● జిల్లాలో 40 ఏళ్లలోపు గిరిజనులకు స్క్రీనింగ్‌ ● తొలి విడతలో 51 మందికి నిర్ధారణ ● 800 మందికి క్యారియర్‌.. ● ప్రారంభమైన రెండో విడత పరీక్షలు ● ‘నేషనల్‌ సికిల్‌సెల్‌ ఎనీమియా ఎలిమినేషన్‌ మిషన్‌’ షురూ | - | Sakshi
Sakshi News home page

● జిల్లాలో 40 ఏళ్లలోపు గిరిజనులకు స్క్రీనింగ్‌ ● తొలి విడతలో 51 మందికి నిర్ధారణ ● 800 మందికి క్యారియర్‌.. ● ప్రారంభమైన రెండో విడత పరీక్షలు ● ‘నేషనల్‌ సికిల్‌సెల్‌ ఎనీమియా ఎలిమినేషన్‌ మిషన్‌’ షురూ

Published Sat, Dec 21 2024 12:16 AM | Last Updated on Sat, Dec 21 2024 12:16 AM

● జిల

● జిల్లాలో 40 ఏళ్లలోపు గిరిజనులకు స్క్రీనింగ్‌ ● తొలి వ

రెండో విడత..

జిల్లాలో నవంబర్‌ 27 నుంచి సికిల్‌సెల్‌ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు. జిల్లాలోని 22 పీహెచ్‌సీలు, ఐదు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఉట్నూర్‌లోని జిల్లా ఆస్పత్రి, బోథ్‌ సీహెచ్‌సీలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందుకోసం 84 బృందాలను ఏర్పాటు చేశారు. మొదటి విడత గతేడాది జూన్‌లో నిర్వహించారు. జిల్లాలో 58,984 మందికి పరీక్షలు చే పట్టగా 51 మందికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఇందులో 800 మంది క్యారియర్లుగా ఉన్నారు. రెండో విడతలో భాగంగా ఇప్పటివరకు 10,978 మందికి పరీక్షలు చేయగా, ఒక్కరికి కూడా వ్యాధి నిర్ధారణ కాలేదు. జిల్లాలో 2లక్షల 80వేల వరకు గిరిజనులు ఉంటారని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. వీరందరికీ పరీక్షలు చేయనున్నారు.

ఆదిలాబాద్‌టౌన్‌: సికిల్‌సెల్‌ అనేది మనిషిని ‘కిల్‌’ చేసే వ్యాధి. జన్యుపరంగా సంక్రమిస్తుంది. ఒకసారి బారిన పడితే జీవితాంతం అనుభవించాల్సిందే. వివిధ రోగాలు తోడవుతూ ఆయుష్షు క్రమంగా తగ్గుతోంది. ఈ వ్యాధికి సంబంధించి క్యారియర్‌గా ఉన్నవారు మరో క్యారియర్‌ను పెళ్లి చేసుకుంటే పుట్టబోయే పిల్లలకు వ్యాధి సంక్రమిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నివారణ ఒక్కటే మార్గమని.. దేశంలో 2047 వరకు పూర్తిగా నయం చేయడమే లక్ష్యంగా వైద్యారోగ్య శాఖ ముందుకు సాగుతుంది. నేషనల్‌ సికిల్‌సెల్‌ ఎనీమియా ఎలిమినేషన్‌ మిషన్‌ కార్యక్రమం పేరిట జిల్లాలోని గిరిజనులందరికీ ఈ పరీక్షలు చేస్తున్నారు. గతనెల 27 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది.

గిరిజనుల్లోనే అధికం..

జిల్లాలో చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల్లో ఈ సమస్య అధికంగా ఉందని వైద్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సికిల్‌సెల్‌ ఉన్నవారికి ఎనీమియా సైతం సోకుతుంది. శరీరంలో రక్త కణాలు గుండ్రంగా ఉండి శరీర భాగాలకు ఆక్సిజన్‌ సరఫరా చేస్తాయి. కానీ సికిల్‌సెల్‌తో బాధపడే వారికి రక్త కణాలు కొడవళి ఆకారంలో ఉంటాయి. సాధారణ వ్యక్తుల్లో రక్త కణాలు 120 రోజులు బతికే ఉంటే వీరిలో 40 రోజులే బతకడంతో రక్తహీనత సమస్య వస్తుంది. రక్తాన్ని సరఫరా చేసే క్రమంలో ఇవి అడ్డు పడుతుంటాయి. తద్వారా శరీర భాగాలు వాపుగా ఉండటం, నొప్పులు రావడం, కంటి సమస్యలతో పాటు తరచూ రోగాల బారిన పడుతుంటారు. దీనికి చికిత్స లేకపోవడంతో మరణాలు సంభవిస్తున్నాయి.

ఒకరి నుంచి మరొకరికి సంక్రమించకుండా..

సికిల్‌సెల్‌ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. క్యారియర్‌గా ఉన్న వ్యక్తి మరో క్యారియర్‌ను వివాహం చేసుకుంటే వారికి పుట్టబోయే బిడ్డకు 25 శాతం వ్యాధి సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇలా జరగకుండా ప్రభుత్వం గుర్తింపు కార్డులను అందజేస్తుంది. ఈ వ్యాధి గురించి అవగాహన కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు. 40 ఏళ్లలోపు ఉన్నవారందరికీ ఈ పరీక్షలు చేయనున్నారు. కళాశాలలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో సైతం పరీక్షలు నిర్వహిస్తారు.

ముందు

జాగ్రత్తే మార్గం..

ముందుజాగ్రత్త మినహా ఈ వ్యాధికి మందులు లేవు. మందులతో పూర్తిగా నయం చేయడం వీలుకాదని వైద్యులు పేర్కొంటున్నారు. తలసేమియా మాది రిగా ఈ వ్యాధి సోకిన వారు తీవ్రతను బట్టి నిర్ణీత సమయంలో రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలి. వ్యాయామం కూడా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. సరైన సమయంలో చికిత్స చేయించుకోకపోతే మృత్యువాత పడే అవకాశాలుంటాయని పేర్కొంటున్నారు.

ఇవీ లక్షణాలు..

వ్యాధి సోకిన వారి రక్తంలోని ఎర్ర రక్త కణాలు గుండ్రంగా కాకుండా, వంకర తిరిగి ఉంటాయి. దీంతో శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుంది. ఆయాసం, దమ్ము, త్వరగా అలసిపోవడం వంటి లక్షణాలుంటాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఏ చిన్న జబ్బు వచ్చినా వారాల తరబడి మంచం పట్టాల్సి వస్తుంది. ముఖ్యంగా ముఖం పాలిపోవడం, హుషారుగా ఉండకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

నివారణకు కృషి

సికిల్‌సెల్‌ అనేది జన్యుపరంగా వస్తుంది. వ్యాధి సోకిన వారికి రక్తహీనత సమస్య ఉంటుంది. ఆరోగ్యంగా ఉండలేరు. శరీర భాగాల్లో వాపులు, నొప్పులు, కంటి సమస్యలు ఉంటాయి. వ్యాధి నిర్ధారణ కోసం జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. నవంబర్‌ 27 నుంచి జిల్లాలో రెండో విడత పరీక్షలు ప్రారంభించాం. 40 ఏళ్లలోపు గిరిజనులకు పరీక్షలు చేపడుతున్నాం.

– నరేందర్‌ రాథోడ్‌, డీఎంహెచ్‌వో

No comments yet. Be the first to comment!
Add a comment
● జిల్లాలో 40 ఏళ్లలోపు గిరిజనులకు స్క్రీనింగ్‌ ● తొలి వ1
1/3

● జిల్లాలో 40 ఏళ్లలోపు గిరిజనులకు స్క్రీనింగ్‌ ● తొలి వ

● జిల్లాలో 40 ఏళ్లలోపు గిరిజనులకు స్క్రీనింగ్‌ ● తొలి వ2
2/3

● జిల్లాలో 40 ఏళ్లలోపు గిరిజనులకు స్క్రీనింగ్‌ ● తొలి వ

● జిల్లాలో 40 ఏళ్లలోపు గిరిజనులకు స్క్రీనింగ్‌ ● తొలి వ3
3/3

● జిల్లాలో 40 ఏళ్లలోపు గిరిజనులకు స్క్రీనింగ్‌ ● తొలి వ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement