సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
నేరడిగొండ: ఆర్థిక, సైబర్ నేరాలపై ప్రజలు అ ప్రమత్తంగా ఉండాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ (ఎల్‌డీవో) దేబో జిత్ బరువ అన్నారు. మండలంలోని తర్నం గ్రామంలో ఆర్బీఐ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరా స్యతపై శుక్రవారం అవగాహన కార్యక్రమం ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అతిథి గా హాజరై మాట్లాడారు. ప్రతిఒక్కరూ బ్యాంకు సేవలను వినియోగించుకోవాలన్నారు. అలా గే సైబర్ కేటుగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. క్లస్టర్ కోఆర్డినేటర్ గంగాధర్ మాట్లాడుతూ రైతులు తీసుకున్న పంట రుణా లను సకాలంలో రెన్యువల్ చేసుకోవాలని సూ చించారు. ఇందులో పంచాయతీ కార్యదర్శి స్వామి, ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్లు సంతో ష్, దంజీ, అరవింద్, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment