ఎఫెక్ట్..
అనుమతి లేని క్వారీలను పరిశీలించిన అధికారులు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో అక్రమంగా తవ్వకాలు చేపడుతున్న క్వారీ నిర్వాహకుల ఆగడాలను వివరిస్తూ ‘ప్రాణాలు తీస్తున్న క్వారీలు.. ‘తవ్వేస్తున్నారు’ శీర్షికలతో ‘సాక్షి’లో ప్రచురించిన వరుస కథనాలకు స్పందన లభించింది. జిల్లా అటవీశాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ జిల్లాలోని తొమ్మిది రేంజ్‌ల పరిధిలోని క్వారీ నిర్వాహకులు, భూయజమానులకు వాల్టా చట్టం ప్రకారం నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. కాగా, గురువారం అటవీ శాఖ అధికారులు జిల్లాలోని బేల, ఉట్నూర్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, సిరిచెల్మ, బీర్సాయిపేట్, నేరడిగొండ, బోథ్ రేంజ్‌ల పరిధిలోని క్వారీలను సందర్శించారు. భూయజమానులు, క్వారీ నిర్వాహకుల గురించి ఆరా తీసి వివరాలు సేకరించారు. వాటి ఆధారంగా సదరు నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment