మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
● తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైర్మన్ శోభ
ఇంద్రవెల్లి: రైతులు, మహిళలు బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాల ని తెలంగాణ గ్రామీణ బ్యాంకు రాష్ట్ర చైర్మన్ శోభ అన్నారు. మండలంలోని ముత్నూర్ గ్రామంలో బ్యాంకు నూతన బ్యాంచి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హజరయ్యారు. ముందుగా కేస్లాపూర్ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కలెక్టర్ రాజర్షిషాతో క లిసి బ్యాంకు నూతన శాఖను ప్రారంభించారు. స్వ యం సహాయక సంఘాల సభ్యులకు రూ.25 కోట్ల చెక్కు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులు, మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే మళ్లీ రుణాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, శిక్షణ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవియా, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్,ఎంపీడీవో భాస్కర్, జెడ్పిటీసీ మాజీ సభ్యులు ఆర్క పుష్పలత, రిజినల్ మేనేజర్ ప్రభుదాస్, ఎల్‌డీఎం ఉత్పల్‌కుమార్, బ్యాంకు మెనేజర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
84 మంది కానిస్టేబుళ్ల బదిలీ
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలోని ఆయా పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న 84 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఎస్పీ గౌస్ ఆలం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా పోలీసు స్టేషన్లలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న వారిని, వివిధ నిష్ణాతులను బదిలీ చేశారు. 84 మందిలో 80 పురుష, నలుగురు మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment