ఆదిలాబాద్‌రూరల్: తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇందిరమ్మ మహిళాశక్తి పథకం ద్వారా మైనార్టీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందించనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి రాజలింగు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 16నుంచి 31వరకు జిల్లాలోని మైనార్టీ ముస్లిం, సిక్కులు, బౌద్ధులు, జైనులకు చెందిన మహిళల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. వార్షికాదాయం గ్రామీణ ప్రాంతం వారికి రూ.1.30 లక్షలు, పట్టణ ప్రాంతం వారికి రూ.లక్ష మించకుండా ఉండాలని, 18–55 వయస్సు గల మహిళలు రేషన్, ఓటరు ఐడీ, ఆధార్‌కార్డులతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ ద్వారా నేర్చుకున్న టైలరింగ్ సర్టిఫికెట్ జత చేయాలని తెలిపారు. కనీసం ఐదో తరగతి విద్యార్హత కలిగి ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment