జొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలి | Sakshi
Sakshi News home page

జొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలి

Published Sat, May 18 2024 9:10 AM

జొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలి

బోథ్‌: ఇటీవల కురిసిన వర్షానికి తడిచిన జొన్నలను షరతులు లేకుండా త్వరగా కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ అన్నారు. మండల కేంద్రంలోని బోథ్‌ మార్కెట్‌ యార్డును శుక్రవారం ఆయన సందర్శించారు. తడిచిన జొన్నలను పరిశీలించారు. అధైర్యపడవద్దని రైతులకు సూచించారు. ఆరు కాంటాలు ఏర్పాటు చేసి త్వరితగతిన కొనుగోలు చే యాలని అధికారులను ఆదేశించారు. అలాగే యా ర్డులో టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలన్నా రు. ఆయన వెంట మార్కెట్‌ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి మనోహర్‌, సెంటర్‌ ఇన్‌చార్జి స్వామి, నేరడిగొండ ఎంపీపీ సజన్‌, నానక్‌ సింగ్‌, నారాయణరెడ్డి, సురేందర్‌ యాదవ్‌, తదితరులున్నారు.

అన్నదాతకు అండగా బీఆర్‌ఎస్‌

ఇచ్చోడ: రైతులకు బీఆర్‌ఎస్‌ అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ అన్నారు. మార్కెట్‌ యార్డులో జొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. వారు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెచ్చారు. వెంటనే ఆయన కలెక్టర్‌కు ఫోన్‌ చేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు. యార్డులో కావాల్సిన రెండు షెడ్‌లకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ఆయన వెంట స్థానిక నాయకులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement