Youtuber
-
Choreographer: సొనాలీ భదౌరియా
డాన్సర్, కొరియోగ్రాఫర్, యూట్యూబర్. సొనాలీ సొంతూరు పుణే. ఆమెకు చిన్నప్పటి నుంచీ డాన్స్ అంటే పిచ్చి. అది ఆమె సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యాక కూడా కంటిన్యూ అయింది. అందుకే తాను జాబ్ చేస్తున్న కంపెనీలోని డాన్స్ క్లబ్ ‘క్రేజీ లెగ్స్’లో జాయిన్ అయింది. ఎన్నో డాన్స్ పోటీల్లో పాల్గొంది. ఆ ఉత్సాహంతోనే "LiveToDance with Sonali’అనే యూట్యూబ్ చానల్‌ను స్టార్ట్ చేసింది. అందులో తన డాన్స్ వీడియోలు అప్లోడ్ చేస్తుంటుంది. ఆమె చానల్‌కి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. యూట్యూబ్ సిల్వర్ బటన్నూ సాధించింది. వేలల్లో ఫాలోవర్స్‌తో సొనాలీకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. -
50 గంటల్లో 16 వేల కేలరీల ఫాస్ట్ ఫుడ్ ఛాలెంజ్..కట్‌చేస్తే..!
ఆరోగ్యం కోసం మంచి సమతుల్య ఆహారం తీసుకోవడమే మేలు. కానీ ఒక్కోసారి జిహ్వ చాపల్యం చంపుకోలేక ఇష్టమైన జంక్ ఫుడ్‌ని లాగించేస్తాం. పైగా ఏదో అప్పుడప్పుడే కదా అని సర్ది చెప్పుకుని మరీ తినేస్తాం. ఆ తర్వాత వర్కౌట్లు చేసి అదనపు కేలరీలను తగ్గించే యత్నం చేస్తాం. కానీ ఇలా తినడం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ప్రయోగాత్మకంగా తెలియజేశాడు ఓ యూట్యూబర్. అందుకోసం అతడు ఏం చేశాడంటే..ఫిట్నెస్ కంటెంట్ క్రియేటర్ అయిన 30 ఏళ్ల కెనడియన్ టెన్నిసన్ ఓ విచిత్రమైన ఫుడ్ ఛాలెంజ్‌ని తీసుకున్నాడు. ఆయన 50 గంటల ఫాస్ట్ ఫుడ్ మారథాన్ సవాలును స్వీకరించాడు. అందుకోసం తన బ్రేక్‌ఫాస్ట్ నుంచి లంచ్, డిన్నర్‌తో సహా మొత్తం ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఐటెమ్స్ వంటివి మాత్రేమ తీసుకున్నాడు. వాటిలో తృణధాన్యాలు, పెరుగు వంటివి కూడా ఉన్నాయి. తొలిరోజు అలాంటి ఫుడ్ తింటూ 8 వేల కేలరీలను వినియోగించినట్లు పేర్కొన్నాడు. ఈ ఆహారం కారణంగా తన మానసిస్థితి, శక్తి స్థాయిలోని ప్రతికూల భావాలను గుర్తించినట్లు తెలిపాడు. రెండో రోజు కూడా ఇలానే తినడం వల్ల గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడ్డట్లు తెలిపాడు. ఎక్కువ మొత్తంలో కేలరీలను పెంచినప్పటికీ పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించాడు. ఈ ఫుడ్ కారణంగా ముఖంపై మొటిమలు రావడం మొదలయ్యిందని వెల్లడించాడు. ఆ తర్వాత కండరాలు తిమ్మిరిగా ఉండి బద్ధకంగా ఏదో తెలియని నీరసంతో ఇబ్బంది పడుతున్నట్లుగా అనిపించిందని వెల్లడించాడు. అలాగే ఈఫుడ్కి తగ్గట్టు చేయాల్సిన పదివేల స్టెప్స్‌కు బదులుగా తాను 4 వేల స్టెప్స్ నడిచినట్లు పేర్కొన్నాడు. ఈ రెండు రోజుల ఛాలెంజ్ తదనంతరం మూడో రోజు జిమ్సెషన్ అత్యంత భయంకరమైనది. ఎందుకంటే ఈ అధిక కేలరీల ఫుడ్ కారణంగా విపరీతమైన చెమట్లు పట్టి..వర్కౌట్లు చేయడం చాలా కష్టంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు.అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల కలిగే పరిణమాల గురించి తెలియజేసేందుకే ఈ 50 గంటల ఫాస్ట్ ఫుడ్ ఛాలెంజ్‌ని స్వీకరించానని యూట్యూబర్ వెల్లడించాడు. అందుకు సంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఆహారంతో మిళితమైన శారీరక సంబంధం గురించి చాలా క్లియర్‌గా వివరించి మరీ చెప్పారంటూ సదరు యూట్యూబర్‌ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: సులభంగా ఇమ్యూనిటీ పెంపొందించుకోండి ఇలా..!) -
హర్ష సాయి కేసులో బిగ్ ట్విస్ట్..
-
హర్ష సాయి సంచలన ఆడియో లీక్
-
యూట్యూబర్ హర్ష అరెస్ట్
-
Supreme Court: కులం పేరిట వేధిస్తేనే... ఎస్సీ, ఎస్టీ కేసు
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వేధింపుల (నిరోధక) చట్టం వర్తింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ప్రత్యేకించి కులం పేరిట వేధించినప్పుడు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుంది. అంతే తప్ప కేవలం బాధితులు ఆ సామాజికవర్గాలకు చెందినంత మాత్రాన వర్తించబోదు‘ అని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అభియోగాలు ఎదుర్కొంటున్న షాజన్ స్కారియా అనే యూట్యూబర్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేరళకు చెందిన ఎమ్మెల్యే పీవీ శ్రీనిజన్ ఆయనపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద క్రిమినల్ కేసు పెట్టారు. మరుణదాన్ మలయాళీ అనే యూట్యూబ్ చానల్ నడుపుతున్న షాజన్ అందులో పెట్టిన ఒక వీడియోలో తనను ఉద్దేశపూర్వకంగా అవమానించారని ఆరోపించారు. షాజన్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కేరళ హైకోర్టు తిరస్కరించింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం, ‘బెదిరింపులకు, లేదా అవమానాలకు గురైన వ్యక్తి కేవలం ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందినంత మాత్రాన సదరు నేరానికి ఎస్సీ, ఎస్టీ వేధింపుల (నిరోధక) చట్టం సెక్షన్ 3(1)(ఆర్) వర్తించబోదు. కులం పేరిట అవమానించినప్పుడు, వేధించినపుడు మాత్రమే వర్తిస్తుంది. సదరు చట్టంలో పేర్కొన్న మేరకు అంటరానితనం వంటి దురాచారాన్ని పాటించినప్పుడు, అగ్ర కులస్తులు మైల, పవిత్రత అంటూ నిమ్నవర్ణాల వారిపట్ల కులం పేరిట దురహంకారపూరితంగా ప్రవర్తించినప్పుడు ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీలను కులం పేరిట వేధించకుండా చూసేందుకే కఠినమైన సెక్షన్లు చేర్చారు. కనుక ఈ చట్టం వర్తింపులో నిందితుని ఉద్దేశం చాల ముఖ్యం‘ అని స్పష్టం చేసింది. ‘షాజన్ కేసులో అదేమీ కని్పంచడం లేదు. సదరు వీడియో ద్వారా ఎస్సీ, ఎస్టీల పట్ల ఉద్దేశపూర్వకంగా ద్వేషం, శతృత్వ భావం, దురుద్దేశాల వంటివి వెళ్లగక్కినట్టు ఎక్కడా రుజువు కాలేదు. ఎమ్మెల్యేను కేవలం వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకున్నారు‘ అని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులో ప్రాథమికంగా అభియోగాలు నిర్ధారణ అయితే తప్ప ముందస్తు బెయిల్‌ను తిరస్కరించలేమని స్పష్టం చేసింది. -
నడిరోడ్డుపై చీప్ ట్రిక్స్.. పట్టించుకోని పోలీసులు
-
Deepthi Sunaina: సాగర్ ఒడ్డున దీప్తి సునైన.. ముద్దొచ్చేంత అందంగా! (ఫొటోలు)
-
రోడ్డు ప్రమాదంలో యూ ట్యూబర్ మృతి
తొండంగి: బైక్ రైడర్‌గా, యూట్యూబర్‌గా సోషల్ మీడియాలో పేరొందిన పొగాకు సోంబాబు (క్రేజీ సొంబాబు) బైక్‌పై వెళ్తుండగా కాకినాడ జిల్లా బెండపూడి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకా రం.. నెల్లూరుకు చెందిన పొగాకు సోంబాబు (35) వృత్తి రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ప్రకృతి అందాలను చిత్రీకరించి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేవారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం రాజమహేంద్రవరంలో స్నేహితుల వివాహానికి తోటి బైక్రైడర్స్తో కలిసి హాజరయ్యారు. అనంతరం బైక్‌లపై దునపాటి రాజేష్ , వెంకట్‌లతో కలసి ఏజెన్సీ ప్రాంతమైన లంబసింగి, అరకు తదితర ప్రాంతాలను సందర్శించారు. అనంతరం విశాఖ నుంచి రాజమహేంద్రవరం బయలుదేరారు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. సోంబాబు బైక్‌ను జాతీయ రహదారిపై బెండపూడి వై.జంక్షన్ వద్ద భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అదుపుతప్పి పడిపోయాడు. దీంతో తీవ్రగాయాలైన సోంబాబును 108 అంబులెన్స్‌లో తుని ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తొండంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యూస్ కోసం నెమలి కూర!
-
‘నెమలి కర్రీ’ వీడియోతో బుక్కయ్యాడు
తంగళ్లపల్లి (సిరిసిల్ల): ‘ట్రెడిషినల్ పికాక్ కర్రీ రెసిపీ’ అంటూ ఓ యూట్యూబర్ తన చానల్లో వీడియో పోస్టు చేసి అడ్డంగా బుక్కయ్యాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రణయ్‌కుమార్ శ్రీటీవీ అనే యూట్యూబ్ చానల్లో నెమలి వంట చేయడం గురించి వీడియో పోస్టు చేశాడు. ఈ విషయంపై ‘యూట్యూబ్‌లో నెమలికూర వంటకం’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన కథనానికి అటవీ అధికారులు స్పందించారు.తంగళ్లపల్లిలో వంట చేసిన స్థలాన్ని పరిశీలించి, ప్రణయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి కల్పనాదేవి మాట్లాడుతూ, వంటకాన్ని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నెమలి పేరుతో వీడియో పెట్టినందుకు అటవీచట్టం ప్రకారం కేసు నమోదు చేశామని, పలు అటవీ జంతువులు, పక్షుల వంటకాల వీడియోలు కూడా పోస్టు చేసినట్లు గుర్తించామన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. తనిఖీలలో ఫారెస్టు సెక్షన్ అధికారి శ్రవణ్‌కుమార్, బీట్ ఆఫీసర్ ఎంఏ ఖలీమ్, సిబ్బంది పాల్గొన్నారు. -
యూట్యూబ్‌లో నెమలికూర వంటకం
తంగళ్లపల్లి (సిరిసిల్ల): జాతీయ పక్షిని చంపడం చట్టరీత్యా నేరం. అయితే ఓ యూట్యూబర్ ఏకంగా ‘ట్రెడిషినల్ పికాక్ కర్రీ రెసిపీ’ అంటూ తన యూ ట్యూబ్ చానల్లో పోస్టు చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రణయ్‌కుమార్ అనే వ్యక్తి కొన్నా ళ్లుగా శ్రీటీవి అనే యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు.అయితే శనివారం తన యూట్యూబ్ చానల్లో ‘నెమలి కూర సంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి’ అంటూ పెట్టిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన వారందరూ విస్తుపోయారు. అంతేకాకుండా అడవిపంది కూర వండటం గురించిన వీడియో కూడా సదరు యూట్యూబ్ చానల్లో దర్శనమివ్వడం గమనార్హం. పోలీసులు, అటవీశాఖ అధికారులు ఈ వీడియోపై నిజానిజాలు తెలుసుకొని సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. -
30 కోట్ల సబ్బర్లను సాధించిన తొలి యూట్యూబర్ ఇతడే..!
-
టాప్ 10 ఇండియన్ యూట్యూబర్స్ లిస్ట్‌లో.. 'శ్రుతి అర్జున్ ఆనంద్'!
శ్రుతి.. ఉత్తరప్రదేశ్, ఝాన్సీలో పుట్టిపెరిగింది. కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. మేకప్, ఫ్యాషన్ అంటే చాలా ఆసక్తి. అందుకే తన తొలి వీడియోను వాటి మీదే అంటే.. హెయిర్ స్టయిల్స్ మీదే తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. అప్పుడు ఆమె అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది.ఆ వీడియోకు ఆమె ఊహించని రీతిలో వ్యూస్, షేర్స్ వచ్చాయి. ఆ ప్రోత్సాహం, ఉత్సాహంతో ‘ShrutiArjunAnand’ పేరుతో యూట్యూబ్ చానెల్‌ను స్టార్ట్ చేసింది. 2013లో ఆమె ఇండియా వచ్చేవరకు ఆ చానెల్లో ఎక్కువగా ఫ్యాషన్ కంటెంట్ వీడియోలే అప్లోడ్ అయ్యేవి. ఇండియా వచ్చేశాక యూట్యూబ్ చానెల్ మీద ఫుల్ టైమ్ వర్క్ చేయడం మొదలుపెట్టింది.డే టు డే లైఫ్‌లోని పరిస్థితులు, కుటుంబ విషయాలను కథానాంశాలుగా తీసుకుని కామెడీ టచ్‌తో వీడియోలుగా తీసి తన చానెల్లో అప్లోడ్ చేస్తోంది. తన చానెల్కున్న లక్షల వ్యూస్, మిలియన్ల సబ్స్క్రైబర్స్తో ఆమె 2016లోనే టాప్ 10 ఇండియన్ యూట్యూబర్స్ లిస్ట్‌లో చేరిపోయింది. ఇప్పుడు శ్రుతి.. దేశంలోకెల్లా రిచెస్ట్ యూట్యూబర్స్లో ఒకరు.ఒక్క శ్రుతే కాదు ఆమె భర్త అర్జున్, కూతురు కూడా టాప్ యూట్యూబర్సే. ఇంకా చెప్పాలంటే ఆమె కుటుంబమంతా యూట్యూబర్సే. ‘ShrutiArjunAnand Digital Media’ ప్రైవేట్ లిమిటెడ్, ‘Shruti Makeup & Beauty’ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు కంపెనీలను స్థాపించి తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలసి పనిచేస్తూ సోషల్ మీడియా వ్యూయర్స్ నచ్చే.. మెచ్చే కంటెంట్‌ని క్రియేట్ చేస్తోంది శుత్రి అర్జున్ ఆనంద్. -
శ్రీవారి భక్తులపై ప్రాంక్ వీడియో..
-
ప్రణీత్ హనుమంతు పై పోక్సో చట్టం
-
రుచులతో ప్రయాగాలు చేయడం.. కబితా సింగ్ అభిరుచి!
రుచులతో ప్రయాగాలు చేయడం కబితా సింగ్ అభిరుచి. అందులో ఆమెకు అపారమైన ప్రజ్ఞ ఉంది. కబితా గరిట పట్టిందంటే చాలు నలభీమ పాకం ఇలాగే ఉంటుందేమో అన్నంత టేస్టీగా ఘుమఘుమలాడిపోతుంది ఆ వంటకం. అలా తను చేసే డిఫరెంట్ వంటకాల గురించి లోకానికి చెప్పాలనుకుంది.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయితే పర్ఫెక్ట్ అనుకుంది. అందుకే 2014లో Kabita's Kitchen పేరుతో యూట్యూబ్ చానెల్‌ను స్టార్ట్ చేసింది. అందులో ఆమె చేప్పే 10 మినిట్స్ ప్రెషర్ కుకర్ రెసిపీస్ నుంచి స్ట్రీట్ ఫుడ్ దాకా, నాన్ ఆయిలీ ఆలూ పాలక్ నుంచి పాస్తా, పిజ్జా, సాలిడ్స్, సూప్స్ దాకా అన్ని రకాల వంటలకు ఊహించని రీతిలో రెస్పాన్స్ మొదలైంది. 2017కల్లా మిలియన్ల వ్యూస్‌కి చేరుకుంది. ఇప్పుడు ఆమె చానెల్‌కి (2023 లెక్కల ప్రకారం) కోటీ 34 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు.ఈ పాపులారిటీ వల్ల ఆమె చానెల్‌కి బ్రాండ్ ప్రమోషన్స్ పెరిగాయి. 2023 గణాంకాల ప్రకారం యాడ్స్ వల్ల ఆమె ఏడాదికి 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఆర్జిస్తోందని అంచనా. అకార్డింగ్ టు వేరియస్ వెబ్‌సైట్స్ Kabita's Kitchen వాల్యూ 5 నుంచి 6 కోట్లు ఉండొచ్చట. చూశారా.. తిరగమోతకూ తిరుగులేని విలువుంటుంది. అందుకే వంటలో నైపుణ్యాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి!ఇవి చదవండి: Sharvari Wagh: అది సినిమానా? ఓటీటీనా? టీవీ సీరియలా అని చూడను.. -
ప్రయాణాలపై ఇష్టంతోనే.. ఈ స్థాయికి!
ముంబైలో హోటల్ మేనేజ్మెంట్ చేసిన నిఖిల్‌కు ప్రయాణాలు చేయడం అంటే బోలెడు ఇష్టం. ఎంత ఇష్టం అంటే రోజూ 50 నుంచి 100 కిలోమీటర్లు ఎక్కడో ఒకచోటుకి వెళ్లిరావాల్సిందే. అయితే ఒకానొక రోజు మాత్రం... ‘ఎప్పుడూ ముంబై మాత్రమేనా.. ఔట్‌సైడ్ ముంబై కూడా వెళ్లాలి’ అనుకున్నాడు.అలా బైక్‌పై ఆజ్మీర్, బెంగళూరుకు వెళ్లాడు. ఇక అప్పటి నుంచి మొదలైన ఔట్‌సైడ్ ముంబై ప్రయాణాలు ఆగలేదు. ఈ ప్రయాణాల పుణ్యమా అని మన దేశంలోని ‘మోటో వ్లాగింగ్’ ప్రఖ్యాత యూట్యూబర్లలో ఒకరిగా నిఖిల్ శర్మ పేరు తెచ్చుకున్నాడు.నిఖిల్ ఫ్యాన్ బేస్ విషయానికి వస్తే..యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఫాలోవర్ల సంఖ్య లక్షలలో ఉంది. తాను వీడియోలు చేయడం మొదలుపెట్టినప్పుడు మన దేశంలో వ్లాగింగ్‌కు పెద్దగా ్రపాచుర్యం లేదు. డైలీ వ్లాగింగ్ చేయడం ద్వారా ఆడియెన్స్‌తో ఎప్పటికప్పుడూ టచ్‌లో ఉండేవాడు. మన దేశంలో ఏ మూలన ఉన్న ఆడియెన్స్ అయిన నిఖిల్ చెబుతున్న కబుర్లు విని ఊహాల్లోనే తాను ఉన్న చోటుకి వెళ్లేవారు.వ్లాగింగ్‌కు ఆవలి ప్రపంచంలోకి వెళితే..నిఖిల్‌కు నటన అంటే ఇష్టం. బాలీవుడ్ సినిమాల్లో, టీవీ సీరియల్స్‌లో నటించాడు. ఫ్లైట్ అటెండెంట్‌గా కొంతకాలం ఉద్యోగం కూడా చేశాడు. ఉద్యోగం మానేసినప్పుడు తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు. అదే సమయంలో తండ్రి చనిపోవడంతో కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత తన భుజస్కంధాలపై పడింది. ‘వ్లాగింగ్ వదలేయ్. డబ్బు సంపాదనపై దృష్టి పెట్టు’ అని కొద్దిమంది సలహా ఇచ్చారు. అయితే ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తన ప్యాషన్‌కు ఎప్పుడూ దూరం కాలేదు.ఆ ప్యాషనే తనను ప్రతిష్ఠాత్మకమైన యూట్యూబ్ ఫ్యాన్స్ ఫెస్టివల్లో పాల్గొనేలా చేసింది. ఔట్‌సైడ్ ముంబై యాత్రలు చేస్తే చాలు అనుకున్న అతడిని అమెరికా, కెనడా, ఇండోనేషియ, సౌత్ కొరియా, జపాన్... మొదలైన దేశాలకు వెళ్లేలా చేసింది. ‘ఫోర్బ్స్ 30 అండర్ 30–ఇండియా’ జాబితాలో చోటు సంపాదించేలా చేసింది. క్లాతింగ్ బ్రాండ్ లేబుల్ ఎంఎన్తో డిజైనర్, ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిరూపించుకున్న నిఖిల్... ‘ఎన్ని చేసినా వ్లాగింగ్ అనేది నా ప్యాషన్’ అంటున్నాడు.ప్రతిభతో పాటు..మన ప్యాషన్‌కు ప్రతికూల పరిస్థితులు ఎదురు కావచ్చు. రాజీ పడి వేరే దారి చూసుకోవడం సులభం. రాజీ పడకుండా నచ్చిన దారిలోనే వెళ్లడం కష్టం. అయితే ఆ కష్టం ఎప్పుడూ వృథా పోదు. తప్పకుండా ఫలితం ఇస్తుంది. ప్రతిభతో పాటు ఓపిక కూడా ఉండాలి. తొందరపాటు వల్ల నష్టపోయిన ప్రతిభావంతులు ఎంతోమంది ఉన్నారు. – నిఖిల్ శర్మఇవి చదవండి: -
మొదటి భార్యతో విడాకులు.. అతనితో ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్..!
కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన భామ సునయన. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉంది. గతేడాది రెజీనా చిత్రంతో పలకరించిన ఈ బ్యూటీ ఈ ఏడాది ఇన్స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. అయితే ఇటీవల తనకు ఎంగేజ్మెంట్ జరిగిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తనకు కాబోయే భర్త వేలిని పట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన నిశ్చితార్థం జరిగిందని పేర్కొంది. అయితే తను పెళ్లి చేసుకోబోయేది ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు. తాజాగా ఆమె ప్రముఖ యూట్యూబర్, దుబాయ్‌కు చెందిన ఖలీద్ అల్ అమెరీతో నిశ్చితార్థం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఖలీద్ ఇటీవల జూన్ 26న అమ్మాయి వేలికి డైమండ్ రింగ్‌తో చేతులు పట్టుకున్న ఫోటోను పోస్ట్ చేశాడు.దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది.కాగా.. సునయన 2005లో కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో నటప్రయాణం మొదలు పెట్టింది. తనకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా కాదలిల్ విడుదెన్(2008). నీర్పరవై చిత్రం తనను మరో మెట్టు ఎక్కించింది. తెలుగులో పెళ్లికి ముందు ప్రేమ కథ, రాజరాజ చోర సినిమాలతో పాటు చంద్రగ్రహణం, మీట్ క్యూట్ సిరీస్‌లతో సినీ ప్రియులకు మరింత దగ్గరైంది.మొదటి భార్యతో విడాకులు..కాగా.. జూలై 1న ఖలీద్ అల్ అమెరీ మాజీ భార్య సలామా మొహమ్మద్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఒ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ తాను, ఖలీద్ విడాకులు తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీనే కోర్టు విడాకులు మంజూరు చేసిందని ఆమె పేర్కొంది. దుబాయ్‌కు చెందిన ఖలీద్ అల్ అమెరికీ సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. View this post on Instagram A post shared by Sunainaa (@thesunainaa) View this post on Instagram A post shared by Khalid Al Ameri (@khalidalameri) -
రైతు వర్సెస్ యూట్యూబర్.. పీఎస్‌కు చేరిన పంచాయితీ
పెద్దపల్లి, సాక్షి: వాడలో మొదలైన చిన్న గొడవ.. చిలికి చిలికి గాలివానగా మారింది. హైవే మీదకు చేరి ఆందోళన చేపట్టే దాకా పోయింది. చివరకు పోలీసుల ఎంట్రీతో ఆ పంచాయితీ.. పోలీస్ స్టేషన్‌కు చేరింది. పెద్దపల్లి పట్టణంలో గౌరెడ్డిపేటకు చెందిన ఓ రైతు తన ఎడ్లబండిని రోడ్డుపై ఉంచాడు. దీంతో అక్కడ వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈలోపు స్థానికంగా ఉండే ఓ యూట్యూబర్ ఆవేశంతో ఊగిపోతూ అక్కడికి వచ్చాడు. సదరు రైతును దుర్భాషలాడుతూ కొట్టాడు. అది భరించలేకపోయిన ఆ రైతు.. ఆ ఎడ్ల బండితో రాజీవ్ రహదారిపై చేరి ఆందోళన చేపట్టాడు. ఈ క్రమంలో అక్కడా ట్రాఫిక్ జామ్ అయ్యింది.విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగారు. రైతుతో పాటు సదరు యూట్యూబర్‌ను అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు తరలించి పంచాయితీ నిర్వహించారు. అయితే ఈ వివాదం ఎలా ముగిసిందన్నది మాత్రం తెలియాల్సి ఉంది. -
Faisal Khan: ఇటు సోషల్ మీడియా.. అటు సోషల్ యాక్టివిటీస్‌లోనూ ఖాన్ సర్ ఫస్టే!
అసలు పేరు ఫైసల్ ఖాన్. టీచర్, యూట్యూబర్. ఖాన్ సర్, ఖాన్ సర్ పట్నాగా పాపులర్. సొంతూరు.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్. అలహాబాద్ యూనివర్సిటీలో సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ చేశాడు. 2019లో ‘ఖాన్ జీఎస్ రీసెర్చ్ సెంటర్’ పేరుతో యూట్యూబ్ చానెల్‌ను స్టార్ట్ చేశాడు.స్కూళ్లు, కాలేజీలు బంద్ అయిన కరోనా లాక్డౌన్ టైమ్‌లో అకడమిక్స్ని టీచ్ చేస్తూ ఖాన్ చేసిన వీడియోలు ఇటు యూట్యూబ్‌లో అటు ఇన్‌స్టాలో వైరలై అతనికి బోలెడంత మంది ఫాలోవర్స్‌ని.. సబ్‌స్క్రైబర్స్‌ని సంపాదించి పెట్టాయి. ఎంతటి కష్టమైన, క్లిష్టమైన సబ్జెక్ట్‌ని అయినా అరటి పండు మింగినంత అలవోకగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఖాన్ సర్ యూఎస్పీ. అందుకే అతని యూట్యూబ్ చానెల్‌కి స్టూడెంట్సే కాదు వరుణ్ ధవన్ లాంటి సినిమా యాక్టర్స్ కూడా సబ్‌స్క్రైబర్సే!సోషల్ మీడియాలోనే కాదు సోషల్ యాక్టివిటీస్‌లోనూ ఖాన్ సర్ ఫస్టే! స్కూల్‌కి వెళ్లలేని పేద పిల్లలకు ఫ్రీగా టీచ్ చేస్తాడు. ఆర్థికావసరాల్లో ఉన్న వాళ్లకు తనకు తోచిన హెల్ప్ చేస్తాడు. యూట్యూబ్ ద్వారా ఖాన్ సర్ నెలకు 15 లక్షల రూపాయలు సంపాదిస్తాడని అంచనా! ఆర్జనే కాదు సాయమందించే మనసూ ముఖ్యమే అని ప్రూవ్ చేస్తున్నాడు ఖాన్ సర్!ఇవి చదవండి: Pooja Singh: పూజా సింగ్ టు.. రింకీ దూబే.. బై శాన్వికా..! -
Nikhil Anil Brijlal Kumar Sharma: ముంబైకర్ నిఖిల్..
నిఖిల్ అనిల్ బ్రిజ్‌లాల్ కుమార్ శర్మ aka నిఖిల్ ముంబైకర్.. మోటో వ్లాగర్, బిజినెస్‌మన్. టాప్ టెన్ రిచెస్ట్సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ర్స్ ఆఫ్ ఇండియాలో ఒకడు. హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసిన ఈ ముంబై వాసి కొన్నాళ్లు ఖతార్ ఎయిర్వేస్లో ఫ్లయిట్ అటెండెంట్‌గా పనిచేశాడు.చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీదున్న ఇంట్రెస్ట్ ఆ ఎయిర్వేస్ కొలువులో కుదురుగా ఉండనివ్వలేదు. దాంతో ముంబైకి తిరిగొచ్చి.. నటనలో లక్‌ని పరీక్షించుకున్నాడు. అట్టే అవకాశాలు రాలేదు. వీడియోగ్రఫీ అంటే కూడా ఆసక్తి ఉండటంతో మైండ్‌ని అటువైపు మోల్డ్ చేసుకున్నాడు. యూట్యూబ్‌ని వేదికగా మలచుకున్నాడు. మోటర్ బైక్ మీద తను వెళ్లిన ప్రదేశాలను షూట్ చేస్తూ ఆ వీడియోలను తన యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేయసాగాడు. అలా అతని లద్దాఖ్ మోటో ట్రిప్ వ్లాగ్ తన చానెల్ సబ్‌స్క్రైబర్స్‌ని అమాంతం పెంచేసింది. పాపులారిటీని తెచ్చిపెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న తన ఫ్యాన్స్‌ని కలవడానికి నిఖిల్ ఓ2ఓ (కన్యాకుమారి టు కశ్మీర్) బైక్ రైడ్ చేశాడు. ‘ముంబైకర్ నిఖిల్’ పేరుతోనే కీ చైన్స్, బెల్ట్‌ల బ్రాండ్‌ని స్థాపించాడు. ఇవి ఎక్స్క్లుజివ్గా అమెజాన్లోనే దొరుకుతాయి.ఇవి చదవండి: Revathi Pillai: తానొక.. డిజిటల్ స్టార్.. అండ్ ఇన్‌స్టా ఇన్ఫ్లుయెన్సర్.. -
Deepthi Sunaina: నలుపు రంగు డ్రెస్‌లో 'పిచ్చెక్కిస్తున్న' సోషల్ స్టార్ దీప్తి సునైనా (ఫొటోలు)
-
Nisha Madhulika: దేశంలోకెల్లా ఫిఫ్త్ రిచెస్ట్ యూట్యూబర్...
నిషామధులిక.. లీడింగ్ యూట్యూబ్ షెఫ్. వెజిటేరియన్ రెసిపీస్కి ఫేమస్. యూట్యూబ్ చానెల్ పెట్టేకంటే ముందు ఆమె తన భర్త కంపెనీలో అకౌంట్స్ చూసేవారు. తొలి నుంచి రకరకాల వంటకాలు చేయడమంటే ఆమెకు ఆసక్తి. సెలవు రోజు వచ్చిందంటే చాలు వెరైటీ వంటల ప్రయోగాలకు పోపు పెట్టేవారు.ఓసారి ఇలాగే కొత్త వంటకాన్ని వండుతూ ‘ఈ రెసిపీని తనలా కుకింగ్ హాబీ ఉన్నవాళ్లకు షేర్ చేస్తే’ అనే ఆలోచన కలిగింది ఆమెకు. వాళ్లబ్బాయితో చెప్పింది. వెబ్సైట్ ఒకటి రూపొందించి ఇచ్చాడు తల్లికి కానుకగా. ఇక్క అక్కడి నుంచి ఆమె అభిరుచి ప్రయాణం మొదలైంది.తనకు తెలిసిన, తను ఎక్స్పరిమెంట్ చేసిన వంటకాల రెసిపీలతో బ్లాగింగ్ స్టార్ట్ చేశారామె. ఆ తర్వాత మూడేళ్లకే అంటే 2011లో ఆమె పేరు మీదే యూట్యూబ్‌లో వంటల చానెల్‌నూ ప్రారంభించారు. షార్ట్ టైమ్‌లోనే మిలియన్ల సబ్‌స్క్రైబర్స్‌ని సాధించారు. ఈ యేడు ఫిబ్రవరి నాటికి ఆమె చానెల్‌కి ఉన్న సబ్‌స్కైబర్స్ సంఖ్య దాదాపు కోటీ 41 లక్షలు (జాగరణ్ వెబ్సైట్ ప్రకారం).దేశంలోకెల్లా ఫిఫ్త్ రిచెస్ట్ యూట్యూబర్. జాగరణ్ వెబ్సైట్ ప్రకారం ఆమె యూట్యూబ్ చానెల్ నెట్ వర్త్ 43 కోట్లు. సబ్జెక్ట్ ఏదైనా సరే.. ఇంట్రెస్ట్ ఉంటే టెక్నో యుగం బారియర్ కాదని.. సెకండ్ యూత్ కూడా ఆన్ పార్ విత్ యూత్ ఉండొచ్చని ప్రూవ్ చేశారు నిషామధులిక.ఇవి చదవండి: Namita Dubey: నిజమైన యాక్టర్స్.. తమ పాత్ర గురించే ఆలోచిస్తారు! -
Gaurav Chaudhary: కోట్ల యూట్యూబ్ సబ్‌స్క్రైబర్స్‌ని సొంతం చేసుకున్నాడు.. ఎలా అంటే?
యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్‌చేసి ఎందరో ముందుకు వెళ్లినవారు, మధ్యలోనే నిలపివేసినవారు, మళ్ళీ కొనసాగించినవారున్నారు. కానీ కోట్ల సబ్‌స్క్రైబర్స్‌ని పొందినవారు ఎందరున్నారు? ఎవరున్నారు? అనే సందేహానికి ఈ యూట్యూబరే.. నిదర్శనం. మరి అతని గురించి తెలుసుకుందామా..'గౌరవ్ చౌధరీ' రిచెస్ట్ ఇండియన్ టెక్ యూట్యూబర్. ‘టెక్నికల్ గురూజీ’ అనే యూట్యూబ్ చానెల్‌తో పాపులర్. దీన్ని 2015లో స్టార్ట్ చేశాడు. కష్టమైన టెక్నికల్ అంశాలను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఇతను ఎక్స్పర్ట్.ఈ స్కిల్‌తోనే 2017 కల్లా కోటి మంది సబ్‌స్క్రైబర్స్‌ని సంపాదించుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత వ్యూస్ గెయిన్ చేస్తోంది అతని చానెల్. 2024, మార్చి నాటికి రెండు కోట్ల 35 లక్షల మంది సబ్స్క్రైబర్స్తో టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో ఒకడిగా ఉన్నాడు. టెక్ కేటగరీలో తొలి నేషనల్ క్రియేటర్స్ అవార్డ్‌ను అందుకున్నాడు.అతని నెట్ వర్త్ 360 కోట్లకు పైమాటే! రాజస్థాన్‌లోని అజ్మేర్ అతని సొంతూరు. 16 ఏళ్లకే కోడింగ్‌లో ఆరితేరాడు. బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో మైక్రోఎలక్ట్రానిక్స్లో గ్రాడ్యుయేషన్ చేశాడు. కోడింగ్‌లో తనకున్న నైపుణ్యంతో దుబాయ్‌లోనే డిజిటల్ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు.సోషల్ మీడియా అనగానే ఎంటర్టైన్మెంటే కాదు సీరియస్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. వాటితోనూ వ్యూస్ అండ్ క్యాష్‌ని రాబట్టుకోవచ్చని నిరూపించాడు!ఇవి చదవండి: కలే నిజమైంది.. ప్రాణాలు కాపాడింది!