‘ఉపాధి’ లక్ష్యాలను పూర్తి చేయాలి
● కలెక్టర్ రాజర్షి షా
కైలాస్‌నగర్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అ న్నారు. పథకం అమలు తీరుపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో శుక్రవారం స మీక్ష నిర్వహించారు. క్లస్టర్ల వారీగా పని దినాలు, చే పడుతున్న పనులు, వనమహోత్సవం, మహిళాశక్తి ఉపాధి భరోసా, స్వచ్ఛభారత్ మిషన్, సోషల్ ఆడి ట్ వివరాలను మండలాల వారీగా ఎంపీడీవోలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయా మండలాల్లోని పాఠశాలల్లో గల 95 కిచెన్‌గార్డెన్లలో 13,527 కూరగాయల మొ క్కలు నాటినట్లు తెలిపారు. వాటి సంఖ్య మరింతగా పెంచేందుకు గాను పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో స్థలాలను సేకరించాలన్నారు. నర్సరీల్లో ఈత, ఖర్జూర మొక్కల లక్ష్యం 9 లక్షలు కాగా 5,04,500 మొక్కలు నాటినట్లు తెలిపారు. అలాగే పశువుల పాకాల నిర్మాణాల లక్ష్యం 340కి గాను 232 మంజూరు చేయగా 59 పూర్తి చేసినట్లు చె ప్పా రు. పొలంబాట, చెక్ డ్యాం పనుల లక్ష్యాలను త్వరి తగతిన పూర్తి చేసేలా శ్రద్ధ వహించాలన్నారు. అంతకు ముందు ఆయా మండలాల్లో సాధించిన లక్ష్యాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. ఇందులో జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీఆర్డీవో సాయన్న, ఏడీఆర్డీవో కుటుంబ రావు తదితరులు పాల్గొన్నారు.
సర్వే పకడ్బందీగా చేపట్టాలి
ఇంద్రవెల్లి: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కో సం చేపట్టిన మొబైల్ యాప్ సర్వే పకడ్బందీగా ని ర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మండలంలోని ముత్నూర్ గ్రామంలో పంచాయతీ కార్యాలయాన్ని శుక్రవారం సందర్శించారు. అనంతరం సర్వే తీరును పరిశీలించి గడువులోపు పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయనవెంట ఉట్నూ ర్ సబ్‌కలెక్టర్ యువరాజ్ మర్మాట్, శిక్షణ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవియా, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో భాస్కర్, తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment