wife murdered
-
Britain: భార్యను 224 ముక్కలుగా నరికేశాడు
లండన్: భార్యను భర్త హత్యచేసి ఏకంగా 224 ముక్కలుగా నరికి మృతదేహాన్ని మాయంచేసిన దారుణ ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. నికొలస్ మెట్సన్ (28), హోలీ బ్రామ్లీ (26) లింకన్ సిటీలోని బస్సింగ్హామ్లో ఉంటున్నారు. గత నెల 17 నుంచి బ్రామ్లీ కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆమె తనను చితకబాది వెళ్లిపోయిందని పోలీసులకు నికొలస్ చెప్పాడు. ఫ్లాట్‌ను తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో రక్తపు మరకలు, అతిగా శుభ్రం చేసినట్లు అమ్మోనియా, బ్లీచింగ్ ఆనవాళ్లు కనిపించాయి. దాంతో అతన్ని అరెస్ట్‌చేసి విచారణ మొదలెట్టారు. తనకేం తెలీదని మెట్సన్ తొలుత వాదించాడు. ఈలోపు సమీపంలోని విథమ్ నదిలో నరికిన చేయి సహా చిన్నిచిన్న శరీరభాగాలున్న ప్లాస్టిక్ బ్యాగులు కొట్టుకుపోవడం చూసి స్థానికుడు పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసు గజ ఈతగాళ్లు వాటిని సేకరించి ల్యాబ్‌కు పంపించారు. అసలేమాత్రం గుర్తుపట్టలేనంతగా హోలీ బ్రామ్లీ శరీరాన్ని పలుమార్లు పొడిచి 224 ముక్కలుగా నరికి భర్త నదిలో పడేశాడు. శరీరభాగాలను పడేయటంతో సాయపడినట్లు భర్త స్నేహితుడు జాషువా హ్యాన్‌కాక్ తన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఎట్టకేలకు భర్త తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఆమె చంపడానికి ముందు పెంపుడు కుక్క పిల్ల, పెంపుడు ఎలుకలనూ చంపేశాడు. తన మాజీ జీవితభాగస్వాములనూ మెట్సన్ హింసించినట్లు 2013, 2016, 2017 పోలీసు రికార్డుల్లో ఉంది. జంతువుల పట్ల అతను అమానుషంగా ప్రవర్తించేవాడని పోలీసు విచారణలో వెల్లడైంది. హత్యచేసి దాదాపు వారంపాటు శరీరం ముక్కలున్న బ్యాగులను దాచి తర్వాత వాటిని పడేశాడు. హత్య తర్వాత భార్య బ్యాంక్ ఖాతా నుంచి 50 పౌండ్లు విత్‌డ్రా చేసి వాడుకున్నాడు. ‘భార్యను హత్య చేస్తే భర్తకు కలిగే లాభాలేంటి?. ఆ తర్వాత నన్ను ఎవరైనా వెంబడిస్తారా?. కూపీ లాగుతారా?’ అంటూ హత్యకు ముందు కొన్ని అంశాలపై ఆన్లైన్లో సెర్చ్చేశాడు. ఈ ఆన్లైన్ సెర్చ్ హిస్టరీని సైతం పోలీసులు వెలికితీశారు. -
షాకింగ్ ఘటన: ఊహకే అందని ఫోన్ కాల్...కంగుతిన్న పోలీసులు
ఇంత వరకు మనం క్షణికావేశంలో హతమార్చడం లేదా తప్పుడూ నిర్ణయాలు తీసుకుని చనిపోవడం విని ఉంటాం. ఒక వేళ హత్య చేసిన ఆ తర్వాత భయంతో పోలీసులకు లొంగిపోవడం వంటివి కూడా చూశాం. కానీ నేనే చంపేశా రండి అరెస్టు చేయండి అంటూ పోలీసులకే ఫోన్ కాల్ చేయడం గురించి ఇంత వరకు విని ఉండ లేదు కదా. ఇక్కడొక వ్యక్తి డైరెక్టగా పోలీసులకే అసలు విషయం చెప్పి ఇంటికి రమ్మని పిలవడంతో.. ఒక్కసారిగా ఇది నిజమా? కాదా! అన్నంతగా షాక్ అయ్యారు పోలీసులు. వివరాల్లోకెళ్తే...ఒక వ్యక్తి పోలీసులకు ఉదయం ఎనిమిది గంటలకు ఫోన్ చేసి నా భార్యను చంపేశానంటూ పోలీసులకు కాల్ చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..యోగేశ్ కుమార్ అనే వ్యక్తి సుశీల్ గార్డెన్లో ఉన్న తన ఇంట్లోనే తన భార్యను హత్య చేశానని పోలీసులకు కాల్ చేశాడు. దీంతో ఒక్కసారిగా పోలీసులు షాక్ అయ్యారు. సదరు నిందితుడు చెప్పిన సంఘటనా స్థలానికి హుటాహుటినా చేరుకున్నారు. అక్కడ నిందితుడి భార్య అర్చన నేలపై విగత జీవిగా పడి ఉంది. దీంతో వారు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ వైద్యులు ఆమె అప్పటికే చనిపోయిందని ధృవీకరించారు. దీంతో పోలీసులు నిందితుడు యోగేశ్ కుమార్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు తేలిందని పోలీసులు అన్నారు. దీంతో అతడి భార్య అర్చన తనకు తెలిసిన వారి నుంచి కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకుంది. ఈ విషయమై ఆదివారం ఆ జంట గొడపడ్డారని, ఆ తర్వాత యోగేశ్ కోపంతో తన భార్య అర్చనను గొంతు నులిమి చంపేశాడని తెలిపారు. (చదవండి: శ్రద్ధా వాకర్ హత్య కేసు: సీబీఐ అవసరం ఏంటి?.. పేరెంట్స్‌కి లేని అభ్యంతరాలు మీకెందుకు?) -
కూర మాడిందని భార్యను చంపేసి.. గుట్టుచప్పుడు కాకుండా..!
భువనేశ్వర్: కూర మాడిపోయిందనే కోపంతో ఓ వ్యక్తి భార్యను దారుణంగా కొట్టి చంపేశాడు. గుట్టుచప్పుడు కాకుండా ఇంటి వెనకాల పూడ్చిపెట్టాడు. ఆపై తన భార్య నెల రోజులుగా కనిపించటం లేదని బుకాయించే ప్రయత్నం చేశాడు. పోలీసులు తమదైన శైలీలో విచారించగా.. అసలు విషయం బయటపెట్టాడు. ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో జరిగిన ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 35 ఏళ్ల బాధితురాలి మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల రోజుల క్రితం బద్మాల్ పంచాయతీలోని రౌత్‌పారా గ్రామానికి చెందిన రంజన్ బడింగ్(36) అనే వ్యక్తి అక్రమంగా వేటాడి తాబేలును ఇంటికి తీసుకొచ్చాడు. తన భార్య సావిత్రిని కూర చేయమని చెప్పాడు. అయితే, వంట చేస్తుండగా అది కాస్త మాడిపోయింది. దీంతో తాగిన మత్తులో ఉన్న నిందితుడు భార్యతో గొడవకు దిగాడు. తీవ్రంగా కొట్టటంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను అలాగే వదిలేసి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. రాత్రి తిరిగి వచ్చే సరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఇంటి వెనకాల ఖాళీ స్థలంలో పూడ్చిపెట్టాడు. తనపై కోపంతో ఇంట్లోంచి వెళ్లిపోయిందని అందరి నమ్మించే ప్రయత్నం చేశాడు. బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించగా విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లారు. వారిని చూసిన నిందితుడు పరారయ్యేందుకు ప్రయత్నించాడు. పోలీసులు, గ్రామస్థులు కలిసి పట్టుకోవటంతో చేసిన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: స్నేహితుడిని బెదిరించి.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై 10 మంది గ్యాంగ్ రేప్ -
డబ్బు ఇవ్వలేదనే అక్కసుతో.. కట్టుకున్న భార్యనే..
శెట్టూరు( అనంతపురం): వ్యసనం.. ఓ కుటుంబంలో కార్చిచ్చు రేపింది. మద్యానికి బానిసైన భర్తలో మార్పు తీసుకువచ్చేందుకు ఆ ఇల్లాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు మద్యం మహమ్మారి కబంధ హస్తాల్లో చిక్కుకున్న భర్త చేతిలోనే దారుణ హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన మేరకు... చింతలేని కుటుంబం.. శెట్టూరు మండలం పెరుగుపాళ్యం గ్రామానికి చెందిన చిన్న నరసింహప్ప... చిన్నకారు రైతు. కొన్నేళ్ల క్రితం కర్ణాటక ప్రాంతానికి చెందిన గొల్ల లక్ష్మీదేవితో ఆయనకు వివాహమైంది. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న వీరికి ముగ్గురు కుమారులు. వీరిలో ఇద్దరికి వివాహమైంది. కుమారులు ముగ్గురూ బెంగళూరులోని గార్మెంట్స్ పరిశ్రమలో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే స్థిరపడ్డారు. వ్యవసాయంతో పాటు పాడి పోషణ చేపట్టి కుటుంబ బాధ్యతలను లక్ష్మీదేవి చూసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో నరసింహప్ప మద్యానికి బానిసయ్యాడు. తరచూ గొడవ.. మద్యానికి బానిసైన నరసింహప్ప ఎలాంటి పనులు చేయకుండా ఇంటి వద్దనే ఉంటూ వచ్చేవాడు. మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలంటూ తరచూ భార్యతో గొడవపడేవాడు. అతని వేధింపులు తాళలేక తాను కష్టపడి సంపాదించుకుని దాచుకున్న డబ్బులో కొంత మేర ఇస్తూ వచ్చింది. దీంతో నరసింహప్ప మద్యం మహమ్మారికి పూర్తిగా లొంగిపోయాడు. ఒక్కపూట మద్యం తాగకపోతే విచిత్రంగా ప్రవర్తిస్తూ వచ్చేవాడు. డబ్బు ఇవ్వలేదనే అక్కసుతో.. మద్యం వ్యసనం నుంచి భర్తను బయట పడేసేందుకు లక్ష్మీదేవి విశ్వప్రయత్నాలు చేస్తూ వచ్చింది. అయినా అతనిలో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం మద్యం తాగేందుకు అవసరమైన డబ్బు కోసం లక్ష్మీదేవిని నరసింహప్ప ప్రాధేయపడ్డాడు. ఆమె ఇవ్వలేదు. అలవాటు మానుకోవాలని హితవు చెప్పింది. సాయంత్రం మరోసారి ఆమెతో గొడవపడ్డాడు. బెదిరించాడు. భర్తలో మార్పు తీసుకురావాలనే కృతనిశ్చయంతో ఉన్న ఆమె డబ్బు ఇచ్చేందుకు నిరాకరించింది. మొత్తం సంసారాన్ని తానే నెట్టుకొస్తున్నానని, రోజూ మద్యం తాగేందుకు డబ్బు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలంటూ అసహనం వ్యక్తం చేసింది. రాత్రి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చివరకు విచక్షణ కోల్పోయిన నరసింహప్ప శనివారం అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్య లక్ష్మీదేవి (45)పై గొడ్డలితో దాడి చేశాడు. మెడపై బలమైన వేటు పడడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. తెల్లవారుజామున నరసింహప్ప సోదరుడు కుమారుడు ఈరన్న పాల కోసం వచ్చినప్పడు ఈ విషయం వెలుగు చూసింది. ‘పిన్నమ్మ ఎక్కడకు పోయింది కనిపించడం లేదు’ అంటూ ఇంటి బయట కూర్చొన్న చిన్నాన్నను ఈరన్న అడిగినప్పుడు అతని మౌనమే సమాధానమైంది. దీంతో వెనుదిరుగుతున్న సమయంలో రక్తపుమడుగులో పడి ఉన్న పిన్నమ్మ కనిపిచండంతో ఒక్కసారిగా అతను నిశ్చేష్టుడయ్యాడు. ఏమి జరిగిందంటూ చిన్నాన్నను నిలదీశాడు. అతను సమాధానమివ్వకపోవడంతో కుటుంబసభ్యులకు, పోలీసులకు విషయాన్ని చేరవేశాడు. ఘటనాస్థలాన్ని సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ యువరాజ్ పరిశీలించారు. హతురాలి సోదరుడు ఈరన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, అక్కడే ఉన్న నిందితుడు చిన్న నరసింహప్పను అదుపులోకి తీసుకున్నారు. -
భర్తతో గొడవల కారణంగా పుట్టింటికి.. మద్యం మత్తులో
చెన్నై(పళ్ళిపట్టు): మద్యం మత్తులో భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్తను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆర్.కే పేట సమీపం బాలాపురానికి చెందిన తమిళ్మణి (42) తాపీమేస్త్రి. అతని భార్య మంగళ. ఈ దంపతులకు శరవణన్ (14), ప్రతీప్ (12) అనే కుమారులున్నారు. భర్తతో గొడవల కారణంగా.. అయ్యనేరిలోని పుట్టింటికి వెళ్లి అక్కడే టైలర్ షాపు నిర్వహిస్తోంది. భార్యను కాపురానికి రావాలని అయ్యనేరికి వెళ్లి తమిళ్మణి గొడవ పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం మద్యం మత్తులో టైలర్ దుకాణం వద్దకు వెళ్లిన తమిళ్మణి భార్య మంగళపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. చదవండి: (ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య) -
జీవితంపై విరక్తి: భార్యను చంపి భర్త ఆత్మహత్య
కామారెడ్డి క్రైం: ఆరోగ్య సమస్యల కారణంగా భార్యను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడో భర్త. ఈ ఘటన కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డిలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శంకర్‌గారి సిద్ధయ్య (60), బాలమణి (58) దంపతులు కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బాలమణికి ఐదేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. అప్పటి నుంచి ఎన్ని ఆస్పత్రులు తిరిగినా తగ్గలేదు. ఉన్నచోటే ఆమెకు సపర్యలు చేస్తున్నారు. సిద్ధయ్య కూడా గతంలో ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అప్పటి నుంచి అతడికి కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. జీవితంపై విరక్తితో భార్యను చంపి తాను కూడా చనిపోతానని సిద్దయ్య పలుమార్లు కుటుంబ సభ్యులతో అనేవాడు. సోమవారం రాత్రి కొడుకు రాజు, కోడలు, మనవళ్లు అందరితో కలసి భోజనం చేసి పడుకున్నారు. కొడుకు రాజు ఉదయం లేచి చూసే సరికి తండ్రి ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. గదిలోకి వెళ్లి చూడగా తల్లి కూడా చనిపోయి ఉంది. బాలమణి పడుకున్న చోటే గొంతుకు చీరతో ఉరివేసి చంపినట్లుగా తెలుస్తోంది. భర్తే ఆమెను చంపేసి తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: డేటింగ్ యాప్‌లో ఫొటోతో నటికి వేధింపులు -
విడాకుల నోటీసు పంపింన భార్యను కిరాతకంగా..
సాక్షి, చెన్నై: విడాకుల నోటీసు పంపించిన భార్యను కిరాయి ముఠా ద్వారా హతమార్చి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఓ భర్త కిరాతకం తిరువారూర్‌లో వెలుగు చూసింది. కిడారి కొండం గ్రామానికి చెందిన చిదంబరం కుమార్తె జయభారతికి ఆరేళ్ల క్రితం తంజావూరు జిల్లా కుంభకోణంకు చెందిన విష్ణుప్రకాష్తో వివాహం అయింది. వీరికి ఓ పాప కూడా ఉంది. భర్త వేధింపులు తాళలేక ఏడాది క్రితం అతి కష్టమ్మీద అమెరికా నుంచి స్వగ్రామానికి చేరుకుంది. ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులు, పాపను జయభారతి చూసుకుంటోంది. రెండు రోజుల క్రితం పని ముగించుకుని ఇంటికి స్కూటర్‌పై వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం గంటల పాటు రోడ్డుపై ఆగి ఉండడం, జయభారతి వాహనాన్ని అతివేగంగా ఢీకొనడం దృశ్యాలను గుర్తించారు. విచారణలో తిరువారూర్‌లోని ఓ సంస్థ నుంచి కుంభకోణానికి చెందిన ఓ వ్యక్తి వాహనాన్ని అద్దెకు తీసుకెళ్లినట్టు తేలింది. అతడిని విచారించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నెలన్నర క్రితం జయభారతి విడాకుల నోటీసు పంపడంతో విష్ణుప్రకాష్ ఉద్యోగానికి ఎసరు తప్పలేదు. దీంతో కుంభకోణంలోని సమీప బంధువు ద్వారా కిరాయి ముఠాను సంప్రదించి జయభారతిని హతమార్చేందుకు పథకం రచించాడు. హత్య కేసుగా మార్చిన పోలీసులు విష్ణు ప్రసాద్‌ను ఇండియాకు పంపించాలని అమెరికాలోని భారత రాయభార కార్యాలయానికి సమాచారం పంపించారు. చదవండి: Tamil Nadu: కరోనాతో నర్సు మృతి -
బిడ్డతో తప్పుడు పనులంటూ అనుమానం, భార్య, మామ హత్య
టీ.నగర్: కుటుంబ తగాదాలో భార్య, మామను హతమార్చిన ఆటో డ్రైవర్‌ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై రాయపేట మహ్మద్ హుస్సేన్ వీధికి చెందిన ముసాఫర్ (80) కుమార్తె కౌవుసి నిషా (50)మొదటి భర్తను విడిచి రాయపేట యానైకుళానికి చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ ఖాదర్ (42)ను పెళ్లి చేసుకుంది. మొదటి భర్త ద్వారా జన్మించిన కుమార్తె(21)తో ఒకే ఇంటిలో ఉంటోంది. కౌవుసి నిషా తన కుమార్తెను తప్పుడు మార్గంలో నడుపుతున్నట్లు అబ్దుల్ ఖాదర్ అనుమానించాడు. దంపతుల మధ్య తరచుగా గొడవలు ఏర్పడ్డాయి. కౌవుసి నిషా కుమార్తెతో రాయపేటలో ఉంటున్న తండ్రి ముసాఫర్ ఇంటికి చేరుకుంది. అబ్దుల్ ఖాదర్ అక్కడికి వెళ్లి గొడవకు దిగాడు. బీర్ బాటిల్‌తో ముసాఫర్‌పై దాడి చేశాడు. కత్తితో భార్య గొంతుకోశాడు. ఇద్దరూ మృతి చెందారు. జామ్ బజార్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను ఓమందూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అబ్దుల్ ఖాదర్‌ను అరెస్టు చేశారు. భార్య మృతిని తట్టుకోలేక.. టీ.నగర్: భార్య మృతిని తట్టుకోలేక భర్త మృతిచెందాడు. ఈ సంఘటన శివగంగై జిల్లాలో చోటుచేసుకుంది. దేవకోట్టై దండాయుధపాణి ఆలయం వీధిలో స్వామినాథన్ (90), సుందరాంబాళ్ (88) దంపతులు ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇద్దరు కుమారులకు వివాహం కావడంతో వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. సుందరాంబాళ్ అనారోగ్యంతో శనివారం మధ్యాహ్నం మృతిచెందారు. ఈ విషాదాన్ని తట్టుకోలేక భర్త స్వామినాథన్ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. భార్యాభర్తలు ఒకేరోజున మృతిచెందడం విషాదాన్ని నింపింది. చదవండి: నా కుటుంబాన్ని కూడా చంపేందుకు చూస్తున్నారు -
అనుమానం: ఫోన్ మాట్లాడుతుందని భార్యను కొట్టి చంపాడు
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలోని పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అనుమానంతో తన భార్యను కొట్టి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్చెరు మండలంలోని రుద్రారం గ్రామంలో రమేష్, స్వప్న దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా తన భార్య స్వప్న తరచూ అర్ధరాత్రి వేరేవాళ్లతో ఫోన్లో మాట్లాడుతుందని భర్త రమేష్ అనుమానం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి కూడా అదే అనుమానంతో రమేష్ తన భార్య స్వప్నను త్రీవంగా కొట్టాడు. అనంతరం అదే గ్రామంలో ఉన్న స్వప్న తల్లిదండ్రులకు ఆమె ఆనారోగ్యంగా ఉందని తమ ఇంటికి రావాలని తెలిపాడు. స్వప్న తల్లిదండ్రులు అక్కడికి వచ్చి చూడగా ఆమె అపస్మరక స్థితిలో కనిపించింది. వెంటనే స్వప్నను ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. స్వప్నను తీవ్రంగా కొట్టాడని, ఆ దెబ్బలు తట్టుకోలేకనే మరణించిందని ఆమె బంధువులు రమేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త రమేష్‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసున్నారు. స్వప్న మృతితో రుద్రారం గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. చదవండి: రా‘బంధువులు’: వివాహితను నగ్నంగా వీడియో తీసి.. -
పెళ్లయిన 43వ రోజు భార్య గొంతు కోసి దారుణ హత్య
సాక్షి, చెన్నై: నిండు నూరేళ్లు సాగాల్సిన ఓ కొత్త జంట జీవితంలో అనుమానం పెనుభూతం అయింది. పెళ్లైయి 43వ రోజే ఆ భర్త కిరాతకుడయ్యాడు. భార్య గొంతు కోసి హతమార్చి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. సేలం జిల్లా వీరాణం ఒరత్తరు పట్టికి చెందిన తంగరాజ్(33) రైతు, కేబుల్ ఆపరేటర్. కన్నంకురిచ్చి గ్రామానికి చెందిన మోనీషా(19)తో 43 రోజుల క్రితం తంగరాజ్కు వివాహమైంది. తన ఎకరం పొలంలో వద్దే ఇంటిని నిర్మించుకుని ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఉదయం వీరి ఇంటి తలుపు ఎంతకు తెరుచుకోలేదు. దీంతో బంధువులు తలుపు పగులకొట్టి లోనికి వెళ్లారు. అక్కడ గొంతు కోసి హతమార్చిన స్థితిలో మోనీసా, కేబుల్ వైర్‌కు ఉరిపోసుకుని తంగరాజ్ వేళాడుతుండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసి సంఘటన స్థలానికి చేరుకున్న వీరానం పోలీసులు మృతదేహాల్ని పోస్టుమార్టానికి తరలించారు. పోలీసుల విచారణలో గత నెల 24వ తేదీన మోనీషా అత్త మోహన కుమారుడు ఇంటికి వచ్చి వెళ్లినట్టు తేలింది. ఆ రోజున తన బర్త్‌డే సందర్భంగా కేక్ ఇవ్వడానికి అత్త కుమారుడు వచ్చినా, తంగరాజ్ మాత్రం అనుమానంతో వేధించడం మొదలెట్టాడు. అలాగే, మోనీషా సోదరి, అత్త మోహన మరో కుమారుడితో చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతుండడాన్ని చూసిన తంగరాజ్లో అనుమానం పెనుభూతమై కూర్చుంది. ఈ అనుమానంతోనే భ్యార మోనీషాను గొంతు కోసి హతమార్చి ఉంటాడని పోలీసులు పేర్కొన్నారు. ముందుగా తంగరాజ్ విషం తాగి, ఆ తర్వాత ఉరి వేసుకున్నట్టు విచారణలో వెలుగు చూసిందని వీరాణం పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: రాసలీలల వీడియో.. ఆమెను సస్పెండ్ చేశారు! -
సంతానం కలగడం లేదని.. భార్యను!
సాక్షి, నల్గొండ : సంతాన భాగ్యం కలగడం లేదని ఓ భర్త కిరాతకానికి తెగబడ్డాడు. ఆదమరచి నిద్దరోతున్న భార్యపై పెట్రోల్ పోసి, నిప్పంటించి మట్టుబెట్టాడు. ఈ దారుణ ఘటన జిల్లా కేంద్రం శివారులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ శివారు అక్కలాయిగూడేనికి చెందిన పరశురామ్ మున్సిపాలిటీలో జవాన్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి చిట్యాల మండలం తాళ్లవెల్లెంలకు చెందిన జ్యోతితో 14ఏళ్ల క్రితం వివా హం జరిగింది. వీరికి పిల్లలు పుట్టకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా ఇదే విషయమై భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. రాత్రి పూటుగా మద్యం తాగిన పరశురామ్ తెల్లవారుజామున నిద్దరోతున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. పరశురామ్ ఇంటినుంచి పొగ వస్తుండడంతో చుట్టు పక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్‌టౌన్ సీఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకునేలోపే జ్యోతి మృతిచెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చదవండి: నోయిడాలో ఉద్యోగం.. స్వగ్రామానికి వచ్చి లాడ్జిలో.. వివాహేతర సంబంధం: మెడ నొక్కి.. పెట్రోల్ పోసి! -
నవ్యరెడ్డి హత్య: కీలక విషయాలు వెల్లడి
సాక్షి, ఖమ్మం: వివాహిత నవ్యరెడ్డి హత్య కేసులో ఎర్రుపాలెం ఎస్ఐ కీలక విషయాలను వెల్లడించారు. ప్రియురాలిపై మోజుతోనే భార్య నవ్యరెడ్డి ఆమె భర్త నాగశేషురెడ్డి హత్య చేశాడని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడిని కోర్టులో హజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. నిందితుడు నాగ శేషురెడ్డి పెగళ్లపాడు గ్రామానికి చెందిన ఓ యువతితో ఏడాదిగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని పేర్కొన్నారు. చదవండి: ఖమ్మం జిల్లాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఘాతుకం వివాహేతర సంబంధంపై భర్తను భార్య నవ్యరెడ్డి నిలదీయటంతో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు. ఎలాగైనా భార్యను చంపి, ప్రియురాలితో వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న నాగ శేషురెడ్డి ఈనెల 2న భార్య నవ్యను సత్తుపల్లి సమీపంలోని ఇంజినీరింగ్ కళాశాల వద్ద దింపి వస్తానని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం కూల్ డ్రింక్‌లో నిద్ర మాత్రలు వేసి తాగించాడు. అనంతరం పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి గ్రామ సమీపంలోని కుక్కలగుట్ట వద్దకు తీసుకెళ్లి చున్నీతో ఉరేసి హత్య చేశాడని ఎర్రుపాలెం ఎస్ఐ వివరించారు. నిందితుడిని మధిర కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. హత్య కేసులో ఇంకా లోతుగా దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. -
కాపురానికి తీసుకెళ్లిన రాత్రే దారుణం..
సాక్షి, కొడవలూరు: ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నామని చెప్పి పెద్దలను ఒప్పించారు. కులాలు వేరైనా తల్లిదండ్రులు అంగీకరించి వారిద్దరికీ వివాహం చేశారు. రెండు నెలలు భార్యతో కాపురం చేసిన భర్త ఆ తరువాత నుంచి ఆమెపై అనుమానం పెంచుకుని దూరంగా ఉంటున్నాడు. తాను మారానని భార్యను బాగా చూసుకుంటానని పెద్దలను ఒప్పించి కాపురానికి తీసుకెళ్లిన రాత్రే ఆమె గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటన కొడవలూరు మండలం ఎన్టీఆర్ నగర్లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు..బుచ్చిరెడ్డిపాళెం మండలం పల్లాప్రోలు వడ్డిపాళేనికి చెందిన కోడి హరికృష్ణ కోవూరులోని ఓ స్వీట్ దుకాణంలో పని చేస్తున్నాడు. కొడవలూరు మండలం గండవరం శివపురం గిరిజన కాలనీకి చెందిన గడ్డం స్రవంతి(19) నార్తురాజుపాళెంలోని ఓ స్వీట్ దుకాణంలో పని చేస్తోంది. ఇరువురు ఇష్టపడి ప్రేమించుకున్నారు. ఈ విషయం స్రవంతి తన తల్లిదండ్రులు పద్మ, రమణయ్యకు తెలుపగా, కులాలు వేరైనా వారు అంగీకరించారు. గతేడాది జూన్ 10న పల్లాప్రోలు రామాలయంలో ఇద్దరికీ వివాహం చేశారు. వివాహం జరిగిన తరువాత రెండ్రోజులు మాత్రం స్రవంతిని పల్లాప్రోలులో ఉంచిన హరికృష్ణ ఆషాడ మాసం పేరుతో మరుసటి రోజు పుట్టింట్లో వదిలేశాడు. రెండు నెలలు వస్తూపోతూ, ఆ తరువాత ఆమెపై అనుమానం పెంచుకుని రావడం మానేశాడు. పెద్దలను ఒప్పించి తీసుకెళ్లి హతం నాలుగు నెలలుగా పుట్టింట్లో ఉంటున్న స్రవంతికి ఫోన్ కూడా చేయని హరికృష్ణ భార్యను ఎలాగైనా అంతమొందించాలని పన్నాగం పన్నాడు. స్రవంతి పెద్దమ్మ తలపల కృష్ణమ్మ బుచ్చిరెడ్డిపాళెం మండలం కొట్టాలులో ఉంటోంది. అక్కడికి ఈ నెల 27న స్రవంతి తల్లిదండ్రులతో కలిసి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న హరికృష్ణ శుక్రవారం రాత్రి అక్కడికి వెళ్లాడు. తన భార్యను కాపురానికి పంపిస్తే బాగా చూసుకుంటానని పెద్దల సమక్షంలో చెప్పి నమ్మించాడు. అందుకు అంగీకరించిన తల్లిదండ్రులు అప్పటికే బాగా పొద్దుపోవడంతో ఆ సమయంలో పల్లాప్రోలుకు వద్దని చెప్పారు. కొడవలూరు మండలం ఎన్టీఆర్నగర్లోని స్రవంతి అక్క దాసరి ఇందిర ఇంటి తాళాలు ఇచ్చి రాత్రి అక్కడ ఉండి శనివారం ఉదయం వెళ్లాలని సూచించారు. ఇదే అదనుగా భావించిన హరికృష్ణ ఎన్టీఆర్ నగర్‌లోని ఇందిర ఇంటికి భార్యతో వచ్చి అర్ధరాత్రి సమయంలో ఆమె గొంతు కోసి హతమార్చి పరారయ్యాడు. కొట్టాలులోనే స్రవంతి తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఇందిర శనివారం ఉదయం ఎన్టీఆర్ నగర్‌లోని ఇంటికి వచ్చి చూడగా బయట గడి పెట్టి ఉంది. అనుమానంతో గడి తీసి లోపల చూడగా స్రవంతి అతి కిరాతకంగా హత్యకు గురై ఉంది. దిగ్భ్రాంతికిలోనైన ఆమె పోలీసులకు సమాచారం అందించారు. కోవూరు సీఐ కే రామకృష్ణారెడ్డి, కొడవలూరు ఎస్సైలు పీ శ్రీనివాసులురెడ్డి, జీ.సుబ్బారావు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య దారుణ హత్య.. భర్త ఏమయ్యాడు..!
సాక్షి, మార్టూరు : మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన వివాహిత దారుణహత్యకు గురైంది. పోలీసులు, సమీప బంధువుల తెలిపిన వివరాల ప్రకారం..లక్కవరం ఎస్సీ కాలనీకి చెందిన మద్దుమాల పద్మ(38), భాస్కర్‌రావు భార్యభర్తలు. ఉన్నత విద్యావంతులైన వీరు కనిగిరిలో ప్రైవేట్ స్కూల్లో గత కొన్నేళ్లుగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా స్వగ్రామంలో ఉంటూ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు చెబుతున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ శుక్రవారం సాయంత్రం యద్దనపూడి మండలంలోని పూనూరులో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి స్వగ్రామం బయలుదేరి రాత్రికి ఇంటికి చేరుకోలేదు. కంగారు పడిన బంధువులు అదే రోజు రాత్రి మార్టూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ద్వారా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో కోనంకి, లక్కవరం గ్రామాల మధ్య పంట కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం పడి ఉన్నట్లు శనివారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బందితో ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించిన ఎస్సై శివకుమార్ మహిళ మృతదేహం శుక్రవారం రాత్రి కన్పించకుండా పోయిన పద్మదిగా గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. అనంతరం శనివారం రాత్రి మార్టూరు ప్రభుత్వాసుపత్రికి తరలించిన పద్మ మృతదేహానికి ఆదివారం పోస్టుమార్టం చేశారు. ఆచూకీ లేని భర్త ఇదిలా ఉండగా భార్య పద్మతో కలిసి ప్రయాణించిన భర్త భాస్కరరావు ఆచూకీ ఇంత వరకు తెలియకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. భాస్కరరావు అనుమానంతో భార్య పద్మను తరచూ వేధిస్తూ ఉండేవాడని, అతడే చంపి ఉంటాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలికి కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం నివేదిక, భాస్కరరావు ఆచూకీ తెలిస్తే గానీ హత్యకు గల కారణాలు చెప్పలేమని పోలీసులు అంటున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చీరాల డీఎస్పీ వేణుగోపాల్ సోమవారం సాయంత్రాన్ని సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో పెద్దదోర్నాల: ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ సెల్ఫీ వీడియో తీసుకున్న తండ్రీ కొడుకులను ఎట్టకేలకు పోలీసులు అదుపులోనికి తీసుకోవటంతో ఇరు రాష్ట్రాల పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రంలోని అచ్చంపేటకు మండలం అంకురోనిపల్లెకు చెందిన హరిశంకర్ నాయక్ తన ఇద్దరు కుమారులతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నాంటూ హైదరాబాద్ రోడ్డులోని మన్ననూర్ వద్ద అటవీ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శనివారం సెల్ఫీ వీడియోను ఫేస్బుక్, వాట్సప్‌లలో అప్లోడ్ చేశాడు. దీంతో తెలంగాణ పోలీసులు శనివారం నుంచి వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు అదుపులోనికి తీసుకున్న తండ్రీ కొడుకులు తెలంగాణలోని దోమలపెంట, ఈగలపెంట తదితర ప్రాంతాలతో పాటు శ్రీశైలం, సుండిపెంట పరిసరాల ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తెలంగాణలోని ఈగలపెంటకు చెందిన ఎస్సై సమాచారం మేరకు పెద్దదోర్నాల ఎస్సై హరిబాబు సైతం వీరి ఆచూకీ కోసం మండల పరిధిలోని చిన్నారుట్ల, శిఖరం తదితర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఇద్దరు బాలురతో కలిసి తుమ్మలబైలు వద్దకు వచ్చి వెనుదిరిగి వెళ్లినట్లు తమ్మలబైలుకు చెందిన గిరిజనులు పోలీసులకు సమాచారమందించారు. దీంతో తెలంగాణ నుంచి వచ్చిన పోలీసులు కాల్ డేటా ఆదారంతో హరిశంకర్ నాయక్‌తో పాటు ఇద్దరి కుమారులను మండల పరిధిలోని శిఖరం, చిన్నారుట్ల మధ్యలో అదుపులోనిని తీసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడేందుకు అటవీ ప్రాంతంలోకి వచ్చి ఉంటాడని పోలీసులు పేర్కొంటున్నారు. -
ప్రియుడిపై మోజుతో...!
సాక్షి, ప్రొద్దుటూరు క్రైం : పోలీసులు, కుటుంబ సభ్యుల అనుమానమే నిజమైంది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను భార్య హత్య చేసింది. ఈ కేసుకు సంబంధించిన నిందితులను మంగళవారం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు... ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయునిపేటకు చెందిన కడియాల చంద్రశేఖర్ ఆచారి మూడేళ్ల నుంచి ప్రొద్దుటూరులోని అమృతానగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య మహాలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రొద్దుటూరులో కార్పెంటర్ పనికి వెళుతూ భార్యా, పిల్లలను పోషించేవాడు. ఈ క్రమంలో గత ఏడాది అక్టోబర్ 28న చంద్రశేఖర్ ఆచారి చనిపోయాడు. ఈ విషయాన్ని మహాలక్ష్మి తన అత్తా మామలకు తెలిపి మృతదేహాన్ని స్వగ్రామమైన సంజీవరాయునిపేటకు తరలించింది. చంద్రశేఖర్ ఆచారి తల్లిదండ్రులు, మహాలక్ష్మి బంధువులు కలిసి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామ శివారులో శవాన్ని ఖననం చేశారు. రెండు నెలల పాటు గ్రామంలో ఉన్న మహాలక్ష్మి తర్వాత కనిపించలేదు. చంద్రశేఖర్ ఆచారి తల్లిదండ్రులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. దీంతో మహాలక్ష్మి మామ వెంకటసుబ్బయ్య కోడలిని వెతుక్కుంటూ ప్రొద్దుటూరుకు వచ్చాడు. అమృతానగర్‌లో ఆమె కోసం ఆరా తీయగా ఆచూకీ లభించలేదు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అతను మైదుకూరు మండలం జీవీ సత్రంకు వెళ్లాడు. అక్కడ మహాలక్ష్మి రామకృష్ణ ఆచారి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు వెంకటసుబ్బయ్య గమనించాడు. వారిద్దరిని చూసిన వెంటనే కుమారుడి మరణంపై అతనికి అనుమానం కలిగింది. దీంతో అతను స్వగ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి జరిగిన విషయాన్ని తెలిపాడు. కొన్ని రోజుల తర్వాత రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి అతను ఫిర్యాదు చేశాడు. తన కుమారుడి మరణంపై అనుమానం ఉందని, కోడలే హతమార్చి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారి ఫిర్యాదు మేరకు ఈనెల 3న రూరల్ ఎస్ఐ సునీల్‌రెడ్డి సంజీవరాయునిపేటకు వెళ్లి చంద్రశేఖర్ ఆచారి శవానికి పంచనామా నిర్వహించారు. ముగ్గురు కలిసి... ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన రూరల్ సీఐ విశ్వనాథరెడ్డి లోతుగా దర్యాప్తు చేశారు. వారు ఉపయోగించిన ఫోన్ నంబర్లు ఆధారంగా ఈ హత్య కేసులో మరొకరి పాత్ర ఉన్నట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో మంగళవారం రామకృష్ణ ఆచారి, మహాలక్ష్మిలను రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. చంద్రశేఖర్ ఆచారిని అడ్డు తొలగించాలనే ఉద్దేశంతోనే గత ఏడాది అక్టోబర్ 28న అర్ధరాత్రి హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అతను నిద్రిస్తున్న సమయంలో రామకృష్ణ ఆచారి, మహాలక్ష్మిలు మురళీ అనే వ్యక్తితో కలిసి దిండు మొహంపై పెట్టి చంపేసినట్లు అంగీకరించారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. -
వెడ్డింగ్ పార్టీలో డ్యాన్స్ : భార్యను కడతేర్చిన భర్త
పట్నా : వివాహ వేడుకలో అతిధులతో కలిసి డ్యాన్స్ చేయడమే భార్య ప్రాణాల మీదకు తెచ్చింది. బిహార్‌లోని పట్నా జిల్లా హసది ముషారి ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఖోరంగ్‌పూర్ గ్రామానికి చెందిన రంజిత్ మాంఝీ భార్య మునియా దేవి హసదిలోని తన తల్లితండ్రుల వద్దకు పదిరోజుల కిందట పిల్లలతో కలిసి వచ్చారు. ఓ వివాహానికి హాజరయ్యేందుకు ఆమె భర్త కూడా మూడు రోజుల కిందట అత్తగారింటికి చేరుకున్నాడు. సోమవారం రాత్రి పెళ్లి వేడుకలో భర్త, పిల్లలతో కలిసి మునియా కూడా పాల్గొన్నారు. ఇక డీజేకు అనుగుణంగా వెడ్డింగ్ పార్టీలో అతిధులతో కలిసి మునియా డ్యాన్స్ వేయడం భర్త రంజిత్ మాంఝీకి ఆగ్రహం కలిగించింది. అందరి ఎదుటే భార్యను చితకబాదిన మాంఝీ ఆ తర్వాత ఆమెను పశువుల పాకలోకి తీసుకువెళ్లి ఊపిరిఆడకుండా చేసి ప్రాణం తీశాడు. ఘటనా స్ధలంలోనే భార్య మునియా మరణించగా నిందితుడు పరారయ్యాడు. -
నిన్న ప్రేమించి..నేడు చంపేసి!
ప్రకాశం జిల్లా / సింగరాయకొండ: రైలులో కలిశాడు. మాటలతో మైమరిపించాడు. నీవు లేనిదే బతకలేనన్నాడు. చివరకు పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తన భర్తకు తాను రెండో భార్యనని తెలిసి ఆ అభాగ్యురాలు విలపించింది. అయినా భర్త అండగా ఉన్నాడనుకుంది.. కానీ ఆ భర్తే చివరకు డబ్బు కోసం చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేసి కటకటాలపాలయ్యాడు. ఈ సంఘటన మండలంలోని సోమరాజుపల్లి పంచాయతీ ఆవులవారిపాలెంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం బండి గ్రామానికి చెందిన అంగూరు మోహన్‌రావు, సావిత్రి దంపతులు బతుకుదెరువు కోసం 15 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోని సనత్‌నగర్ వచ్చి అక్కడే నివాసం ఉంటూ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి హేమలత (19)తో పాటు కొడుకు ఉన్నారు. చదువులో రాణిస్తున్న హేమలతను డిగ్రీ వరకు చదివించి కానిస్టేబుల్ ట్రైనింగ్‌కు కూడా పంపించారు. ప్రేమలో పడిన హేమలత ఏడాది క్రితం హేమలత చెన్నైలోని తన బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వస్తోంది. సింగరాయకొండ మండలం పాకల ఆదిఆంధ్ర కాలనీకి చెందిన ఎల్లూరి అనిల్ ఆమెకు తారసపడ్డాడు. అనిల్ హైదరాబాద్‌లో బేల్దారి మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి చివరకు ప్రేమగా మారింది. తర్వాత ఒకరోజు హేమలత ఇంట్లో నుంచి పారిపోయి అనిల్‌ను వివాహం చేసుకుంది. అప్పుడు హేమలత తల్లిదండ్రులు సనత్‌నగర్ పోలీసుస్టేషన్లో కుమార్తె కనబడటం లేదని ఫిర్యాదు కూడా చేశారు. ఆ తర్వాత పోలీసులు ఆ ఫిర్యాదును పట్టించుకోలేదని హేమలత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చివరకు వారిద్దరు మేజర్లు కావడంతో తామేమీ చేయలేమని పోలీసులు తల్లిదండ్రులకు చెప్పి పంపించారు. ఆ తర్వాత వివాహం చేసుకుని వచ్చిన కుమార్తెను ఆదరించి ఇంట్లో ఉంచుకున్నారు. రెండు నెలలు ఇంట్లో ఉన్న తర్వాత భార్యను తన స్వగ్రామం పాకల ఇంటికి తీసుకెళ్లాడు. బయట పడిని మోసం పాకల వచ్చిన హేమలతకు తన భర్త అనిల్ చేసిన మోసం తెలిసేసరికి అప్పటికే సమయం దాటిపోయింది. అప్పటికే ఆమె గర్భిణి. అనిల్ తన బంధువుల అమ్మాయిని మొదట పెళ్లి చేసుకున్నాడని తెలిసి హతాశురాలైంది. చేసేది లేక భర్తనే నమ్ముకుంది. మొదటి భార్య తల్లిదండ్రులు అనిల్‌ను తమ బిడ్డ సంగతేంటని నిలదీయడంతో మీ అమ్మాయికి విడాకులిస్తానని చెప్పాడు. అనిల్ తల్లి ఎలీసమ్మ తన ఇల్లు తాకట్టు పెట్టి రూ.50 వేలు అప్పు చేసి ఇచ్చి పెద్ద కోడలితో సంబంధాన్ని తెగతెంపులు చేసుకుంది. వారం క్రితం ఆవులవారిపాలెంలో మకాం హేమలత ఇటీవల పండంటి కుమారుడిని ప్రసవించింది. పుట్టిన బిడ్డకు పసికర్లు అని బాక్స్‌లో పెట్టటంతో ఖర్చుల కోసం హేమలత తన తండ్రిని ప్రాధేయపడగా ఖర్చుల కోసం రూ.14 వేలు పంపించాడు. అంతేగాక తల్లి సావిత్ర కూడా మరో రూ.20 వేలు ఇచ్చింది. వారం క్రితం హేమలత అత్త ఎలీసమ్మ తన కొడుకు, కోడలిని అవులవారిపాలెంలో ఇల్లు తీసుకుని వారితో కాపురం పెట్టించింది. ఆత్మహత్యగా సృష్టించే ప్రయత్నం శనివారం రాత్రి 8 గంటల సమయంలో అనిల్ తన అత్త సావిత్రికి ఫోన్ చేసి 2 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్తూ పక్కింటి వారు ముగ్గు వేస్తున్నారని, నీవు కూడా ముగ్గు వేయమని బయట నుంచి కేకవేసి వెళ్లాడని, ఆ తర్వాత అరగంట ద్వారా తిరిగి వచ్చి తన భార్య చీరెతో దూలానికి ఉరేసుకుని చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. హత్యేనంటున్న హేమలత తల్లిదండ్రులు తన అల్లుడు 8 గంటలకు డబ్బు కావాలని ఫోన్ చేశాడని, మళ్లీ 9 గంటలకు ఫోన్ చేసి హేమలత చనిపోయిందని చెప్పాడని, ఇది ముమ్మాటికీ హత్యేనని ఆరోపించారు. తన అల్లుడి కారణంగా మనుమడి భవిష్యత్తు ఏమిటని, కేవలం 15 నెలల పిల్లాడేనని, ఏం చేయాల్లో అర్థం కావటం లేదని హేమలత తల్లిదండ్రులు విలపించటం స్థానికులను కలచివేసింది. ఈ కేసును విచారిస్తున్న సీఐ ఓ.దుర్గాప్రసాద్, ఎస్ఐ వి.నాగమల్లేశ్వరరావు మాత్రం హేమలత మెడపై గాయాలున్నాయని, ఇది ముమ్మాటికి హత్యేనని అనుమానిస్తున్నామన్నారు. -
అక్రమ సంబంధం; నమ్మించి తోసేశాడు
గురుగ్రామ్ : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను మేడపై నుంచి తోసి చంపేశాడు. అనంతరం ప్రమాదవశాత్తు కింద పడిందని పోలీసులతో నమ్మబలికాడు. ముమ్మర దర్యాప్తు చేసిన పోలీసులు ఆమె చావుకు కారణమైన భర్తను, అతని ప్రియురాలిని అరెస్టు చేశారు. ఈ ఘటన గురుగ్రామ్‌లోని ‘వాలీ వ్యూ ఎస్టేట్’ అపార్ట్మెంట్లో గత అక్టోబర్, 27న చోటుచేసుకుంది. వివరాలు.. దీపికా చౌహన్ (32), విక్రం చౌహన్ (35) భార్యభర్తలు. వీరికి నాలుగేళ్ల పాప, 5 నెలల బాబు ఉన్నారు. అయితే, గత కొంత కాలంగా విక్రం ఎదురు ఫ్లాట్స్‌లో ఉండే షెఫాలి భాసిన్తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగేవి. ఘటన జరిగిన రోజు సాయంత్రం విక్రం దీపికా మరోమారు గొడవపడ్డారు. ‘నీ వ్యవహారాలు నచ్చడం లేదు. నన్నూ.. నా పిల్లల్ని అన్యాయం చేయొద్దు. ఇప్పుడే వెళ్లి భాసిన్ అంతు చూస్తా’ అని దీపిక హెచ్చరించింది. దీంతో తన అక్రమ సంబంధం ‘చెడిపోతుంది’ అని భావించిన విక్రం తన భార్యను హతమార్చాలని పథకం రచించాడు. మంచిగా నటించి ఆ రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో దీపికతో బాల్కనీలో కాసేపు ముచ్చటించాడు. ఆమెను నమ్మించి ఒక్కసారిగా 8 అంతస్తుల ఎత్తు నుంచి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలపాలైన దీపిక ఆస్పత్రికి తరలించేలోపే మరణించిందని పోలీసులు తెలిపారు. కాగా, ఈ హత్యలో విక్రమ్‌కి సహకరించాడనే అనుమానంతో మరోవ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు డీఎల్ఎఫ్ ఫేజ్-1 పోలీస్‌స్టేషన్ ఎస్హెచ్ఓ సంజీవ్ కుమార్ వెల్లడించారు. -
భర్త ఆత్మహత్యతో బయటపడిన భార్య హత్య
హైదరాబాద్: భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలతో మనస్తాపం చెందిన ఓ బ్యాంక్ ఉద్యోగి ఏడు నెలల గర్భవతి అయిన భార్యను దారుణంగా హతమార్చాడు. ఆ తరువాత భార్య మృతదేహాన్ని బెడ్రూమ్లోనే ఉంచి, ఇంటికి తాళం వేసి, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా కేతేపల్లికి చెందిన బయ్య లింగమల్లమ్మ, సర్వయ్య దంపతుల కుమార్తె సుమలత(25)కు మిర్యాలగూడకు చెందిన ఎం.మలయాద్రి కుమారుడు మేకల మాధవ్ (30)తో కిందటేడాది అక్టోబర్ 5న వివాహం జరిగింది. ఆ సమయంలో అల్లుడు మాధవ్‌కు రూ.6 లక్షల నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చారు. వివాహం అయిన కొంతకాలం వీరి కాపురం సజావుగా నడిచింది. భార్య మెడ చుట్టూ చున్నీ బిగించి.. నల్లకుంట సిండికేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్న మేకల మాధవ్ శంకరమఠం ఎదురు వీధిలో గల ఆరో విల్లా అపార్ట్మెంట్ మూడో అంతస్తులోని ఫ్లాట్ నంబర్ 303లో అద్దెకు దిగాడు. ఏడు నెలల గర్భవతి అయిన సుమలత గత కొంతకాలంగా పుట్టింట్లోనే ఉంటూ ఈ నెల 16న తల్లితో కలసి భర్త వద్దకు వచ్చింది. తల్లి ఈ నెల 18న సాయంత్రం కుమార్తెను ఇక్కడే వదిలి స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఇంట్లో జరిగిన విషయాలకు మనస్తాపం చెందిన మాధవ్ శనివారం మధ్యాహ్నం భార్య సుమలత మెడ చుట్టూ చున్నీతో బిగించి హత్య చేశాడు. ఆ తరువాత ఆమె మృతదేహాన్ని బెడ్రూమ్లోనే ఉంచి, ఇంటికి తాళం వేసి సమీపంలో ఉన్న రైలు పట్టాలపైకి వెళ్లి.. నడుస్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుకుని ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు.. మృతుని ఐడీ కార్డు ఆధారంగా వివరాలు తెలుసుకుని అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. భర్త ఆత్మహత్యతో బయటపడిన భార్య హత్య మాధవ్ తండ్రి మలయాద్రి శనివారం సాయంత్రం 4.30కి వియ్యంకురాలు లింగమల్లమ్మకు ఫోన్ చేసి తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. వెంటనే లింగమల్లమ్మ కుమార్తెకు ఫోన్ చేయగా స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చిన లింగమల్లమ్మ బంధువులతో కలసి రాత్రి 8.30 గంటలకు నల్లకుంటలో కుమార్తె నివాసముంటున్న ఇంటి వద్దకు చేరుకుంది. ఇంటికి తాళం వేసి ఉండటంతో.. పోలీసుల సమక్షంలో తాళం పగులగొట్టి చూడగా సుమలత బెడ్రూమ్లో విగత జీవిగా పడి ఉంది. ఆదివారం మధ్యాహ్నం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నల్లకుంట సీఐ వి.యాదగిరిరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పరాయిగడ్డపై భార్యను కడతేర్చాడు..
లండన్ : బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన వారిద్దరూ ప్రేమించి పెళ్లాడారు..అన్యోన్య దాంపత్యంతో పరాయిగడ్డపైనా పలువురి మన్నన పొందారు. ఇంతలోనే వారి కాపురంలో ఏం కల్లోలం చెలరేగిందో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. లండన్‌లో ఫార్మసీ దుకాణాన్ని నిర్వహిస్తున్న జెస్సికా పటేల్‌ను భర్త మితేష్ పటేల్ దారుణంగా హతమార్చినట్టు పోలీసులు అభియోగం నమోదు చేశారు. 34 సంవత్సరాల జెస్సికా పటేల్‌ను భర్త మితేష్ పటేల్ (36) హతమార్చాడని టెసీడ్ మేజిస్ర్టేట్ కోర్టులో విచారణ చేపట్టారు. జెస్సికా పటేల్ భర్తతో కలిసి మిడిల్స్‌బోరోలో గత మూడేళ్లుగా తమ ఇంటికి సమీపంలోనే మందుల దుకాణం నడిపిస్తున్నారు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని స్ధానికులు చెబుతున్నారు. ఇంతలో ఏమైందో గత వారం జెస్సికా తన ఇంటిలోనే విగతజీవిగా పడిఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ప్రత్యేక నిపుణులు, ఫోరెన్సిక్ బృందాలు నేర విచారణలో నిమగ్నమయ్యాయి. పోస్ట్‌మార్టమ్ నివేదిక వివరాలను విచారణ నిబంధనల ప్రకారం వెల్లడించడం లేదని పోలీసులు తెలిపారు. జెస్సికా తమను ఎంతో ప్రేమగా చూసుకునేవారని, కుటుంబానికి అంకితమై సేవలు అందించారని , ఆమె మరణం తమకు కోలుకోలేని విషాదమని కుటుంబ సభ్యులు ప్రకటన విడుదల చేశారని క్లీవ్‌లాండ్ పోలీసులు తెలిపారు. భార్యతో ఎంతో ప్రేమగా మెలిగే మితేష్ పటేల్ జెస్సికాను ఎందుకు హత్య చేశాడన్నది స్ధానికులకు అంతుపట్టడం లేదు. విచారణలో వాస్తవాలు వెలుగుచూస్తాయని పోలీసులు చెబుతున్నారు. -
ప్రాణం తీసిన ఆస్తి వివాదం
భాగ్యనగర్‌కాలనీ: ఆస్తి విషయంలో తాను చెప్పినట్లు వినటం లేదని ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను గొంతు నులిమి దారుణంగా హత్య చేసిన సంఘటన మూసాపేట రాఘవేంద్ర సొసైటీలో వెలుగు చూసింది. కూకట్పల్లి పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా, కొక్కిర్యాల తండాకు చెందిన జర్పల శ్రీను, దేవి (27) దంపతులు రాఘవేంద్ర సొసైటీలో నివాసముంటున్నారు. శ్రీను స్థానిక డ్రైక్లీనింగ్ షాపులో పనిచేస్తుండగా, దేవి ఇంటివద్దనే ఉండేది. దేవి తల్లి ఇటీవల గ్రామంలోని భూమిని విక్రయించటంతో భార్యాభర్తల మధ్య గత కొంత కాలంగా ఆస్తి విబేధాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి వారి మధ్య గొడవ జరిగింది. తన మాట వినకపోవడంతో సహనం కోల్పోయిన శ్రీను భార్యను తీవ్రంగా కొట్టడమేగాక, గొంతు నులిమి హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాం«ధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు శ్రీను పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. -
భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్యాయత్నం
సాక్షి, నేలకొండపల్లి: భార్యను హత్య చేసి తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడో భర్త. ఈ దారుణ సంఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలోని బీడులో మండలంలోని గువ్వలగూడెం గ్రామానికి చెందిన మాతంగి గంగాధర్, నవీన అనే భార్యాభర్తలు తమ ఇద్ద మగ పిల్లలతో నివసిస్తున్నారు. ఈ కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం నవీనను చున్నీతో ఉరిబిగించి గంగాధర్ చంపాడు. అనంతరం అతను కూడా విష గిళికలు తిని ఆత్మహత్యకు యత్నించాడు. నేలకొండపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను కిడ్నాప్ చేసి చంపేశాడు
ఇల్లెందు(భద్రాద్రి కొత్తగూడెం): భార్యను కిడ్నాప్ చేసి.. హత్య చేసిన ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో గురువారం రాత్రి జరిగింది. టేకులపల్లిలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఇల్లెందుకు చెందిన పుల్లిగండ్ల పద్మ(30), కారేపల్లి మండలం తొడిదలగూడేనికి చెందిన ఆటో డ్రైవర్ బండారు ప్రభాకర్ 12 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రభాకర్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ.. తరచూ భార్యను హింసించటం మొదలు పెట్టాడు. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెకు టేకులపల్లి నుంచి జెడ్పీకి బదిలీ కావడంతో ఖమ్మానికి మకాం మార్చారు. అక్కడ కూడా తరచూ వేధించడంతో పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా, పెద్దలు పంచాయితీ చేసినా ప్రభాకర్‌లో మార్పు రాలేదు. వేధింపులు తాళలేక రెండు నెలలుగా పద్మ పిల్లలతో కలిసి ఇల్లెందులోని పుట్టింటిలో ఉంటోంది. అక్కడి నుంచి ఉద్యోగ రీత్యా రోజూ ఖమ్మం నుంచి ఇల్లెందుకు రాకపోకలు సాగిస్తోంది. ఈ క్రమంలో గురువారం రాత్రి 7.30 గంటలకు ఇల్లెందులో బస్సు దిగి ఇంటికి వెళ్తోంది. పద్మ కోసం కాపు కాసిన ప్రభాకర్ మరో ఇద్దరితో కలిసి కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకెళ్లారు. కేకలు వేస్తుండటంతో ఆటోలోనే చున్నీని మెడకు చుట్టి చంపేశాడు. మృతదేహాన్ని మొట్లగూడెం వెళ్లే దారిలో రోడ్డు పక్కన పడేశారు. నిందితులు ప్రభాకర్‌తో పాటు ఈ దారుణానికి ఒడిగట్టిన మరో ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ జి. ప్రకాశరావు తెలిపారు. -
ప్లాన్ చేసి.. క్యాబ్‌లో రైడ్‌కు తీసుకెళ్లి!
వాషింగ్టన్: భార్యతో తన వైవాహిక బంధంపై విసుగు చెందిన ఓ భర్త ప్లాన్ ప్రకారం ఆమెను హత్యచేశాడు. ఈ ఘటన ఆమెరికాలోని సీటెల్‌లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. నిందితుడిని అరెస్ట్ చేసి సోమవారం కోర్టులో హాజరుపరచగా బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ వివరాలిలా ఉన్నాయి... కామెరాన్ జాన్ ఎస్పీటియా(31), జెన్నిఫర్ ఎస్పీటియా(29) భార్యాభర్తలు స్థానిక సీటెల్‌లో నివాసం ఉంటున్నారు. కామెరాన్ అమెరికా కోస్ట్ గార్డులో విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంతకాలం నుంచి భార్య జెన్నిఫర్‌తో ఆయనకు విభేదాలున్నాయి. ఆమెతో సంసార బంధం కొనసాగకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కామెరాన్ భార్యను అంతమొందించేందుకు ప్లాన్ చేశాడు. ప్లాన్ ప్రకారం.. రైడ్‌కు వెళ్దామని జెన్నిఫర్‌ను ఒప్పించి ఉబర్ క్యాబ్ బుక్ చేశాడు. మద్యం మత్తులో ఉన్న కామెరాన్ క్యాబ్ ఎక్కినప్పటినుంచి భార్యతో గొడవపడుతూనే ఉన్నాడు. కొంతసేపయ్యాక క్యాబ్ డ్రైవర్ ఓ పెద్ద శబ్దం విన్నాడు. కారు టైర్ పేలిందేమోనని కంగారుపడి వెనక్కి తిరిగి చూసి షాక్ తిన్నాడు. జెన్నిఫర్ ఆమె సీట్లో నిర్జీవంగా పడి ఉంది. కారు బాగానే ఉన్నా.. తన ప్రాణాలకు ముప్పు ఉందని గమనించిన డ్రైవర్.. ఎక్కడికి వెళ్లాలో చెప్పండి సార్ అని కామెరాన్‌ను అడిగాడు. అతడు చెప్పిన ప్రాంతంలో క్యాబ్ ఆపగా.. భార్య మృతదేహాన్ని దించి, డ్రైవర్‌కు డబ్బులు చెల్లించాడు. జరిగిన విషయాన్ని ఉబర్ డ్రైవర్ పోలీసులకు చెప్పాడు. ఆ సమాచారంతో నిందితుడు కామెరాన్ ఇంటికి వెళ్లి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. జెన్నిఫర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆప్పత్రికి తరలించినట్లు చెప్పారు. భార్యతో శారీరక బంధం కొనసాగడం లేదని, అందువల్లే ఆమెను తుపాకీతో కాల్చి హత్యచేశానని కామెరాన్ అంగీకరించాడు. సోమవారం కామెరాన్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా.. జడ్జి నిర్ణయం ప్రకారం మూడు మిలియన్ల అమెరికన్ డాలర్లు చెల్లించి బెయిల్‌పై విడుదలయ్యాడు. తదుపరి విచారణ జులై6కు వాయిదా వేశారు. సెకండ్ డిగ్రీ హత్య నేరం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
అనుమానంతో భార్య.. ముగ్గురు పిల్లల దారుణహత్య
కట్టుకున్న భార్యకు తన తమ్ముడితో వివాహేతర సంబంధం ఉందేమోనన్న అనుమానంతో ఆమెతో పాటు తన ముగ్గురు పిల్లలను కూడా చంపేశాడో వ్యక్తి. ఈ దారుణ ఘటన హరియాణాలోని షెహబజాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. అతడు కూడా ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. రాధేశ్యామ్ అనే ఈ నిందితుడు ముందుగా తన కూతుళ్లిద్దరినీ, కొడుకును ఒక నీళ్ల ట్యాంకులోకి తోసేసి, దానికి బయట నుంచి మూత పెట్టేశాడు. తర్వాత ఇంట్లో వంట చేస్తున్న భార్య మంజు (33) వద్దకు వెళ్లి, ఆమెను పదునైన ఆయుధంతో పీక నరికి చంపేశాడు. హడావుడిగా ఆమె మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత తాను నూతిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే స్థానికులు అతడిని కాపాడి బయటకు తీయడంతో విషయం మొత్తం బయటపడింది. వివాహేతర సంబంధం ఉందన్న అనుమానమే ఈ హత్యలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిని ఆస్పత్రిలో చేర్చామని.. అతడి పరిస్థితి బాగానే ఉందని పోలీసులు చెప్పారు.