పొరపాట్లకు తావివ్వకుండా సర్వే చేపట్టాలి
ఇచ్చోడ: ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలంలోని అడేగామ బి గ్రామంలో సర్వేను శుక్రవారం పరిశీ లించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సర్వే పకడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షించాలని అధికారులు ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మణ్, తహసీల్దార్ సత్యనారాయణ, డిప్యూటీ తహసీల్దార్ జాదవ్‌రమేశ్, ఆర్‌ఐ హుస్సేన్, గ్రామస్తులు పాల్గొన్నారు.
‘ఫ్యామిలీ’ సర్వే పరిశీలించిన కలెక్టర్
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని రాంనగర్ కాలనీలో చేపడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ఇంటింటి సర్వేను కలెక్టర్ రాజర్షిషా శుక్రవా రం పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వివరాల నమోదు తీరును అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత ప్రొఫార్మా ప్రకారం కుటుంబ సభ్యుల వివరాలు ఎలాంటి తప్పుల్లేకుండా నమోదు చేయాలని సూ చించారు. కలెక్టర్ వెంట మావల, ఆదిలాబాద్ అర్బ న్ తహసీల్దార్లు వేణుగోపాల్, శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment