం 23 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఇక సోమవారం జరిగిన పోలింగ్‌లో 8,62,066 మందికిగాను 5,14,086 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉ.8 గంటలకు లెక్కింపు ప్రారంభం ఓట్ల లెక్కింపు బుధవారం ఉ.8 గంటలకు ప్రారంభిస్తారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన అనంతరం సాధారణ ఓట్లు లెక్కిస్తారు. సా.5 గంటలలోపు అన్ని మున్సిపాలిటీల్లో పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 23 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లు లెక్కించడానికి 450 టేబుళ్లు ఏర్పాటుచేశారు. కౌంటింగ్ సూపర్వైజర్లుగా 534 మందిని, అసిస్టెంట్ కౌంటింగ్ సూపర్వైజర్లుగా 3,792 మందిని నియమించారు. నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లు ఉండగా ఏకగ్రీవమైన 8 డివిజన్లు పోను మిగిలిన 46 డివిజన్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆయా డివిజన్లలో పోలైన ఓట్లు లెక్కించడానికి 142 టేబుళ్లు ఏర్పాటుచేశారు. అదే విధంగా కుప్పంలో 24 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 14 టేబుళ్లు సమకూర్చారు. లెక్కింపు ప్రక్రియ చిత్రీకరణ ఇక అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల ద్వారా చిత్రీకరిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నీలం సాహ్ని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లోని పోలింగ్ ప్రక్రియను చిత్రీకరించినట్లు తెలిపారు. కుప్పం మున్సిపాలిటీలో పోలింగ్ స్టేషన్ల వెలుపల చిన్నచిన్న ఘటనలు మినహా, పోలింగ్ ప్రక్రియ అంతా సజావుగా సాగినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఎన్నికల పరిశీలకులు, ఇతర అధికారుల నుంచి నివేదికలు అందాయన్నారు. అన్ని పార్టీల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలోనే పోలింగ్ జరిగిందని.. రీపోల్ నిర్వహించాలన్న వినతులు అందలేదన్నారు. -
10 రౌండ్లలో బద్వేల్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
-
హుజురాబాద్ ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలి
-
'ఏలూరు' ఎన్నికల కౌంటింగ్‌కు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, కోవిడ్ ప్రొటోకాల్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి నిమిత్తం ప్రభుత్వం, అభ్యర్థి టీవీ అన్నపూర్ణ శేషుకుమారి దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు అనుమతించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. మధ్యంతర ఉత్తర్వుల రద్దు ఏలూరు నగరపాలక సంస్థ ఓటర్ల జాబితాలో తప్పులున్నాయంటూ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి ఈ ఏడాది మార్చి 8న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల్లో పోటీ చేసిన టీవీ అన్నపూర్ణ శేషుకుమారి వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై ఇప్పటికే విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు అనుమతినిచ్చి.. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి వద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ అప్పీళ్లపై తుది విచారణ జరిపిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జి ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత ఎన్నికలపై స్టే విధించారని, ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టు అధికరణ 226 కింద ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం సబబేనా? అంటూ ధర్మాసనం తనకు తాను ప్రశ్న వేసుకుంది. ఇటీవల రత్నప్రభ వర్సెస్ కేంద్ర ఎన్నికల సంఘం కేసులో ఇదే హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సీజే ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించింది. ఎన్నిక ప్రక్రియ మొదలైన తరువాత అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని ధర్మాసనం చెప్పిన విషయాన్ని సీజే ధర్మాసనం గుర్తు చేసింది. ఆ తీర్పుతో పాటు పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను ఆధారంగా చేసుకుంటూ.. ప్రభుత్వంతో పాటు అన్నపూర్ణ దాఖలు చేసిన అప్పీళ్లను అనుమతిస్తూ పైవిధంగా తీర్పునిచ్చింది. -
భాగ్యమెవరికో?
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో పోలైన ఓట్లను శుక్రవారం లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ప్రకటించింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించినందున ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి కొంత ఎక్కువ సమయం పట్టనుంది. తక్కువ ఓట్లు పోలైన మెహిదీపట్నం డివిజన్లో (ఒక్క రౌండ్లోనే) మధ్యాహ్నం 12 గంటలకు తొలి ఫలితం వెల్లడి కానుంది. అధిక ఓట్లు పోలైన మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ ఫలితాలు చివరగా వచ్చే అవకాశాలున్నాయి. ఓట్ల ఆధిక్యతల రూపంలో మధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఫలితాల సరళిపై స్పష్టత రానుంది. సాయంత్రం 4 గంటల వరకు అన్ని డివిజన్ల ఫలితాలు వెలువడతాయని ఎస్ఈసీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 1న జరిగిన జీహెచ్ఎంíసీ ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. మొత్తం 74,67,256 ఓటర్లకు గాను 34,50 331 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు ఇలా.. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. జీహెచ్ఎంసీ పరిధిలో 30 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో డివిజన్‌కు ఒక్కో కౌంటింగ్ హాల్.. ప్రతి హాల్లో 14 టేబుల్స్ ఉంటాయి. కౌటింగ్ హాళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పెట్టెల్లోని ఓట్ల కంటే ముందు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఒక్కో రౌండ్లో 14 వేల చొప్పున ఓట్లు లెక్కిస్తారు. పోలైన ఓట్ల సంఖ్యను బట్టి రౌండ్ల సంఖ్య పెరగనుంది. బ్యాలెట్ బాక్స్‌లు తీసుకెళ్లే సిబ్బంది, బ్యాలెట్ పేపర్లను మిక్స్ చేసే వ్యక్తులకు పీపీఈ కిట్స్ అందించాలని ఎస్ఈసీ సూచించింది. కౌంటింగ్ ఎలా? ► మొదటి విడతలో లెక్కింపు పోలింగ్ స్టేషన్ వారీగా జరుగుతుంది. ఇందులో బ్యాలెట్ పేపర్ల మడతలు విప్పకుండానే 25 ఓట్ల చొప్పున కట్టలుగా చేసి రబ్బర్ బ్యాండు వేసి, బ్యాలెట్ పేపర్ అకౌంట్‌తో సరిచూసి కట్టలను రిటర్నింగ్ అధికారి వద్ద గల డ్రమ్ములో వేస్తారు. ► రెండో విడతలో బ్యాలెట్ బండిళ్లు ఉన్న డ్రమ్ములోని బండిళ్లను జాగ్రత్తగా కలిపి ఆ హాలులో ఉన్న అన్ని కౌంటింగ్ టేబుళ్ల వద్దకు డ్రమ్ములో నుంచి 40 బండిళ్లను (వెయ్యి బ్యాలెట్ పేపర్లను) లెక్కింపు కోసం ఇస్తారు. ఎన్నికల విధుల్లో మైనర్‌ను నియమించలేదు.. పదిహేడేళ్ల బాలుడిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఆ అబ్బాయిని వెబ్ క్యాస్టింగ్ నిర్వహణకు పోలింగ్ కేంద్రంలో నియమించినట్లు తెలిపింది. వెబ్ క్యాస్టింగ్ కోసం కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న విద్యార్థులను మాత్రమే నియమించామని, వీరికి వయసుతో సంబంధం లేదని పేర్కొంది. మధ్యాహ్నం భోజనం చేయడానికి మాత్రమే ఆ కుర్రాడు ఇతర పోలింగ్ సిబ్బందితో ఉన్నాడని, అతడికి ఎన్నికల విధులు కేటాయించినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. ఆ రెండు డివిజన్లలోనూ.. ఘాన్సీబజార్ డివిజన్(49), పురానాపూల్ డివిజన్ (52)లలో యథావిధిగా ఓట్ల లెక్కింపు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ రెండు డివిజన్లలో అవసరం ఉంటే కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించాలని గురువారం రాష్ట్ర హైకోర్టును బీజేపీ ఆశ్రయించింది. బీజేపీ చేసిన విజ్ఞప్తిని పరిశీలించాలని హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో ఆయా పోలింగ్‌బూత్‌లలో రీపోలింగ్‌పై వెంటనే ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఆ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్, రిటర్నింగ్, పోలింగ్ అధికారుల నుంచి నివేదిక ఎస్ఈసీ తెప్పించుకుంది. ఈ డివిజన్లలో పెద్దగా గొడవలు జరగలేదని, బీజేపీ నేతల ఫిర్యాదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో రీపోలింగ్‌కు ఆదేశించే పరిస్థితులు లేవనే అభిప్రాయంతో ఎస్ఈసీ వర్గాలున్నాయి. -
ఆప్ ‘హ్యాట్రిక్’సంబరాలు
-
అసెంబ్లీ రద్దుకు లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్స్
-
ఆప్ జోరు, వైరల్ మినీ మఫ్లర్‌మ్యాన్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం దిశగా దూసుకుపోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమ విజయాన్ని ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటోంది. స్మైలీ ఫేస్ ఎమోజీతో ‘మఫ్లర్‌మాన్’ పేరుతో ఒక బుడతడి ఫోటోను షేర్ చేసింది. ఆప్ ట్రేడ్ మార్క్ మఫ్లర్, టోపీ ధరించి, అచ్చం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లా వున్న ఒక పసిబిడ్డ ఫోటోను ట్విటర్లో షేర్ చేసింది. దీంతో అభిమానుల లైక్‌లతో పాటు కమెంట్లు, అభినందనల వెల్లువ కురుస్తోంది. ఆప్ షేర్ చేసిన మినీ మఫ్లర్ మాన్ ఫోటో వైరల్ అవుతోంది. ప్రధానంగా "నేను కేజ్రీవాల్...కానీ నేను ఉగ్రవాదిని కాదు’ అని ఒక యూజర్ వ్యాఖ్యానించగా, మరో యూజర్ ఆప్‌కు ఓట్లు వేసిన ఢిల్లీ ఓటర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇది భారతదేశం ఆత్మను, సారాన్ని రక్షించడానికి ప్రజల స్పష్టమైన తీర్పు అని, విద్య, ఆరోగ్య సంరక్షణకు వేసిన ఓటు. హిందుస్తాన్, పాకిస్తాన్ కోసం కాదు..స్థిరత్వం కోసం ఢిల్లీ ప్రజలు ఓటు వేశారని వ్యాఖ్యానించారు. ఏదో ఒకరోజు అతనే సీఎం అని మరొకరు పోస్ట్ చేయడం విశేషం. Mufflerman 😄 pic.twitter.com/OX6e8o3zay — AAP (@AamAadmiParty) February 11, 2020 He will be the CM one day. 😍#DelhiResults Mophlar Men pic.twitter.com/oFrpjKgQY4 — Pramod Gupta (@PramodG96346806) February 11, 2020 -
ఓటమికి బాధ్యత వహిస్తా : మనోజ్ తివారీ
-
నేడే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
-
హస్తిన తీర్పు : మోదీ, రాహుల్ ట్వీట్
నా ప్రత్యేక అభినందనలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు మించిన ఫలితాలతో అఖండ విజయాన్ని అందుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై ప్రశంసల జల్లులు కురుస్తునే ఉన్నాయి. ఇప్పటికే ఆంద్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, కేరళ ముఖ్యమంత్రులతో పాటు జాతీయ, స్థానిక నేతలు కేజ్రీవాల్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ ఫలితాల అనంతరం ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి శుభాకంక్షలు. ఢిల్లీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆకాంక్షిస్తున్నాను’అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్‌కు తన ప్రత్యేక అభినందనలు అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆప్ 62.. బీజేపీ 8 ఎలాంటి గందరగోళం, ఉత్కంఠ లేదు. వార్ వన్ సైడ్ అయింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను మించిన ఫలితాలతో ‘సామాన్యుడి’ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ 62 చోట్ల గెలుపొందగా.. బీజేపీ 8 స్థానాలతోనే సరిపెట్టుకుంది. కాగా, కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది. ఈ సారి కూడా ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవకపోగా.. ఏ తరుణంలోనూ కనీసం ఆధిక్యం కూడా ప్రదర్శించ లేదు. ఇక వరుసగా మూడో సారి ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక 2015లో ఆప్ 67 స్థానాల్లో ఆప్ జయకేతనం ఎగురవేయగా.. బీజేపీ 3 స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. ఇక తాజా ఎన్నికల్లో ఆప్ ఐదు స్థానాలను చేజార్చుకోగా.. బీజేపీ మరో ఐదు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఇంతకుమించి 2015 ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల ఫలితాల్లో పెద్దగా తేడా ఏం కనిపించలేదు. కేజ్రీవాల్ అండ్ టీమ్‌కు అభినందనలు ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపీ గౌరవిస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. అదేవిధంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అవిశ్రాంతంగా ప్రనిచేసిన కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీని అభివృద్ది చేస్తుందనే నమ్మకంతోనే అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి మరోసారి పట్టం కట్టారన్నారు. ఇక అసెంబ్లీలో ప్రజా సమస్యలు లెవనెత్తుతూ నిర్మాణాత్మక ప్రతిపక్షపాత్రను బీజేపీ పోషిస్తుందన్నారు. ఇక ఢిల్లీ అభివృద్దికి కృషి చేస్తుందనే నమ్మకంతో కేజ్రీవాల్ అండ్ టీమ్‌కు అభినందనలు అంటూ నడ్డా ట్వీట్ చేశారు. ఇది ఢిల్లీ ప్రజల విజయం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి అఖండ విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు ఆ పార్టీ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వార్ వన్ సైడ్‌గా నిలిచిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సీఎం కేజ్రీవాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఇది ఢిల్లీ ప్రజలు విజయం. ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు. అభివృద్దికే ప్రజలు ఓటేశారు. ఈ విజయం కొత్త రాజకీయాలకు నాంది. ఢిల్లీ తన కుమారుడిని మరోసారి నమ్మింది’అంటూ ఆ ప్రకటనలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. కేజ్రీవాల్‌కు అభినందనల వెల్లువ ఒంటిచేత్తో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్‌ను ధీటుగా ఎదుర్కొని కనీవినీ ఎరుగని రీతిలో మరోసారి బంపర్ విక్టరీ సాధించిన అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తలదన్ని అఖండ విజయంతో ఆప్ దూసుకపోతోంది. ఇప్పటికే 45 స్థానాల్లో ఆప్ గెలుపొందగా.. 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక కేజ్రీవాల్ అండ్ టీం సాధించిన ఈ సూపర్బ్ విక్టరీపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్‌కి, ఆ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌కు హృదయపూర్వక అభినందనలు అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మరోసారి విజయ ఢంకా మోగించిన అరవింద్ కేజ్రీవాల్‌కు యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. అదేవిధంగా జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సైతం కేజ్రీవాల్‌కు శుభాభినందనలు తెలిపారు. అసెంబ్లీ రద్దుకు సిఫార్సు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి బంపర్ మెజార్టీ రావడం, నేటితో అసెంబ్లీ కాలపరిమితి ముగియడంతో ఢిల్లీ శాసనసభను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ రద్దు చేశారు. త్వరలోనే కేజ్రీవాల్ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. సింగిల్ డిజిట్‌కే బీజేపీ పరిమితం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి మరోసారి నిరాశే ఎదురైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పట్నుంచి 20కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టు కనిపించిన బీజేపీ మెల్లిమెల్లిగా పట్టువదిలింది. ప్రస్తుతం సింగిల్ డిజిట్ స్థానాలకే బీజేపీ పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ ఫలితాల్లో కాంగ్రెస్‌కు రిక్త హస్తమే మిగిలింది. కనీసం ఒక్క స్థానంలో కూడా కనీసం ఒక్కసారైనా ఆధిక్యాన్ని ప్రదర్శించలేదు డిప్యూటీ సీఎం విజయం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పట్పర్ గంజ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రవి నేగిపై దాదాపు 3,571 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ఆద్మీ పార్టీ దూసుకెళ్తుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను మరోసారి కంగుతినిపిస్తూ అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ పార్టీ విజయ దుందుభి మోగిస్తోంది. న్యూఢిల్లీలో కేజ్రీవాల్ విజయం న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భారీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై 13,508 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. శీలంపూర్‌లో ఆప్ అభ్యర్థి అబ్దుల్ రెహమాన్ విజయం సాధించారు. సంగంవిహార్, దేవ్లీలో ఆప్ అభ్యర్థులు మెహనియా, ప్రకాష్‌లు విజయం సాధించారు. ఇక ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా 1288 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ముస్తఫాబాద్‌లో బీజేపీ అభ్యర్థి జగదీష్ ప్రధాన్ విజయం సాధించారు. కల్కాజీలో ఆప్ అభ్యర్థి 2070 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. కేజ్రీవాల్‌కు ప్రశాంత్ కిశోర్ అభినందనలు ఢిల్లీ ఫలితాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ట్వీటర్ వేదికగా స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించినందుకు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మూడోసారి సీఎం కాబోతున్న కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపారు.‘ భారత దేశ ఆత్మను కాపాడినందుకు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు’ అని ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు. కాగా,ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. టాపాసులు కాల్చకండి : కేజ్రీవాల్ ఆప్ భారీ విజయం దిశగా దూసుకెళ్తుండడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. పార్టీ విజయోత్సవాల్లో భాగంగా టపాసులు కాల్చవద్దని కార్యకర్తలకు ఆదేశించారు. పటాకుల స్థానంలో స్వీట్లు పంపిణీ చేయండి అని ఢిల్లీ సీఎం చెప్పారు. ఢిల్లీ వాయు కాలుష్యం దృష్ట్యా సీఎం కేజ్రీవాల్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఆప్ పేర్కొంది. ఐదింతలు పెరిగిన బీజేపీ బలం దేశ రాజధాని ఢిల్లీ పీటాన్ని మరోసారి సామన్యుడే అధిరోహించనున్నాడు. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆప్ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు వెలువడి ఫలితాల ప్రకారం ఉదయం 11 గంటలకు ఆప్ 54 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుండగా, బీజేపీ 16స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ పత్తా లేకుండా పోయింది. ఒక్క స్థానంలో కూడా ఆ పార్టీ ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం. ఉచిత విద్యుత్‌తో ఆప్‌కు అనుకూలం: బీజేపీ ఎంపీ నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి బిల్లు ఉండదని కేజ్రీవాల్ సర్కార్ తీసుకున్న నిర్ణయం అసెంబ్లీ ఎన్నికల్లో పేదల ఓటింగ్‌పై ప్రభావం చూపిందని ఢిల్లీ బీజేపీ ఎంపీ రమేష్ బిధురి అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ దూకుడు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పార్టీ శ్రేణులు ప్రజలకు చేరువ చేయడంలో విఫలమైనట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఓటమికి బాధ్యత వహిస్తా : మనోజ్ తివారీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తానని బీజేపీ ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారీ అన్నారు. ఆప్ దూకుడుతో కాషాయ పార్టీ కొద్దిస్ధానాలకే పరిమితం కావడంతో పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యాయి. 70 స్ధానాలు కలిగిన ఢిల్లీలో ఆప్ ప్రస్తుతం 50 స్ధానాల్లో ముందజంలో ఉండగా, బీజేపీ 20 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. 2015 ఎన్నికల్లో బీజేపీ కేవలం మూడు స్ధానాలు గెలుచుకున్న బీజేపీ పుంజుకోవడం ఒక్కటే ఆ పార్టీకి ఊరట ఇస్తోంది. సంబరాల్లో ఆప్.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విస్పష్ట విజయం ఖాయమవడంతో ఆప్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఆప్ కార్యాలయం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఆరు జిల్లాల్లో ఆప్ ఏకపక్షంగా దూసుకుపోతోంది. సత్తా చాటిన ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో ఆప్ మొదటి నుంచి లీడ్‌లో కొనసాగుతుతోంది. మెజారిటీ స్థానాల్లో దూసుకెళ్తోంది. మొత్తం 70 స్థానాలకుగాను ఆప్ 50 స్థానాల్లో, బీజేపీ 19 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఢిల్లీ కంటోన్మెంట్, ద్వారాకా, జనక్ పురి, కృష్ణానగర్‌లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. న్యూఢిల్లీలో కేజ్రీవాల్ అధిక్యంలో కొనసాగుతున్నారు. కౌంటింగ్ సెంటర్ వద్ద మనీష్ అక్షర్ ధామ్ కౌంటింగ్ సెంటర్లో ప్రతాప్ గంజ్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీజేపీ అభ్యర్థి రవినేగి పాల్గొన్నారు. అక్కడక్కడ మెరుస్తోన్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. మ్యాజిక్ ఫిగర్ 36 కాగా ఇప్పటికే 54 స్థానాల్లో ఆప్ ముందంజలో ఉంది. ఇక ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకున్న బీజేపీకి పరాభవం ఎదురైంది. ఆప్‌కు గట్టి పోటీ ఇవ్వకపోయినా.. అక్కడక్కడ బీజేపీ ముందంజలో ఉంది. రోహిణిలో బీజేపీ అభ్యర్థి విజయేంద్రకుమార్ లీడ్‌లో కొనసాగుతున్నారు. బగ్గాలో తాజిందర్‌పాల్ సింగ్ ఆప్ అభ్యర్థిని వెనక్కినెట్టి ముందంజలో కొనసాగుతున్నారు. ముందంజలో కేజ్రీవాల్, సిసోడియా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆప్ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. 55 స్ధానాల్లో ఆ పార్టీ అభ్యర్ధులు ముందంజలో ఉండగా, బీజేపీ 13 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఒక్క స్ధానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియాలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దూసుకెళ్తున్న ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు 52 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 15, కాంగ్రెస్ 1 స్థానంలో లీడ్‌లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో తాము తప్పకుండా విజయం సాధిస్తామని ఆప్ నేత,ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. కౌంటింగ్ ప్రారంభం దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. తొలుత బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఢిల్లీలోని 11 జిల్లాల్లో మొత్తం 21 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గెలుపుపై ధీమాతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు ఆప్ మద్దతు దారులు పెద్ద ఎత్తును కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. పిల్లలతో సహా కేజ్రీవాల్ ఇంటికి... శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులు ఈ ఉదయం నుంచే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి చేరుకుంటున్నారు. పిల్లలతో కలిసి వారంతా కేజ్రీవాల్ నివాసానికి వస్తుండటం విశేషం. మరోవైపు బీజేపీ నాయకుడు విజయ్ గోయల్.. కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తన నివాసంలోనే ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్వత్రా ఉత్కంఠ దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాసేపట్లో ప్రారంభం కానుంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం ఢిల్లీలోని ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కే మళ్లీ అధికారం అన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు.. ఎన్నికల సంఘం తుది పోలింగ్ శాతాన్ని ఆలస్యంగా వెల్లడించిన నేపథ్యంలో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలైన పోటీ ఆప్, బీజేపీ మధ్యే ప్రధానంగా ఉండనుందని, ఈసారి కూడా కాంగ్రెస్ ఖాతా తెరిచే అవకాశాలు లేవని భావిస్తున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 67.47 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి ఐదు శాతం తక్కువగా 62.59 శాతం మాత్రమే నమోదైందని ఆదివారం సాయంత్రం ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. 21 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఓట్ల లెక్కింపులో 70 నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన 79 మంది మహిళలు సహా మొత్తం 672 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఢిల్లీలోని సీడబ్ల్యూజీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, సర్ సీవీ రామన్ ఐటీఐ, రాజీవ్ గాంధీ స్టేడియం, మీరాబాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తదితర 21 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు, 33 మంది పరిశీలకులను నియమించారు. 13, 780 పోలింగ్‌బూత్‌లలో పోలైన ప్రతి ఓటును ప్రిసైడింగ్ అధికారులు పరిశీలిస్తారని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా తెలిపారు. అభివృద్ధినే ఎజెండాగా తీసుకుని ఎన్నికల బరిలో దిగిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఈసారి కూడా తమదే అధికారమనే ధీమాతో ఉంది. జాతీయతావాదం, సీఏఏ వ్యతిరేక ఆందోళనలపై తీవ్రంగా ప్రచారం చేసిన బీజేపీ కూడా ఢిల్లీ సీఎం పీఠం తమకే దక్కుతుందని అంచనా వేస్తోంది.