కై లాస్‌నగర్: నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన నవభారత సాక్షరత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో కార్యక్రమ నిర్వహణపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 15 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులను గుర్తించి, ఐదు దశల్లో వారికి శిక్షణ ఇచ్చి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. జిల్లాలో 18,051 మంది నిరక్షరాస్యులండగా ఇందులో పురుషులు7,220, మహిళలు 10,831 మంది ఉన్నారని తెలిపారు. స్వచ్ఛంద స్థానిక వలంటీర్ల ద్వారానే ఈ కార్యక్రమం అమలు కానుందన్నా రు. ఇందులో వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీని వాస్‌రెడ్డి, డీఆర్డీవో సాయన్న, డీఎంహెచ్‌వో కృష్ణ, మెప్మా పీడీ మమత, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
‘కాల్ బిఫోర్ యుడిక్’ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్ కాల్ బిఫోర్ యుడిక్ యాప్‌ను అందరూ రిజిస్ట్రేషన్ చేసుకొని వినియోగించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో టెలికాం అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అటవీ అనుమతులు పెండింగ్‌లో ఉన్నవి, మిషన్ భగీరథ పైపులైన్ డ్యామేజ్, కొత్త రహదారులు తదితర అంశాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఇరిగేషన్ ఎస్‌ఈ సురేశ్, టీ ఫైబర్ జిల్లా మేనేజర్ భరత్‌చంద్ర, ఈడీఎం రవీందర్, ఆర్‌అండ్‌బీ డీజీఎం, పీఆర్, విద్యుత్, అటవీశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment