వంటావార్పుతో ‘సమగ్ర’ నిరసన | - | Sakshi
Sakshi News home page

వంటావార్పుతో ‘సమగ్ర’ నిరసన

Published Sat, Dec 21 2024 12:16 AM | Last Updated on Sat, Dec 21 2024 12:16 AM

వంటావార్పుతో ‘సమగ్ర’ నిరసన

వంటావార్పుతో ‘సమగ్ర’ నిరసన

ఆదిలాబాద్‌టౌన్‌/కై లాస్‌నగర్‌: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా శుక్రవారం తెలంగాణ చౌక్‌లో వంటావార్పు చేపట్టి రోడ్డుపైనే సహపంక్తి భోజనం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇ చ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. వీరికి గెజిటెడ్‌ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అమర్‌సింగ్‌ తిలావత్‌, గడ్డం శశికళ, ఉదయ్‌రావు, దే విదా స్‌ సంఘీభావం తెలిపారు. ఇందులో సమగ్ర ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్‌, జిల్లా అధ్యక్షురాలు ప్రియాంక, ప్రత్యేక అధికారులు కవిత, హిమబిందు, అర్చన, దీప్తి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement