రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలి
● అదనపు కలెక్టర్ శ్యామలాదేవి
ఆదిలాబాద్: సీఎం కప్–2024లో భాగంగా జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తా చాటాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి పోటీలను శుక్రవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సీఎం కప్ పోటీలను నిర్వహిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో సైతం రాణిస్తే ఉ జ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. అనంతరం ఆత్యాపాత్య, సైక్లింగ్, సాఫ్ట్‌బాల్, తైక్వాండో, వుషూ క్రీడాంశాల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్‌రెడ్డి, డీవైఎస్‌వో వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, క్రీడా సంఘాల బాధ్యులు కాంతారావు, రాష్ట్రపాల్, హరిచరణ్, పాండు, వీరేష్, శ్రీనివాస్, వేదవ్యాస్, శ్రీనివాస్, రాము, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment