YSR Kanti Velugu
-
వరంగా జగనన్న ఆరోగ్య సురక్ష
-
వైఎస్సార్ కంటి వెలుగు మూడో విడతపై దృష్టి
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం మూడో విడతను ఈ ఏడాది మే నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్దేశించుకున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అదనంగా స్క్రీనింగ్ బృందాలను సమకూర్చడం లాంటి అంశాలపై దృష్టి సారించారు. సామూహిక కంటి పరీక్షల ద్వారా 5.60 కోట్ల మంది ప్రజల్లో నేత్ర సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆరు దశల్లో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించే ప్రణాళిక రూపొందించారు. తొలి రెండు దశల్లో ఇలా తొలి రెండు దశల్లో 60,393 పాఠశాలల్లో 66,17,613 మంది విద్యార్థులకు కంటి సమస్యలు గుర్తించేందుకు స్క్రీనింగ్ నిర్వహించారు. నేత్ర సమస్యలతో బాధపడుతున్న 1,58,227 మందికి ప్రభుత్వం ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేసింది. 310 మంది విద్యార్థులకు కేటరాక్ట్ సర్జరీలు చేశారు. కంటి వెలుగు ద్వారా అత్యధికంగా బీసీ సామాజిక వర్గాలకు చెందిన 34 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. ఇతర విద్యార్థుల్లో ఓసీలు 14.42 లక్షలు, ఎస్సీలు 13.17 లక్షలు, ఎస్టీలు 4.50 లక్షల మంది ఉన్నారు. మూడో విడతలో 56.88 లక్షల మందికి స్క్రీనింగ్ రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన 56,88,424 మంది వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించేలా మూడో విడత కార్యక్రమాన్ని 2020 ఫిబ్రవరిలో ప్రారంభించారు. ఇప్పటి వరకూ 22,91,593 మందికి పరీక్షలు చేశారు. వీరిలో 10,91,526 మందికి మందుల ద్వారా నయం చేయవచ్చని గుర్తించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 10,21,007 మందికి కళ్లద్దాలు అవసరం కాగా 8.50 లక్షల మందికి పంపిణీ పూర్తైంది. 1,66,385 మంది వృద్ధులు శుక్లాలతో బాధ పడుతున్నట్టు గుర్తించి ఉచితంగా సర్జరీలు నిర్వహిస్తోంది. వేగంగా పూర్తయ్యేలా అదనపు బృందాలు వృద్ధులందరికి కంటి పరీక్షలు వేగంగా పూర్తి చేసేలా ప్రతివారం సమీక్ష నిర్వహిస్తున్నాం. మే నెలాఖరులోగా మూడో విడత పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాం. ఐదు నెలల్లో 33.96 లక్షల మంది స్క్రీనింగ్‌కు వీలుగా అదనపు బృందాలను నియమిస్తాం. పీఎంవోవో/పీఎంవోఏ రోజుకు 60 మందిని స్క్రీనింగ్ చేయాల్సి ఉంటుంది. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు స్క్రీనింగ్, కళ్లద్దాల పంపిణీ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటారు. పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లు తమ పరిధిలో రోజువారి స్క్రీనింగ్ కార్యక్రమాలను పర్యవేక్షించాలి. – డాక్టర్ యాస్మిన్, డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు రాష్ట్ర ప్రత్యేకాధికారి -
అవ్వాతాతల కంటికి వెలుగు
సాక్షి, అమరావతి: మలిసంధ్యలో కంటిచూపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు ‘డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు’ కార్యక్రమం చూపు ప్రసాదిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా 60ఏళ్లు పైబడిన వృద్ధులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తోంది. చూపు సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి మందులు, కళ్లద్దాలు అందించడంతో పాటు, కేటరాక్ట్ సర్జరీలు ఉచితంగా చేస్తోంది. రాష్ట్రంలోని 5.60 కోట్ల మందికి కంటి వైద్య పరీక్షలు ఉచితంగా చేయాలనే ఉద్దేశ్యంతో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ 2019 అక్టోబర్ 10న శ్రీకారం చుట్టారు. ఆరు దశల్లో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగా తొలి రెండు దశల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 66.17 లక్షల మంది పిల్లలకు వైద్య పరీక్షలు చేశారు. వీరిలో 1.58 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయడంతో పాటు, 300 మందికి పైగా పిల్లలకు సర్జరీలు చేశారు. 22.16 లక్షల మందికి పరీక్షలు ఇక మూడో దశలో.. 60 ఏళ్లు పైబడిన 56,88,424 మంది వృద్ధులకు కంటి పరీక్షలు చేయాలన్న లక్ష్యంతో 2020 ఫిబ్రవరిలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వీరిలో ఇప్పటివరకూ 22,16,031 మందికి పరీక్షలు పూర్తయ్యాయి. ఇందులో 10,42,457 మందికి మందుల ద్వారా నయమయ్యే సమస్యలున్నట్లు గుర్తించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 10,01,049 మందికి కళ్లద్దాలు అవసరం ఉండగా 8,31,584 మందికి పంపిణీ పూర్తయింది. అలాగే, 1,69,105 మంది వృద్ధులు శుక్లాల సమస్యతో బాధపడుతున్నట్లు వైద్య బృందాలు గుర్తించి వీరికి ప్రభుత్వమే ఉచితంగా కేటరాక్ట్ సర్జరీలు చేపడుతోంది. ఈ కార్యక్రమ నిర్వహణలో ఉమ్మడి విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే తొలిస్థానంలో ఉంది. ఈ జిల్లాలో 1.52 లక్షల మందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా 53.72 శాతం మందికి పూర్తయ్యాయి. అలాగే, 50.88 శాతం మందికి పరీక్షలు నిర్వహించి ఉమ్మడి వైఎస్సార్, 50.66 శాతంతో శ్రీకాకుళం జిల్లాలు తర్వాత స్థానంలో ఉన్నాయి. ఈ ఆస్పత్రులు వెరీ పూర్ కేటరాక్ట్ సర్జరీల నిర్వహణలో రాష్ట్రంలోని పలు ప్రభుత్వాస్పత్రులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తుంటే, మరికొన్ని ఆస్పత్రుల్లో అంతంతమాత్రంగానే సర్జరీలు జరుగుతున్నాయి. డీఎంఈ పరిధిలోని ఆస్పత్రులను పరిశీలిస్తే.. ఈనెల 15 నుంచి 21 మధ్య వారం రోజుల్లో 41 సర్జరీలతో విశాఖపట్నం రీజనల్ కంటి ఆస్పత్రి తొలిస్థానంలో ఉంది. కర్నూలు రీజినల్ కంటి ఆస్పత్రిలో 35 సర్జరీలు, గుంటూరు జీజీహెచ్‌లో 30 సర్జరీలు నిర్వహించారు. మరోవైపు.. ఎనిమిది మంది సర్జన్స్ ఉన్నప్పటికీ అనంతపురం జీజీహెచ్‌లో ఒక్క సర్జరీ కూడా నిర్వహించలేదు. ఇక వైద్య విధాన పరిషత్ విభాగంలో.. ఏలూరు జిల్లా ఆస్పత్రి 61 సర్జరీలు నిర్వహించి రాష్ట్రంలోనే తొలిస్థానంలో ఉంది. ఇదే విభాగంలోని గూడూరు, రామచంద్రాపురం, నరసరావుపేట, పాలకొల్లు, తణుకు, పాడేరు ఏరియా ఆస్పత్రులు, మార్కాపురం జిల్లా ఆస్పత్రిలో వారం రోజుల్లో ఒక్క సర్జరీ కూడా నిర్వహించలేదు. ఉచితంగా ఆపరేషన్ చేశారు నేను చేనేత కార్మికుడిని. కంటిచూపు మందగించడంతో కంటి వెలుగు కింద ప్రభుత్వం ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తోందని తెలిసింది. మా గ్రామంలో శిబిరం ఏర్పాటుచేసినప్పుడు పరీక్ష చేయించుకున్నాను. శుక్లాలు ఉన్నట్లు నిర్ధారించారు. ప్రభుత్వం ఇటీవలే కంటికి ఉచితంగా ఆపరేషన్ చేయించింది. ఇప్పుడు బాగా కనిపిస్తోంది. – సీహెచ్ మల్లికార్జునరావు, వీరులపాడు, ఎన్టీఆర్ జిల్లా వేగంగా పూర్తిచేయడానికి చర్యలు వృద్ధులందరికీ కంటి పరీక్షలు వేగంగా పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. వారం వారం కార్యక్రమంపై సమీక్షలు నిర్వహిస్తున్నాం. మందకొడిగా పరీక్షలు, సర్జరీలు జరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నాం. – డాక్టర్ యు. స్వరాజ్యలక్ష్మి, ప్రజారోగ్య సంచాలకులు -
మలిసంధ్యలో ‘వెలుగు’రేఖ
సాక్షి, అమరావతి: చూపు లేకపోతే లోకమంతా చీకటే. చూపు కొద్దిగా మందగించినా జీవనం కష్టమవుతూ ఉంటుంది. అందుకే వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యతాంశాల్లో రాష్ట్ర ప్రజల కంటి చూపు పరిరక్షణకు కూడా చోటిచ్చారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ కంటి వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2019 అక్టోబర్ 10న శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం పిల్లలు, వృద్ధులకు వరమే అయింది. ఆరు దశల్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో తొలి రెండు దశల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 66.17 లక్షల మంది పిల్లలను పరీక్షించారు. వీరిలో 1.58 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. 60 ఏళ్లు పైబడిన 56,88,424 మంది వృద్ధులకు కంటి పరీక్షల లక్ష్యంతో 2020 ఫిబ్రవరిలో మూడో దశ ప్రారంభించారు. ఈ కార్యక్రమం వడివడిగా జరుగుతోంది. 361 వైద్య బృందాలు నిత్యం పరీక్షలు నిర్వహిస్తున్నాయి. రోజుకు సగటున 2,500 మందికి పరీక్షలు చేస్తున్నారు. సుమారు 900 కేటరాక్ట్ (శుక్లాలు) ఆపరేషన్లు చేస్తున్నారు. ఇప్పటివరకు 33.90 శాతం అంటే 19,28,511 మంది వృద్ధులకు వైద్య పరీక్షలు చేశారు. వీరిలో చిన్న సమస్యలు ఉన్న 8,51,772 మందికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 9,22,373 మందికి కళ్లద్దాలు అవసరం ఉండగా 7,90,704 మందికి ఉచితంగా పంపిణీ పూర్తయింది. 1,54,366 మంది వృద్ధులు శుక్లాల సమస్యతో బాధపడుతున్నట్టు వైద్య బృందాలు గుర్తించాయి. వీరిలో 1,44,476 మందికి ప్రభుత్వం ఉచితంగా కేటరాక్ట్ సర్జరీలు చేయించింది. సెప్టెంబర్‌లోగా వృద్ధులందరికీ పరీక్షలు పూర్తి కంటి వెలుగు వైద్య పరీక్షలు, సర్జరీల్లో వేగం మరింతగా పెంచుతాం. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి వృద్ధులందరికీ కంటి పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఈ లోగానే పరీక్షలు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి, రాష్ట్ర అంధత్వ నివారణ జేడీ, కంటివెలుగు సంస్థ రూపాయి ఖర్చు లేకుండా వయసు పైబడటంతో కంటి చూపు మందగించింది. ప్రభుత్వం వైఎస్సార్ కంటి వెలుగు కింద మా పీహెచ్సీలో గత ఏడాది ఉచితంగా కంటి పరీక్షలు చేసింది. ఉచితంగా ఆపరేషన్ చేశారు. తర్వాత కళ్లద్దాలు ఇచ్చారు. ప్రస్తుతం బాగా కనిపిస్తోంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్ చేశారు. నాలాంటి ఎంతో మంది పేదలకు ఆర్థిక భారం లేకుండా చీకట్లు తొలగిస్తున్నారు. – గోపిశెట్టి బ్రహ్మయ్య, చాగంటివారిపాలెం, ముప్పాళ్ల మండలం, పల్నాడు జిల్లా -
AP: వృద్ధులకు వరం.. ‘వైఎస్సార్ కంటి వెలుగు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కంటిచూపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం వరంగా మారింది. ఈ కార్యక్రమం కింద 60 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటోంది. వచ్చే సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలోని వృద్ధులందరి కంటిచూపు సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో వైద్య, ఆరోగ్యశాఖ చురుగ్గా చర్యలు తీసుకుంటోంది. చదవండి: మీ ఆనందమే నా తపన: సీఎం జగన్ 13 జిల్లాల్లోని 378 వైద్యబృందాలు ఇప్పటివరకు 15,64,710 (అర్హుల్లో 27.51 శాతం) మందికి కంటిపరీక్షలు చేశాయి. 6.04 లక్షల మందికి మందుల ద్వారా నయం అయ్యే సమస్యలున్నట్లు గుర్తించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 8,23,264 మందికి కళ్లద్దాలు అవసరం ఉండగా 5,33,789 మందికి ఇచ్చారు. వైఎస్సార్ కంటివెలుగు పథకం మొదటి రెండు దశల్లో విద్యార్థులకు కంటిపరీక్షలు చేశారు. మొత్తం 70.36 లక్షల మంది (మొదటిదశలో 66 లక్షల మంది, రెండోదశలో 4.36 లక్షల మంది) విద్యార్థులకు కంటిపరీక్షలు నిర్వహించారు. 796 ఆపరేషన్లు చేసిన మచిలీపట్నం వైద్యుడు భాస్కర్‌రెడ్డి రాష్ట్రంలో 1,27,632 మంది వృద్ధులు శుక్లాల సమస్యతో బాధపడుతున్నట్టు వైద్యబృందాలు గుర్తించాయి. వీరందరికి ప్రభుత్వం ఉచితంగా కేటరాక్ట్ ఆపరేషన్లు చేయించింది. రాష్ట్రంలో వారానికి సుమారు ఆరువేల మందికి ఆపరేషన్లు చేస్తున్నారు. ఈ పథకం కింద అనేకమంది వైద్యులు అత్యధిక సర్జరీలు చేస్తున్నారు. గత ఏడాది నవంబర్ నుంచి 60 ఏళ్లు దాటిన 796 మందికి, 60 ఏళ్లలోపున్న 552 మందికి మొత్తం 1,348 ఆపరేషన్లు చేసి మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రి వైద్యుడు భాస్కర్‌రెడ్డి రాష్ట్రంలోనే తొలిస్థానంలో నిలిచారు. 964 సర్జరీలతో ఏలూరు ప్రభుత్వాస్పత్రి వైద్యుడు ఎ.ఎస్.రామ్, 921 సర్జరీలతో విజయనగరం జిల్లా ఆస్పత్రి వైద్యుడు కె.ఎన్.మూర్తి తరువాత స్థానాల్లో ఉన్నారు. గుంటూరు జీజీహెచ్‌లో ఒక ప్రొఫెసర్, పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు ఏరియా ఆస్పత్రి వైద్యుడు ఇప్పటివరకు ఒక్క సర్జరీ కూడా చేయని వారిలో ఉన్నారు. డీఎంఈ, ఏపీవీవీపీ పరిధిలో సర్జరీలు చేయని, మొక్కుబడిగా చేస్తున్న వైద్యులకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీచేశారు. సెప్టెంబర్ నాటికి లక్ష్యసాధన వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి వృద్ధులందరికీ కంటిపరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. ఈ లోగానే పరీక్షలు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వేగంగా పరీక్షలు పూర్తిచేయడానికి జిల్లా అధికారులకు సలహాలు, సూచనలు ఇస్తున్నాం. వైద్యుల వారీగా చేస్తున్న సర్జరీలను సమీక్షిస్తున్నాం. అవసరాన్ని బట్టి వైద్యులకు శిక్షణ ఇప్పిస్తున్నాం. – డాక్టర్ ఆర్.ఆర్.రెడ్డి, జేడీ, రాష్ట్ర అంధత్వ నివారణ, కంటివెలుగు సంస్థ -
అవ్వాతాతల కంటి పరీక్షలు వచ్చే ఏడాదికి పూర్తి
సాక్షి, అమరావతి: ఏపీలో తొలిసారిగా 60 ఏళ్లు దాటిన అవ్వాతాతలకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టింది. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలో 60 సంవత్సరాలు దాటిన 56.88 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేయాలని నిర్ణయించారు. మందులతో పాటు కంటి అద్దాలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు అన్నీ ఉచితంగానే చేస్తారు. ఇందులో ఇప్పటివరకు 13.58 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. మిగిలిన వారందరికీ వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి పరీక్షలు పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, కరోనా కారణంగా ఈ పరీక్షలకు అవరోధం ఏర్పడింది. కరోనా తగ్గడంతో తిరిగి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు 13.58 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా ఇందులో 4.71 లక్షల మందికి మందుల ద్వారా కంటిచూపు మెరుగుపరిచారు. 7.60 లక్షల మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించడమే కాకుండా ఉచితంగా కంటి అద్దాలు పంపిణీకి ఆర్డర్ ఇచ్చారు. ఇందులో ఇప్పటివరకు 4.69 లక్షల మంది అవ్వా తాతలకు ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే, ఇప్పటివరకు 1.26 లక్షల మందికి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించగా.. వాటిని ఒక లక్ష మందికి పూర్తిచేశారు. అక్టోబర్ రెండు నుంచి మధ్య వయస్కులకు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి అవ్వా తాతలందరికీ కంటి పరీక్షలను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను అమలుచేస్తున్నాం. ఇప్పటికే స్కూలు పిల్లలకు పూర్తయ్యాయి. వచ్చే సెప్టెంబర్ నాటికి అవ్వాతాతల కార్యక్రమం పూర్తిచేసిన తరువాత మధ్య వయస్సుల వారికి కూడా ప్రపంచ దృష్టి దినోత్సవం అక్టోబర్ రెండు నుంచి ప్రారంభించేందుకు ప్రణాళికలను సిద్ధంచేస్తున్నాం. మొత్తం మీద అంధత్వ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను చేయాలనే ముఖ్యమంత్రి లక్ష్యాలను సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – డా. హైమావతి, ప్రజారోగ్య సంచాలకులు (నోడల్ అధికారి, వైఎస్సార్ కంటి వెలుగు) -
వైఎస్సార్ కంటి వెలుగుతో ఎందరికో చూపు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా చూపు కోల్పోయిన ఎంతో మందిలో వెలుగులు నింపినట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ పి.శ్యామ్‌ప్రసాద్ చెప్పారు. ఏపీ ఆప్తాల్మిక్ సొసైటీ (ఏపీవోఎస్) ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న 6వ రాష్ట్ర నేత్ర వైద్యుల సదస్సు ఐకాన్–2021ను శనివారం డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నేత్ర వైద్యంలో ఆధునిక పద్ధతులను వివరిస్తూ ముద్రించిన జర్నల్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా నేత్ర వైద్యుల సంఘం కార్యదర్శి డాక్టర్ నమ్రతా శర్మ, ఏపీ ఆప్తాల్మిక్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఎం.పర్నికుమార్, ప్రధాన కార్యదర్శి ఎన్.విష్ణువర్ధన్‌రావు, ప్రెసిడెంట్ ఎలక్ట్ డాక్టర్ ఎ.శ్రీహరి, ఉపాధ్యక్షుడు డాక్టర్ జీఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Andhra Pradesh: కంటి వెలుగుల పరీక్షలు పూర్తి
సాక్షి, అమరావతి: విద్యా రంగ సంస్కరణలతో విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, వారి ఆరోగ్యం విషయంలోనూ అంతే శ్రద్ధ తీసుకుంటోంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి బాలల భవితపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో భాగంగానే బాలల కంటి లోపాలను ప్రాథమిక దశలోనే గుర్తించి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ‘వైఎస్సార్ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూలు పిల్లలకు తొలిసారిగా చేపట్టిన కంటి పరీక్షలు దాదాపు పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 66.17 లక్షల మంది స్కూలు పిల్లలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. రెండు దశల్లో బాలలకు కంటి పరీక్షలు నిర్వహించారు. తొలి దశలో ప్రాథమిక కంటి స్క్రీనింగ్ చేశారు. ఆశా వర్కర్లు, వలంటీర్ల సహాయంతో శిక్షణ పొందిన సిబ్బంది దీనిని పూర్తి చేశారు. ఈ పిల్లల మెడికల్ రికార్డు, ఇతర వివరాలన్నింటినీ ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ పోర్టల్‌లో నమోదు చేశారు. 1.58 లక్షల మందికి కళ్లద్దాలు అవసరమని గుర్తించారు. వారందరికీ కళ్లద్దాలు కూడా ఇప్పటికే పంపిణీ చేశారు. 500 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని తేలగా ఇప్పటికే 459 మందికి ఆపరేషన్లు పూర్తి చేశారు. పిల్లలందరికీ పరీక్షలు పూర్తి రాష్ట్రంలోని పాఠశాలల్లో ఉన్న బాలలందరికీ కంటి పరీక్షలు పూర్తయ్యాయి. కళ్ల జోళ్లూ ఇచ్చాము. అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేయించాము. ఇంకా 41 మందికి మాత్రమే శస్త్ర చికిత్సలు చేయించాల్సి ఉంది. వీలైనంత త్వరగా వారికి కూడా ఆపరేషన్లు చేయిస్తాం. దీంతో పూర్తి స్థాయిలో కంటి వెలుగు కార్యక్రమం పూర్తి అయినట్లే. – డా.హైమావతి, ప్రజారోగ్య సంచాలకులు (నోడల్ అధికారి, వైఎస్సార్ కంటి వెలుగు) -
అవ్వాతాతలకు కంటి చూపు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడకూడదు.. చికిత్సలేని కారణంగా కంటిచూపునకు ఎవరూ దూరం కాకూడదు.. అన్న సత్సంకల్పంతో ప్రారంభమైన వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా ముందుకెళ్తోంది. ఈ యజ్ఞంలో ఇప్పటివరకు 93వేల మందికి పైగా అవ్వాతాలకు కేటరాక్ట్ (కంటి శుక్లాలు) సర్జరీలు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 60 ఏళ్లు దాటిన వారు 56.88 లక్షల మంది ఉన్నట్లు అంచనా. వీరిలో ఇప్పటివరకు 11.80 లక్షల మందికి కంటిపరీక్షలు పూర్తయ్యాయి. ఈ పరీక్షలు చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 413 ప్రత్యేక బృందాలు ముమ్మరంగా స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నాయి. కరోనా కేసులు తగ్గిన తర్వాత పీహెచ్సీ స్థాయి నుంచి బోధనాసుపత్రి వరకూ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించి పరీక్షలు చేస్తున్నారు. అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు ఇస్తున్నారు. వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల దూకుడు సెకండరీ కేర్ (వైద్యవిధాన పరిషత్) పరిధిలో ఉండే జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లోని కంటి వైద్యులు శస్త్రచికిత్సల్లో దూకుడుగా వెళ్తుండగా, బోధనాసుపత్రుల్లో ఉన్న కంటి డాక్టర్లు మాత్రం తగిన స్థాయిలో సర్జరీలు చేయలేకపోతున్నారు. విచిత్రమేమంటే 11 బోధనాసుపత్రుల్లో 107 మంది కంటివైద్య నిపుణులు ఉండగా, వారంతా కలిసి 4,495 శస్త్రచికిత్సలు మాత్రమే చేశారు. అదే వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో కేవలం 40 మంది మాత్రమే ఉండగా వీరు 5,143 ఆపరేషన్లు చేశారు. వాస్తవానికి నిపుణుడైన డాక్టర్ కంటిశుక్లాల ఆపరేషన్లు రోజుకు 8 నుంచి 10 వరకూ చేయచ్చు. కానీ, డీఎంఈ ఆస్పత్రుల్లో ఉన్న పెద్ద డాక్టర్లు గడిచిన మూడు మాసాల్లో ఒక్కొక్కరు సగటున 42 మాత్రమే చేశారు. ఇప్పటికీ చాలాచోట్ల కరోనా పేరుతో చికిత్స చేయడంలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో తక్కువ కంటి ఆపరేషన్లు చేస్తున్న ఆస్పత్రులు, డాక్టర్ల వివరాలను ఉన్నతాధికారులు సేకరిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా పేద రోగులకు మెరుగైన చికిత్స చేయాలని అధికారులు ఇప్పటికే వైద్యులకు పిలుపునిచ్చారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో వైద్యులకు శిక్షణ ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్యాన్నే అవ్వాతాతలకు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో ఇక్కడి వైద్యులకు బృందాల వారీగా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తోంది. ఇందుకయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. దీంతో కేటరాక్ట్ సర్జరీలు మరింత నైపుణ్యంతో చేయడానికి వైద్యులకు వీలు కలుగుతోంది. కంటి వెలుగు చికిత్స వివరాలు.. ► ఇప్పటివరకూ స్క్రీనింగ్ చేసింది : 11,80,170 మందికి ► మందులు అవసరమైన వారు : 4,64,850 ► కేటరాక్ట్ ఆపరేషన్లు జరిగినవి : 93,566 ► కళ్లద్దాలు అవసరమైన వారు : 6,05,680 ► ప్రభుత్వాస్పత్రుల్లో జరిగిన కేటరాక్ట్ ఆపరేషన్లు :9,638 ► ఎన్జీవో/ఆరోగ్యశ్రీ కింద చేసినవి : 48,129 ► ప్రైవేటు ఆస్పత్రుల్లో.. : 35,799 -
ముమ్మరంగా కంటి పరీక్షలు
సాక్షి అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ కంటివెలుగు యజ్ఞం ముమ్మరంగా జరుగుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బోధనాసుపత్రుల్లో ఈ కంటి పరీక్షలు జరుగుతున్నాయి. గతంలో కంటి వైద్యం డబ్బుతో కూడుకున్న వ్యవహారం కావడంతో పేదలు నానా యాతన పడేవారు. వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమం మొదలయ్యాక ఇంటికి దగ్గర్లోనే పరీక్షలు చేయడం, అద్దాలు ఉచితంగా ఇవ్వడం, శుక్లాలుంటే ఆపరేషన్ చేస్తుండడంతో అవ్వాతాతల ఆనందానికి అవధుల్లేవు. ఇలా 60 ఏళ్లు దాటిన వారు భారీ సంఖ్యలో కంటి పరీక్షలకు క్యూ కడుతున్నారు. ఈ యజ్ఞంలో వందలాది మంది వైద్యులు, ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్లు పాల్గొంటూ సేవలు అందిస్తున్నారు. 10.64 లక్షల మందికి పరీక్షలు రాష్ట్రంలో అరవై ఏళ్లు దాటిన వారు 56.88 లక్షల మంది ఉంటారని ప్రభుత్వ అంచనా. వీళ్లందరికీ ఉచితంగా కంటిపరీక్షలు చేసి, వారికి కంటివెలుగు ప్రసాదించాలని సర్కారు సంకల్పించింది. తొలిదశలో స్కూలు పిల్లలకు పూర్తవగా, రెండో దశలో అవ్వాతాతలకు శ్రీకారం చుట్టింది. కానీ, అంతలోనే కరోనా వచ్చింది. ఇప్పుడు మళ్లీ పరీక్షలు పునరుద్ధరించారు. తాజాగా ఆగస్టు 7 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 10,64,979 మంది అవ్వాతాతలకు కంటిపరీక్షలు పూర్తిచేశారు. అంటే నిర్దేశించిన లక్ష్యంలో 18.72 శాతం పూర్తిచేశారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 25.77 శాతం మందికి పూర్తయ్యాయి. 5.43 లక్షల మందికి కళ్లద్దాలు అవసరం ఇప్పటివరకూ కంటిపరీక్షలు పూర్తిచేసుకున్న వారిలో 5.43 లక్షల మందికి కళ్లద్దాలు అవసరమని వైద్యులు నిర్ధారించారు. మరో 94,835 మందికి కంటిశుక్లాల ఆపరేషన్లు చేయాలని తేల్చారు. వీరందరికీ కళ్లద్దాలు, ఆపరేషన్లు ఉచితమే. సర్జరీలు ప్రభుత్వాస్పత్రులతోపాటు ప్రైవేటు, ఎన్జీవో ఆస్పత్రుల్లో ప్రభుత్వ వ్యయంతోనే నిర్వహిస్తున్నారు. 84,145 మందికి కేటరాక్ట్ సర్జరీలు డాక్టర్లు సిఫార్సు చేసిన 94,835 మందిలో ఇప్పటివరకూ 84,145 మందికి కంటి శుక్లాలకు ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 10,822 మంది చేయించుకున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో 8,785 మంది, ఎన్జీవో ఆస్పత్రుల్లో 45,941 మంది, ప్రైవేటు ఆస్పత్రుల్లో 29,419 మంది చేయించుకున్నారు. దేశంలో ఇంత పెద్దఎత్తున ఎక్కడా కంటి సర్జరీలు, పరీక్షలు జరగడంలేదు. సమీపంలోని పీహెచ్‌సీల్లో సంప్రదించాలి ఎవరైనా 60 ఏళ్లు దాటిన వారు కంటి పరీక్షలు చేయించుకోవాలంటే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగానీ, ఆరోగ్య ఉపకేంద్రంగానీ, సచివాలయంలోగానీ అడిగితే ఎక్కడ కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారో చెబుతారు. అక్కడికెళ్తే పరీక్షలతో పాటు అవసరాన్ని బట్టి సర్జరీలు ఉచితంగా చేస్తారు. – డాక్టర్ హైమావతి, నోడల్ అధికారి, వైఎస్సార్ కంటివెలుగు -
వైఎస్సార్ కంటి వెలుగు: ఆ ‘చూపు’ సూపర్
సాక్షి, అమరావతి: సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు.. అంటే అన్ని ఇంద్రియాల్లోకెల్లా నేత్రాలు చాలా ముఖ్యమైనవని అర్ధం. అలాంటి కంటిచూపుకు రాష్ట్రంలో తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. పిల్లల్లో కంటి లోపాలను ప్రాథమిక దశలోనే గుర్తించి వారి జీవితంలో వెలుగులు నింపాలనే లక్ష్యంతో 2019 అక్టోబర్ 10న వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పిల్లలందరికీ ఉచితంగా కంటి పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గిరిజన పిల్లల్లో కంటి సమస్యలు తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. 66.17 లక్షల మంది పిల్లలకు పరీక్షలు కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 60 వేలకు పైగా స్కూళ్లలోని 66.17 లక్షల మంది పిల్లలకు పరీక్షలు నిర్వహించారు. ఇందులో 4.38 లక్షల మందికి దృష్టి లోపాలున్నట్లు గుర్తించారు. బాలికల్లో 6.81 శాతం మందికి, బాలురుల్లో 6.46 శాతం మందికి చూపులో ఇబ్బందులు ఉన్నట్లు ఆ పరీక్షల్లో తేలింది. మొత్తం మీద రాష్ట్రంలో ప్రతీ 100 మంది పిల్లల్లో 6.6 శాతం మంది పిల్లలకు కంటి సమస్యలున్నట్లు స్పష్టమైంది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఈ పరీక్షల్లో మిగతా పిల్లలతో పోల్చి చూస్తే గిరిజన పిల్లల్లో దృష్టి లోపాలు చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. వారు నివశించే ప్రాంతాలతో పాటు ఆధునిక ఆహారపు అలవాట్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల ప్రభావం తక్కువగా ఉండటంతో వారిలో దృష్టి లోపాలు తక్కువగా ఉన్నాయి. వీరిలో అత్యల్పంగా 0.29 శాతమే సమస్యలున్నట్లు పరీక్షల్లో తేలింది. అలాగే.. ఎస్సీ పిల్లల్లో 1.09 శాతం దృష్టిలోపం ఉండగా ఓసీ పిల్లల్లో 1.77 శాతం ఉంది. అత్యధికంగా బీసీ పిల్లల్లో 3.46 శాతం కంటి సమస్యలు కనిపించాయి. రెండు దశల్లో కంటి పరీక్షలు పిల్లలందరికీ రెండు దశల్లో కంటి పరీక్షలు నిర్వహించారు. తొలి దశలో ప్రాథమికంగా కంటి స్క్రీనింగ్ నిర్వహించారు. వీరి వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ పోర్టల్‌లో నమోదు చేశారు. ఈ స్క్రీనింగ్‌లో కంటి సమస్యలున్నట్లు గుర్తించిన 4.38 లక్షల మంది పిల్లలకు రెండో దశలో నిపుణులతో పరీక్షలు చేయించారు. ఇందులో 2.41 లక్షల మందికి మందులు, వైద్యుల సలహాలు, సూచనలిచ్చారు. 1.58 లక్షల మందికి కళ్లజోళ్లను పంపిణీ చేశారు. మరో 42,542 మందికి నిపుణుల పరీక్షలకు సూచించారు. ఈ పరీక్షల ద్వారా 24,017 మంది పిల్లలకు కంటి సంరక్షణపై సూచనలు చేశారు. 2,612 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని తేల్చగా వీరిలో 294 మందికి వాటిని పూర్తిచేశారు. మరో 145 మంది పిల్లలకు శుక్లాల ఆపరేషన్లు చేశారు. పిల్లలపై ‘ఎలక్ట్రానిక్స్’ ప్రభావం తీవ్రంగా ఉంది చిన్న పిల్లల కంటిచూపుపై ఎలక్ట్రానిక్ పరికరాల ప్రభావం తీవ్రంగా ఉంది. సెల్ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్‌లు వంటివి చిన్నతనం నుంచే అలవాటు చెయ్యొద్దు. టీవీల ప్రభావం కూడా తక్కువేం కాదు. వీటి ప్రభావం పట్టణ పిల్లల్లో ఎక్కువ. గిరిజన ప్రాంతాల్లో ఈ ఉపకరణాలు తక్కువగా వాడుతున్నారు కాబట్టి గిరిజన పిల్లల్లో కంటి సమస్యలు తక్కువగా ఉన్నాయి. – డా. హైమావతి, నోడల్ అధికారి, వైఎస్సార్ కంటి వెలుగు కంటి పరీక్షల వివరాలు జెండర్ పరీక్షలు దృష్టిలోపం లోపం శాతం బాలురు 34,44,818 2,22,676 6.46 శాతం బాలికలు 31,72,795 2,16,075 6.81 శాతం సామాజికవర్గాల వారీగా కంటి పరీక్షలు.. సామాజికవర్గం దృష్టిలోపం లోపం శాతం ఎస్సీ 72,771 1.09 శాతం ఎస్టీ 19,214 0.29 శాతం బీసీ 2,29,567 3.46 శాతం ఓసీ 1,17,109 1.77 శాతం -
వైద్యానికి నిధుల కొరత లేదు
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ నిధుల కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. జ్యుడిషియల్ ప్రివ్యూ పూర్తి చేసుకుని టెండర్లు నిర్వహించిన కాలేజీల్లో వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. ఉభయ గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో మెడికల్ కాలేజీల కోసం భూ సేకరణ, నిధుల కేటాయింపుల్లో జాప్యం జరగకుండా కలెక్టర్లతో చర్చించాలని అధికారులకు సూచించారు. వైద్య, ఆరోగ్య రంగం, కుటుంబ సంక్షేమశాఖలో నాడు–నేడు, వైఎస్సార్ కంటి వెలుగు పథకాలపై సీఎం జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నాడు – నేడు కింద వైద్య, ఆరోగ్య రంగంలో చేపట్టిన అన్ని పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, బోధనాస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, సదుపాయాలు మెరుగుపరిచి తగినంత మంది సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల, మచిలీపట్నం మెడికల్ కాలేజీలకు సంబంధించి టెండర్లు అవార్డు అయ్యాయని, మిగిలిన 12 మెడికల్ కాలేజీలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఈ నెల 21వ తేదీ లోగా ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. 3,90,479 మంది అవ్వా తాతలకు ఉచితంగా కళ్లజోళ్లు వైఎస్సార్ కంటి వెలుగు పథకం అమలులో ఎటువంటి జాప్యం జరగకూడదని సీఎం జగన్ ఆదేశించారు. కంటి వెలుగు కింద అవ్వాతాతలకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయడంతో పాటు అవసరమైన వారికి ఆపరేషన్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. కంటి వెలుగు పథకం మూడో విడతలో భాగంగా 8,09,262 మంది అవ్వాతాతలకు నేత్ర పరీక్షలు నిర్వహించి 3,90,479 మందికి ఉచితంగా కళ్లద్దాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. మరో 41,193 మందికి ఆపరేషన్లు పూర్తయ్యాయని, ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతోందని వివరించారు. సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్, కుటుంబ సంక్షేమ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఏపీఎంఎస్ఐడీసీ వైస్ చైర్మన్, ఎండీ విజయరామరాజు, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ మల్లికార్జున్ పాల్గొన్నారు. -
36వేల మందికి పైగా.. అవ్వా తాతలకు కంటి శస్త్రచికిత్సలు
సాక్షి, అమరావతి: అంధత్వ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రారంభమైన అందరికీ ఉచిత కంటి పరీక్షల కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం రూ.560 కోట్లతో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రెండు దశల్లో స్కూలు పిల్లల కంటి పరీక్షలు పూర్తికాగా.. మూడో దశలో 60 ఏళ్లు పైబడిన 7,29,266 మందికి ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించారు. ఇందులో 3,40,535 మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించడంతోపాటు వారిలో 2,03,483 మందికి వాటిని ఇప్పటికే పంపిణీ చేశారు. అలాగే, 72,416 మందికి కంటి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించగా వీరిలో 36,261 మందికి వాటిని నిర్వహించారు. అంటే 50 శాతం పైగా శస్త్ర చికిత్సలను పూర్తిచేశారు. నిజానికి.. రాష్ట్రంలోని 60 ఏళ్లు పైబడిన 56,88,420 మంది అవ్వా తాతలకు ఉచితంగా కంటి వైద్య సేవలను అందించే కార్యక్రమాన్ని గత ఏడాది ఫిబ్రవరి 18న కర్నూలులో సీఎం జగన్ ప్రారంభించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే, లాక్డౌన్ నేపథ్యంలో గత ఏడాది మార్చి నెలాఖరు నుంచి అవ్వాతాతల కంటి వెలుగు పరీక్షలు నిలిచిపోయాయి. కరోనా ప్రభావం తగ్గడంతో గత ఏడాది నవంబరు 2 నుంచి కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలను తిరిగి ప్రారంభించారు. మిగతా వారికి కూడా వీలైనంత త్వరగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి శస్త్ర చికిత్సలను పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అవ్వా తాతలందరికీ కంటివెలుగు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రభుత్వాసుపత్రులు, ఎన్జీఓ కంటి ఆసుపత్రుల్లో మిగతా వారికి శస్త్ర చికిత్సలు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. శంకర నేత్రాలయం, ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రుల్లో అవ్వా తాతలకు కంటి శస్త్ర చికిత్సలను చేయిస్తున్నాం. అలాగే, ఈ కార్యక్రమం కోసం ఇప్పటివరకు 230 మంది పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్లను నియమించాం. త్వరలోనే మరికొంత మందిని నియమించేందుకు నోటిఫికేషన్ ఇస్తున్నాం. – డా. హైమావతి, నోడల్ అధికారి, వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమం -
అవ్వాతాతల కంటికి వెలుగు
సాక్షి, అమరావతి: అవ్వాతాతలకు కంటి పరీక్షలు మళ్లీ మొదలయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈనెల రెండోతేదీ నుంచి కంటి పరీక్షలు చేస్తున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా 60 ఏళ్ల అవ్వాతాతల కంటిచూపు గురించి ఆలోచించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వారికి నేత్రపరీక్షలు చేయించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 56,88,424 మంది అవ్వాతాతలకు వారి గ్రామ, వార్డుల్లోనే వైఎస్సార్ కంటివెలుగు మూడోవిడత కింద కంటి పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 18న కర్నూలులో సీఎం జగన్ ప్రారంభించారు. కోవిడ్–19 లాక్డౌన్ నేపథ్యంలో మార్చి నెలాఖరు నుంచి ఈ పరీక్షలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమాన్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈనెల 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ ప్రారంభించారు. గ్రామ, వార్డుల్లో కాకుండా పీహెచ్‌సీలు, వైద్యసంస్థల్లో అవ్వాతాతలకు కంటి పరీక్షలు చేస్తున్నారు. తొలి, మలివిడత పరీక్షలు సమాంతరంగా చేయడం ప్రారంభించారు. తొలివిడత ప్రాథమికంగా పరీక్షిస్తారు. దాన్లో మళ్లీ పరీక్షించాలని తేలితే అక్కడే కంట్లో చుక్కలమందు వేసి రెండోసారి పరీక్షిస్తున్నారు. రెండోసారి పరీక్షలో అద్దాలు ఇవ్వాలని గుర్తిస్తే అద్దాలు రాయడమే కాకుండా వాటిని తయారు చేయడానికి ఆర్డర్‌ను కూడా ఇచ్చారు. శస్త్రచికిత్స అవసరమైన వారిని ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు పంపించే ఏర్పాట్లు చేశారు. 33,222 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తింపు కోవిడ్–19 ప్రభావం రాకముందు 3.06 లక్షలమంది అవ్వాతాతలకు కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో అవసరమైన 90,773 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశారు. 33,222 మందికి శస్త్రచికిత్స, 3,501 మందికి ఇతర చికిత్స అవసరమని గుర్తించారు. ఇప్పటికే 6,473 మందికి శస్త్రచికిత్సలు చేశారు. మిగిలినవారికి కూడా కోవిడ్–19 నిబంధనలు పాటిస్తూ వీలైనంత త్వరగా శస్త్రచికిత్సలు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వీరికి శంకర నేత్రాలయం, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు చేయిస్తున్నామని వైఎస్సార్ కంటివెలుగు నోడల్ ఆఫీసర్ హైమావతి చెప్పారు. -
బాల్యానికి భరోసా
సాక్షి, అమరావతి : చిన్నతనంలోనే ఆరోగ్య సమస్యలు గుర్తించి వారికి వైద్యమందిస్తే పెద్దయ్యాక దుష్ప్రభావాలు కనిపించవనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతోంది. గత 12 నెలల్లో ఐదు నుంచి 18 ఏళ్లలోపు వయసున్న సుమారు 1.22 కోట్ల మందికి ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రీయ బాలస్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) కింద చేపట్టిన ఈ పరీక్షల్లో పలువురు చిన్నారుల్లో లోపాలు గుర్తించారు. వారిని ఇప్పటికే వివిధ ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో శారీరక, మానసిక ఎదుగుదలకు సంబంధించిన లోపాలు గుర్తించి వారికి వయసొచ్చాక ఎలాంటి సమస్యలు లేకుండా చేయాలన్నది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ప్రతి ప్రభుత్వ,ప్రైవేటు స్కూళ్లు,కళాశాలల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఎక్కువగా పదేళ్లలోపు వయసున్న చిన్నారుల్లోనే సమస్యలు కనిపించాయి. దేశంలోనే గొప్పగా కంటివెలుగు కార్యక్రమం చిన్నారులకు వైద్య పరీక్షలే కాదు.. ‘వైఎస్సార్ కంటివెలుగు’లో భాగంగా 66 లక్షలమందికి కంటిపరీక్షలు నిర్వహించారు. ఇందులో సమస్యలున్న 55 వేలమందికి విజన్కిట్స్ పంపిణీ చేశారు. 1.58 లక్షల మందికి ప్రభుత్వం ఉచితంగా కళ్లద్దాలు అందజేసింది. 9,666 మంది చిన్నారులను పెద్దాస్పత్రులకు పంపి చికిత్స చేయించింది. ఎప్పట్నుంచో చిన్నారులు కంటి సమస్యలతో బాధపడుతుండగా నేరుగా స్కూళ్లకే వెళ్లి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అద్దాలు ఇచ్చింది మొదటగా మన రాష్ట్రంలోనే. ఆర్బీఎస్కే కింద పరీక్షల వివరాలు మొదటి దశలో స్క్రీనింగ్ 62,83,203 పుట్టుకతోనే లోపాలున్నవారు 46,627 శారీరక లోపాలతో ఉన్నవారు 36,614 జబ్బులతో బాధపడుతున్నవారు 44,288 ఎదుగుదలలో లోపాలు 9,322 రెండోదశలో స్క్రీనింగ్ 59,99,438 పుట్టుకతోనే సమస్యలున్నవారు 10,439 రకరకాల శారీరక లోపాలున్నవారు 8,921 జబ్బులతో బాధపడుతున్నవారు 54,548 ఎదుగుదల లోపాలున్నవారు 30,084 వైఎస్సార్ కంటివెలుగు కింద మొత్తం స్కూళ్లు 60,406 స్క్రీనింగ్ చేయించుకున్న విద్యార్థులు 66 లక్షలు అద్దాలు తీసుకున్నవారు 1.58 లక్షలు పెద్దాస్పత్రులకు సిఫార్సు 9,666 విజన్కిట్లు తీసుకున్నవారు 55,000 -
అవ్వాతాతలకు వచ్చేనెలలో కళ్లద్దాలు
సాక్షి, వైఎస్సార్, కడప : డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం మళ్లీ వేగం అందుకుంది. కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపి వేసిన ప్రక్రియను కొనసాగిస్తున్నారు. కళ్లద్దాలు పంపిణీ చేయడానికి, ఇతర సమస్యలకు చికిత్సను అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మొదటి దశ గతేడాది అక్టోబర్ 10 వరకు ..రెండవ దశ నవంబర్ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు అమలు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 4,450 (1 నుంచి 10వ తరగతి) పాఠశాలల్లో 4,12,301 మంది విద్యార్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. 32,800 విద్యార్దులకు కంటి వ్యాధులు ఉన్నట్లుగా గుర్తించారు. మళ్లీ కంటి వైద్య నిపుణులు బాధిత విద్యార్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 13,600 మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించారు. వారందరికీ కళ్లద్దాలను పంపిణీ చేశారు. 2,600 మందికి ఇతర కంటి లోపాలను గుర్తించి చికిత్సను అందించారు.మిగతా విద్యార్ధులకు ఎలాంటి సమస్యలు లేవని నిర్ధారించారు. మూడో దశకింద 60 ఏళ్లకు పైబడిన అవ్వాతాతలకు ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి మార్చి 20 వరకు కంటి పరీక్షలు నిర్వహించారు. 10 డివిజన్లలో 14,780 మందికి పరీక్షలు నిర్వహించారు. 9,028 మందికి కళ్లద్దాలు అవసరమని నిర్ధారించారు. 4,164 మందికి కంటి (ఐఓఎల్) ఆపరేషన్లు చేయాలని రెఫర్ చేశారు. ఇప్పటికే 302 మందికి ఆపరేషన్లు నిర్వహించారు. మిగిలిన 1,588 మందికి కంటి లోపాలు లేవని గుర్తించారు. కరోనా వైరస్ కారణంగా అప్పట్లో తాత్కాలికంగా పధకం ప్రక్రియను నిలిపి వేశారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అవ్వాతాతలకు కళ్లద్దాలు అందనున్నాయి. వైద్య నిపుణులు, వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే వెల్లి కళ్లద్దాలను అందజేస్తారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లను చేస్తారు. (ఇంటివద్దకే కళ్లద్దాలు) వచ్చే నెలలో కళ్లదాలు అందజేస్తాం 'అక్టోబర్ 1న ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా అవ్వాతాతలకు కళ్లద్దాలు పంపిణీ చేయడానికి చర్యలు చేపడుతున్నాం. ఇంటి వద్దకే వెల్లి కళ్లద్దాలు పంపిణీ చేస్తాం. అలాగే అవసరమైన వారికి ఆపరేషన్లు చేయడానికి చర్యలు చేపడుతాం. ఈ పధకం ద్వారా వేలాది మందికి కంటి వెలుగు రావడమే ప్రభుత్వ సంకల్పం.' అని జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ రామిరెడ్డి తెలిపారు -
ఇంటివద్దకే కళ్లద్దాలు
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ కంటివెలుగు’ పథకంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన కంటి పరీక్షల్లో కళ్లద్దాలు అవసరమైన వారికి ఈనెలాఖరులోగా ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కళ్లద్దాలను చిన్నారుల ఇంటి వద్దకే పంపడానికి అధికారులు సిద్ధం చేశారు. మార్చినెలలోనే ఈ కళ్లద్దాలు పంపిణీ చేయాల్సి ఉన్నా కోవిడ్–19 కారణంగా ఆ కార్యక్రమం వాయిదా పడింది. త్వరలో స్కూళ్లు తెరిచే అవకాశం ఉండటంతో ఆలోగా చిన్నారులకు ఉపాధ్యాయుల ద్వారా కళ్లజోళ్లు పంపిణీ చేయాలని భావిస్తున్నారు. అలాగే ఏఎన్ఎం, ఆశా కార్యకర్తల ద్వారా వృద్ధులకు కళ్లజోళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాదిమంది చిన్నారులకు, వృద్ధులకు కంటి పరీక్షలు చేసి కళ్లద్దాలు ఇవ్వడం దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. ► రాష్ట్రంలో మొదటి, రెండో దశ కంటి వెలుగులో భాగంగా 60,393 స్కూళ్లలో 66,17,613 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ► వీరిలో 4.38 లక్షల మంది చిన్నారులకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, 1.58 లక్షల మందికి కళ్లద్దాలు అవసరమని వైద్యులు గుర్తించారు. ► మరో 55 వేల మందికి విజన్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. ► మూడో దశ కంటి వెలుగులో భాగంగా 60 ఏళ్లు దాటిన 3,06,961 మంది వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించగా 95,075 మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించారు. ► వీరికి వచ్చే నెల మొదటి వారంలో కళ్లద్దాలు ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే కళ్లద్దాలు సిద్ధం చేశామని అధికారులు చెప్పారు. ► మూడో దశలో మరింత మంది వృద్ధులకు కంటి పరీక్షలు చేయాల్సి ఉంది. అయితే ఆ కార్యక్రమం కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ► కళ్లద్దాలు ఆర్డర్ ఇచ్చాక కోవిడ్ పరిస్థితులు రావడం, కళ్లద్దాలు తయారుచేసే సంస్థలు కొంతకాలం మూతపడటం వల్ల వాటి పంపిణీ తాత్కాలికంగా వాయిదా పడింది. ► కాగా, మొదటి దశలో రూ.11.18 కోట్లు, రెండో దశలో రూ.12.65 కోట్లు, మూడో దశలో రూ. 6.60 కోట్లు వ్యయం అయ్యింది. -
సెకండరీ ‘కేర్’
సాక్షి, అమరావతి: ప్రభుత్వాసుపత్రులను జాగ్రత్తగా కాపాడుకుంటే అవి అంతకంటే జాగ్రత్తగా మన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. సామాన్య, పేద రోగులకు సర్కారీ ఆస్పత్రులే ఆధారం. ఆంధ్రప్రదేశ్‌లో ద్వితీయ శ్రేణి ఆస్పత్రులు ఏటా లక్షలాది మందికి ఊరటనిస్తున్నాయి. అలాంటివి గత సర్కారు పాలనలో నిధులివ్వక, నియామకాలు లేక, పట్టించుకునే నాథుడు లేక దిక్కూమొక్కూ లేనివిగా మారాయి. ఇక ఎంతోమంది పేద గర్భిణులకు సాంత్వన చేకూర్చే సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్‌సీ) పరిస్థితి దయనీయం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న భరోసాతో సీహెచ్‌సీలతో పాటు ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు కళకళలాడుతున్నాయి. వానొస్తే ఇక నీరుగారే భవనాలు లేవు. వైద్యుల నియామకాలు, అత్యాధునిక వైద్య సదుపాయాల కల్పనతో ప్రభుత్వ ఆస్పత్రులకు రోగులు ధైర్యంగా వెళుతున్నారు. సెకండరీ కేర్ ఆస్పత్రులుగా పేరున్న వైద్య విధానపరిషత్ విభాగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. వైద్య విధాన పరిషత్‌లోని 169 ఆస్పత్రులను నాడు–నేడులో భాగంగా రూ.1,236 కోట్లతో ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. పేద రోగులకు ఊరట.. ‘సామాజిక ఆరోగ్య కేంద్రాలకు మంచిరోజులొచ్చాయి. ఏడాదిలోగా అన్ని సీహెచ్‌సీలు కొత్త హంగులతో సేవలందిస్తాయి. వీటి పునరుద్ధరణ లక్షలాది మంది పేద రోగులకు ఊరటనిస్తుంది. వచ్చే నాలుగేళ్లలో ఆస్పత్రుల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాం. అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డీఎన్బీ వైద్య సీట్లు వచ్చేలా చర్యలు చేపట్టాం’ –డాక్టర్ రామకృష్ణారావు (వైద్య విధాన పరిషత్ కమిషనర్) రూ.560 కోట్లతో వైఎస్సార్ కంటి వెలుగు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే లక్షల మంది చిన్నారులకు ప్రభుత్వం చేపట్టిన వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమంతో మేలు జరిగింది. ఇప్పటివరకూ 68 లక్షల మందికి కంటి పరీక్షలు పూర్తయ్యాయి. నాలుగేళ్ల పాటు జరిగే ఈ కార్యక్రమానికి రూ.560 కోట్లు కేటాయించారు. ఇందులో ఎన్హెచ్ఎం నుంచి రూ.220 కోట్లు ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.340 కోట్లు ఇస్తోంది. కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ప్రభుత్వమే ఉచితంగా కళ్లద్దాలు అందచేసింది. ఈ కార్యక్రమం మొత్తం సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ, ఏరియా ఆస్పత్రుల్లోనే జరిగింది. 70 ఆస్పత్రుల్లో నలుగురు చొప్పున గైనకాలజిస్ట్లు రాష్ట్రంలో 192 సామాజిక ఆరోగ్య కేంద్రాలుండగా పేదలు ఎక్కువగా ఈ ఆస్పత్రుల్లోకే ప్రసవానికి వస్తుంటారు. అయితే 70 సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సామర్థ్యానికి మించి కాన్పులు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని గుర్తించి ఏకంగా నలుగురు చొప్పున గైనకాలజిస్ట్లు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పీడియాట్రిక్స్, అనస్థీషియా వైద్యులు ఎలాగూ ఉంటారు. ఈ 70 ఆస్పత్రుల్లో ఆపరేషన్ థియేటర్లు, పడకలు పెంచి మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు 24 సీహెచ్‌సీలను ఉన్నతీకరించి ఏరియా ఆస్పత్రులుగా మారుస్తున్నారు. ఉన్నతీకరించే ఆస్పత్రుల్లో పడకలను రెట్టింపు చేస్తారు. దివ్యాంగుల సర్టిఫికెట్లలో కొత్త ఒరవడి వివిధ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం దివ్యాంగులు సర్టిఫికెట్లు పొందాలంటే గతంలో నెలల తరబడి వేచి చూసేవారు. ఇప్పుడు ప్రభుత్వం ఆస్పత్రుల సంఖ్యను భారీగా పెంచి వైద్యులను నియమించడంతో రెట్టింపు సంఖ్యకు పైగా సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి. రూ.1,236 కోట్లతో నాడు–నేడు పనులు వైద్య విధాన పరిషత్‌లోని 169 ఆస్పత్రులను నాడు–నేడులో భాగంగా రూ.1,236 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో 123 సామాజిక ఆరోగ్యకేంద్రాలు, 46 ఏరియా ఆస్పత్రులున్నాయి. ఏరియా ఆస్పత్రుల అభివృద్ధికి రూ.695 కోట్లు, సీహెచ్‌సీల అభివృద్ధికి రూ.541 కోట్లు వ్యయం చేస్తారు. నిర్మాణ పనుల నుంచి వైద్య పరికరాల వరకూ అన్ని ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తారు. ప్రధానంగా తల్లీ బిడ్డల వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఆగస్టు చివరికల్లా వైద్య సిబ్బంది నియామకాలు.. సెకండరీ ఆస్పత్రుల్లో ఉన్న ప్రధాన లోపాలు మౌలిక వసతులు, వైద్యుల కొరతే. నాడు–నేడుతో మౌలిక వసతుల కొరతను, కొత్త నియామకాలతో వైద్యుల కొరతను అధిగమించనున్నారు. ఒకే నోటిఫికేషన్ ద్వారా 718 మంది వైద్యులను ప్రభుత్వం నియమిస్తోంది. ఆగస్టు చివరి కల్లా వైద్యుల నియామక ప్రక్రియ పూర్తవుతుంది. ఇది కాకుండా స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్‌లు కలిపి మరో 990 మందిని నియమించనున్నారు. -
కంటికి వెలుగు
-
అవ్వాతాతల కంటికి వెలుగు
కంటి వెలుగు కార్యక్రమం ద్వారా అవ్వాతాతలకు ఉచితంగా కంటి వైద్యం అందిస్తాం. అవ్వాతాతలకు ఎంత చేసినా తక్కువే అని భావించే వారిలో నేను మొదటి వాడిని. వారికి సేవ చేయడం దేవుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నా. 56,88,420 మంది అవ్వాతాతలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయిస్తున్నాం. కంటి పరీక్షలు చేసిన వారికి 2 వారాల లోపు నేరుగా వలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దకే వచ్చి కళ్లజోళ్లు పంపిణీ చేస్తాం. మార్చి 1 నుంచి ఆపరేషన్లు, ఇతర వైద్య చికిత్సలు చేయిస్తాం. సబ్ సెంటర్ నుంచి పీహెచ్సీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రి, భోదనాసుపత్రి వరకూ ఇప్పుడు అన్నింటి ఫొటోలు తీసి, మూడేళ్లలో మార్పు చేసి మళ్లీ ఫొటోలు తీసి అందరికీ చూపిస్తాం. అందుకు ఏకంగా రూ.15,337 కోట్లతో పనులు చేయబోతున్నాం. మంచి పాలన సాగిస్తుంటే ఓర్వలేకపోతున్నారు. ఆరోగ్యశ్రీలో 2 వేల వ్యాధులకు చికిత్స ఉంది. కేన్సర్ వచ్చినా చికిత్స ఉంది. కానీ అసూయతో వచ్చే కడుపు మంటకు ఎక్కడా చికిత్స లేదు. కంటి చూపు మందగిస్తే కంటి వెలుగు ద్వారా చికిత్స చేయొచ్చు. చెడు చూపునకు ఎక్కడా చికిత్స లేదు. వయసు మళ్లితే చికిత్స ఉంది కానీ.. మెదడు కుళ్లితే చికిత్స లేదు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: అవ్వాతాతలకు వయసు మీద పడిన తర్వాత దృష్టి లోపం లేకుండా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, చికిత్స చేయించే వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పెద్ద వయసులో కంటి చూపు మందగిస్తే ఎలాంటి సమస్యలు ఉంటాయో అందరికీ తెలుసని, ఈ పరిస్థితిని మార్చబోతున్నామని చెప్పారు. కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాలలో మంగళవారం ఆయన మూడో విడత వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తనకెంతో ఇష్టమైన అవ్వాతాతల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఈ రోజు నుంచి జూలై ఆఖరు వరకు కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. 56,88,420 మంది అవ్వాతాతలకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉచితంగా కంటి వైద్య సేవలు ప్రారంభమవుతున్నాయన్నారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఆపరేషన్ల కోసం 133 కేంద్రాలు ‘మార్చి 1వ తేదీ నుంచి కంటి ఆపరేషన్లు ప్రారంభమవుతాయి. ఆపరేషన్ల కోసం 133 కేంద్రాలు సిద్ధం చేశాం. జిల్లా కేంద్రాల్లోని 11 బోధనాసుపత్రులు, 13 జిల్లా ఆస్పత్రులు, 28 ఏరియా ఆస్పత్రులు, 81 ఎన్జీవో పరిధిలోని ఆస్పత్రుల్లో వైద్యం చేయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. గ్రామ సచివాలయాల్లోని ఉద్యోగులతో పాటు పీహెచ్సీ వైద్యలు, సిబ్బంది, ఆశా వర్కర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దీని కోసం రూ.560 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మొదటి దశగా 2019 అక్టోబర్ 10న కంటి వెలుగు ప్రారంభమైంది. స్కూళ్లకు వెళ్లే చిన్నారుల కోసం మొదలుపెట్టాం. ఏకంగా 66 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాం. 60 వేల మంది సిబ్బంది పాల్గొని ఒక మహాయజ్ఞంగా చేశారు. నవంబర్ 1 నుంచి 31 వరకూ రెండోదశ పూర్తి చేశారు. 500 మంది నిపుణులైన బృందాలతో 4.36 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. అందులో 1.50 లక్షల మందికి కళ్లజోళ్లు ఇచ్చాం. 46 వేల మందికి ఈ వేసవిలో పదో తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు శస్త్ర చికిత్సలు చేయిస్తాం. కంటి పరీక్ష చేయించుకుంటున్న అవ్వను పలకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐపీహెచ్ స్టాండర్డ్స్ తీసుకొస్తాం ఆటో, లాయర్ అన్నదమ్ముల నుంచి చేనేత అక్కచెల్లెమ్మలు, మత్స్యకారులు, అగ్రిగోల్డ్ బాధితుల వరకు.. మీ బిడ్డగా చేతనైన సాయం చేశానని గర్వంగా చెబుతున్నా. ఈ రోజు మరో అడుగు ముందుకేసి మరో రెండు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. ఆసుపత్రుల రూపురేఖలు మార్చే కార్యక్రమం ఒకటైతే.. వైఎస్సార్ కంటి వెలుగు మరొకటి. ఈ రోజు నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ ఆస్పత్రుల స్థాయిలో మార్చేందుకు ‘నాడు–నేడు’కు శ్రీకారం చుడుతున్నాం. జాతీయ స్థాయి ప్రమాణాలు నెలకొల్పుతాం. మొదటగా కర్నూలు జిల్లా నుంచే ప్రారంభిస్తున్నాం. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిని ఐపీహెచ్ఎస్ (ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్) స్థాయికి తీసుకొస్తాం. గ్రామాల్లోని ఆసుపత్రుల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడు దశల్లో మూడేళ్లలో పూర్తిగా మారుస్తాం. మొదటి దశలో 7,458 సబ్సెంటర్లలో ‘నాడు–నేడు’కు శ్రీకారం చుట్టాం. 4,906 కొత్త భవనాలు నిర్మిస్తున్నాం. కొత్త శాశ్వత ఆస్పత్రులు తీసుకొస్తున్నాం. మిగిలిన 2,552 సబ్‌సెంటర్ల రూపురేఖలు కూడా మారుస్తాం. వీటన్నిటికీ రూ.11,029 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పేందుకు గర్వపడుతున్నా. కర్నూలులో బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన జనసందోహం 52 ఏరియా ఆసుపత్రుల ఆధునికీకరణ రెండో దశలో 1,445 పీహెచ్సీ, 149 కొత్త ఆసుపత్రులు నిర్మిస్తున్నాం. మిగిలిన 989 ఆసుపత్రులకు మరమ్మతులు చేసి అత్యాధునికంగా మార్చబోతున్నాం. రెండో దశలోనే 169 కమ్యూనిటీ సెంటర్ల రూపురేఖలు కూడా మారుస్తున్నాం. ఇవికాక 52 ఏరియా ఆస్పత్రులను ఆధునికీకరిస్తున్నాం. వీటన్నిటికీ రూ.700 కోట్లు ఖర్చు చేస్తున్నాం. సీహెచ్‌సీల కోసం రూ.1,212 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మూడు దశల్లో జిల్లా ఆసుత్రులు, భోదనాసుపత్రులను బలోపేతం చేస్తాం. కొత్తగా మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. వీటికి రూ.12,300 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మొత్తంగా వైద్య రంగ అభివృద్ధికి రూ.15,303 కోట్లు ఖర్చు పెడుతున్నందుకు గర్వపడుతున్నా. ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ’ హెల్త్‌కార్డు (నమూనా)ను ఆవిష్కరిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్తగా 16 మెడికల్ కాలేజీలు ‘నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్న విధంగా, ఇదే కార్యక్రమం ద్వారా ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలను సమూలంగా మార్చేందుకు శ్రీకారం చుట్టాం. కార్పొరేట్ స్థాయి ప్రమాణాలు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. వీటిని పూర్తిగా ఆధునికీకరించడమే కాకుండా మూడేళ్లలో మూడు దశల్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక మెడికల్ కాలేజీ (బోధనాసుపత్రి) ఉండేలా చూస్తాం. ఇప్పుడున్న 11 మెడికల్ కాలేజీలకు అదనంగా 16 కొత్త కాలేజీలు కలిపి మొత్తం 27 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం. వీటితో పాటు నర్సింగ్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకుంటాం. దీంతో ప్రతి ఆసుపత్రిలో పీజీ కోర్సులు వస్తాయి. పూర్తి స్థాయిలో డాక్టర్లు అందుబాటులో ఉంటారు. పీజీ చేసే డాక్టర్లు, ఎంబీబీఎస్ విద్యార్థులు, నర్సులు కూడా అందుబాటులో ఉంటారు. పేదవాడు వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే డాక్టర్లు లేరనే మాటే రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం. 11 బోధనాసుపత్రులు, 6 అనుబంధ ఆసుపత్రులు, 8 సూపర్ స్పెషాలిటీ, 3 కేన్సర్ ఆసుపత్రులు, 16 కొత్త నర్సింగ్ కాలేజీలు స్థాపించి వైద్య రంగం రూపురేఖలు మార్చబోతున్నాం. పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు దేశంలో ఏ రాష్ట్రం ఖర్చు చేయని విధంగా మనం ఖర్చు చేస్తున్నామని చెప్పేందుకు గర్వంగా ఉంది. మంచి పనులు చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి, ప్రతి సామాజిక వర్గానికి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా దేవుని ఆశీస్సులతో మంచి చేస్తున్నాం. మంచి పరిపాలన చేస్తున్నపుడు సహజంగా ఓర్చుకోలేని వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. చంద్రబాబు మాటలు విన్నప్పుడు అలాగే అనిపిస్తుంది. ఆయనకు ఎంతటి కడుపు మంట ఉంటుందో అందరూ అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి మనుషుల్ని మహానుభావులుగా చూపించే కొన్ని చానెళ్లు, పత్రికలు ఉన్నాయి. వీరిని బాగుచేసే మందులు ఎక్కడా లేవు. వీటన్నింటి మధ్య మీ బిడ్డ మీ కోసం పని చేస్తున్నాడు. నిజాయితీతో పని చేస్తున్నాం. ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవిస్తున్నాం. వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయంపై దృష్టి పెడుతున్నాం. మేనిఫెస్టోలోని వాగ్దానాలను ఏడాదిలోపే 85 శాతం అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ప్రజల ఆనందం, భవిష్యత్తు కోసం పని చేస్తున్నాం. అవ్వాతాతల దీవెనలు, అక్కాచెల్లెమ్మల చల్లని దీవెనలు మీ బిడ్డకు ఉండాలని కోరుతున్నా’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. సభకు ముందు వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా సీఎం దగ్గరుండి.. వృద్ధులకు స్క్రీనింగ్ టెస్ట్‌లు చేయించారు. విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. స్మార్ట్ హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. మోడల్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ నిర్మాణానికి శిలాఫలం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ఆళ్లనాని, గుమ్మనూరు జయరాం, ఎంపీలు సంజీవ్‌కుమార్, పోచా బ్రహ్మానందరెడ్డి, గోరంట్ల మాధవ్, మండలి విప్ గంగుల ప్రభాకర్‌రెడ్డితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. న్యాయ రాజధానిలో సీఎంకు ఘన స్వాగతం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కర్నూలుకు తొలిసారి రావడం, అందులో కర్నూలును ‘న్యాయ రాజధాని’గా ప్రకటించి ఉండటంతో కర్నూలు వాసులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మరిచిపోలేని విధంగా స్వాగతం పలికారు. ఎస్ఏపీ క్యాంపులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి ఎస్టీబీసీ కళాశాలలో సభా వేదిక వరకు దాదాపు 25 వేల మంది మానవహారంగా నిల్చొని స్వాగతం పలికారు. ‘థ్యాంక్యూ సీఎం’ అనే ప్ల కార్డులను చేతబట్టి ‘జై జగన్.. జైజై జగన్’ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు తప్పెట్లు, మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. కర్నూలు చరిత్రలో ఏ ముఖ్యమంత్రికీ ఈ స్థాయిలో స్వాగతం లభించి ఉండదని స్థానికులు చర్చించుకున్నారు. బహిరంగ సభలోనూ ‘థ్యాంక్యూ సీఎం’ అన్న ప్లకార్డులు పెద్దఎత్తున ప్రదర్శించారు. మామయ్యా.. మళ్లీ మళ్లీ మీరే రావాలి బాలిక ప్రసంగానికి ముగ్దుడైన సీఎం ‘ఒక అమ్మలా ఆలోచించి మంచి పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. ఒక నాన్నలా ఆలోచించి బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారు. ఒక అన్నలా ఆలోచించి ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నారు. ఇంత మంచి సీఎం మామయ్య ఉండగా మనకు ఇంకేమి కావాలి? చెప్పండి. మళ్లీ మళ్లీ ఇలాంటి సీఎం మామయ్య రావాలి. నేను డాక్టరై మీ పరిపాలనలో సేవ చేయాలని ఉంది మామయ్యా..’ అంటూ కర్నూలు జిల్లా మిడుతూరు కస్తూర్బా పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న జ్యోతిర్మయి చేసిన ప్రసంగానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముగ్దుడయ్యారు. ప్రసంగం ముగియగానే ఆ బాలికను ప్రత్యేకంగా అభినందించారు. మంగళవారం కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగిన సీఎం సభలో జ్యోతిర్మయి ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. జ్యోతిర్మయిని అభినందిస్తున్న సీఎం వైఎస్ జగన్ ‘జగన్ మామయ్య చెప్పిన విధంగానే నవరత్నాల అమలుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అమ్మ ఒడి, రైతు భరోసా, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, మద్యపాన నిషేధం, వైఎస్సార్ ఆసరా, పేదలందరికీ ఇళ్లు, పెన్షన్ల పెంపు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. విద్యకు సంబంధించి చాలా పథకాలను ప్రవేశపెట్టారు. నేను డాక్టరై పేదలకు ఉచిత వైద్యం అందించాలనుకుంటున్నా. కానీ, మా ఇంట్లో ఇంత పెద్ద చదువులు చదివించడానికి స్తోమత లేదు. కానీ ఇప్పుడు నాకు ఆ భయం లేదు. అమ్మఒడి, నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, పౌష్టికాహారం, కంటి వెలుగు తదితర పథకాలు, కార్యక్రమాలతో పేద విద్యార్థులందరూ చదువుపట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇన్ని గొప్ప పనులు చేసినందుకు సీఎం మామయ్యకు కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని జ్యోతిర్మయి వివరించడంతో సభకు హాజరైన వారందరూ చప్పట్లతో అభినందించారు. సీఎంకు ఘన స్వాగతం సీఎంగా బాధ్యతలు చేపట్టాక కర్నూలుకు తొలిసారి రావడం, అందులో కర్నూలును ‘న్యాయ రాజధాని’గా ప్రకటించి ఉండటంతో కర్నూలు వాసులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మరిచిపోలేని విధంగా స్వాగతం పలికారు. ఎస్ఏపీ క్యాంపులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి ఎస్టీబీసీ కళాశాలలో సభా వేదిక వరకు దాదాపు 25 వేల మంది మానవహారంగా నిల్చొని స్వాగతం పలికారు. ‘థ్యాంక్యూ సీఎం’ అనే ప్లకార్డులను చేతబట్టి ‘జై జగన్.. జైజై జగన్’ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు తప్పెట్లు, మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. కర్నూలు చరిత్రలో ఏ సీఎంకు ఈ స్థాయిలో స్వాగతం లభించి ఉండదని స్థానికులు చర్చించుకున్నారు. సభలోనూ ‘థ్యాంక్యూ సీఎం’ అన్న ప్లకార్డులు పెద్దఎత్తున ప్రదర్శించారు. సీఎంకు స్వాగతం పలుకుతున్న కర్నూలు ప్రజలు -
మూడోదశ వైఎస్ఆర్ కంటి వెలుగు
-
వైఎస్సార్ కంటి వెలుగు మూడో దశ ప్రారంభించిన సీఎం జగన్
-
‘సీఎం మామయ్యా’ అంటూ చిన్నారి ప్రసంగం..
-
‘సీఎం మామయ్యా’ అంటూ చిన్నారి ప్రసంగం..
సాక్షి, కర్నూలు : వైఎస్సార్ కంటి వెలుగు మూడో విడత ప్రారంభోత్సవ సభలో ఓ చిన్నారి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. కర్నూలులో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న జ్యోతిర్మయి అనే చిన్నారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ‘మామయ్యా’ అంటూ సంబోధించి ప్రసంగించింది. కర్నూలులోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న జ్యోతిర్మయి విద్యా వ్యవస్థలో సంస్కరణలు, అమ్మ ఒడి పథకంతో ప్రభుత్వ బడుల్లో చదువు పట్ల ఆసక్తి పెరిగిందని చెప్పింది. (చదవండి : ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మారుస్తాం: సీఎం జగన్) ‘ఇంత గొప్ప పని చేసినందుకు మన సీఎం మామయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేటి సమాజంలో మహిళలకు, బాలికలను రక్షణ కరువైంది. ఒక అన్నలా, తమ్ముడిలా, తండ్రిలా, మామయ్యాలా ఆలోచించి దిశ పోలీస్ స్టేషన్లను ప్రవేశ పెట్టారు. ఆడవాళ్లనే కాకుండా నాలాంటి పేద విద్యార్థులకు రక్షణ కల్పించారు. ఆడవాళ్లందరి తరపున మన మామయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే, మన కర్నూలును న్యాయ రాజధానిగా ఎంచుకున్నందుకు మన మామయ్య గారికి మనమెంతో రుణపడి ఉండాలి’అని జ్యోతిర్మయి పేర్కొంది. చిన్నారి ప్రసంగానికి సీఎం వైఎస్ జగన్ ముగ్ధుడయ్యారు. ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. -
రాజన్న కలలను నెరవేరుస్తున్నారు