Yello Media
-
పౌర సమాజం మేల్కోవాలి !
దేశంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వైరి పక్షాల మధ్య మాటల యుద్ధం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది . కానీ మన రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండగా.. చంద్రబాబు కోసం కొన్ని పత్రికలు, ఛానళ్లు ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగి తెలుగుదేశం కంటే కూడా ఎక్కువగా చావో రేవో అన్నట్లుగా వైఎస్సార్సిపి మీద తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. నిత్యం నీతులు వల్లించే రామోజీ ఇప్పుడు విలువలను విడిచి చంద్రబాబు కోసం గారడీలు చేయడం దీనికి పరాకాష్ట.నిజానికి రామోజీ మొదటి నుండీ వైయస్ కుటుంబానికి వ్యతిరేకంగా పని చేస్తూనే ఉన్నాడు, కాకపోతే పాతరోజుల్లో నగ్నంగా కనిపించకుండా ముసుగు వేసుకొని టీడీపీకి కొమ్ముకాసేవాడు. ఇప్పుడు ఈ ముసుగులన్నీ తొలగించి నగ్నంగానే విచ్చలవిడిగా అన్ని కట్టుబాట్లు గాలికొదిలేసి పుఖానుపుంఖాలుగా విషం చిమ్ముతున్నాడు. ఈనాడు పత్రికను చూస్తే.. అవసానదశలో కూడా రామోజీ ఎంత నీచ స్థాయికి దిగజారిపోయాడో అని ఆశ్చర్యంగా ఉంది. అంతెందుకు, నా సొంత అనుభవాన్నే తీసుకోండి. ఎటువంటి ఆధారాలూ లేకుండా "సీబీఐ వెతుకుతున్న నిందితుడు" అనే హెడ్లైన్ పెట్టి ఈనాడులో మూడ్రోజులు అడ్డమైన రాతలు రాయడం .. రామోజీ దిగజారుడు తనానికి పరాకాష్ట. విచిత్రంగా అసలు కేసు ఏమిటి? అది నిజంగా ఇంకా వుందా లేదా? ఒకవేళ ఉంటే ఏ స్థాయిలో వుంది? నోటీసులు ఇచ్చారా లేదా? ఇస్తే ఏ రకమైన నోటీసులు ఇచ్చారు? ఆ నోటీసులు ఇంకా అమల్లో ఉన్నాయా? ఇలాంటివేవీ ఆ మూడ్రోజుల రాతల్లో ఎక్కడా కనిపించలేదు. కనీసం కేసు తాలూకు వివరాలు తెలుసుకొనే ప్రయత్నం కూడా చేయలేదు .లుక్ అవుట్ అంటే ఏమిటి ? ఇంటర్‌పోల్ అంటే ఏమిటి? అవి ఏ ఏ దేశాలలో ఏ విధంగా పనిచేస్తాయో అన్న కనీస అవగాహన లేకుండా .. ఏదో అంతర్జాతీయ ఉగ్రవాది కేసు చేధించినట్లు పెద్ద పెద్ద అక్షరాలతో ప్రధాన వార్తగా అచ్చేశాడంటే .. రామోజీ ఎంత అభద్రతా భావంలో బ్రతుకుతున్నాడో తెలుస్తుంది. పేరు మార్చానంట... వేషం మార్చానంట. సినిమా వాళ్ళు కూడా ఇంత పకడ్భందిగా స్టోరీ అల్లలేరు. ఎవరో ఇచ్చిన స్టోరీని కనీసం నిజానిజాలు నిర్దారించుకోకుండా యధాతధంగా అచ్చేసి రామోజీ శునకానందం పొందటం తప్పితే ఇందులో ఎలాంటి నిజాలు లేవు.పుట్టినప్పుడు తల్లితండ్రులు పెట్టిన పేరుతోనే వున్నాను, వయస్సుతో వచ్చిన మార్పులు తప్పితే వేషంలో కూడా ఎలాంటి మార్పులు లేవు. జుట్టు ఊడిపోతే విగ్గురాజు లాగా విగ్గు ఎందుకులే అని స్టయిలిష్‌గా ఫుల్ షేవ్ చేస్తాను . నన్ను వ్యక్తిగతంగా ఎరిగిన ప్రతీ ఒక్కరికీ ఈ విషయాలు తెలుసు. నా మీద ఎలాంటి కేసులు లేవు, ఎలాంటి నోటీసులు లేవు . గుండుతో ఉంటే ఎయిర్‌పోర్టులో వదిలేస్తారా ? రామోజీకి మన వ్యవస్థల మీద ఎంత చిన్న చూపు వుందో అర్థం చేసుకోండి.నా మీద వార్త రాస్తున్న సమయంలోనే ప్లాన్ లో భాగంగా నా ఫేస్బుక్ అకౌంట్ మీద రిపోర్టులు కొట్టించి 24 గంటలు బ్లాక్ అయ్యేలా కుట్ర పన్నారు. పైగా "చూశారా, అకౌంట్ కూడా క్లోజ్ చేసాడని" అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు . నేను ఫేస్‌బుక్‌కి ఛాలెంజ్ ఆప్షన్ పెట్టి అకౌంట్‌ను వెనక్కి తెచ్చుకొని పోస్ట్ పెట్టేవరకూ యెల్లో మీడియా అంతా చెలరేగిపోయింది.చిన్నప్పటి నుండీ పత్రికల్లో రాతలకి, రోత రాజకీయాలకి , ఎన్నికలప్పుడు ప్రచారం చేసే పుకార్లకు అన్నిటికీ అలవాటు పడ్డవాళ్ళం కాబట్టి రామోజీ రాతలు చూసి మనకేదో పబ్లిసిటీ వచ్చిందిలే అని నవ్వుకున్నాం కానీ ... అదే నా స్థానంలో గీతాంజలి లాంటి అభాగ్యులు వుంటే అలాంటి వార్తలకు ఎంతమంది తట్టుకొని నిబ్బరంగా ఉండగలరు.? ఒకపక్క సోషల్ మీడియాలో వచ్చే నెగెటివ్ వార్తలకే ప్రాణాలు తీసుకొంటుంటే .. ఈనాడు లాంటి ప్రధాన పత్రికలో మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో కధనాలు వస్తే ఎంతమంది తట్టుకొని నిలబడగలరు?ఇదే విషయమై మొన్న ఈనాడులో పనిచేసిన పాతతరం జర్నలిస్టులు కలిసినప్పుడు చర్చకి వస్తే వాళ్ళు చెప్పిన గత సంగతులు వింటే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే! వాళ్ళు చెప్పిన దాని ప్రకారం .. రామోజీ మాట వినని ప్రభుత్వ అధికారులమీద , వివిధ వ్యవస్థలలో ఉన్న అనేకమంది ప్రముఖుల మీద , ఆఖరికి సొంత వ్యవస్థలో పనిచేసే వాళ్ళ మీద కూడా ఇలాంటి దొంగ వార్తలు రాసి దారికి తెచ్చుకొనేవాడట . అలా తన దారికి రానివాళ్ళమీద మరింత విషపూరితంగా రాసి వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడట. ఇది రామోజీ దగ్గర అనేక సంవత్సరాలుగా దగ్గరగా పనిచేసిన సీనియర్ జర్నలిస్టులు చెప్పిన సంగతులు.రామోజీ ఇంత నీచస్థాయికి దిగజారటానికి కారణాలు ఏమిటి ?తరచి చూస్తే కారణాలు సుస్పష్టం. రామోజీ తన జీవితపు అవసాన దశలో ఉన్నాడు. నిజానికి ఈ వయస్సులో ఎవరైనా మరింత హుందాగా గౌరవం పొందాలని .. శత్రువులతో కూడా మంచి అనిపించుకోవాలని తాపత్రయపడతారు. నలభై ఏళ్లుగా తన టక్కుటమారా విద్యలతో ఒంటికి తెల్లని బట్టలు ముసుగుగా తొడిగి మీడియాని అడ్డం పెట్టుకొని వ్యవస్థలన్నిటినీ చెరబట్టాడు, అధికారం అండతో చెలరేగిపోయాడు. ముఖ్యంగా తనకి ఎదురు తిరిగిన ఎన్టీఆర్ ని దించి చంద్రబాబుని ఎక్కించటంలో సఫలీకృతుడు అవ్వటంతో ఇక తనకి ఎదురే లేదని, తానే సర్వాంతర్యామి అనే స్థాయికి చేరుకున్నాడు.చంద్రబాబు వెన్నుపోటు దిగ్విజయం అవ్వటంతో తాను తలచుకుంటే ముఖ్యమంత్రులను దించేయగలననీ .. అనుకుంటే ఎవరినైనా ముఖ్యమంత్రిని చేయగలనని భయపెట్టగలిగాడు. చంద్రబాబు హయాంలో రామోజీకి ఎదురు లేకుండా పోయింది. ఫిలింసిటీకి రూపకల్పన చేసి వేల ఎకరాలని దోచుకొని ఆఖరికి రాష్ట్రం విడిపోవటానికి బీజాలు కూడా వేసాడు. విడిపోయిన రాష్ట్రానికి తన మనిషి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వటం .. ఆ ఊపులోనే దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ రావటంతో ఇక తనకి తిరుగే లేదని .. తాను దేవేంద్రుడంతటి వాడినని తనకో రాజధాని కావాలనే ఉద్దేశ్యంతో దానికి అమరావతి పేరు పెట్టి ' ఇది మారాజ్యం / మా ఏలుబడిలో ఉన్న రాజ్యం ' అని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలనే కుఠిల బుద్ధితో ఎన్నో అరాచకాలు చేసారు.2019 ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు ఈడ్చికొట్టడం, ఆ తరువాత మార్గదర్శి కేసులో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంతో రామోజీకి కళ్లు బైర్లు కమ్మినట్టయింది. మార్గదర్శి ఫైనాన్సియల్ మీద ఎంక్వయిరీ జరుగుతుండడంతో తన మోసాలు బట్టబయలు అవ్వటం ఖాయమని నిర్దారించుకున్నాడు రామోజీ. మార్గదర్శిలో అక్రమంగా డిపాజిట్లు సేకరించటమనేది కేసులో ఒక పార్శం మాత్రమే. వాస్తవానికి నిజమైన డిపాజిట్ దారులు 10 శాతం మంది మాత్రమే, మిగతా డబ్బంతా చంద్రబాబు బినామీదారులే... నల్ల డబ్బుని .. ఎల్లయ్య, పుల్లయ్య పేరులతో డిపాజిట్ దారులుగా రికార్డులు సృష్టించి మార్గదర్శిలో దాచుకున్నారు. అందుకే ఫిర్యాదు ఇచ్చే వాళ్లు కనిపించరు. ఎందుకంటే అక్కడ ఉన్నది 90 శాతం ఫేక్ డిపాజిట్ దారులే. కేసు ముందుకి వెళ్లే కొద్దీ ఈ అసలైన ఈ విషయం బయటకొస్తుంది. వీటన్నిటి నుండి రామోజీ తప్పించుకోవటం అసంభవం.రామోజీకి ఇప్పుడు 88 ఏళ్ళు. జీవితపు అవసాన దశలో ఉన్నాడు. కీర్తి ప్రతిష్టలు పతాక స్థాయిలో ఉన్నప్పుడు మరణిస్తే శాశ్వత కీర్తి వస్తుంది. ఎవరైనా అదే కోరుకొంటారు. కానీ రామోజీ విషయంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది . అందుకే రామోజీ కంపించిపోతున్నాడు. కేసులలో తనకి శిక్ష పడటం ఖాయమని.. సమాజానికి తన నిజ స్వరూపం బట్టబయలు అవ్వటంతో పాటుగా కేంద్రం ఇచ్చిన పద్మవిభూషణ్ కూడా తిరిగి తీసుకుంటారని .. ఇది దేశంలో మరెవ్వరికీ జరగని ఘోరమైన అవమానమని రామోజీ భయకంపితులవుతున్నాడు. అవమానభారంతో మరణిస్తే ఇన్ని రోజులు తన టక్కుటమారా విద్యాలతో నిర్మించిన సామ్రాజ్యం , సంపాదించిన పేరు ప్రఖ్యాతలు అన్నీ కుప్పకూలిపోవటం ఖాయమని , రామోజీ అనేది ఒక విషపురుగుగా చరిత్ర గుర్తు పెట్టుకుంటుందనే ఆందోళనలో రామోజీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు .ఇదంతా తప్పించుకోవాలంటే రామోజీ ముందున్న ఏకైక మార్గం మళ్ళీ చంద్రబాబుని ముఖ్యమంత్రి చెయ్యటం . అదొక్కటే రామోజీ ముందున్న పరిష్కారం . అందుకోసమే ఎన్నడూ లేనంతగా దిగజారి విషం చిమ్ముతున్నాడు . రాజకీయపార్టీల కంటే కూడా స్వయంగా తానే పోటీ చేస్తున్నట్లు భావిస్తూ పేపర్ మొత్తాన్ని విషంతో నింపేస్తున్నాడు. గడచిన కొద్ది నెలలుగా ప్రధాన శీర్షికలని గమనించండి. ఒక్కటంటే ఒక్క అక్షరం కూడా నిజం లేకుండా ప్రభుత్వం మీద మీద ఊహించనంత స్థాయిలో విషం చిమ్ముతూ తాను ఎంత ఆందోళనలో ఉన్నాడో చెప్పకనే చెప్తున్నాడు. విషయం చిన్నదా, పెద్దదా? నిజమా, అబద్దమా? అనే దానితో నిమిత్తం లేకుండా ఏదో రకంగా ఎదుటి పక్షానికి నష్టం చేయాలి .. ఈనాడు పరువుపోయినా ఫరావాలేదు .. కొద్దిమంది నమ్మినా అంతే చాలు .. అనే తరహాలో సిగ్గు విడిచేసి పుంఖానుపుంఖాలుగా వార్తలని వండి వారుస్తున్నాడు .అందుకే పౌర సమాజం మేల్కోవాలి , నిజాలని గ్రహించి సమాజపు భవిష్యత్ గురించి ఆలోచన చేయాలి. దానికి ఒక తేదీ ఉంది. జూన్ 4, 2024.శివ అన్నపురెడ్డి, అమెరికా -
ఒక అత్యాశ... ఒక అసూయ... ఒక మాయావి!
పురందేశ్వరి భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖకు అధ్యక్షురాలు. ఎన్టీ రామారావు కూతురు అనే అర్హత ఆమెకు రాజకీయ ఆశ్రయాన్ని కల్పించింది. తాజా హోదాకు కూడా కారణమైంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు, రామోజీల తర్వాత ఈమె పాత్రే ముఖ్యమైనదని లక్ష్మీపార్వతి ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. తండ్రి షాజహాన్‌కూ, పెద్దన్న దారాషికోకూ వెన్ను పోటు పొడిచిన ఔరంగజేబుతో చంద్రబాబును ఎన్టీఆర్ పోల్చారు. చంద్రబాబు ఔరంగజేబయితే లక్ష్మీపార్వతి లెక్క ప్రకారం పురందేశ్వరిది రోషనారా పాత్ర అవుతుంది. అంతఃపుర కలహాల్లో చిన్నక్క రోషనారా చేసిన సాయానికి గుర్తుగా తాను రాజైన పిదప ఔరంగజేబు ఆమెను అందలాలెక్కించి కృతజ్ఞతను ప్రకటించుకున్నాడు. ఎన్టీఆర్ కుటుంబం ‘చిన్నమ్మ’గా పిలుచు కునే పురందేశ్వరి పట్ల చంద్రబాబు అటువంటి కృతజ్ఞత ప్రకటించుకోలేదని ఆమె క్యాంపు కినుకతో ఉండేది. చంద్రబాబు మోసంపై పురందేశ్వరి భర్త ఓ పుస్తకం కూడా రాశాడు. షర్మిల మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి. మూడేళ్ల కింద తండ్రి పేరుతో తెలంగాణలో ఒక పార్టీ పెట్టారు. పార్టీ ఎందుకు పెట్టారన్నది ఎవరికీ అర్థం కాలేదు. ఏపీలో అన్న ముఖ్యమంత్రి అయ్యారు కనుక తెలంగాణలో తానెందుకు కాకూడదన్న ఆరాటం తప్ప మరో హేతు బద్ధమైన కారణం కనిపించలేదు. కనుకనే ఆ ప్రాంతంలో వైఎస్ అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నా పార్టీలో చేరడానికి ఎవరూ ముందుకు రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టడంలోని ఔచిత్యాన్ని వారు ప్రశ్నించారు. అటువంటి వారికి షర్మిల ఘాటు గానే సమాధానం చెప్పారు. తెలంగాణ తాను మెట్టినిల్లనీ, తనకిక్కడ సర్వహక్కులున్నాయనీ ఢంకా భజాయించారు. అయితే తాను మెట్టినవారి ఇంటి పేరు మొరుసుపల్లిని మాత్రం ఆమె స్వీకరించలేదు. స్వీకరించాలనే రూల్ కూడా ఏమీ లేదు. తాను ఏ ఇంటి పేరు స్వీకరించాలో నిర్ణయించుకునే అధికారం ప్రతి మహిళకూ ఉంటుంది. కాకపోతే మెట్టినింటి ఆధారాలతో పొలిటికల్ క్లెయిమ్ పెట్టినప్పుడు ఇటువంటి ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. తలెత్తాయి. చంద్రబాబు నాయుడు వయోభారం మీద పడింది. ఈసారి గెలిస్తేనే పార్టీ బతుకు తుంది. కొడుకు రాజకీయ భవిష్యత్తు నిలబడుతుంది. కానీ క్షేత్ర నాడి బలహీనంగా కొట్టుకుంటున్నది. ఆయన దగ్గర ఎన్నికల ఎజెండా లేదు. ఎజెండాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించేశారు. ‘నా పరిపాలన వల్ల మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి. మీ ఊరికి మంచి జరిగిందనుకుంటేనే నాకు స్టార్ క్యాంపెయినర్లుగా నిలబడండ’ని జగన్మోహన్ రెడ్డి పిలుపు నిచ్చారు. చరిత్రలో ఇంత సూటిగా, ఇంత నిక్కచ్చిగా చెప్పగలి గిన నేత వైఎస్ జగన్ మాత్రమే. ఐదేళ్ల పారదర్శక పాలన ఇచ్చిన ఆత్మవిశ్వాసం అది. ఈ ఛాలెంజ్‌ను చంద్రబాబు స్వీకరించలేక పోతున్నారు. తాను పాలించిన ఐదేళ్లలో మంచి జరిగితేనే ఓటేయండనే ధైర్యం చంద్రబాబుకు లేదు. ఛాలెంజ్ స్వీకరించకపోతే తాను చేసిన మంచి ఇసుమంతైనా లేదని అంగీకరించినట్టే! అందుకే ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు. ఎజెండాల మీద చర్చలు జరగవద్దు. పొత్తులతో నెట్టుకుని రావాలి. దుష్ప్రచారంతో పబ్బం గడుపుకోవాలి. యెల్లో ముఠా ముందున్న ఆప్షన్లు ఇవే! పురందేశ్వరి తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని నంజు కోవడం కుదరలేదు. లక్ష్మీపార్వతిని అడ్డు తొలగిస్తే కుదురుతుందని చంద్రబాబు, రామోజీ నమ్మబలికారు. ఎన్టీ రామారావును గద్దె దింపకుండా లక్ష్మీపార్వతి అడ్డును తొలగించలేమని తీర్మా నించారు. సోదర సోదరీమణులందరిలోకీ తెలివైనదిగా పేరున్న పురందేశ్వరికి కూడా ఈ తీర్మానంలో నిజాయితీ కనిపించింది. ఆపరేషన్ వైస్రాయ్‌కు తోబుట్టువులను సిద్ధం చేసింది ఆమేననే ప్రచారం ఉన్నది. వ్రతం చెడింది కానీ ఫలం దక్కలేదు. ఈసారి తాను మారిన మనిషినని బంధువర్గ సర్వసభ్య సమావేశంలో చంద్రబాబు ప్రకటించారట! పులి ముసలిదైపోయింది. శాకా హారిగా మారిపోయింది. బంగారు కడియాన్ని కూడా నమల్లేక పోతున్నది. మనం కలిసుంటే పిల్లలు సంయుక్తంగా నములు కుంటారని ప్రతిపాదించారట! తాము మిస్సయిన బస్సు తమ వారసుడికి దొరికితే దగ్గుబాటి కుటుంబానికి ఇంకేమి కావాలి? చంద్రబాబు ఎటువంటి హామీ ఇచ్చారో తెలి యదు కానీ డీల్ కుదిరింది. పురందేశ్వరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కడానికి చంద్రబాబు – రామోజీలు కలిసి ఆరెస్సెస్‌లో కదపాల్సిన పావులన్నీ కదిపి చివరికి కృతకృత్యులయ్యారని సమాచారం. ఎన్నికలు పూర్తయ్యేలోగా ఆమె నిర్వహించవలసిన పాత్రకు సంబంధించిన స్క్రిప్టు పుస్తకాన్ని ఆమె చేతిలో పెట్టారు. షర్మిల తాను పాదయాత్ర చేస్తే ఓట్లు జలజలా రాలతాయనే మూఢ నమ్మకం ఏదో షర్మిలకు ఉండేదట! ఆ నమ్మకాన్ని యెల్లో మీడియా పెద్దలు మరింత ఎగదోశారు. తెలంగాణలో ఆ నమ్మకం వమ్మయింది. వైఎస్సార్, వైఎస్ జగన్‌లలో ఉన్న ‘మాట తప్పని – మడమ తిప్పని’ లక్షణం షర్మిలలో ఏ కోశానా కనిపించలేదు. తెలంగాణలోనే ఆమె పలుమార్లు నాలుక మడ తేశారు. దీంతో ఉన్న కొద్దిపాటి అనుచరుల్లోనూ భ్రమలు పటా పంచలైపోయాయి. ‘చావైనా బతుకైనా తెలంగాణ’తోనే అంటూ ఆమె చేసిన ప్రకటన హాస్యాస్పదంగా మిగిలిపోయింది. ‘ఏ పార్టీతో పొత్తు పెట్టుకోను, 119 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తాన’ని పలుమార్లు చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా చూడటం తమ పనికాదని చెప్పారు. అదే నోటితో వ్యతిరేక ఓటును చీల్చడం ఇష్టం లేదు. అందుకే కాంగ్రెస్‌తో పొత్తుకోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఏడాది తిరక్కుండానే కాంగ్రెస్ పిలుపు కోసం తహతహలాడారు. రేవంత్‌రెడ్డిని తిట్టని తిట్టు లేదు. ఆయన సీఎం కావడమే తరువాయి, ఆమె స్వరంలో చిత్రమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆమె నిలకడలేనితనంపై అప్పటికే అవగాహన ఉన్నందువల్ల ఆమె స్వర విన్యాసాలను ఎవరూ పట్టించుకోలేదు. ఈ దశలో యెల్లో పెద్దలు మళ్లీ రంగంలోకి దిగారు. చంద్రబాబుకు రెండు అవసరాలున్నాయి కదా! బీజేపీతో పొత్తు – పొత్తు ద్వారా కలిగే ప్రయోజనాలు పొందడం మొదటిది. ఇందుకోసం పురందేశ్వరి డీల్. రెండోది జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం. యెల్లో మీడియా దిగంబర ప్రదర్శన జనంలో వెగటు పుట్టిస్తున్నది. కొత్త గొంతుకతో యెల్లో పలుకులు పలకాలి. ఆ గొంతుక జగన్ ఇంటి నుంచే వస్తే ఇంకేం కావాలి? చకచకా ఏర్పాట్లు జరిగాయి. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి షర్మిలను వరించేట్టుగా శకుని పాచికలు విసిరాడు. తల బీజేపీలో, మొండెం టీడీపీలో ఉండే సీఎం రమేశ్‌కు చెందిన ప్రైవేట్ విమానాలు అటూ ఇటూ పరుగులు తీశాయి. కొస మెరుపు ఏమిటంటే మొన్న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడు దల చేయడానికి కూడా సదరు బీజేపీ నాయకుడి విమానంలోనే షర్మిల కడపకు వెళ్లారు. తన ఉపన్యాసాల్లో మాటిమాటికీ రాజశేఖరరెడ్డి బిడ్డనని చెప్పుకునే షర్మిల ఆయన మరణానంతరం అవినీతి కేసులో ఆయన పేరు చేర్చిన కాంగ్రెస్‌లో చేరడంపై ఇప్పటికీ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయారు. అలా చేర్చినట్టు సోనియాకూ, రాహుల్‌కూ తెలియదట! ‘ఈ విషయం నాకు ప్రత్యేకంగా చెప్పార’ని షర్మిల చెప్పారు. క్విడ్ ప్రో కో కేసుల్లో విధాన నిర్ణయాలపై ప్రభుత్వాధి నేత పేరు లేకుండా బయటి వ్యక్తిపై కేసు ఎట్లా పెడతారు? సోనియాకు, రాహుల్‌కు తెలియదనడం చెవుల్లో పూలు పెట్టడంకాదా! చంద్రబాబునాయుడు అన్నిరకాల పొత్తుల్నీ జాగ్రత్తగానే అల్లుకుంటూ వచ్చాడు. ఇంటి ముందు ‘ఎన్డీఏ’ బోర్డు పెట్టుకున్నాడు. దొడ్లో ఇండియా కూటమిని కట్టేసుకున్నాడు. ఒక్క వైసీపీ తప్ప ఎవ్వరూ వ్యతిరేకం కాదు. అయినా గ్రాఫ్ వేగంగా పడిపోతున్నది. గుండె లయ తప్పుతున్నది. మాటలు తడబడుతున్నవి. దుష్ప్రచారాన్ని ఇప్పటికే ఆరున్నొక్క రాగంతో హైపిచ్‌కు తీసుకెళ్లారు. అయినా ఏదో వెలితి. రెండు జాతీయ పార్టీల రాష్ట్ర శాఖల అధ్యక్షురాళ్లతో సమన్వయం కుదిరినా కూటమిలో కళ లేదు, కలవరం తప్ప! రెండు జాతీయ పార్టీల రాష్ట్ర శాఖలను ఇద్దరు మహిళలే నడిపి స్తున్నందుకు గర్వపడాలో, ఒక ప్రాంతీయ పార్టీకి ఆ రెండు పార్టీల ఆఫీసులు సబ్–స్టేషన్లుగా మారినందుకు క్షోభ పడాలో తెలియని పరిస్థితి రాష్ట్ర ప్రజలది! యెల్లో కార్డ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా నియుక్తురాలైనప్పటి నుంచి టీడీపీ ప్రయోజనాలకే పురందేశ్వరి పెద్దపీట వేస్తున్నారని బీజేపీ కాషాయ టీమ్ వాపోతున్నది. టిక్కెట్ల పంపిణీలోనూ యెల్లో టీమ్‌కే పెద్దపీట వేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ పోటీ చేస్తున్నదే 10 అసెంబ్లీ సీట్లకు! కానీ 22 మంది ఉన్నతాధి కారులను తొలగించాలని, వారి స్థానంలో ఫలానా వారిని నియ మించాలని బీజేపీ అధ్యక్షురాలి హోదాలో ఆమె ఎన్నికల సంఘా నికి రాసిన లేఖ వివాదాస్పదంగా మారింది. చంద్రబాబు – రామోజీల డ్రాఫ్టు కింద ఆమె సంతకం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక షర్మిల కూడా యెల్లో కూటమి ప్రయోజనాలకు అను గుణంగానే ప్రచారాన్ని ప్రారంభించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ ప్రభుత్వాన్ని నిందించడం, ముస్లిం, మైనారిటీ ఓట్లను దూరం చేయడం అనే డబుల్ యాక్షన్ ప్రోగ్రామ్‌ను షర్మిలకు అప్పగించారు. ఈ కర్తవ్యంలో ఆమె టీడీపీ నేతలను కూడా మించిపోయి మాట్లాడుతున్నారు. మణిపుర్లో అల్లర్లు జరిగితే జగన్ ఖండించలేదట. మణిపుర్ అల్లర్ల నేపథ్యమేమిటి? దానికి మతం రంగు పులమాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? కొండ ప్రాంతంలోని ప్రజలకూ, మైదాన ప్రాంత ప్రజలకూ మధ్యన చెలరేగుతున్న భూసమస్య. తెగల సమస్య. ఈశాన్య రాష్ట్రాలు కేంద్రం స్పందించాల్సిన సమస్య. భారత్‌లోని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడిని కూడా ఖండించవచ్చు. కానీ ప్రయోజనముంటుందా? ఉక్రోషం ఎక్కువైతే చేసే విమర్శల్లో పస ఉండదు. బీజేపీకి జగన్ బానిసగా మారాడట! ఒక ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైన వైఖరితో కేంద్రంతో సఖ్యంగా ఉంటే బానిసగా మారడమా? కేంద్రంలో జనతా పార్టీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా ఎంజీఆర్ సఖ్యంగానే ఉండేవారు. ఆయన బానిసగా మారినట్టా? ఇప్పుడు నవీన్ పట్నాయక్ కూడా అదే వైఖరి అవలంబిస్తున్నారు. ఒడిషాకు ఈ విధానం వల్ల ప్రయోజనం కలుగుతున్నది. కేంద్ర – రాష్ట్ర సంబంధాలు అనేవి ఒక విధాన పరమైన నిర్ణయం. దీనికి పార్టీల ఐడియాలజీలతో సంబంధం లేదు. బీజేపీకి జగన్ బానిసగా మారితే ఎన్డీఏలోనే చేరేవాడు కదా! వైసీపీ సిద్ధాంతాలకూ, బీజేపీ సిద్ధాంతాలకు పొసగదు కనుకనే జగన్ పార్టీ ఒంటరి పోరాటం చేస్తున్నది. ఇక వివేకా హత్యపై యెల్లో కూటమి చేస్తున్న ఆరోపణలను మరింత బలంగా షర్మిల వినిపిస్తున్నారు. ఆమెకు చంద్రబాబు అప్పగించిన బాధ్యత కూడా అదే కదా! ఈ హత్యపై వివిధ కోణాల్లో తలెత్తుతున్న సందేహాలన్నీ షర్మిల పక్కన తిరుగుతున్న సునీత కుటుంబంవైపే వేలెత్తి చూపుతున్నాయి. అయినా విచారణ పూర్తి కాలేదు కనుక బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఎవరినీ హంతకులని సంబోధించడం లేదు. అటువంటి నాగరికమైన కట్టుబాటును కూడా షర్మిల గిరాటేశారు. చట్టాన్నీ, ఎన్నికల నియమావళిని కూడా ఉల్లంఘించారు. అవినాశ్‌రెడ్డిని పదేపదే హంతకుడని సంబోధించారు. ఈ వైఖరిని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని అవి నాశ్ హుందాగా స్పందించారు. రెడ్‌కార్డ్ చంద్రబాబు, యెల్లో కూటముల కథ ముగిసింది. ఎన్ని కుప్పిగంతులు వేసినా ఈ రెండు నెలలే. యెల్లో కూటమితో ఊరేగుతున్న ఉపగ్రహాలన్నీ పునరాలోచించుకోవాలి. కూటమి క్షుద్రవిద్యల కారణంగా, కుయుక్తుల కారణంగా జనంలో వారి పట్ల ఏవగింపు కలుగుతున్నది. క్షేత్ర సమాచారం ప్రకారం వైసీపీ ఓటింగ్ బలం 55 శాతానికి చేరుకున్నది. కూటమి ఉమ్మడి మద్దతు 41 శాతం. ఈ తేడా మరింత పెరగనున్నది. రాబోయే ఘోర పరాజయం తర్వాత యెల్లో కూటమి బతికి బట్టకట్టడం జరిగితే అదొక ప్రపంచ వింతే! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
చంద్రబాబు డబుల్ గేమ్.. రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్!
ఏపీ శాసనసభలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ సభ్యులు అల్లరి చేసిన తీరు వారు ఎంత అధమస్థాయికి పతనమైంది తెలియచేస్తోంది. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు సభకు రాలేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడే తన భార్యను ఏదో అన్నారని లేని సాకును చూపి సభకు రావడం మానుకున్నారు. పోనీ తనతో పాటే మిగిలినవారిని కూడా బహిష్కరింపచేశారా అంటే ఆ పని చేయలేదు. వారిని అసెంబ్లీలోకి పంపి అల్లరి చేయించారు. టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చేది కొద్ది మందే అయినా, గొడవ చేయడానికి మాత్రం సిగ్గుపడలేదు. ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా సభలో నిరసనలు చెబుతుంటారు. అది తెలిసిన విషయమే. దానికి కొన్ని హద్దులు ఉంటాయి. కానీ, టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం సభలో అరాచకంగా ప్రవర్తించడం ద్వారా వారికి మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియాల్లో ప్రముఖంగా వార్తలు వస్తాయన్న భావనతో రెచ్చిపోయి వ్యవహరించారు. శాసనసభ ఎన్నికల ముందు చివరి సెషన్‌గా జరిగిన సమావేశాలలో ప్రచారం కోసం వారు చేసిన హడావుడి తెలిసిపోయింది. ఏదో ఒక కారణం చెబుతూ స్పీకర్ తమ్మినేని సీతారాం పొడియంలోకి దూసుకురావడం, ఆ తర్వాత కాగితాలు చించడం, వాటిని స్పీకర్‌పైకి విసరడం, ఆయన ముఖానికి ప్లకార్డులు అడ్డుపెట్టి, నినాదాలు చేయడం వంటి అల్లరి చేష్టలతో ప్రజల దృష్టిని ఆకర్షించాలని యత్నించారు. చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ యథా ప్రకారం తన పిచ్చి పనులతో సభలో ఏ మాత్రం హుందాగా లేకుండా వ్యవహరించారు. గతసారి మాదిరే ఈ సెషన్లో కూడా ఆయన విజిల్స్ తీసుకువచ్చి ఈలలు వేయడం చూసి అసహ్యించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. సినిమాకు, అసెంబ్లీకి తేడా లేకుండా వ్యవహరించారు. ఆయన అంటే మానసికంగా అంత స్థిరత్వం లేని మనిషి కనుక అలా చేశారులే అనుకుంటే కాస్త పద్దతిగా ఉంటారనుకునే సీనియర్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వంటివారు కూడా అదే బాటలో నడిచారు. తాచెడ్డ కోతి వనమెల్ల చెరచిందన్న సామెతను తలపిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరిని చూసి మరొకరు అల్లరి చేశారు. దీనికి ఎస్సీ ఎమ్మెల్యే వీరాంజనేయులును ముందు పెట్టారు. తద్వారా ఏదైనా చర్య తీసుకుంటే ఎస్సీ ఎమ్మెల్యేని సభ నుంచి బయటకు పంపుతారా? అన్న ప్రచారం చేయడమే వారి లక్ష్యం అని తెలుస్తూనే ఉంది. గవర్నర్ స్పీచ్ జరిగిన రోజు నుంచీ ఇదే తంతు. దీనికంతటికి డైరెక్షన్ చంద్రబాబుదే అని వేరే చెప్పనవసరం లేదు. అందులోనూ టిక్కెట్లు మళ్లీ కావాలంటే ఏదో ఒక అల్లరి చేసి చంద్రబాబు దృష్టిలో పడాలని కూడా కొంతమంది ప్రయత్నిస్తారు. వీరి ప్రవర్తనను ఈసారి స్పీకర్ తమ్మినేని సీతారాం చాలా ఒపికగా భరించి, కొంత సమయం ఇచ్చి ఆ తర్వాత సస్పెండ్ చేసి బయటకు పంపించారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నిరసనలు చేయలేదా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. కానీ, వారు మరీ ఇంత మితిమీరి ప్రవర్తించలేదని స్పష్టంగా చెప్పవచ్చు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని అధికార పక్షం నానా మాటలన్నా ఆయన భరించారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలు జగన్‌ను దూషిస్తుంటే నవ్వుతూ ఎంజాయ్ చేసేవారు. అదే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఏదైనా నిరసనకు దిగి పోడియం వైపు వెళితే ఇంకేముంది విలువలు పాటించలేదని విమర్శించేవారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతిపక్షం విలువలు పాటించాలి. నిరసనలు చెప్పకూడదు. సభ గురించి ఆయన క్లాస్ తీసుకుంటారు. అదే తాను ప్రతిపక్షంలో ఉంటే టీడీపీ సభ్యులను రెచ్చగొడతారు. ఇది గత మూడు దశాబ్దాలుగా చంద్రబాబుకు ఉన్న అలవాటే. ఒక విషయం జ్ఞప్తి చేసుకోవాలి. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావును ముఖ్యమంత్రి సీటు నుంచి లాగేసి, తాను ఆ సీటులోకి ఎక్కిన తర్వాత చంద్రబాబు సుద్దులు చెప్పడం ఆరంభించారు. ఈనాడు అధినేత రామోజీతో కలిసి తన ఇమేజీ పెంచుకోవడం కోసం రకరకాల వ్యూహాలు అనుసరించారు. శాసనసభలో వ్యవహరించాల్సిన పద్దతులు, పాటించవలసిన విలువలు అంటూ ప్రత్యేక సదస్సులు పెట్టారు. దానికి రామోజీ కూడా ఒక స్పీకర్‌గా వచ్చినట్లు గుర్తు. అప్పట్లో యనమల రామకృష్ణుడు స్పీకర్‌గా ఉండేవారు. ఆయన ఆనాటి కాంగ్రెస్ ప్రతిపక్షాన్ని కట్టడి చేయడానికి కొన్ని కొత్త నిబంధనలు తెచ్చారు. దాని ప్రకారం అనుమతి లేకుండా స్పీకర్ పోడియం వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలు ఆటోమాటిక్‌గా సస్పెండ్ అవుతారంటూ ఒక ఎర్రగీతను పెట్టారు. గవర్నర్ స్పీచ్ జరుగుతుంటే ప్రసంగ పుస్తకం విసిరేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చర్య తీసుకోవడానికి ప్రత్యేకంగా ఎథిక్స్ కమిటీని సృష్టించారు. ఇలా ప్రతిపక్షంపై పలు ఆంక్షలు పెట్టిన తెలుగుదేశం పార్టీ తాను విపక్షంలోకి రాగానే మొత్తం రివర్స్ అయింది. ప్రతి నిత్యం ఏదో ఒక వివాదం పెట్టుకుని సభలో రచ్చ చేయడానికి యత్నించేది. కొన్నిసార్లు గొడవలు చేస్తూ సభలోనే ఉండిపోవడానికి యత్నించేది. ఒకసారి అయితే శాసనసభ కారిడార్లోనే చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలంతా రాత్రి అంతా ఉండడానికి ప్లాన్ చేస్తే పోలీసులు వచ్చి వారిని టీడీపీ ఆఫీస్‌కు తరలించారు. గత ప్రభుత్వ హయాంలో కోడెల శివప్రసాద్ స్పీకర్‌గా ఉన్నారు. ఆయన మాట ఎవరైనా విపక్ష సభ్యుడు వినకపోతే ఆగ్రహం వ్యక్తం చేసేవారు. దానిని ఈనాడు పత్రిక పెద్ద అక్షరాలతో అచ్చేసేది. అదేదో వైఎస్సార్సీపీ చేయకూడనిది చేసినట్లు ప్రచారం చేసేది. చిత్రం ఏమిటంటే ప్రస్తుత సభలో తెలుగుదేశం పార్టీ నానా అరాచకాలకు పాల్పడుతున్నా, దానిని సమర్ధించే రీతిలో ఈనాడు రామోజీరావు కథనాలు ఇస్తున్నారు. టీడీపీ చేసిన అల్లరిని తప్పు అని రాయయకుండా, దద్దరిల్లిన సభ అని ఈనాడు హెడింగ్ పెట్టి ప్రజలను మోసం చేసే యత్నం చేసింది. అది శాసనసభ సమావేశాలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడమే అవుతుంది. నిజమే.. శాసనసభలో తమ వాదనలు వినిపించడం ద్వారా రాజకీయంగా ప్రజల ఆదరణ పొందడానికి కృషి చేయవచ్చు. అంతవరకుతప్పు లేదు. కానీ, అల్లర్లు చేయడం ద్వారానే ప్రజలను ఆకర్షించవచ్చనే పాత ఆలోచనలతోనే టీడీపీ రాజకీయం చేసింది. గత టర్మ్‌లో 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసి టీడీపీలో చేర్చుకున్నారు. వారిలో నలుగురిని మంత్రులుగా చేశారు. ఇందుకు నిరసనగా జగన్ మొత్తం సభనే బహిష్కరించారు. తనతో పాటు మిగిలిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలందరిని బయటకు తీసుకువెళ్లారు. అప్పుడు ఇదే టీడీపీ.. వైఎస్సార్సీపీని తప్పుపడుతూ విమర్శలు చేసేది. ప్రజాధనం జీతాలుగా తీసుకుంటూ సభకు రారా అని ప్రశ్నించేది. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చే జీతం ,సదుపాయాలు పొందుతూ సభకు రాలేదు. పోనీ తనకు ఇష్టం లేకపోతే పదవికి రాజీనామా చేయవచ్చు. కానీ అన్నిటిలోను డబుల్ గేమ్ ఆడడం చంద్రబాబుకు అలవాటే. 1989-94 మధ్య కూడా టీడీపీ ప్రతిపక్షంలో ఉండేది. తనను అన్యాయంగా సస్పెండ్ చేశారని అప్పటి ప్రతిపక్ష నేత ఎన్టీ రామారావు రెండేళ్లపాటు సభకు రాలేదు. ఆ సమయంలో చంద్రబాబు సభలో నానా రచ్చ చేస్తుండేవారు. పలుమార్లు ఆనాటి మంత్రి రోశయ్య సభలో చంద్రబాబును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండేవారు. కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై పెద్ద అవినీతి ఆరోపణ చేశారు. తన చాంబర్లో ఉండి అది విన్న కోట్ల వెంటనే సభలోకి వచ్చి చంద్రబాబుపై మండిపడ్డారు. ఇంకో ఉదాహరణ కూడా చెప్పాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టులో టెండర్లో అధిక రేటు వేశారంటూ ఈనాడు ఒక కథనం రాసింది. దాని ఆధారంగా టీడీపీ, ఇతర విపక్షాలు కలిసి చర్చను కోరాయి. అందుకు వైఎస్ ప్రభుత్వం అంగీకరించింది. అయితే సంబంధిత నోటీసులో ఒక అంకెను మార్చి రాసినట్లు అధికారపక్షం గుర్తించింది. దానిని అప్పటి ఛీఫ్ విప్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావించితే, చంద్రబాబు తాను కావాలనే అలా మార్చానని చెప్పారు. దాంతో అధికారపక్షం చంద్రబాబుపై విరుచుకుపడింది. అప్పుడు ఆయన పూర్తి ఆత్మరక్షణలో పడ్డారు. ఈ ఉదాహరణలన్నిటిని ఎందుకు ప్రస్తావించవలసి వస్తుందంటే టీడీపీపై చంద్రబాబు నీడ పడినప్పటి నుంచి, ముఖ్యంగా చంద్రబాబు చేతికి టీడీపీ పగ్గాలు వచ్చినప్పటి నుంచి ద్వంద్వ ప్రమాణాలు పాటించడం ఆనవాయితీ అయింది. ఇప్పుడు కూడా అదే మోస్తరుగా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తుంటే, దానిని ఖండించవలసిన రామోజీరావు వంటివారు నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు. -
Yellow Media: ఈ పత్రికలు చదవడానికా? సైకిల్ తుడవడానికా?
కోరల నిండా విషం నింపుకున్న పాములకన్నా.. వాళ్ళిద్దరూ ఇంకా ప్రమాదకరం.. వాళ్ళు చిమ్మే ఎల్లో పాయిజన్ పాము విషం కంటే అత్యంత ప్రమాదకరం. తప్పుడు కథనాలు, అసత్య ప్రచారాలతో ఎల్లో మీడియా జగన్‌పై, జగన్ సర్కార్‌పై విషం చిమ్ముతోంది.. మొదట్లో ఒకటి రెండు డోస్ మాత్రమే పాయిజన్ కనిపించేది. ఇప్పుడు లీటర్ల కొద్దీ విషం కక్కుతున్నారు. ప్రతిరోజూ తప్పుడు వార్తలు, అసత్య కథనాలతో తమ పత్రికల్ని నింపేస్తున్నారు. వాటిని పత్రికలు అనడం కటంటే.. విష పుత్రికలు అనడమే కరెక్ట్.. క్రమంగా విషపు రాతల డోస్ పెంచుతూ వచ్చారు. ఎంతలా అంటే మన ఊహలకు అందనంతలా ఇప్పుడు డోస్ పెంచారు. ఒక్కో పత్రిక రోజుకు 50కి పైగా విషపు వార్తలు రాస్తోంది. అంటే ఆ రెండు ఎల్లో పత్రికలు రోజుకు వందకు పైగా విషపు రాతలు రాసి జనాలపైకి వదులుతున్నాయి. సీఎం జగన్ ప్రభుత్వంపై పూర్తిగా బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఇంతకీ ఎందుకు ఇంతలా విషం చిమ్ముతున్నారు? పనికట్టుకుని మరీ ఎందుకిలా రోత పుట్టించే రాతలు రాస్తున్నారు ? ఈ పత్రికలు చదవడానికా ? సైకిల్ తుడవడానికా ? జర్నలిజం అనే సీసా ఒక ఇజంతో ఒక నిజంతో నిండి ఉంటుంది. అందులో ఉన్న ఆ ఇజాన్ని నిజాన్ని పక్కన పడేసి పూర్తిగా అందులో విషాన్ని నింపి... రాజకీయాల్లో దాన్ని శత్రువులపై అస్త్రంగా వాడుకోవచ్చని మూడు దశాబ్దాల క్రితమే గుర్తించిన దొంగ విజన్ వున్నోడు నారా రూప చంద్రబాబు నాయుడు. మీడియా ఏం చెప్పినా జనం నమ్ముతారు.. మీడియా ఏం చెప్పినా జనం వింటారని అప్పట్లోనే గుర్తించి మెల్లగా కొన్ని పత్రికలను తన విష పుత్రికలుగా మార్చుకుని స్లో పాయిజన్ మాదిరిగా తప్పుడు వార్తలు జనంలోకి తీసుకెళ్లిన ఘనత పచ్చ బాబుకే దక్కుతుంది. జర్నలిజం విలువలు పూర్తిగా దిగజార్చిన ఖ్యాతి కూడా ఆయనదే..! అతను విసిరే బిస్కెట్ల కోసం ఆశపడే శునక జాతి.. జర్నలిజాన్ని అమ్ముడుపోయే వస్తువుగా మార్చేసింది. జాతి జనుల కంటే..తమ జాతి గాడి ప్రయోజనాల కోసం మీడియా విలువల్ని కిలో మీటర్ లోతులో గొయ్యి తీసి పాతి పెట్టిన క్రెడిట్ మాత్రం మన ఎల్లో తాతగారికి, అందరి కుర్చీ కింద కూర్చుని, బాత్ రూముల్లో దాక్కుని రహస్య వార్తలు సేకరించే కృష్ణయ్యగారికే దక్కుతుంది. అసలు ఎందుకీ విషపు రాతలు? వీళ్లు చేస్తున్నది జర్నలిజమా ? చంద్రబాబుకు ఊడిగమా ? ఇవి పత్రికలా.. పత్రికలకు పట్టిన పీడా ? ఈ పత్రికలు చదవడానికా ? సైకిల్ తుడవడానికా ? అడ్డగోలు రాతలు రాసి అడ్డంగా బుక్కై పోయామా.. అయినా డోంట్ కేర్. పట్టపగలు నట్ట నడివీధిలో నగ్నంగా పట్టుబడ్డామా.. అయినా డోంట్ కేర్. పచ్చి అబద్ధాలు చెప్పి పక్కా ఆధారాలతో పచ్చిగా దొరికిపోయామా...అయినా డోంట్ కేర్. అందరి ముందు ముసుగు తొలగిపోయి నిజస్వరూపం బయట పడిపోయిందా...అయినా డోంట్ కేర్. ప్రతిరోజూ వందకు పైగా తప్పుడు వార్తలు రాసేద్దాం.. ప్రజల మధ్యకు వదిలేద్దాం..! జగన్ చేస్తున్న సంక్షేమాన్ని, అబివృద్దిని పచ్చ పత్రికలతో కప్పేద్దాం ...ఇలానే ఉంది ఈ విష పత్రికల తీరు. ఒక్క మాటలో చెప్పాలంటే బాబుగారి కూలి పత్రికలు.. ప్రభుత్వంపై బురద జల్లేందుకు పోటీ పడతాయి.. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడంలో ముందుంటాయి.. మంత్రులు, వైఎస్ఆర్ సీపీ నేతలపై విమర్శలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తాయి.. ప్రభుత్వం చేసే మంచి పనులపై తప్పుడు రాతలు రాయడంలో మేమే ఫస్ట్ అంటాయి. పేదలపై విషం చిమ్మేందుకు ప్రయత్నిస్తాయి. మంచి చేసే వ్యవస్థలను నోటికొచ్చిన ఆరోపణలు చేయడంలో పోటీ పడతాయి. వీటి పనేంటో తెలుసా.. ప్రజలకు నిజాలు చెప్పడం కాదు. అందంగా అబద్ధాలను వండి వార్చడం. ప్రభుత్వంపై లేని వ్యతిరేకతను సృష్టించడం. తప్పుడు వార్తలు ప్రచారం చేయడం. బాబుగారి కూలి పత్రికలు అదే పనిగా అబద్ధాలను అచ్చేసి వదిలేస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.. అవేంటో ఒక్కసారి చూద్దాం... 1. ప్రభుత్వంపై ఎందుకిలా విషం చిమ్ముతున్నారు? 2. ప్రతిరోజూ వందకు పైగా తప్పుడు కథనాలు ఎందుకు వండి వారుస్తున్నారు ? 3. ఈ పత్రికలు చదవడానికా ? సైకిల్ తుడవడానికా ? 4. వీళ్లు చేస్తున్నది జర్నలిజమా ? చంద్రబాబుకు ఊడిగమా ? పదే పదే బాబుగారి విషపు పత్రికలు అబద్ధాలను అచ్చేస్తున్న వేళ వినిపిస్తున్న ప్రశ్నలివే! ఎల్లో తాతగారి పత్రిక, కుర్చీ కింద కృష్ణయ్య గారి పత్రిక ఒక్కసారి ఓపెన్ చేసి తీక్షణంగా చూడండి. మొదటి పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు ఓసారి ప్రభుత్వ వ్యతిరేక వార్తలు లెక్క పెట్టి చూడండి. ఒక్కో పత్రికలు సుమారుగా 50కి పైగా వార్తలు మీకు కనిపిస్తాయి. అంటే ఈ రెండు పత్రికల్లో రోజుకు సుమారుగా వందకు పైగా తప్పుడు కథనాలు వండి వారుస్తున్నారన్న మాట. ఈ లెక్కన ఏడాదికి 365 రోజులు అంటే.. 36 వేల 500 తప్పుడు వార్తలు. అవును ఎవరు నమ్మినా నమ్మకపోయినా.. ఇది నిజంగా నిజం. ఇంకా డౌట్ ఉంటే ఓ వారం రోజులు ఆ దిక్కుమాలిన పేపర్లు దగ్గర పెట్టుకుని.. విషపు వార్తలు ఎన్ని వున్నాయో లెక్క పెట్టి చూడండి... నేను చెప్పిన లెక్క తక్కువ కాదు ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. వీటి పనంతా ప్రభుత్వంపై బురద జల్లడం ప్రభుత్వాన్ని బద్నాం చేయడం. దీనికోసం బాబుగారి నుంచి సెపరేట్ పేమెంట్లు ఉంటాయ్. ఇటు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు, ఇంచార్జీల మార్పులు చేర్పులు చేస్తుంటే దానిపైనా విషం కక్కుతున్నారు. ముందు రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్లు మాకొద్దు బాబోయ్ మాకొద్దు అంటున్నారని ఓ వార్త రాస్తారు. మరుసటి రోజు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కో టికెట్ కోట్లు పలుకుతోందని రాస్తారు. ఆ వార్తకు ఈ వార్తకు అసలు సంబంధమే లేదు. ఏదేమైనా జనాల మెదళ్లలోకి విషాన్ని నింపడమే వీళ్ల టార్గెట్. మరి టీడీపీకి రాజీనామా చేస్తానని ఎంపీ కేశినేని నాని ప్రకటిస్తే మాత్రం ఆ వార్త జోలికి పోరు. వాటిని మెయిన్ పేజీల్లో అచ్చేయరు. అలా చేస్తే బాబుకు డ్యామేజీ కాబట్టి. ఈసారి ఎన్నికల్లో గెలిచే దారి బాబుకు కనిపించడం లేదు. కొడుకుతో పాదయాత్ర చేయించాడు కుదర్లేదు. జైల్లో ఉండగా భార్యతో చెక్కులు పంపిణీ చేశాడు పావుకిలో సింపతీ రాలేదు. పీకేను తెచ్చేకున్నాడు ఉపయోగం లేదు. మరో పీకేతో చర్చలు జరిపాడు.. అయినా నమ్మకం కుదర్లేదు. ఎయిర్ పోర్టులో డీకేను కలిశాడు.. అయినా ఐసీయూలో ఉన్న పార్టీని బతికించే దారి కనిపించ లేదు. కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాడు.. అయినా జగన్ అదరలేదు బెదరలేదు. ఇక చేతిలో ఉన్న అన్నీ అస్త్రాలు వాడేసిన బాబు.. మిగిలిన ఒకే ఒక్క విషపు అస్త్రాన్ని మరింత బలంగా వాడుతున్నాడు. అదే ఎల్లో మీడియా. ఆంధ్రాలో జనరంజక పాలన నడుస్తుంటే.. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతుంటే.. అభివృద్ధి పరుగులు పెడుతుంటూ.. చూసి ఓర్వలేక అబద్ధాలను అచ్చేసి ఆనందిస్తున్నారు చంద్రబాబు, ఆయన కూలి మీడియా. నిజం చెప్పకపోవడం అబద్ధం.. అదే అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం..! ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మీరు చేస్తోంది పచ్చి మోసం. దానికి తగిన మూల్యం త్వరలోనే చెల్లించుకోక తప్పదు. సార్ ఒక్క విషయం చెప్పనా.. 700 సంవత్సరాల క్రితం బద్దెన ఓ పద్యం రాసారు శార్.. తలనుండు విషము ఫణికిని....వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్...తలతోక యనక యుండును.. ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ! పాముకి తలలో, తేలుకు తోకలో విషం వుంటుంది...కానీ శరీరమంత విషం నిండిన వారు ఈ భూలోకంలో ముగ్గురే ముగ్గురు వున్నారు.. కుప్పం, ఎల్లో తాత, బాత్ రూం క్రిష్ణయ్య.. చెప్పాను కదా 700 సంవత్సరాల క్రితమే ఈ ముగ్గురు గురించి... బద్దెన ఊహించారు. అందుకే ఈ పద్యం రాశారు. చదవండి: రామోజీకి గోనె ప్రకాశరావు బహిరంగ లేఖ -
ప్రగతి పథంపై పచ్చ పడగ
గుడ్లగూబ వెలుగును చూడ లేదు. రాక్షస మూకలు మంచిని మెచ్చుకోలేవు. అది వాటి నైజం. నేటి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పక్షాలు... ప్రత్యేకించి దుష్ట చతు ష్టయంతో పాటు ఎల్లో జర్న లిజం కల్పిస్తున్న ఆటంకాలూ, అబద్ధాలూ చూస్తుంటే ఈ సంగతి మరింత స్పష్టమవుతోంది. 2020, 2021 సంవత్సరాలలో కరోనా మహమ్మారి మూలాన ప్రపంచ ఆర్థిక పరిస్థితితో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితీ కుదేలయ్యింది. అంతేగాక చంద్రబాబు దిగిపోతూ ఖజానాను ఖాళీ చేశారు. అయినప్పటికీ జగన్ తన మేధాసంపత్తితో రాష్ట్ర ఆర్థిక నిర్వహణను అతి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ విజనరీని మెచ్చి పారిశ్రామిక వేత్తలు 13 లక్షల కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదుర్చుకొన్నారు. పరిశ్రమలకు లెసైన్సులను ఏకగవా క్షము ద్వారా అప్పటికప్పుడు మంజూరు చేస్తున్నందున పరిశ్రమలు స్థాపించేదానికి ప్రపంచ ప్రఖ్యాత కంపె నీలు ఆంధ్రప్రదేశ్‌కు వరుస కడుతున్నాయి. అవుకు రెండో చానల్‌ను పూర్తి చేసి త్రాగునీరు, సాగునీటి ప్రాజె క్టును గత నవంబర్‌లో ప్రారంభించారు. పోలవరం పూర్తి చేసేదానికి పనులు చకచకా సాగుతున్నాయి. 4 అతి పెద్ద పోర్టుల నిర్మాణాలు పూర్తి అవుతు న్నాయి. 10 షిప్పింగ్ హార్బర్లు, 17 కొత్త మెడికల్ కాలేజీలు, ప్రాణాంతక వ్యాధులైన కాన్సర్, కిడ్నీ వ్యాధులకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, చిన్న పిల్లల ఆసు పత్రులు నిర్మిస్తున్నారు. 10 వేలకు పైగా ‘విలేజ్ క్లినిక్’లు, 10 వేల మెగా వాట్లతో కర్నూలులో గ్రీన్కో ప్రాజెక్టు, వెయ్యి మెగా వాట్ల హైడ్రోపవర్ ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టు, కాకి నాడలో ఫార్మాసెజ్. జగన్ చేతుల మీదుగా ఉత్పత్తి ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 10,788 ఆర్బీకేలను నిర్మించారు. ఒక్కొక్క ఆర్బీకేకు సుమారు 21 లక్షల రూపాయలతో నిర్మాణాలు జరిగాయి. దీనితో రైతులు విత్తనం నుంచి విక్రయం వరకు ఈ ఆర్బీకేల ద్వారా చేసుకుంటు న్నారు. దీనివల్ల 70 లక్షల మంది రైతులకు లాభ సాటిగా ఉంది. జగన్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమా లలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో గణనీయ మైన అభివృద్ధి చెందుతూ ఉన్నదనీ, దానికి తార్కాణం భారీగా పెరిగిన 16 లక్షల ఉద్యోగాలనీ కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖ మంత్రివర్యులు గత డిసెంబర్ మాసంలో రాజ్యసభలో తెలిపారు. కొత్త ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ క్రింద జమ అయిన ఫండు ఈ ఉద్యోగాల నియామకం నిజమేననడానికి నిదర్శన మన్నారు. అలాగే 32 లక్షల ఇళ్ళు మహిళల పేరుననే రిజిష్టర్ చేసి వారి సాధాకారతకు కృషి జరుగుతోంది. జగన్ ముఖ్యమంత్రియైన తర్వాత 2.14 లక్షల శాశ్వత ఉద్యోగాలు, 6.32 లక్షల కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను ఇచ్చారు. ఇదంతా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల స్థాపనతో వీలయ్యింది. వైద్యరంగంలో దాదాపు 6000 వేల డాక్టర్లు, నర్సులను పారదర్శకంగా నియమించారు. మిగిలిన శాఖల్లోనూ ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. ఈ అన్ని చర్యల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. సకల జనుల ఆర్థికాభివృద్ధి పెరిగింది. గత మూడేళ్ళలో ఆంధ్రప్రదేశ్ ప్రజల డిపాజిట్లు వివిధ బ్యాంకుల్లో రూ 87,877 కోట్లు పెరిగాయి. 2021 మార్చి 31 నాటికే డిపాజిట్లు 3,85,929 కోట్ల రూపా యలు కాగా, 2023 జూన్ 30వ తేదీ నాటికి బ్యాంకు డిపాజిట్లు 4,73,806 కోట్ల రూపాయలకు పెరిగాయని రిజర్వుబ్యాంక్ పేర్కొంది. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో గత మూడేళ్ళుగా మన జగనన్న ప్రభుత్వం ప్రథమ ర్యాంకులో ఉంది. 2019లో చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌ది తలసరి ఆదాయంలో 17వ ర్యాంకు కాగా, 2021–22లో అది 9వ ర్యాంకుకు చేరింది. 2019లో వ్యవసాయరంగంలో 27వ ర్యాంకులో ఉన్న ఏపీ, ఇప్పుడు 6వ ర్యాంకును సొంతం చేసుకొంది. 2019లో పారిశ్రామికాభివృద్ధిలో 22వ ర్యాంకులో ఉన్న రాష్ట్రం, ఇప్పుడు 3వ ర్యాంకుకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో 1 కోటి 63 లక్షల కుటుంబాల వారు ఉన్నారు. వారిలో దాదాపు 85 శాతం కుటుంబాలకు 2.50 లక్షల కోట్ల రూపాయలు నేరుగా నగదు చెల్లింపులు జరుగుతున్నాయి. ‘అమ్మఒడి’, ‘విద్యా దీవెన’ ద్వారా బ్రతుకుదెరువునూ, నైపుణ్యాలనూ మెరుగు పరచుకొంటున్నారు. ‘వైఎస్సార్ ఆసరా’, ‘చేయూత’ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలు సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలను ప్రారంభించారు. వారు తయారు చేస్తున్న ఉత్పత్తులకు హిందూస్థాన్ లీవర్స్, రిలయన్స్, మహీంద్ర వంటి పెద్ద కంపెనీలు మార్కెటింగ్ చేస్తు న్నాయి. వీటన్నింటినీ పరిశీలిస్తే జగన్ ప్రభుత్వం అభివృద్ధి పథంలో చంద్రబాబు కంటే ఎన్నోరెట్లు ముందుకు దూసుకుపోతోంది. అయినా పచ్చ మీడియా, పచ్చపార్టీ వక్రభాష్యాలు, అబద్ధపు కథనాలు చెప్తూ ప్రజలను వంచిస్తున్నాయి. ఈ పచ్చ మీడియా, పచ్చ పార్టీని చూస్తే తెలుగులో ఒక పద్యం గుర్తుకు వస్తుంది. ‘తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు దవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.’ గాజులపల్లి రామచంద్రారెడ్డి వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం సభ్యులు -
సీటు ఇవ్వకున్నా.. జగనన్న వెంటే: మంత్రి రోజా
సాక్షి, తిరుమల: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ రాదని ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలు, యెల్లో మీడియాపై మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తనపై అసత్య ప్రచారం చేస్తూ కొంతమంది శునకానందం పొందుతున్నారని అన్నారామె. ‘‘ప్రభుత్వ కార్యక్రమాలు ఏది జరిగినా ముందు వరుసలో ఉండేది నేనే. నేను సీఎం జగననన్నకు సైనికురాలిని. జగనన్న కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం. సీటు ఇవ్వకపోయినా జగనన్న వెంటే ఉంటా. మిషన్ 2024లో 175/175లో భాగం అవుతా’’ అని అన్నారామె. ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైనా ఆమె స్పందించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారామె. అయితే జగనన్న మాటే తనకు శిరోధార్యని చెప్పారామె. సీఎం వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని దేవుడిని కోరుకున్నట్లు తెలిపారు. ఎల్లో మీడియా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. పవన్, చంద్రబాబు ఎక్కడ పోటీ చేయాలో తెలియక.. రెండేసి చోట్ల సర్వే చేయించుకుంటున్నారని మంత్రి రోజా దుయ్యబట్టారు. -
పేదల సాధికారతపై ఉచిత పత్రిక ఉక్రోషం!
సూర్యుడు తూర్పు దిక్కుననే ఉదయించును. ఇది ఒక నిత్య సత్యం. పేద ప్రజల సాధికారతను పెత్తందార్లు అంగీకరించరు. ఇది కూడా అటువంటిదే. అనుదిన సత్యమే. నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక... ఈ సుభాషితాన్ని ‘ఈనాడు’ పత్రికవాళ్లు అప్పుడెప్పుడో బ్రాండ్ క్యాంపెయిన్‌కు వాడుకున్నట్టు గుర్తు. ఇప్పుడు పైన చెప్పిన రెండో సత్యాన్ని నిలబెట్టడం కోసం ఆ పత్రిక యాజమాన్యం ‘త్యాగాలకు’ కూడా సిద్ధమైంది. ఇంటింటికీ ఉచితంగా పత్రికను పంపిణీ చేసే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌లో ‘ఈనాడు’ శ్రీకారం చుట్టింది. ‘సత్యం నినదించు గాక’ అనే క్యాంపెయిన్‌ను ‘ఈనాడు’ చాలాకాలం కిందటే నిలిపివేసింది. చంద్రబాబు–యెల్లో కూటమి అండ్ సన్స్ ప్రయోజనాలకు అనుగుణంగా నిత్యం అసత్యాలను అచ్చొత్తడమే పనిగా పెట్టుకొన్నందున ఆ క్యాంపెయిన్‌ను కొనసాగించడానికి వాళ్లకే సిగ్గేసింది కాబోలు. ఏదో సినిమాలో మెడలో రుద్రాక్ష మాల ఉన్నంత వరకూ అల్లు అర్జున్ నాన్వయలంట్గా ఉండిపోతాడు. ఫైటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ మాలను తీసి పక్కన పెడతాడు. ఈ తీసుకోవడం, వేసుకోవడం గొడవంతా ఎందుకని ‘ఈనాడు’ వాళ్లు సత్యం నినదించుగాక అనే క్యాంపెయిన్‌ను శాశ్వతంగా నిద్రపుచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయం సమీపిస్తున్నకొద్దీ అసత్య కథనాల వంటకాన్ని ‘ఈనాడు’ భారీగా పెంచేసింది. పేజీకో పొయ్యి చొప్పున వెలిగించి నిత్యాగ్నిహోత్రాన్ని నిర్వహిస్తున్నది. అసత్య కథనాలతో అధికార పక్షం మీద బురద జల్లడానికే అది పరిమితం కాలేదు.మానవ నాగరికత వికాసానికి మోకాలొడ్డే సాహసం చేస్తున్నది. ప్రజాస్వామ్య పరిణతి ప్రస్థానాన్ని వెక్కిరించే విదూషక పాత్రను పోషిస్తున్నది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపాలనే తింగరి చేష్టకు తెగబడుతున్నది. కష్టజీవులు తలపెట్టిన సాధికారత యజ్ఞంపై మారీచ మాయలు ప్రయోగిస్తున్నది. మహిళలూ – పేదవర్గాల సాధికారత అనేది ఈ దేశ రాజ్యాంగం ఇచ్చిన హామీ. ఈ హామీని అమలుపరచడంలో విఫలమైన ప్రభుత్వా ధినేతలందరూ ఈ విషయంలో దోషులే. ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ సమాన హక్కులూ, సమాన అవకాశాలూ కల్పించడం ద్వారానే క్రమంగా సాధికారత సాధ్యమవుతుంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ క్రమం నెమ్మదించింది. ఇన్నాళ్లకు ఇప్పుడొక రాష్ట్ర ప్రభుత్వం దాని వేగాన్ని పెంచే పని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారత రాజ్యాంగం ఆశయాల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలకు, అన్నివర్గాల మహిళలకు ఒక్కొక్కటిగా ఆర్థిక రాజకీయ సాంఘిక హోదాలను కట్టబెడుతూ వెళుతున్నారు. ఈ అవకాశాలను ఉపయోగించుకొని సాధికారత పథంలో పరుగు తీయాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో సామాజిక సాధికార యాత్ర పేరుతో ఒక జన జాగృత కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు భుజాన వేసుకున్న మాట నిజమే. ఆ పార్టీ ప్రభుత్వమే, ఆ పార్టీ అధినేతే స్వయంగా పేదవర్గాల సాధికారతను ఒక పవిత్ర లక్ష్యంగా పరిగణిస్తున్నప్పుడు అదే పార్టీ ఈ కార్యక్రమానికి ముందు నడవడం అసహజమేమీ కాదు. వెనుకబడిన వర్గాలను వెన్నెముక వర్గంగా మలిచే కార్యక్రమం వల్ల పాలక పార్టీ పలుకుబడి మరింత పెరుగుతుందనడం కూడా వాస్తవమే. ఈ ఒక్క కారణం చాలదా యెల్లో మీడియా కళ్లు మంటెక్కడానికి! దానికి తోడు శ్రామిక వర్గాల సాధికారతను సిద్ధాంతపరంగానే చంద్రబాబు కూటమి వ్యతిరే కిస్తున్నది. కబుర్లు ఏవైనా చెప్పవచ్చు. ఆచరణ ఏమిటన్నదే కీలకం.వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన సాధికారతకు బాటలు వేసే ప్రతి కార్యక్రమాన్ని చంద్రబాబు పార్టీ – యెల్లో మీడియా తీవ్రంగా వ్యతిరేకించాయి. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం విద్యాబోధనను వ్యతిరేకించాయి. ఇప్పటికీ అభాసుపాలు చేయ డానికి, విఫలం చేయడానికి ప్రయ త్నిస్తున్నాయి. మహిళల పేరు మీద సొంత ఇల్లు కట్టించే కార్య క్రమాన్ని వ్యతిరేకించాయి. కోర్టు మెట్లెక్కాయి. అమరావతి శాసన రాజధాని పరిధిలో బలహీనవర్గాల ప్రజలకు ఇళ్ల పట్టా లిస్తే ఘోరమైన, క్రూరమైన అప చారం జరిగినట్టు గావుకేకలు పెట్టాయి. బాబు గార్లు ఉండాల్సిన చోట బడుగులు నివసించడమేమిటని వాదించాయి. కుల భ్రష్టమైపోతారట, మైలపడిపోతారట! ఇదే విషయాన్ని పాలిష్ చేసి చెప్పారు. జనాభా సమ తుల్యత దెబ్బతింటుందని! కోర్టులో కూడా ఇదే వాదన చేశాయి. పేదింటి ఆడబిడ్డల చదువు మధ్యలో ఆగిపోకుండా, బాల్య వివా హాల రుగ్మతను రూపుమాపే విధంగా పెళ్లి కానుకల కార్యక్రమాన్ని డిజైన్ చేస్తే కూడా ఈ కూటమి మండిపడింది. కారణం ఆడపిల్లల మీద అభిమానం కాదు. వారి అభివృద్ధి మీద ద్వేషం. అమ్మ ఒడి, చేయూత, ఆసరా వంటి కార్యక్రమాలను ఎద్దేవా చేశారు. ఇలాగైతే ఈ రాష్ట్రం దివాళా తీస్తుందని శాపనార్థాలు పెట్టారు. ఖర్చు చేయడానికి ప్రజల చేతిలో డబ్బులుంచాలని అభిజిత్ బెనర్జీ వంటి ఆర్థిక వేత్తలు చెప్పినా మన యెల్లో కూటమికి తలకెక్కలేదు. జనం సొమ్ముతో సొంత వ్యాపారాలు చేసుకునే మన ‘చీ’ట్ ఫండ్ ముఠాకు అభిజిత్ ముఖర్జీలు, అమర్త్యసేన్లతో ఏం పని? చివరకు ఆర్థిక వేత్తలు చెప్పిందే నిజమైంది. జీఎస్డీపీ గ్రోత్ రేట్లో ఏపీ అగ్రగామిగా నిలబడింది. ఆర్థిక వ్యవస్థ పటిష్ఠమవడంతో పాటు లక్షలాది పేద కుటుంబాల ఆత్మగౌరవం పెరిగింది. ఆత్మ విశ్వాసం ఇనుమడించింది. పేద వర్గాల ప్రజలు సాధికారతను సంతరించుకోవడానికి ఉపయోగపడే ప్రతి కార్యక్రమం మీదా చంద్రబాబు – యెల్లో ముఠా దాడులు చేస్తూనే వస్తున్నది. సాధికారత కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా మలిచి ప్రజలను చైతన్యం చేయడానికి సిద్ధమవగానే ‘ఈనాడు’ పత్రిక అన్ని విలువల్నీ వదిలేసింది. దిగంబరంగా నిలబడింది. చివరకు ఉచిత పత్రిక అవతారమెత్తింది. ‘సాక్షి’ చదివే పాఠకులందరికీ ఫ్రీగా పత్రికను పంచడం మొదలుపెట్టింది. ఇదితొలి దశ. క్రమంగా పాఠకులందరికీ పంచడానికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే ‘ఈనాడు’ పాఠకులుగా వున్నవారు వచ్చేనెల బిల్లు కట్టే పరిస్థితి లేదు. పక్కింట్లో ఫ్రీగా వేస్తున్నప్పుడు తాను మాత్రం ఎందుకు బిల్లు కట్టాలి. చివరికి ఫ్రీగా పేపర్ వేయించుకోవడానికి కూడా నెలకు రెండు ప్రియా పచ్చడి సీసాలు గిఫ్టుగా ఇవ్వాల్సిన దుఃస్థితిలోకి మన ఉచిత పత్రిక కూరుకొనిపోవచ్చు. స్వర్ణోత్సవ సంవత్సరంలోకి అడుగిడిన వేళ ఈ విషాదం దాని స్వయంకృతం. సామాజిక సాధికారత యాత్ర మొదలవగానే ఫ్రీ పేపర్ కార్యక్రమాన్ని ఈ పత్రిక ప్రారంభించింది. ఈ కార్యక్రమం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందనేది ఒక కారణం కావచ్చు. అసలు కారణం పేదల, మహిళల సాధికారతకు యెల్లో కూటమి వ్యతి రేకమన్న విషయం గతంలో అనేక మార్లు రుజువైంది. బీసీలు జడ్జీలుగా పనికిరారని కేంద్ర న్యాయశాఖకు లేఖ రాసిన వారెవరు? చంద్రబాబు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఈసడించుకున్న వారెవరు? చంద్రబాబు. దళితులు... మీకెందుకురా అధికారాలు, రాజకీయాలు... అవన్నీ మేం చూసుకుంటామని బోధించిన వారెవరు? బాబు శిష్యపరమాణువు చింతమనేని ప్రభాకర్. కోడలు మగపిల్లాడిని కంటా నంటే అత్త వద్దంటుందా అని మీడియా సమావేశంలోనే ప్రవ చించిన వారెవరు? చంద్ర బాబు. మహిళా అధికారి పట్ల వందలాదిమంది సాక్షిగా దుశ్శాసనుడిలా ప్రవర్తించింది ఎవరు? చంద్రబాబు శిష్య పరమాణువు చింతమనేని ప్రభాకర్. బీసీల తోకలు కత్తిరి స్తానని బెదిరించిందెవరు?చంద్రబాబునాయుడు. ఎస్సీ పిల్లలు శుభ్రంగా ఉండరు, స్నానాలు చెయ్యరని తిట్టి పోసిందెవరు? చంద్రబాబు కొనుగోలు చేసిన ఆదినారా యణరెడ్డి. ముస్లిం మైనారిటీ లకూ, గిరిజనులకూ మంత్రి పదవి లేకుండా చేసిందెవరు? చంద్రబాబు నాయుడు. రాజ్యాంగబద్ధమైన గిరిజన సలహా మండలి ఏర్పాటును అటకెక్కించిందెవరు? చంద్రబాబు నాయుడు. ఈ రకమైన దుర్నీతిని ప్రశ్నించకుండా, ప్రస్తావించకుండా, ఎండ గట్ట కుండా ఆమోదముద్ర వేసిన ప్రముఖ పత్రికారాజము ఏది? మన ఉచిత పత్రిక, దాని తోకపత్రిక. ఇటువంటి ముఠా ప్రజా సాధికారతను ఏ రకంగా సహిస్తుంది? రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో రోజూ వేలాదిమంది బహు జనులు సాధికారత కోసం నినదిస్తూ ప్రదర్శనలు చేస్తున్నారు. సభల్లో సగటున ఇరవై నుంచి పాతికవేల మంది చొప్పున మూడు ప్రాంతాల్లో ప్రజలు పాల్గొంటున్నారు. ఉష్ట్ర పక్షికి భయం వేసినప్పుడు దాని తలను ఇసుకలో దాచేస్తుందట! అప్పుడేమీ కనపడదు. భయం తగ్గిన తర్వాత మళ్లీ బయటకు తీస్తుంది. ఉచిత పత్రికకు కూడా అటువంటి భయమేదో ఉన్నట్టుంది. బాటలు నడిచీ, పేటలు కడచీ, కోటల న్నిటినీ దాటుకుంటూ వచ్చే శ్రామిక జనాన్ని చూస్తే భయం. అందుకే సభ ప్రారంభం కాకముందూ, ముగిసిన తర్వాత ఫోటోలు తీసి అచ్చేసుకొని సంబర పడుతున్నది. ఉష్ట్రపక్షి మాదిరిగా ఉచిత పత్రిక దాని తలను ఎక్కడో దాచుకుంటే నిజం దాగుతుందా? ఎన్నో టీవీ చానెళ్లు, పత్రికలు అసలు విషయాన్ని చూపెడుతున్నాయి కదా! అయినా సరే – నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
Nov 10th : చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions.. 09:09 PM, Nov 10, 2023 కుంభకోణాల్లో పీహెచ్డీ.. లూటీ రత్న ►అవినీతి పుట్టకతో అబ్బిన విద్య ►ఓనమాల దశలోనే కుట్రలు, కుతంత్రాలు నేర్చారు ►ఎమ్మెల్యే కాకముందే ఎన్నో వేషాలు ►కుంభకోణాల్లో పీహెచ్డీ పూర్తి చేసిన కుట్రదారు ►టూటీ రత్న.. నారా చంద్రబాబు నాయుడు 08:50 PM, Nov 10, 2023 తెలంగాణలో ముసుగు తొలగించిన టీడీపీ ►కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారంలోకి దిగిన టీడీపీ ►చంద్రబాబు ప్రియ శిష్యుడు రేవంత్‌రెడ్డి కోసం రంగంలోకి టీడీపీ నేతలు ►నామినేషన్ల పర్వం ముగియగానే.. కాంగ్రెస్ ప్రచారానికి బహిరంగ మద్దతు ఇచ్చిన టీడీపీ ► కోదాడలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న టీడీపీ శ్రేణులు ►కాంగ్రెస్ ర్యాలీలో కాంగ్రెస్ జెండాలతో కలగలిసిన టీడీపీ జెండాలు 4:51 PM, Nov 10, 2023 ఫైబర్‌నెట్ కేసులో ఏసీబీ కోర్టు విచారణ వాయిదా ►ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై సీఐడీ పీటీ వారెంట్ ►సీఐడీ పీటీ వారెంట్ పై ఏసీబీ కోర్టులో విచారణ ►ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయొద్దని ఇప్పటికే చెప్పిన సుప్రీం కోర్టు ►ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సీఐడీ తరపు లాయర్లు ►విచారణ వచ్చే నెల 1 కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 4:22 PM, Nov 10, 2023 2019 ఎన్నికల్లో కుప్పకూలిన టిడిపి కంచుకోటలు ► అనేక దశాబ్దాలుగా గెలుస్తూ కంచుకోటలుగా భావించిన నియోజకవర్గాల్లో ఘోరంగా ఓడిన తెలుగు దేశం ► కేవలం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కేబినెట్లోని ముగ్గురు మంత్రులు మినహా మిగతావారంతా పరాజయం ► పార్టీ ఆవిర్భావం తర్వాత గత 36 ఏళ్లలో జరిగిన 8 ఎన్నికల్లో టీడీపీ ఏడు నుంచి ఆరుసార్లు గెలుపు ► ఇప్పటివరకు టీడీపీ ఏడుసార్లు గెలిచిన నియోజకవర్గాలు 16, ఆరుసార్లు గెలిచినవి 29 చోట్ల ఓటమి ► శ్రీకాకుళం జిల్లా పలాసలో (గతంలో సోంపేట) 2009లో తప్ప అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ విజయం, 2019లో గౌతు శిరీష ఓటమి ► 2004లో తప్ప అన్నిసార్లూ గెలుస్తూ వచ్చిన విజయనగరంలో సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు కుమార్తె అదితి గజపతి రాజు ఓటమి ► పాయకరావుపేటలో టీడీపీ 8 ఎన్నికల్లో ఒకేసారి ఓడింది. ఇప్పుడు వైఎస్సార్సీపీ నెగ్గింది. ► ఏడుసార్లు గెలిచిన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో వంగలపూడి అనిత ఓటమి ► ఏడుసార్లు గెలిచిన కృష్ణా జిల్లా నందిగామలో సైకిల్ గల్లంతు ► 1989లో తప్ప అన్ని ఎన్నికల్లోనూ గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ విజయం సాధించగా... 2019లో ఓటమి ► అనంతపురం జిల్లా పెనుగొండ, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, కర్నూలు జిల్లా పత్తికొండలో ఇలాంటి దీన పరిస్థితి సైకిల్‌కు 4:05 PM, Nov 10, 2023 మేం కలిసి పోటీ చేసి ఉంటే.. 2019లో మరోలా ఉండేది : టిడిపి, జనసేన సమన్వయం ► 2019లో పవన్‌కళ్యాణ్ ఎందుకు ఒంటరిగా పోటీ చేశాడో చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు ► చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నది పవన్ ఎజెండా ► అయినా పారని ఎత్తుగడ, ఛీ కొట్టి ఇంటికి పరిమితం చేసిన ఓటర్లు ► ఒకసారి కింద ఇచ్చిన ఎన్నికల సంఘం నివేదికను జాగ్రత్తగా పరిశీలించండి పార్టీ పోటీ చేసిన సీట్లు గెలిచిన సీట్లు వచ్చిన ఓట్లు ఓట్ల శాతం పోటీచేసిన చోట ఓట్ల శాతం YSRCP 175 151 1,56,88,569 49.95% 49.95% TDP 175 23 1,23,04,668 39.17% 39.17% జనసేన 137 1 17,36,811 5.53% 7.04% BJP 173 0 2,64,437 0.84% 0.85% ► అసలు జనసేన కేవలం 137 సీట్లకే ఎందుకు పరిమితమయింది? ► తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం వల్ల మిగతా చోట్ల పోటీ చేయలేదు ► ఎక్కడెక్కడ YSRCP అభ్యర్థి బలంగా ఉన్నాడో.. అక్కడ మాత్రమే జనసేన బరిలోకి దిగింది ► జనసేన ఉద్దేశ్యం ఒకటే.. YSRCP ఓట్లను పరిమితం చేయడం 3:55 PM, Nov 10, 2023 మా కమ్మలు తెలంగాణలో కాంగ్రెస్‌కు ఓటేస్తారు: TDP నేతల ప్రకటనలు అసలు తెలంగాణలో కమ్మల బలమెంత? ► ఇప్పటివరకు తెలంగాణలో మాత్రం కమ్మ వర్గం 1985లో అత్యధికంగా ఎనిమిది మంది గెలుపు ► మిగిలిన ఎన్నికలలో రెండు నుంచి ఏడుగురు వరకు మాత్రమే పరిమితం ► ఉమ్మడి రాష్ట్రంలో 1994లో అత్యధికంగా గెలిచిన కమ్మనాయకులు ► 1994లో ఏకంగా 53 మంది కమ్మ నాయకులు ఎమ్మెల్యేలుగా విజయం ► అత్యల్పంగా 2018లో తెలంగాణలో ఐదుగురు కమ్మలు ► 2018లో సిర్పూరులో కోనేరు కోనప్ప, జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపినాథ్, శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ, మిర్యాలగూడలో భాస్కరరావు, ఖమ్మంలో పువ్వాడ అజయ్‌కుమార్ గెలుపు ► 2019లో ఏపీలో 17 మంది అంటే రెండు రాష్ట్రాలలో కలిపి 22మంది గెలుపు ► 2014లో రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 38 మంది కమ్మల విజయం ► ఉమ్మడి ఏపీలో 2009లో 27 మంది కమ్మలు ఎమ్మెల్యేలుగా గెలుపు ► 2004లో 35 మంది, 1999లో 43, 1994లో 53, 1989లో 36, 1985లో 52, 1983లో 51, 1978లో 41, 1972లో 35, 1967లో 41, 1962లో 39 మంది గెలుపు 3:50 PM, Nov 10, 2023 కిలారు పిటిషన్‌పై విచారణ ►కిలారు రాజేష్ లంచ్‌మోషన్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ ►సీఆర్పీసీ 160,91 నోటీసులు, ఇల్లీగల్ అంటూ రిట్ పిటిషన్ ►సిఐడీ అధికారులు తనను విచారణలో బెదిరించారని పిటిషన్ లో పేర్కొన్న కిలారు రాజేష్ ►స్కిల్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కిలారు రాజేష్ 3:35 PM, Nov 10, 2023 గుంటూరులో సైకిల్ తొక్కేదెవరు? ►గుంటూరు లోక్‌సభ స్థానంలో పోటీకి టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ విముఖత.? ►రాజకీయాలపై అంతగా ఆసక్తి చూపించని గల్లా ►ఇటీవలి కాలంలో గుంటూరు వైపు తిరిగి చూడని గల్లా ►ఢిల్లీ లేదా హైదరాబాద్‌లో ఉంటూ వ్యాపారాలు చూసుకుంటున్న గల్లా 3:22 PM, Nov 10, 2023 ఫైబర్ గ్రిడ్ కేసు 30వ తేదీకి వాయిదా ►విజయవాడ : ఏపీ ఫైబర్ గ్రిడ్ వారెంట్ పై ఏసీబీ కోర్టులో విచారణ ►ఈనెల 30వ తారీకు వరకు ఏపీ ఫైబర్ గ్రిడ్ కేస్ పిటి వారెంట్ పై ఎలాంటి అరెస్టులు చేయవద్దన్న సుప్రీంకోర్టు ►ACB కోర్టు లో మెమో దాఖలు చేసిన సిఐడి తరుపున న్యాయవాదులు ►వచ్చే నెల ఒకటవ తేదీకి విచారణ వాయిదా వేసిన ఏసిబి కోర్టు ►ఏపి ఫైబర్ గ్రిడ్ కేసులో అక్రమాలకు పాల్పడ్డిన కేసులో అస్తులు అటాచ్మెంట్ చేయాలని ఏసిబి కోర్టులో పిటిషన్ పై విచారించిన ఏసిబి కోర్టు ►విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసిన ఏసిబి కోర్టు 3:03 PM, Nov 10, 2023 తమ్ముడి సీన్ అంతేనా? ►తెలంగాణలో 8 సీట్లతో సరిపెట్టుకున్న పవన్‌కళ్యాణ్ ►జనసేన స్థాయికి 8 సీట్లు సరిపోతాయని సూత్రీకరణ ►ఇచ్చిన 8 సీట్లలోనూ 2 సీట్లలో బీజేపీ లీడర్లే పోటీ ►బీజేపీలో ఉంటే టికెట్ సమస్య కాబట్టి.. పార్టీ మారి జనసేన నుంచి పోటీ చేస్తోన్న ఇద్దరు ►తెలంగాణ వ్యవహారాల పట్ల తెలుగుదేశం వెరీ హ్యాపీ ►తెలంగాణలో 8 ఇచ్చారు కాబట్టి.. ఏపీలో 16తో సరిపెట్టాలన్న యోచనలో తెలుగుదేశం నేతలు ►ఆ 16లోనూ ఆరు చోట్ల తమ వాళ్లనే జనసేనలోకి పంపాలన్న ప్లాన్ ►మొత్తమ్మీద పవన్ కళ్యాణ్ పరిస్థితి ఆటలో అరటిపండు అయిందంటున్న రాజకీయ విశ్లేషకులు 2:43 PM, Nov 10, 2023 అబద్దాలతో మోసం చేయడమే తెలుగుదేశం వ్యూహం ►తాడేపల్లిలో మాట్లాడిన మంత్రి సీదిరి అప్పలరాజు ►అబద్దాలను సృష్టించటం, ఎల్లోమీడియాలో ప్రచారం చేయటమే టీడీపీ, జనసేన పని ►రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనే భయం సృష్టించాలని వారి ప్లాన్ ►నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి ►చిత్తూరు డైరీని చంద్రబాబు సర్వనాశనం చేశారు ►మ్యాక్స్ చట్టం తెచ్చి తన మనుషులకు డెయిరీలను కట్టబెట్టారు ►సంగం డెయిరీ, విశాఖ డెయిరీ, కృష్ణా డెయిరీలను అలాగే తన వారి చేతిలో పెట్టారు ►ప్రభుత్వానికి చెందిన సంగం డెయిరీ ధూళిపాళ్ళ నరేంద్రకు ఎలా వెళ్లింది? ►73 ఎకరాల భూములు సంగం డెయిరీకి ఉండేవి ►ఆ భూములపై రూ.150 కోట్ల వరకు అప్పు తెచ్చుకున్నారు ►ధూళిపాళ్ళ నరేంద్ర కబ్జా చేసిన భూములు, డెయిరీలపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి ►ప్రభుత్వ ఆస్థులను కొల్లగొట్టటంలో టీడీపీ వారికి ఉన్నంత స్కిల్ మరెవరికీ లేవు ►ప్రభుత్వ ఆస్తులను దోచుకునే టీడీపీ నేతలు మాపై ఆరోపణలు చేయటం ఏంటి? ►కోఆపరేటివ్ యాక్టులోకి సంగండెయిరీ, హెరిటేజ్ డెయిరీలను మార్చి ప్రభుత్వ సాయం అడగండి ►అమూల్ పేరు వింటేనే టీడీపీ నేతలకు నిద్ర పట్టటం లేదు ►అమూల్ రాకముందు సంగం డెయిరీ వారు 58 రూపాయలు రైతులకు ఇచ్చేవారు ►అమూల్ వచ్చాక రూ.69.35 లు ఇస్తున్నారు ►అమూల్ రాకముందు సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో రైతులకు మద్ధతు ధర పెంచేవారు ►అమూల్ వచ్చాక బలవంతంగా రైతులకు పెంచి ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది ►ఇది తట్టుకోలేకనే అమూల్ పై ఎల్లోమీడియాలో విషం కక్కుతున్నారు ►3.73 లక్షల మంది రైతులు అమూల్ కి పాలు పోస్తున్నారు ►అమూల్ వలన 4,490 కోట్ల అదనపు లబ్ది రైతులకు చేకూరింది ►జనసేన పరిస్థితి విచిత్రంగా ఉంది ►తెలంగాణలోని ఒక పార్టీ నుండి, ఏపీలో మరొక పార్టీ నుండి స్క్రిప్టు వస్తుంది ►నాదెండ్ల మనోహర్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది ►చంద్రబాబు పాలనలో ఆదరణ పథకం కింద ఏ ఒక్క కుటుంబమైనా బాగుపడిందా? ►టీడీపీ, జనసేన ఎప్పుడూ కలిసే ఉన్నాయి ►గత ఎన్నికలలో కూడా ఒప్పందం మేరకే వేర్వేరుగా పోటీలో ఉన్నారు ►అమరావతి ఎవరి రాజధాని? అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే అమరావతి పై ఎందుకు ప్రేమ చూపుతున్నారు ►పార్టీని పవన్ అమ్మేశాడని జనసైనికులు గుర్తించాలి ►ఏపీలో మద్యం బ్రాండ్లను పురంధేశ్వరి టేస్టు చేస్తున్నారేమో తెలీదు ►ఇప్పుడు ఉన్నవన్నీ చంద్రబాబు పర్మిషన్ తో వచ్చినవే ►కాబట్టి పురంధేశ్వరి వెళ్లి చంద్రబాబునే ప్రశ్నించాలి ►ఆమె కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కాస్త గౌరవం ఉండేది ►బీజేపీలోకి వచ్చి, చంద్రబాబుకు వంత పాడటం మొదలెట్టాక తేడా వచ్చింది ►బీజేపీలో ఉన్న క్యాడరే పురంధేశ్వరితో విభేదిస్తున్నారు ►పురంధేశ్వరికి అంత ఇష్టం ఉంటే టీడీపీలో చేరితే మంచిది 2:35 PM, Nov 10, 2023 CBIకి స్కిల్ కేసు అప్పగించాల్సిందే.! ►స్కిల్ కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్ పై విచారణ వాయిదా ►ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ ►నోటీసులు ఇవ్వడంలో జాప్యంపై విచారణ జరపాలని రిజిస్ట్రీకి సూచించిన జడ్జి ►సీబీఐకి కేసు అప్పగింతలో మాకు అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపిన అడ్వొకేట్ జనరల్ ►విచారణను ఈనెల 29కి వాయిదా వేసిన హైకోర్టు 2:05 PM, Nov 10, 2023 స్కిల్ కేసులో కిలారు రాజేష్ పిటిషన్ ►స్కిల్ కేసులో ఏపీ హైకోర్టుకు టీడీపీ నేత కిలారు రాజేష్ కొత్త వాదన ►స్కిల్ కేసులో తనకు CRPC 100 కింద నోటీసులు ఇచ్చి విచారణలో బెదిరించారంటూ కిలారు రాజేష్ పిటిషన్ ►క్వాష్ పిటిషన్ వేసిన రాజేష్ లాయర్ ఆదినారాయణరావు ►లంచ్ మోషన్ పిటిషన్ ను అనుమతించిన ఏపీ హైకోర్టు ►కిలారు రాజేష్ పిటిషన్ పై కాసేపట్లో హైకోర్టులో విచారణ 12:30 PM, Nov 10, 2023 కమలం కోసం ఎదురుచూపులు ►పశ్చిమగోదావరి జిల్లాలో మాట్లాడిన మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య ► టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరే అవకాశం ఉంది: జోగయ్య ►ఈ కూటమికి జనరంజకమైన ఉమ్మడి మేనిఫెస్టో అవసరం ►వైసీపీ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను ప్రకటించాలి : జోగయ్య జోగయ్య వ్యాఖ్యలపై వైఎస్సార్సిపి సీరియస్ ►టిడిపి-జనసేన గెలవలేదని అర్థమయిందా? ►దేశంలో ఉన్న పార్టీలన్నింటిని కలుపుకుంటే తప్ప పరువు మిగలదని అవగతమయిందా? ►మీకు నిజంగా బలమే ఉంటే.. సింగిల్‌గా ఎందుకు పోటీ చేయడం లేదు? ►ఇన్నాళ్లు సంక్షేమ పథకాలు ఇస్తున్నారని కడుపు చించుకున్నారు కదా.! ►ఎన్నికలు రాగానే అమలు చేయలేని పథకాలు ప్రకటించి జనాల్ని మోసం చేయాలనుకుంటున్నారా? 11:50 AM, Nov 10, 2023 ఉండవల్లి పిటిషన్‌పై విచారణ వాయిదా ►స్కిల్ స్కాం కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టులో ఉండవల్లి పిటిషన్ ►ఉండవల్లి పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ►తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసిన కోర్టు 11:00 AM, Nov 10, 2023 అసైన్డ్ భూముల స్కాంలో క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా ►అమరావతి అసైన్డ్ భూముల స్కాంలో బాబు, నారాయణ క్వాష్ పిటిషన్ ►బాబు, నారాయణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ రీ ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో విచారించాలని హైకోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు ►సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా ►ఈనెల 22వ తేదీకి విచారణ వాయిదా వేసిన హైకోర్టు 10:55 AM, Nov 10, 2023 స్కిల్ స్కాంలో బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా ►స్కిల్ స్కాంలో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ►చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 15కి వాయిదా 8:45 AM, Nov 10, 2023 కంటి ఆపరేషన్ కోసం బాబుకు మధ్యంతర బెయిల్: సామాన్యుడు ►చంద్రబాబుకు కంటి ఆపరేషన్ కోసమే కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ►టీడీపీ ఈ విషయాన్ని దాచిపెట్టి.. నిజం గెలిచిందంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ►ఎంతమంది కలిసి పొత్తులతో వచ్చినా 2024లో వచ్చేది జగనన్న ప్రభుత్వమే. చంద్రబాబుకు కంటి ఆపరేషన్ కోసమే కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. టీడీపీ ఈ విషయాన్ని దాచిపెట్టి.. నిజం గెలిచిందంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఎంతమంది కలిసి పొత్తులతో వచ్చినా 2024లో వచ్చేది జగనన్న ప్రభుత్వమే. - సామాన్యుడి మనోగతం#PublicVoice… pic.twitter.com/7awryHjz84 — YSR Congress Party (@YSRCParty) November 10, 2023 8:02 AM, Nov 10, 2023 ►విజయవాడ : నేడు ఫైబర్ నెట్ కేసులో సీఐడీ పిటిషన్ పై విచారణ ►ఏడుగురి ఆస్తుల అటాచ్మెంట్ కోసం సీఐడీ పిటిషన్ 8:00 AM, Nov 10, 2023 నేడు పలు పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ ►నేడు ఏపీ హైకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసుపై విచారణ ►చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ►స్కిల్ కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ ►ఇప్పటికే మధ్యంతర బెయిల్‌పై ఉన్న చంద్రబాబు ►నేడు ఉండవల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ ►స్కిల్ డెవలప్మెంట్ కేసును సీబీఐ విచారించాలని పిటిషన్ ►నేడు సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ ►మాజీ మంత్రి నారాయణపై పెట్టిన అమరావతి అసైన్డ్ ల్యాండ్ కేసును రీ ఓపెన్ చేయాలని పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ 6:40 AM, Nov 10, 2023 చంద్రబాబుకు కొత్త టెన్షన్స్ ►స్కిల్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►52రోజులపాటు జైలు జీవితం.. బయటకు వచ్చాక ఆస్పత్రుల చుట్టూ బాబు ► దిక్కుతోచని స్థితిలో టీడీపీ శ్రేణులు ►పరామర్శయాత్రని పక్కన పారేసిన సతీమణి నారా భువనేశ్వరి ►యువగళాన్ని అటకెక్కించి ఢిల్లీ పరారైన తనయుడు నారా లోకేష్ బాబు ►టెన్షన్లో నారావారు.. గందరగోళంలో పార్టీ క్యాడర్ ►స్కిల్ కేసులో సుప్రీం తీర్పుపైనే ఆశలు పెట్టుకున్న బాబు అండ్ కో 6:30 AM, Nov 10, 2023 అయోమయంలో తెలుగుదేశం ►నవంబర్ 28న సాయంత్రం 5గంటలకు తిరిగి జైలుకు వెళ్లాల్సిన చంద్రబాబు ►ఈలోగా సుప్రీంకోర్టు ఉత్తర్వుల కోసం కోటి ఆశలతో ఎదురుచూపులు ►ప్రస్తుతం అనారోగ్య కారణాలతో తాత్కాలిక బెయిల్ మీద ఉన్న చంద్రబాబు ►17ఏ సెక్షన్‌ను చూపించి కేసు కొట్టేయించుకోవాలన్న వ్యూహంలో బాబు లాయర్లు ►బాబు క్వాష్ పిటిషన్‌పై నవంబర్ 28 తర్వాత ఉత్తర్వులిస్తామన్న సుప్రీంకోర్టు ►అంటే చంద్రబాబు జైలుకు వెళ్లిన ఒకటి, రెండు రోజుల తర్వాత ఉత్తర్వులు వచ్చే అవకాశం ►ఒక వేళ తీర్పు అనుకూలంగా రాకపోతే చంద్రబాబు జైలుకే పరిమితం అయ్యే అవకాశం ►చంద్రబాబు బయట ఉంటేనే మ్యానిఫెస్టో విడుదల చేయాలన్న యోచనలో తెలుగుదేశం ►చంద్రబాబు చుట్టే ముడిపడి ఉన్న టిడిపి వ్యవహారాలు ►నవంబర్ 30 తర్వాతే పాదయాత్రపై నిర్ణయం తీసుకుంటానంటోన్న లోకేష్ ►అప్పటివరకు పాదయాత్ర జోలెత్తవద్దంటున్న చినబాబు ►సమన్వయ కమిటీ సమావేశాలు జరుగుతున్నా.. టిడిపిలో కనిపించని జోష్ తెలుగుదేశం విష ప్రచారమేంటీ? అసలు నిజాలేంటీ? ►తెలుగుదేశం, ఎల్లోమీడియాలో జరుగుతున్న ప్రచారమేంటీ? ►చంద్రబాబు విజనరీ, ఆయనే హైటెక్ సిటీ కట్టాడు ►మళ్లీ చంద్రబాబు నెగ్గితే ఏపీ అభివృద్ధి చేస్తాడు ►ప్రస్తుతమున్న ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదు కింది ఫోటో చూడండి. హైటెక్ సిటీకి శంకుస్థాపన చేస్తోంది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ఆలోచన చంద్రబాబుది కాదు, టిడిపిది కాదు కిందివి చదివిన తర్వాత మరిన్ని విషయాలు నిర్దారించుకోండి ►విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ సీఎం జగన్ వచ్చి పూర్తి చేసాడు. ►వైజాగ్ NAD ఫ్లై ఓవర్ కూడా సీఎం జగన్ వచ్చి పూర్తి చేసాడు. ►బెజవాడ బెంజి సర్కిల్ మొదటి ఫ్లైఓవర్ కూడా సీఎం జగన్ వచ్చి పూర్తి చేసేసాడు. ►రెండో ఫ్లైఓవర్ కూడా సీఎం జగన్ మొదలుపెట్టి, ఏడాదిలో జగనే పూర్తి చేసాడు. ►కృష్ణా నది రిటైనింగ్ వాల్ సీఎం జగనే స్టార్ట్ చేసి పూర్తి చేసాడు. ఇంకొకటి స్టార్ట్ చేసాడు. ►తిరుపతిలోని సేతు ఫ్లైఓవర్ అందంగా సీఎం జగన్ ప్రభుత్వమే పూర్తి చేసింది ►అనంతపురం టవర్ క్లాక్ బ్రిడ్జి సీఎం జగనే మొదలుపెట్టి, పూర్తి చేసాడు. ఇవే కాదు ►భోగాపురం ఎయిర్‌పోర్టుకి అన్ని అనుమతులు సాధించి, సీఎం జగనే మొదలు పెట్టి పనులు చేస్తున్నాడు. ►వెలిగొండ18 కి.మీ. మొదటి టన్నెల్ సీఎం జగనే పూర్తి చేసాడు. రెండో టన్నెల్ కూడా జగనే పూర్తి చేయబోతున్నాడు. ►ఒక రూపు లేని పోలవరాన్ని కూడా సీఎం జగనే ఒక రూపుకు తెచ్చాడు. స్పిల్ వే, అప్పర్, లోయర్ కాఫర్ డ్యాములు సీఎం జగనే పూర్తి చేసాడు. ►అప్రోచ్, స్పిల్ పైలట్ ఛానెళ్ళు కూడా సీఎం జగనే పూర్తి చేసాడు. నిర్వాసితులకు వేల ఇల్లు ఈ ప్రభుత్వమే కట్టించింది ►16 మెడికల్ కాలేజీలు సీఎం జగనే మొదలుపెట్టాడు, 5 పూర్తి చేసాడు. ►4 పోర్టులు,10 ఫిషింగ్ హార్బర్లు సీఎం జగనే మొదలుపెట్టాడు, పనులు పరుగులు పెట్టిస్తున్నాడు. సీఎం జగన్ కాబట్టే చేస్తున్నాడు. ►ఇవే కాక, వేల పాఠశాలలను, విద్యాసంస్థలను సీఎం జగనే మార్చాడు. నాడు నేడు కింద రూపురేఖలు మొత్తం మార్చేశాడు. ►లక్షల ఇళ్లు సీఎం జగనే కట్టిస్తున్నాడు. ►వేల సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు సీఎం జగనే మొదలు పెట్టి, పూర్తి చేస్తున్నాడు. ఇలా చెప్పుకోవడానికి చంద్రబాబుకి తాత్కాలిక కట్టడాలు తప్ప, ఒక్కటి ఏదైనా ఉందా ? మరెలా విజనరీ అయ్యాడు? రాజధాని ప్రాంతంలో మొదలు పెట్టిన ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేకపోయాడు అసలు ఎలా మోస్తున్నారు ? హైదరాబాద్ రింగు రోడ్డు, ఎయిర్‌పోర్టు నుండి ఏదీ మొదలుపెట్టింది లేదు. పూర్తి చేసిందీ లేదు కానీ అన్నీ నేనే చేసానని చెప్పుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ సంపద సృష్టిస్తాడని ప్రచారం చేస్తున్నారు. అందుకే .. జగనే చేసాడు... జగనే చేస్తాడు... ఏదైనా జగనే చేయగలడు... అన్న నమ్మకం ప్రజల్లో ఉంది ►ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేడన్నారు, చేశాడు. ►CPS రద్దు చేయలేడన్నారు, చేశాడు. PRC ఇవ్వలేడన్నారు, ఇచ్చాడు. -
జైల్లో చంద్రబాబు.. ఆంధ్రజ్యోతి టెక్నికల్ మిస్టేక్
Skill Development Scam బోడి గుండుకు మోకాలికి ముడి పెట్టడం అంటే ఎంటో పచ్చమీడియా చూస్తే అర్ధమవుతుంది. స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టు అయి జైలుకు వెళితే.. పచ్చమీడియా దీనిపై మాత్రం మాట్లాడదు. కేసులో చంద్రబాబు పాత్రపై ఎల్లో మీడియా మాట్లాడదు. అయితే విచిత్ర వాదనలతో కేసును బలహీనపరిచేందుకు ఎల్లో మీడియా కుయుక్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ స్కామ్.. జగన్ స్కీమ్ అంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే దీని నిజానిజాలేంటో ఒకసారి చూద్దాం. స్కిల్ స్కాం కేసులో తీవ్రమైన అవినీతి జరిగిందని, ఆధారాలతో సహా బయటపడింది. అయితే ఆ ఆధారాలను తప్పు అని ప్రచారం చేసే బాధ్యతను టీడీపీ అనుకూల మీడియా భుజానికెత్తుకుంది. ఇందులో భాగంగానే కళ్లముందు వాస్తవాలు కనిపిస్తున్నా… అబద్ధాలను అసలు సిసలైన వాస్తవాలుగా ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతోంది. స్కిల్ స్కాం కేసులో తీవ్రమైన అవినీతి జరిగిందని… నిధులు దారి మళ్లించారని ఫొరెన్సిక్ ఆడిటింగ్‌లో తేలింది.ప్రఖ్యాత ఆడిటింగ్ సంస్థ శరత్ అండ్ అసోసియేట్స్ఈ ఫొరెన్సిక్ ఆడిటింగ్ పూర్తి చేసి దాదాపు 70షెల్ కంపెనీల ద్వారా ప్రభుత్వ నిధులు సుమారు 241 కోట్ల రూపాయలు దారి మళ్లాయని నివేదించింది. ఇదే విషయాన్ని సీఐడి తన విచారణ నివేదికలో స్పష్టంగా కోర్టుకు సమర్పించింది. అయితే కోట్ల రూపాయల ప్రజాధనం దారిమళ్లిన విషయంపై నోరు మెదపని పచ్చమీడియా… ఆడిటింగ్ సంస్థపై బురద జల్లుతోంది. శరత్ అండ్ అసోసియేట్స్ అనే సంస్థతో ఏపీ ముఖ్యమంత్రికి సంబంధం ఉందని కథలు అల్లుతోంది. ఈ కథనానికి ఆంధ్రజ్యోతి పత్రిక చెప్పిన కారణాలు చూస్తే.. బుర్ర ఉన్నవాళ్లేవరైన ఇది అబద్ధపు వార్త అని అర్ధం చేసుకుంటారు. శరత్ అండ్ అసోసియేట్స్ వెబ్‌సైట్‌తో పాటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కంపెనీలకు చెందిన ఆడిటర్స్ ఐవీఎస్ అండ్ అసోసియేట్స్ వెబ్ సైట్ ఒకే సర్వర్‌లో ఉందనేది ఆంధ్రజ్యోతి ఆరోపణ. అసలు సర్వర్లు ఎవరు హోస్ట్ చేస్తారు.. వాటికి ఐపీ అడ్రస్‌లు ఎలా కేటాయిస్తారు అనేది తెలిస్తే… ఆంధ్రజ్యోతివి పిచ్చిరాతలని స్పష్టమైపోతుంది. అసలు ఆంధ్రజ్యోతి రాసినట్లు శరత్ అండ్ అసోసియేట్స్, ఐవీఎస్ అసోసియేట్స్ వెబ్‌సైట్స్ ఒకే సర్వర్‌లో ఉన్నాయా అనేది పరిశీలిస్తే ఇది పూర్తి అవాస్తవం. ఆంధ్రజ్యోతి రాసిన వార్తలోనే చాలా స్పష్టంగా రెండు వేరు ఐపి అడ్రస్‌లు కనిపిస్తున్నాయి. ఇందులో శరత్ అండ్ అసోసియేట్స్ ఐపి అడ్రస్-115. 124. 126. 242. 80కాగా ఐవీఎస్ అండ్ అసోసియేట్స్ ఐపి అడ్రస్-115.124.126.216.80 అని ఆంధ్రజ్యోతే రాసింది. మరి రెండు వేరు ఐపి అడ్రస్‌లు ఉంటే ఒకే అడ్రస్‌లో ఉన్నాయని ఆంధ్రజ్యోతి రాయడం హాస్యాస్పదం. ESDSఅనేది కేవలం డొమైన్ ప్రొవైడర్ మాత్రమే చాలా కంపెనీలు డొమైన ఒక కంపెనీ ద్వారా హోస్ట్ ఇంకోచోట రిజిస్టర్ చేసుకుంటారు. ఇక ESDS అనేది కేవలం డొమైన్ ప్రొవైడర్ అయినంత మాత్రానా ఈ కంపెనీల డేటా వీరివద్దే ఉందనడానికి ఆధారాలు లేవు. ఒకసారి ఐపీ అడ్రస్‌లు వాటి వెనక ఉన్న టెక్నికల్ ఇష్యూస్ చూస్తే ఆంద్రజ్యోతి వార్త ఎంత పేలవమైందో అర్ధమైపోతుంది. వెబ్సైట్ హోస్ట్ చేయడం అనేది సాధారణంగా చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. అందుకే కంపెనీలు తమ వెబ్ సైట్ హోస్ట్ చేసేందుకు ఏదో ఒక సర్వీస్ ప్రొవైడర్ సహాయం తీసుకుంటాయి. ఇలాంటి సర్వీస్ ప్రొవైడర్లు ప్రపంచ వ్యాప్తంగా చాలా మందే ఉన్నారు. ఇందులో అమేజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్‌తో పాటు దేశీయ సర్వీస్ ప్రొవైడర్లు కూడా చాలా మందే ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం శరత్ అండ్ అసోసియేట్స్ , ఐవీఎస్ అండ్ అసోసియేట్స్ రెండు కంపెనీల వెబ్సైట్లు ESDS అనే సంస్థ హోస్ట్ చేస్తోంది. కాని ESDS హోస్ట్ చేస్తున్న కంపెనీల లిస్ట్ చూస్తే అసలు విషయం అర్ధం అవుతుంది. ESDS కంపెనీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా కంపెనీల వెబ్సైట్లు హోస్ట్ చేస్తోంది. ఇందులో టాటా క్యాపిటల్, యూనియన్ బ్యాంక్, ముత్తూట్ ఫైనాన్స్ , సిడ్బి, యాక్సిస్ అస్సెట్ మేనేజ్మెంట్లాంటి కార్పోరేట్ సంస్థల వెబ్సైట్లు ESDSహోస్ట్ చేస్తోంది. దీంతో పాటు చెన్నై స్మార్ట్‌సిటి, ఎస్టిపీఐ, కేంద్ర గృహనిర్మాణశాఖలాంటి దాదాపు 200లకు పైగా ప్రభుత్వ వెబ్సైట్లు సైతం ESDSహోస్ట్ చేస్తోంది. ESDS క్లయింట్ లిస్ట్ చూస్తే ప్రెస్టీజ్ కుక్కర్, జేకే సిమెంట్, ఎస్సార్, ఎల్ అండ్ టీలాంటి దిగ్గజ కంపెనీలు సైతం ఉన్నాయి. అలాంటి సందర్భంలో కేవలం రెండు ఆడిటింగ్ కంపెనీలు మాత్రమే ఉన్నాయని ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలు రాసింది. ఇక ఆంధ్రజ్యోతి రాసిన కథనం ప్రకారం.. రెండు కంపెనీల సర్వర్ ఒకటే అని చెబుతున్న మాటల్లో ఎలాంటి వాస్తవాలు లేవు. శరత్ అండ్ అసోసియేట్స్ ఐపి అడ్రస్-115. 124. 126. 242. 80కాగా ఐవీఎస్ అండ్ అసోసియేట్స్ ఐపి అడ్రస్-115.124.126.216.80 అని పచ్చ మీడియానే రాసింది. ఇందులో115.124.126 అనేది ESDS డొమైన్ పూల్ కాగా తరువాత వచ్చే నెంబర్లు ఆయా కంపెనీ ఐపి అడ్రస్‌ను ఇండికేట్ చేస్తుంది. అంటే ఒక పిన్‌కోడ్‌లో మొదటి మూడు నెంబర్లు ఎలా కామన్‌గా ఉంటాయో అలా హోస్ట్‌కు మొదటి మూడు నెంబర్లు కామన్‌గా ఉంటాయి. ఒక బ్యాంకు బ్రాంచిలో ఖాతా ఉంటే వారి అకౌంట్ నెంబర్‌కు సంబంధించి 11నెంబర్లలో మొదటి 7నుంచి 8నెంబర్లు సేమ్‌గా ఉంటాయి. ఇక ఫోన్ నెంబర్లలో మొదటి నాలుగైదు నెంబర్లు సేమ్ ఉంటే వారిద్దరు డేటా షేర్ చేసుకున్నట్లా. ఇక తెలుగుదేశం పార్టీ తన వెబ్‌సైట్‌ను మైక్రోసాఫ్ట్ ద్వారా హోస్ట్ చేస్తోంది. ఇదే మైక్రోసాఫ్ట్ ఎన్నో ఈ కామర్స్ వెబ్సైట్లను హోస్టు చేస్తోంది. ఇక రెండు కంపెనీలు ఒకే హోస్టు ప్రొవైడర్ ద్వారా డొమైన్ రిజిస్టర్ చేసుకున్నా వారి డేటా ఒకే చోటా ఉండాలని లేదు. కంపెనీలు డొమైన్ రిజిస్ట్రేషన్ ఒకచోట డేటా హోస్టింగ్ మరో చోట చేసుకోవచ్చు. ఇదీ ఆంద్రజ్యోతి రాసి అడ్డమైన రాతల వెనక ఉన్న అసలు వాస్తవం. ఇక అబద్దాలను ప్రచారం చేస్తే అసలు వాస్తవాలు మరుగున పడతాయనేది ఎల్లో మీడియా తాపత్రయం. అందుకే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అసలు విషయాలు మాట్లాడకుండా.. ఇలా తప్పుడు రాతలతో బయటపడాలనేది పచ్చమీడియా ఆలోచన. -
పోలవరం ప్రాజెక్టుపై ఎల్లోమీడియా దుష్ప్రచారం
-
అసెంబ్లీ ఆవరణలో ఆనాడు చెప్పిన ముచ్చట్లు మరిచారా? ఈనాడు రామోజీ!
ఆంద్రప్రదేశ్‌లో రాజకీయాలు ఎంత ఘోరంగా తయారవుతున్నాయో చూడండి. ఇక మీడియా పరిస్థితి అయితే నానాటికి నాసిరకంగా మారుతోంది. ఒకప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే ఓటు అమ్ముకుంటే, అమ్ముకున్నవారిపై పుంఖానుపుంఖాలుగా కథనాలు వచ్చేవి. చివరికి ఓటును విక్రయించారన్న ఆరోపణలు ఎదుర్కునేవారు సిగ్గుతో తలవంచుకునే విధంగా వార్తా కథనాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఏమి జరుగుతోందో గమనించండి. ఓటు అమ్ముకున్నవారికి మద్దతుగా పేజీలకు, పేజీల వార్తలు వండి వార్చుతున్నారు. అబ్బో.. తాము విలువలకు కట్టుబడి ఉన్నామని పోజులిచ్చిన రామోజీరావుకు చెందిన ఈనాడు మీడియా అయితే మరీ అరాచకంగా తయారైంది. ప్లేట్ పిరాయించిన ఈనాడు జర్నలిజాన్ని గాలికి వదలివేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎలాగోలా వ్యతిరేకత పెంచాలన్న నీచ మనస్తత్వంలో ఉన్న ఈనాడు పత్రిక పూర్తిగా దిగజారిపోయినట్లు ఎప్పటికప్పుడు రుజువు చేసుకుంటోంది. ఏపీలో ఎమ్మెల్యేల కోటా నుంచి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో నలుగురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన విషయాన్ని ఆ పత్రికే కథనాలుగా ఇచ్చింది. దానిపై డబ్బు చేతులు మారాయన్న ఆరోపణలు పెద్ద ఎత్తున రావడంతో తెలుగుదేశం పార్టీ ఇరుకునపడింది. అంతే .. ఈనాడు కూడా ప్లేట్ పిరాయించేసింది. తాము వైఎస్సార్సీపీకే ఓటు వేశామని ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు చెబితే దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వార్తలు ఇచ్చారు. అంతేకాక ఆ ఎమ్మెల్యేలు నలుగురు ప్రభుత్వాన్ని, పార్టీని తీవ్రంగా విమర్శిస్తే దానిని పటం కట్టి ప్రచురించారు. అంతే తప్ప.. ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలలో నిజం ఉందా? లేదా? అన్నదానిపై వార్తలు ఇవ్వలేకపోయింది. రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా, భూతద్దంలో వెదికి రాసే ఈనాడుకు ఇంత పెద్ద డీల్ గురించి తెలియకపోవడం అంటే వారి అసమర్దత అనుకోవాలా? లేక అవినీతిని సమర్ధించడం అనాలా? తనకు కూడా టీడీపీ డబ్బు ఆఫర్ ఇచ్చిందని, తాను ఒప్పుకుంటే పది కోట్లు వచ్చి ఉండేవని, తనకు సిగ్గు,శరం ఉన్నాయి కాబట్టి ఆ పని చేయలేదని చెప్పిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన ప్రకటనను మాత్రం ఒక చిన్నపేరాగా ఎక్కడో లోపల పేజీలో కనబడి, కనబడనట్లుగా ప్రచురించారు. దీనిని బట్టి ఈనాడు అవినీతిపరుల వైపు నిలబడడానికి కంకణం కట్టుకుందని తేలడం లేదా! పాఠకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు.. వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల వాదన ఇవ్వదలిస్తే ఇవ్వండి.. తప్పు లేదు. కాని అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేల కొనుగోలు బేరం గురించి మరో ఎమ్మెల్యే చేసిన ప్రకటనకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి కదా! అలాగే వాస్తవం ఏమిటో పాఠకులకు తెలియచేయాలి కదా! తను భుజాన వేసుకున్న తెలుగుదేశం పార్టీ ఇలాంటి అరాచకాలకు పాల్పడితే అది ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమర్దతగా, చాతుర్యంగా అభివర్ణించే అధమస్థాయి ఈనాడు, ఆంద్రజ్యోతి ,టీవీ 5వంటి మీడియా సంస్థలు రావడం అత్యంత హేయంగా కనిపిస్తుంది. అదే పని కనుక మరే పార్టీ అయినా చేసి ఉంటే ఈ పాటికి చంద్రబాబు కాని, ఆయనకు మద్దతు ఇచ్చే ఈ ఎల్లో మీడియా కాని గగ్గోలుగా ప్రచారం చేసి ఉండేవారు. తమకు పదహారు మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని టీడీపీ నాయకత్వం చెబితే అది గొప్ప విషయంగా ఈ మీడియా భావించింది. అంతే తప్ప.. అదేమిటి? అలాంటివాటిని ఎందుకు ప్రోత్సహిస్తారు.. అని ప్రశ్నించలేదు. గతంలో 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి గబ్బు పట్టిన తెలుగుదేశానికి ఇంకా గుణపాఠం రాకపోవడంపై ఆ మీడియా ప్రశ్నించలేదు. పైగా బలం లేకపోయినా టిడిపి అభ్యర్ది గెలిచారంటూ చంకలు గుద్దుకుంటూ ఈ మీడియా సంబరపడిపోయింది. సుద్దులు చెప్పి.. ఇప్పుడేంటి ఇంత దారుణంగా.. రామోజీరావు విలువల గురించి ఎన్ని సుద్దులు చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఏకంగా అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఒక సమావేశంలో ఎమ్మెల్యేల తీరుతెన్నుల గురించి ధర్మోపన్యాసం చేసిన రామోజీరావు ఇప్పుడు ఎమ్మెల్యేల బేరసారాలకు మద్దతు ఇచ్చే పరిస్థితికి చేరుకున్నారు. మరో మీడియా అధినేత గురించి చెప్పుకోవడం అనవసరం. ఎందుకంటే ఇలాంటి బ్రోకర్ పనులు చేయడంలో ఆయన ఆరితేరారని ఎప్పటి నుంచో ప్రజలలో ఉన్నదే. ఈసారి కూడా ఆయన తన వంతు పాత్ర పోషించారని ప్రచారం జరుగుతోంది. ఆయనను పెద్దగా సీరియస్‌గా తీసుకోనవసరం లేదు. కాని ఈనాడు మీడియా మోసపూరిత విధానాలపై మాత్రం మాట్లాడుకోక తప్పదు. సస్పెండైన ఎమ్మెల్యేలు ఆనం నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డిలు నలుగురు కూడా తాము వైఎస్సార్సీపీ సూచించిన అభ్యర్దులకే ఓటు వేశామని చెబుతుండడం విశేషం. దానికి కారణం లేకపోలేదు. మీడియా ముందు తాము తెలుగుదేశం పార్టీకి ఓటు వేశామని చెబితే వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. పైగా వీరు డబ్బుకు అమ్ముడుపోయారన్నది నిర్ధారణగా మారి ప్రజలు మరింత ఈసడించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే తాము అమ్ముడుపోలేదని చెప్పుకుంటూనే వైఎస్సార్సీపీని విమర్శిస్తూ మీడియా ముందు మాట్లాడుతున్నారు. నిజంగానే వీరు పార్టీకి ద్రోహం చేయకుండా ఉన్నట్లయితే , తాము ఎక్కడా పొరపాటు చేయలేదని, పార్టీ తమను అన్యాయంగా సస్పెండ్ చేసిందని చెప్పేవారు. కాని వారిలో ఆ ధైర్యం కొరవడింది. అపరాధ భావనను కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడ్డారు. అయినా ఆనం రామనారాయణరెడ్డి తనకున్న రాజకీయ అనుభవంతో బాగానే నటించగలిగారు. ఆయన మొన్నటిదాకా సీఎం జగన్‌ను ఎలా మెచ్చుకున్నారు? ఇప్పుడు ఎంత ఘోరంగా విమర్శిస్తున్నారు? 2014లో రామనారాయణరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో పోటీచేసి డిపాజిట్ పోగొట్టుకున్నారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలో ఉండడంతో ఆ వైపునకు వెళ్లి, ఆ పార్టీ పరిస్థితి బాగోలేదని తెలుసుకున్నారేమో తెలియదు కాని, 2019 ఎన్నికల నాటికి వైఎస్ జగన్‌ను ఆశ్రయించి వెంకటగిరి టిక్కెట్ పొందారు. ఆ కృతజ్ఞతను కూడా ఆనం మిగుల్చుకోకపోవడం విషాదం. తండ్రి దారిలోనే ఆనం... ఆనం ఇంతవరకు మూడుసార్లు టీడీపీలోకి ,రెండుసార్లు కాంగ్రెస్, వైఎస్సార్సీపీలోకి మారారు. తమకు ఎంతో చరిత్ర ఉందని ఆయన చెబుతున్నారు. నిజమే..ఆయన తండ్రి ఆనం వెంకటరెడ్డికి కూడా ఇలాగే ఫిరాయింపులు చేసిన చరిత్ర ఉంది. దానిని రామనారాయణ కూడా అనుసరిస్తున్నట్లుగా ఉంది. వచ్చేసారి బీజేపీ, జనసేన, టీడీపీ లలో ఏదో ఒక పార్టీలో చేరవచ్చన్న సంకేతాలను ఆయన ఇస్తున్నారు. ఇక కొత్తగా రాజకీయాలలోకి వచ్చిన ఉండవల్లి శ్రీదేవి అసెంబ్లీలో కాని, బయటకాని ముఖ్యమంత్రిని ఉద్దేశించి జగనన్న అంటూ ఎన్ని కబుర్లు చెప్పారు. ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అమరావతి రాజధాని గురించి ఇంతకాలం ఏమి మాట్లాడింది.. ఇప్పుడు ఏమి మాట్లాడుతోంది.. వింటే నరం లేని నాలుక ఎటైనా తిరుగుతుందంటే ఇదేనేమో అనిపిస్తుంది. సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో విస్తారంగా వెలుగులోకి వచ్చాయి. ఈమె తన ఓటును టిడిపికి వేయడానికి ముందుగా ఎవరెవరి ద్వారా రాయబారాలు సాగించారన్న అంశంపై కొందరు నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికే బయటపడిపోయినందున ఆయన ఏమన్నా పట్టించుకోనవసరం లేదు. మేకపాటి చంద్రశేఖరరెడ్డిపై ఇటీవలికాలంలో వచ్చిన ఆరోపణలు, దానికి ఆయన ఆత్మరక్షణలో పడిన తీరు మొదలైనవి చూసిన తర్వాత ఇప్పుడు ఆయన ఏమి చెప్పినా, జనం నమ్మే పరిస్థితి లేదు. వీరంతా ఒక వైపు తాము వైసిపికే ఓటువేశామని చెబుతూనే , మరో వైపు వైసిపిని విమర్శిస్తున్న వైనాన్ని బట్టి వీరు ఏమి చేసింది అర్ధం చేసుకోవడం కష్టం కాదు. రాజకీయ నేతలు విలువలు పాటించడం లేదని సంపాదకీయాలు రాసే ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా సంస్థలు సైతం అంతకన్నా ఘోరంగా , చివరికి అమ్ముడుపోయారన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్యేలకు మద్దతు ఇవ్వడం జర్నలిజం విలువలను నిలువెత్తు గోతిలో పాతిపెట్టడమే.రాపాక వరప్రసాద్ చెబుతున్నట్లు ఈ మీడియా కూడా సిగ్గు,శరం వదలివేశాయని అనుకుంటే తప్పేముంటుంది? -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ -
అసెంబ్లీ సాక్షిగా బుక్కైన టీడీపీ నేతలు, ఎల్లో మీడియా.. ఇప్పుడేమంటారో?
అసెంబ్లీ సాక్షిగా టీడీపీ బండారం బయటపడింది. ఎల్లో మీడియా ఫేక్ ప్రచారానికి అసెంబ్లీ వేదికగా మంత్రి బుగ్గన చెక్ పెట్టారు. దీంతో ఎల్లో బ్యాచ్.. ఒక్కసారి షాకై నోరు మూసుకున్నారు. చెరపకురా చెడేవు.. అన్న సామెత పచ్చ బ్యాచ్ పక్కాగా సూట్ అవుతుంది. లేనది ఉన్నట్టు చూపించి నమ్మించాలనే వారి ఐడియాలు ఎప్పుడూ తుస్సుమంటూనే ఉన్నాయి. దీంతో, ఖంగుతినడం పరిపాటిగా మారిపోయింది. అయినప్పటికీ ఫేక్ ప్రచారం మాత్రం ఆగడం లేదు. అయితే, అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వాగతం పలకలేదని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాసుకొచ్చింది. దీనికి టీడీపీ సభ్యులు వంత పాడారు. దీంతో, ఎల్లో మీడియా ఫేక్ ప్రచారాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఖండించారు. ఈ క్రమంలో టీడీపీ తప్పుడు ప్రచారాలకు వీడియోలతో సహా చెక్ పెట్టారు. అసలు వాస్తవాలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బయటపెట్టారు. అసత్య ప్రచారాలపై ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాలని.. కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కోరారు. కాగా, గవర్నర్‌కు స్వాగతం పలుకుతున్న వీడియోను మంత్రి బుగ్గన.. అసెంబ్లీలో ప్లే చేశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో మంత్రి ఈ అంశాన్ని ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగంపై ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని వీడియోతో సహా చూపించారు. టీడీపీవీ అన్ని తప్పుడు ఆరోపణలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌కు మేము ఇచ్చినంత మర్యాద ఎవరూ ఇవ్వలేదన్నారు. గవర్నర్‌కు ఏవిధంగా సీఎం జగన్ స్వాగతం పలికారో వీడియోలో చూపించారు. దీంతో, టీడీపీ నేతల బండారం బయటపడింది. అనంతరం, స్పీకర్ తమ్మినేని కూడా ప్రోటోకాల్ ప్రకారమే.. గవర్నర్ నజీర్‌ను సీఎం జగన్ స్వాగతం పలికారని చెప్పారు. దీనికి ఆయనే ప్రత్యక్ష సాక్షినని స్పష్టం చేశారు. మరోవైపు.. రాజ్యాంగ వ్యవస్థలపై బురద చల్లేలా టీడీపీ సభ్యులు, ఈనాడు వ్యవహరిస్తున్నాయని ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రికి స్పీకర్ సూచించారు. ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్టు తెలిపారు. తప్పుడు ప్రచారాలపై తప్పకుండా చర్యలుంటాయని హెచ్చరించారు. -
ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్లవి.. కుట్రపూరిత కథనాలే
సాక్షి, అమరావతి: ‘సీఎస్‌తో కలసి వెళ్లిన ఓఎస్డీ’ శీర్షికన ఎల్లో మీడియా ప్రచురించిన కథనాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. దారుణమైన అబద్ధాలను ఆలంబనగా చేసుకుని ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు, ఆంధ్రజ్యోతి వెబ్సైట్, ఏబీఎన్ చానల్ రాష్ట్రంలో ఉద్యోగులందరికీ అధినేత అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చులకన చేస్తూ, కుట్రపూరితంగా కట్టుకథలు అల్లాయని స్పష్టం చేశారు. ఓ అత్యున్నత స్థాయి అధికారిని, వ్యవస్థను కించపరుస్తూ తప్పుడు కథనాలు ప్రచురించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఉద్యోగులందరిలో అత్యున్నతస్థాయి అధికారిని టార్గెట్ చేస్తూ అవాస్తవాలను ప్రచురించడం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతిష్టకు భంగం కలిగించడం ద్వారా ఏ జర్నలిజం విలువల ఆధారంగా పని చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. తాను ఖండనలో పొందుపరిచిన అన్ని విషయాలను అంతే ప్రాధాన్యతతో, బేషరతుగా క్షమాపణలు చెబుతూ ప్రచురించాలన్నారు. ఫిబ్రవరి 4వ తేదీన సత్యదూరమైన న్యూస్ ఐటమ్‌ను ఆయా పత్రికల్లో ఏ పేజీల్లో ఎంత ప్రాముఖ్యతతో ప్రచురించారో, ఏ సమయంలో ఎంత ప్రాధాన్యతతో చానల్లో కథనాలను ప్రసారం చేశారో అంతే ప్రాముఖ్యత, ప్రాధాన్యతతో ఖండనను ప్రసారం చేస్తూ జరిగిన పొరపాటుకు క్షమాపణలు కూడా చెప్పాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో ఆ న్యూస్ ఐటమ్కు బాధ్యులపై న్యాయ నిపుణుల సలహా, ప్రభుత్వ నిబంధనలకు లోబడి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీట్ నంబర్ 1 డి... వెళ్లింది హైదరాబాద్ వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం అహోబిలపురం సమీపంలో రూ.5 కోట్లతో పునర్నిర్మించిన శ్రీ భానుకోట సోమేశ్వరాలయం మహా కుంభాభిషేకాన్ని ఫిబ్రవరి 4వతేదీ ఉదయం 9.58 గంటలకు నిర్వహించాలని ముహూర్తాన్ని నాలుగు నెలల క్రితమే 2022 అక్టోబర్ 14 నిర్ణయించారని సీఎస్ తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో తాను ఫిబ్రవరి 2వతేదీ రాత్రి 11 గంటలకు రేణిగుంట ద్వారా కడప చేరుకున్నట్లు వివరించారు. 3వ తేదీ ఉదయం 9.50 గంటలకు కడప కలెక్టర్, ఇతర జిల్లా ఉన్నతాధికారులు ఆలయ కార్యక్రమాల్లో పాల్గొన్నారని వివరించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తాను చదువుకున్న జిల్లా పరిషత్ హైస్కూల్ ముద్దనూరులో విద్యార్ధులతో సమావేశం ముగియగానే 4.40కి బయలుదేరానని, సుమారు 8.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయంలో కలెక్టర్, ఇతర అధికారులు తనకు మర్యాదపూర్వకంగా వీడ్కోలు పలికారని తెలిపారు. రాత్రి 9 గంటలకు స్పైస్‌జెట్ ఎస్జీ 3003 సిరీస్ ద్వారా 1 డి సీట్లో ప్రయాణించి హైదరాబాద్ చేరుకున్నట్లు జవహర్‌రెడ్డి వివరించారు. వాస్తవాలు ఇలా ఉంటే శుక్రవారం రోజు సీఎస్‌తో కలసి ఓఎస్డీ విజయవాడ వెళ్లారని, ఒకే వాహనంలో ప్రయాణించారని ప్రచురించిన కథనాలు ఊహాజనితం, సత్యదూరమని చెప్పారు. దారుణమైన ఈ అబద్ధాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. -
అమూల్‌పై టీడీపీ టిష్యూ పేపర్ తప్పుడు కథనాలు: మంత్రి అప్పలరాజు
సాక్షి, విశాఖపట్నం: అమూల్ డెయిరీ విషయంలో యెల్లో మీడియా రాస్తున్న తప్పుడు కథనాలపై మండిపడ్డారు మంత్రి సీదిరి అప్పలరాజు. టీడీపీ టిష్యూ పేపర్ ఈనాడులో సర్వం అమూల్ పాలు అంటూ తప్పుడు కథనం రాశారని, సర్వం అమూల్ కాదు.. సర్వం హెరిటేజ్ పాపం అని రాయలన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తప్పుడు కథనాలపై నిప్పులు చెరిగారు మంత్రి అప్పలరాజు. ఉక్రోషంతో ప్రభుత్వంపై ఈనాడు వార్తలు రాస్తోందన్నారు. అమూల్ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతోందని, రైతులకు గౌరవం పెరిగిందంటే అమూల్ వల్లనే కాదా అని ప్రశ్నించారు. జగనన్న పాల వెల్లువ ద్వారా రైతులకు మేలు జరిగిందని స్పష్టం చేశారు. ‘2.5 లక్షల లీటర్లు రోజుకు ఉత్పత్తి చేసే చిత్తూరు డైరీని చంద్రబాబు నాయుడు హయాంలోనే మూసేసారు. ఆ తర్వాత హెరిటేజ్‌ను చంద్రబాబు స్థాపించారు. డెయిరీని మూయించడం కూడా చంద్రబాబు గొప్పగా చెప్పుకున్నారు. ఇటువంటి వాస్తవాలు ఎందుకు రామోజీరావు రాయడం లేదు. 33 ఏళ్ళ, 99 ఏళ్ళ లీజు పాలసీని తీసుకువచ్చింది చంద్రబాబే కదా? రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన అక్రమాలపై ఎందుకు ఈనాడులో రాయలేదు. మిగతా డెయిరీలకు అమూల్‌కు 9 నుంచి 10 రూపాయలు తేడా ఉంది. ఈ డబ్బులన్నీ ఎవరి ఖాతాలోకి వెళ్లాయో చెప్పాలి. అమూల్ రాకపోయి ఉంటే రైతుల పరిస్థితి దారుణంగా ఉండేది. ఋషికొండలో ఏమి జరిగింది? అక్కడ కట్టేది ప్రభుత్వ భవనాలే కదా..ప్రైవేట్ భవనాలు కాదు కదా? రామోజీ ఫిల్మ్ సిటీని కొండలు తవ్వకుండా కట్టారా? వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర.. రామోజీ ఫిల్మ్ సిటీ కట్టేటప్పుడు చుస్తే చనిపోయేవారు. ఏపీకి మొత్తం అప్పు 3.8 లక్షల కోట్లని కేంద్ర మంత్రి చెబితే..దాన్ని వక్రీకరించి సుమారు 10లక్షల అని రాశారు’ అని మండిపడ్డారు మంత్రి అప్పలరాజు. ఇదీ చదవండి: సంగం డెయిరీ దూళిపాళ్ల నరేంద్ర అబ్బ సొత్తు కాదు: మంత్రి అప్పలరాజు -
గన్ షాట్: లేనిది ఉన్నట్టు మాట్లాడే పవన్ కు మతి ఉన్నట్టా లేనట్టా ..!
-
పవన్ పై మంత్రి జోగి రమేష్ ఫైర్
-
దొంగను పట్టుకునేందుకు CID పోలీసులు వెళ్తే తప్పా : జోగి రమేష్
-
బలంగా ‘బాదినా’ బుద్ధి రాలేదా?
రాయదుర్గం: ‘ప్రజల సంక్షేమాన్ని విస్మరించినందుకు 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని 23 సీట్లకు పరిమితం చేసినా మీకు బుద్ధి రాలేదా..? ‘బాదుడే.. బాదుడు’ కార్యక్రమం పేరుతో వీధినాటకాలకు తెర తీస్తారా? పేదలపై వివక్ష, విద్వేషాలను రెచ్చగొట్టే ‘పచ్చ’ కుట్రలకు స్వస్తి పలకకపోతే 2024 ఎన్నికల్లో మూడు సీట్లు కూడా దక్కవు’ అంటూ మాజీ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుపై రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం రాయదుర్గంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదిస్తూ ‘పచ్చ బ్యాచ్’ ఇంటింటా తిరుగుతూ విస్తృత ప్రచారం చేస్తుండడంపై మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క మంచి పనైనా చేశావా అంటూ కాలవను ప్రశ్నించారు. ఉన్నత చదువులు చదువుకున్నానని చెప్పుకునే నీకు ధరల పట్ల కనీస జ్ఞానం లేకపోవడం విచారకరమన్నారు. ‘పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలోని మొలకాల్మూరు, చిత్రదుర్గం, బళ్లారికి నాతో కలిసి నీవు, నీ పచ్చ బ్యాచ్, మీడియాతో వస్తే అక్కడ మీరు చెప్పిన దుకాణాల్లో నిత్యావసర ధరలు విచారిద్దాం.. ఆ తర్వాత రాయదుర్గం, అనంతపురం వచ్చి ఇక్కడెలా ఉన్నాయో బేరీజు వేద్దాం. ధరల్లో వ్యత్యాసం కనిపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా?’ అంటూ సవాల్ విసిరారు. రాజకీయ స్వార్థం కోసం ప్రజలను మోసం చేయాలని చూడొద్దని హితవు పలికారు. అభివృద్ధి, సంక్షేమం తమ ప్రభుత్వ అభిమతమని, పేదలందరికీ కడుపునిండా అన్నం పెట్టాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని గుర్తుచేశారు. అసత్య ఆరోపణలు మానుకోకపోతే ‘చీపుర్లతో బాదుడు’ తప్పదని హెచ్చరించారు. సోషల్ మీడియా తోకలు కత్తిరిస్తాం.. ‘సొంత డబ్బుతో నిస్వార్థంగా సామాజిక సేవ చేస్తున్న నాపై విమర్శలు చేసినా సహించా. దీన్ని అలుసుగా తీసుకుని నా కుటుంబంపై అక్కసు వెళ్లగక్కుతూ అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెట్టించేలా కుట్రలకు పాల్పడితే మాత్రం ఊరుకునేది లేదు. ఖబడ్దార్’ అంటూ కాలవకు విప్ కాపు రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ‘రెడ్‌క్రాస్ సంస్థకే వన్నె తెచ్చేలా జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి.. ఆపద సమయంలో ప్రజలకు రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడే బాధ్యత సంస్థ చైర్‌పర్సన్‌గా కాపు భారతి తీసుకుంటే ప్రశంసించాల్సిందిపోయి.. సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టింగ్‌లు పెట్టిస్తావా..? ఇదా రాజకీయంలో నీవు నేర్చుకున్న నీతి’ అంటూ విరుచుకుపడ్డారు. అసభ్యకర పోస్టింగ్‌లపై ఇప్పటికే ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశానన్నారు. అయినా పద్ధతి మార్చుకోకపోతే అభిమానులు, కార్యకర్తలు, ప్రజల ద్వారా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. కాలవ శ్రీనివాసులు చీకటి బతుకు గురించి తెలిస్తే ప్రజలే ముఖాన ఉమ్మేస్తారని, పరిస్థితి అంతదాకా తెచ్చుకోవద్దని అన్నారు. నీతిమాలిన రాజకీయాలకు కేరాఫ్‌గా నిలిచావని దుమ్మెత్తి పోశారు. కరోనా లాంటి కష్టకాలంలో రోడ్డు మీదకొచ్చి తాము ప్రజలకు సేవ చేస్తే ప్రతిపక్ష పార్టీ నేతలు ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. కులాలు, మతాల మధ్య కుంపట్లు పెట్టి ప్రశాంతంగా ఉండే రాయదుర్గాన్ని రావణకాష్టగా మార్చాలని చూస్తే సహించేది లేదన్నారు. మార్ఫింగ్ వీడియో పోస్టు చేయించి డ్రామాలా? బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో టీడీపీ ఆడిన డ్రామాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయని విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ‘ఐ– టీడీపీ’ అనే ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా అర్ధరాత్రి మారి్ఫంగ్ వీడియో పోస్ట్ చేసి నీచమైన కుట్రకు ఒడిగట్టి.. ఏదో జరిగిపోయిదంటూ డ్రామాలు ఆడతారా అంటూ నిలదీశారు. వీడియో ఒరిజినల్ కాదని ఎస్పీ చెబుతున్నా.. దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం తగదన్నారు. 2024 ఎన్నికలే టీడీపీకి ఆఖరివి కానున్నాయన్నారు. ఇందుకు చాలామంది టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరడమే నిదర్శనమన్నారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు శ్రీనివాస్‌యాదవ్, వలిబాషా, వైఎస్సార్సీపీ పట్టణ కనీ్వనర్ ముస్తాక్, గుమ్మఘట్ట జెడ్పీటీసీ సభ్యుడు పీఎస్ మహే‹Ù, మండల కనీ్వనర్ బోయ మంజునాథ, సీనియర్ నాయకుడు గొల్లపల్లి కాంతారెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. (చదవండి: వారంతా చంద్రబాబుతో చేతులు కలిపారు: ఎంపీ గోరంట్ల మాధవ్) -
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీ అప్పు తక్కువే
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులకు సంబంధించి ఎక్కడా దాపరికం లేదు. అప్పులు చేయకుండా ఏ రాష్ట్రం కూడా ముందుకు అడుగులు వేయలేదు. ఒక పక్క కోవిడ్ సంక్షోభం వల్ల ఆదాయం పడిపోయి, ఖర్చులు పెరిగినప్పటికీ బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట పరిమితులకు లోబడే ఈ ప్రభుత్వం అప్పులు చేస్తోందని కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరో పక్క ద్రవ్య లోటును తగ్గించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2021–22 ఆర్థిక ఏడాదిలో మన రాష్ట్రం చేసిన అప్పుల కంటే పలు ఇతర రాష్ట్రాలు చేసిన అప్పులే ఎక్కువ అని తేలింది. వాస్తవం ఇలా ఉండగా, ఈ మాత్రం అప్పులు చేయడం కూడా మహా ఘోరం అన్నట్లు ప్రతిపక్షం, ఎల్లో మీడియా ప్రజల్లో విషం నింపుతున్నాయి. ► పొరుగు రాష్ట్రమైన తెలంగాణ 2021–22 బడ్జెట్ అంచనాలకు మించి అప్పులు చేసినట్లు కాగ్ ప్రాథమిక అకౌంట్స్ పేర్కొన్నాయి. రూ.45,509.60 కోట్ల అప్పు చేయనున్నట్లు తొలుత పేర్కొన్నప్పటికీ, రూ.47,690.59 కోట్ల అప్పు చేసినట్లు తేలింది. ► కర్ణాటక కూడా రూ.59,244.99 కోట్ల అప్పు చేయనున్నట్లు వెల్లడించి, తీరా రూ.60,486.26 కోట్ల అప్పు చేసినట్లు తేలింది. సాక్షి, అమరావతి: దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలతో పాటు ఎల్లో మీడియా కథనాల్లో వాస్తవం లేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక స్పష్టం చేసింది. కోవిడ్ సంక్షోభంతో కేంద్ర, రాష్ట్ర ఆదాయాలు గణనీయంగా తగ్గిపోగా, మరో పక్క ఖర్చులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు అప్పుల పరిమితి పెంపునకు అనుమతించింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక ఏడాది అంటే 2021–22 బడ్జెట్ అంచనాల్లో వెల్లడించిన మేరకు కూడా అప్పులు చేయలేదు. అందులో కేవలం 68.04 శాతం మేర మాత్రమే అప్పు చేసినట్లు కాగ్ ప్రాథమిక అకౌంట్స్ నివేదిక స్పష్టం చేసింది. ఆర్థిక ఏడాది మొత్తం ఆదాయ, వ్యయాలను ఆర్థిక ఏడాది చివరి నెల మార్చిలో సర్దుబాటు చేసి, కాగ్ ఈ నివేదిక రూపొందిస్తుంది. 2021–22 ఆర్థిక ఏడాదిలో కాగ్ ప్రాథమిక అకౌంట్స్ మేరకు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువగా ద్రవ్య లోటు ఉన్నట్లు తేలింది. ఆర్థిక ఏడాది ద్రవ్య లోటు అంటే ఆ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం చేసిన నికర అప్పుగా పేర్కొంటారు. 15వ ఆర్థిక సంఘం జీఎస్డీపీలో 4.5 శాతం ద్రవ్యలోటు లక్ష్యంగా నిర్ధారించగా, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా 2021–22 ఆర్థిక ఏడాదిలో దానిని 2.10 శాతానికే పరిమితం చేసిందని కాగ్ అకౌంట్స్ స్పష్టం చేశాయి. అలాగే రెవెన్యూ లోటును రూ.8,370.51 కోట్లకే పరిమితం చేసింది. టీడీపీ, ఎల్లో మీడియా అసత్య ప్రచారం ► టీడీపీ ఐదేళ్ల పాలనలో జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3% పరిమితికి మించి ఉండేది. అలాంటి ద్రవ్యలోటును గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం 2021–22లో 2.10 శాతానికి పరిమితం చేసింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం విచక్షణతో నిర్వహించిన ఆర్థిక వ్యవహారాలకు నిదర్శనం. ► బడ్జెట్ అంచనాల్లో వెల్లడించిన మేరకు అప్పు చేసేందుకు వీలున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు కూడా అప్పు చేయలేదు. అంటే ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తున్నారనే టీడీపీ నేతల ఆరోపణలు, ఎల్లో మీడియా కథనాల్లో వాస్తవం లేదని స్పష్టమైంది. ► వివిధ రాష్ట్రాల కాగ్ ప్రాథమిక అకౌంట్స్‌ను పరిశీలిస్తే మిగతా రాష్ట్రాల కన్నా ఏపీ 2021–22లో అతి తక్కువగా అప్పు చేసినట్లు తేలింది. బడ్జెట్ అంచనాల్లో రూ.37,029.79 కోట్లు అప్పు చేయనున్నట్లు పేర్కొని, వాస్తవంగా రూ.25,194.62 కోట్లు మాత్రమే (68.04 శాతం) అప్పు చేసింది. అంటే ఇంకా 31.96 శాతం మేర అప్పు చేయడానికి అవకాశం ఉన్నా చేయలేదు. ► ఈ లెక్కన వాస్తవాలను పట్టించుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చేందుకే టీడీపీ నేతలతో పాటు ఆ పార్టీ అనుబంధ మీడియా.. రాష్ట్ర అప్పులపై ఆర్బీఐ ఆరా, కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు తాఖీదులంటూ దుష్ప్రచారం చేస్తోందని ఇట్టే తెలుస్తోంది. ద్రవ్య బాధ్యతలు తడిసి మోపెడు ► బాబు హయాంలో ఐదేళ్లు అస్తవ్యస్థ ఆర్థిక నిర్వహణ, పాలన కారణంగా ప్రస్తుత ప్రభుత్వంపై ద్రవ్య బాధ్యతలు తడిసి మోపెడయ్యాయి. చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.39,000 కోట్లు బిల్లులను పెండింగ్‌లో పెట్టి వెళ్లిపోయింది. ► మరో పక్క ప్రభుత్వ గ్యారెంటీలతో ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయడంతో పాటు విద్యుత్ సంస్థల అప్పులను రూ.29,703 కోట్ల నుంచి రూ.68,596 కోట్లకు పెంచేసింది. ఇదే సమయంలో డిస్కమ్స్ బకాయిలను రూ.2,893.23 కోట్ల నుంచి రూ.21,540.96 కోట్లకు పెంచింది. ఇటు సంక్షేమం.. అటు అభివృద్ధి ► ప్రస్తుత ప్రభుత్వం ఇవన్నీ తీరుస్తూనే మరో పక్క కోవిడ్ కారణంగా 2019–20లో రాష్ట్ర ఆదాయంలో రూ.8 వేల కోట్లు, 2020–21లో రూ.14 వేల కోట్లు తగ్గినప్పటికీ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఎక్కడా ఆపకుండా అమలు చేసింది. ► 2021–22 ఆర్థిక ఏడాదిలో అంతకు ముందు రెండేళ్ల కంటే కొంత మేర రాష్ట్ర ఆదాయం మెరుగు పడింది. 2020–21లో బడ్జెట్ అంచనాల రెవెన్యూ రాబడిలో 72.32 శాతమే రాగా, 2021–22లో 84.96% మేర వచ్చిందని కాగ్ పేర్కొంది. ► ఎక్కడా అవినీతి, దుర్వినియోగం లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాలకు ఏకంగా రూ.1.41 లక్షల కోట్లు జమ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులను రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు వీలుగా నవరత్నాలకు వినియోగించిందని, కోవిడ్ సంక్షోభంలో రాష్ట్రంలో పేద, సామాన్య ప్రజలు కష్టాలు ఎదుర్కోకుండా ప్రభుత్వం ఆదుకున్నట్లయిందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వైద్య, విద్య, వ్యవసాయ రంగాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ కార్యక్రమాలను చేపట్టింది. బాబు హయాంలోనే పరిమితికి మించి అప్పులు ► చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పరిమితికి మించి జీఎస్డీపీలో 3 శాతానికన్నా ఎక్కువగా అప్పులు చేశారని కాగ్ అకౌంట్స్ స్పష్టం చేస్తున్నాయి. 2014–15 ఆర్థిక ఏడాదిలో జీఎస్డీపీలో ద్రవ్య లోటు 3.95 శాతం ఉంది. 4 బాబు దిగిపోయే సమయానికి అంటే 2018–19 జీఎస్డీపీలో ద్రవ్యలోటు (అప్పులు) 4.06%కి పెరిగింది. అలాంటిది 2021–22 ఆర్థిక ఏడాదిలో జీఎస్డీపీలో అప్పులను 2.10%కు ఈ ప్రభుత్వం తగ్గించింది. ఇతర రాష్ట్రాల కన్నా ఏపీ అప్పు తక్కువే ► పొరుగు రాష్ట్రమైన తెలంగాణ 2021–22 బడ్జెట్ అంచనాలకు మించి అప్పులు చేసినట్లు కాగ్ ప్రాథమిక అకౌంట్స్ పేర్కొన్నాయి. రూ.45,509.60 కోట్ల అప్పు చేయనున్నట్లు తొలుత పేర్కొన్నప్పటికీ, రూ.47,690.59 కోట్ల అప్పు చేసినట్లు తేలింది. ► కర్ణాటక రాష్ట్రం 2021–22 ఆర్థిక ఏడాదిలో రూ.59,244.99 కోట్లు అప్పు చేయనున్నట్లు వెల్లడించి, తీరా రూ.60,486.26 కోట్ల అప్పు చేసింది. ► బడ్జెట్ అంచనాల్లో కేరళ ప్రభుత్వం 81.58% మేర, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 82.27% మేర అప్పు చేశాయి. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ బయట వివిధ సంస్థల కోసం అప్పులు చేయడం మామూలే. ఆ అప్పులకు ప్రభుత్వాలు గ్యారెంటీ ఇస్తాయి. అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం సంస్థల ద్వారా అప్పులు చేస్తోంది. ► బడ్జెట్ బయట అప్పులు ఎంత చేశారనేది ద్రవ్య జవాబు దారీ బడ్జెట్ నిర్వహణ విధాన పత్రంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో దాపరికం ఏమీ లేదు. గత చంద్రబాబు ఐదేళ్ల పాలనతో సగటు వార్షిక అప్పు వృద్ధి రేటు 19.46 శాతం ఉండగా, ఈ మూడేళ్లలో సగటు వార్షిక అప్పు 15.77 శాతమే ఉంది. -
విష ప్రచారాలు మానుకోండి: భూమన కరుణాకర్ రెడ్డి
-
మీ పత్రిక రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యోగులతో ఆటలా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై రాజకీయంగా తమకున్న అక్కసు, కక్షతో ఆంధ్రజ్యోతి పత్రిక తప్పుడు సమాచారంతో కథనాలు రాస్తూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో గందరగోళం, ఆందోళన కలిగించేందుకు ప్రయత్నిస్తోందని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ తప్పు బట్టింది. సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు, అదనపు ప్రధాన కార్యదర్శి బీఆర్ఆర్ కిషోర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విప్పర్తి నిఖిల్ కృష్ణలు సోమ వారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని సచివాలయ వ్యవస్థను ఈ ప్రభుత్వం మన రాష్ట్రంలోనే ఏర్పాటు చేసి, నా లుగు నెలల వ్యవధిలోనే ఒకేసారి లక్షకు పైగా ఉద్యోగాలిచ్చి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ప్రభుత్వానికి మధ్య అపోహలు కలిగించేలా ఆ పత్రిక కథనాలు రాయడాన్ని తాము ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. అప్పట్లో ఉద్యోగాలు పొందిన వారిలో అర్హులకు జూన్ నెలాఖరుకల్లా ప్రొబేషన్ ఖరారు చేసి, జూలై నుంచి పెరిగిన వేతనాలు అందజేయా లని సీఎం జగన్ ఈ ఏడాది జనవరిలోనే అధికారులకు ఆదేశాలిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ ఆదేశాలకనుగుణంగా గతేడాదిలోనే డిపార్ట్మెంట్ టెస్ట్ పాసైన దాదాపు 60 వేల మంది సచివాలయ ఉద్యోగుల వివరాలు ఇప్పటికే అధికారులు తెప్పించుకున్నారని, దీనికి తోడు గత నెలలో డిపార్ట్మెంట్ పరీక్షల్లో పాసైన మరో 12 వేల మంది ఉద్యోగుల వివరాలనూ అధికారులు సేకరిస్తున్నారని అసోసియేషన్ నేతలు గుర్తుచేశారు. ఇంకో 13 వేల మంది ఏఎన్ఎంలకు సంబంధించిన ఫలితాలు వెల్లడవడంతో వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారని తెలిపారు. మరో 14 వేల మహిళా పోలీసులకు సంబంధించిన ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నాయి. డిపార్ట్మెంట్ టెస్ట్‌లో పాస్ కాని వారికీ మరోసారి డిపార్ట్మెంట్ పరీక్షలు నిర్వహించి, వెంటనే ఫలితాలు ప్రకటించి వారికి సైతం ప్రొబేషన్ డిక్లరేషన్‌కు ప్రణాళికలు సిద్ధం చేసిన తరుణంలో ఆ పత్రిక యజమాన్యం తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యోగుల జీవితాలతో ఆట లాడుకోవాలనుకోవడం సరికాదని అసోసియేషన్ ప్రతినిధులు ఆ ప్రకటనలో హితవుపలికారు. -
ఎల్లో చానెల్లో మీటింగ్‌లు.. చాటింగ్‌లు
సాక్షి, అమరావతి: ‘‘చంద్రబాబునాయుడు గారూ.. మీరు చాలా సూపర్. ఎల్లో సిండికేట్ అంటే ఇప్పటివరకు చాలామందికి అర్థంకాలేదు. మీ టీవీ–5 టూర్‌తో అది ఇప్పుడు పూర్తిగా అర్ధమవుతోంది’’.. అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు టీవీ–5 స్టుడియోకు వెళ్లడం, అక్కడి సిబ్బందితో మాట్లాడడం, చానెల్ అధినేత బీఆర్ నాయుడుతో చెట్టాపట్టాలేసుకుని తిరగడం చూస్తుంటే వీరిమధ్య బంధం ఎలాంటిదో ఇట్టే అర్ధంచేసుకోవచ్చని రమేష్ వ్యాఖ్యానించారు. ఎల్లో మీడియా, చంద్రబాబు బినామీలు, చంద్రబాబు కలిస్తే ఎల్లో సిండికేట్ అన్న విషయం ఇన్నాళ్లూ చాలామందికి తెలీదని.. ఇప్పుడిప్పుడే అందరూ అర్ధంచేసుకుంటున్నారని శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తుంటే ఎల్లో మీడియా దానికి అనుబంధంగా పనిచేస్తోంది. తాజాగా.. టీవీ–5 చానెల్ స్టుడియోకు వెళ్లిన చంద్రబాబు వారితో ఎడిటోరియల్ మీటింగ్ నిర్వహించినట్లు కనిపిస్తోంది. చానెల్ ఎలా పనిచేయాలో దిశా నిర్దేశం చేసినట్లు అక్కడి వాతావరణాన్ని బట్టి అర్ధమవుతోంది. ఎల్లో సిండికేట్‌లో భాగంలా పనిచేస్తున్న రఘురామకృష్ణరాజు వంటివాళ్లు ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేయడం, చివరికి కోర్టు మెట్లెక్కి చివాట్లు తినడం చూస్తున్నాం. ఇప్పటివరకు వ్యవస్థలను వాడుకోవడం, మీడియాను మేనేజ్ చేయడం గురించి విన్నాం.. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. స్వయంగా చంద్రబాబు ఓ స్టుడియోకు వెళ్లి అక్కడి వారికి ఏమేం చేయాలో చెప్పడం చూస్తుంటే మరింత బరితెగించేందుకు అందరూ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది’’ అని జోగి రమేష్ పేర్కొన్నారు. -
ఇక జన్మలో చంద్రబాబు సీఎం కాలేడు: మంత్రి కొడాలి నాని
-
వ్యవస్థలను చంద్రబాబు భ్రష్టు పట్టించారు
-
లీజు నిర్వాహకులకే అనుమతులు పునరుద్ధరించాం
సాక్షి, తిరుపతి తుడా: తూర్పుగోదావరి జిల్లాలోని లేటరైట్ నిక్షేపాల నమూనాలను కెమికల్ అనాలసిస్‌కు పంపామని.. అందులో అల్యూమినియం ఉన్నట్లు తేలడంతో తిరిగి లీజు నిర్వాహకులకే అనుమతులను పునరుద్ధరించామని రాష్ట్ర గనులు, భూగర్భ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టంచేశారు. బాక్సైట్‌కు అయితే కేంద్రమే అనుమతులిస్తుందని ఆయనన్నారు. ఈ విషయాన్ని పక్కనపెట్టి ఆంధ్రజ్యోతి దినపత్రిక నిరాధారమైన ఆరోపణలతో ‘ఏటా రూ.180 కోట్లు’ స్వాహా చేస్తున్నట్లు అసత్య కథనాన్ని ప్రచురిం చిందని ఆయన మండిపడ్డారు. 2012లో అప్పటి ముఖ్యమంత్రి తూర్పు గోదావరి జిల్లాలో తొమ్మిది మందికి 2033 వరకు ఈ లేటరైట్ నిక్షేపాల తవ్వకాలకు అనుమతులిచ్చారని మంత్రి తెలిపారు. తిరుపతిలోని తన నివాసంలో పెద్దిరెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఆదివారం ఆ పత్రిక ప్రచురించిన ‘ఏటా రూ. 180 కోట్లు’ స్వాహా కథనంపై చట్టపరంగా చర్యలు తప్పవు. ఇప్పటికే నోటీసులు జారీచేశాం. సరైన వివరణ ఇవ్వకున్నా ఆధారాలు చూపకుంటే పరువు నష్టం దావా వేస్తాం. చంద్రబాబు హయాంలో దోచేశారు కాబట్టే మా ప్రభుత్వం కూడా దోచేస్తోందనే భ్రమలో ఎల్లో మీడియా ఉన్నట్లుంది. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కథనాలతో ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు ఆంధ్రజ్యోతి కుట్ర చేస్తోంది. గనుల కేటాయింపుల్లో ముఖ్యనేత అంటూ ఒకసారి.. మంత్రి సమీ ప బంధువంటూ మరోసారి కథనాలను రాయడం సరైందికాదు. గతంలోనూ సరస్వతి పవర్‌కు కోట్లు కట్టబెట్టారంటూ అసత్యాన్ని ప్రచారం చేశారు. రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణ జరిగి తీరుతుంది. కరోనా కా రణంగా ఆలస్యమవుతోంది. సరైన సమయంలో నిర్ణయిస్తాం.