పకడ్బందీగా సర్టిఫికెట్ల పరిశీలన
● విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి
ఆదిలాబాద్‌టౌన్: డీఎస్సీ–2024 సర్టిఫికెట్ల పరిశీల న పకడ్బందీగా చేపడుతున్నట్లు విద్యాశాఖ జా యింట్ డైరెక్టర్, డీఎస్సీ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పరిశీలకులు సోమిరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో శుక్రవారం నిర్వహిస్తున్న డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడో రోజు 134 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 472 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిందని తెలిపారు. ఈనెల 9న సీఎం రేవంత్‌రెడ్డి ఎంపికై న అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారని వివరించారు. ఆయన వెంట డీఈవో ప్రణీత, ఉద్యోగులు, సిబ్బంది తదితరులున్నారు.
నేటితో ముగియనున్న గడువు
ఆదిలాబాద్‌టౌన్: 2024 డీఎస్సీ 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాలో పేర్లు ఉన్నవారు శనివారంలోగా సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలని డీఈవో ప్రణీత ప్రకటనలో తెలిపారు. ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ చేసిన తర్వాత డీఎడ్ చేస్తే అనుమతి లేదని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. విషయాన్ని అభ్యర్థులు గమనించి సర్టిఫికెట్లను పరిశీలించుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment