సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్‌టౌన్: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ డీఎస్పీ హసీ బుల్లా అన్నారు. పట్టణంలోని పలు షాపింగ్ మాళ్లలో సైబర్ క్రైమ్‌పై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అపరిచిత వ్యక్తులు, నంబర్ల నుంచి ఫోన్లకు వచ్చే లింకులను తెరవకూడదని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీనంబర్ 1930లో సమాచారం అందించాలని పేర్కొన్నారు. ఇందులో సిబ్బంది పాల్గొన్నారు.
గుత్పాలలో వైద్య శిబిరం
నేరడిగొండ: కిడ్నీ సమస్యలతో ‘ప్రాణాలు పో తున్నాయ్’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి వై ద్యారోగ్య శాఖ స్పందించింది. మండలంలోని గుత్పాల గ్రామంలో సోమవారం వైద్య శిబి రం ఏర్పాటు చేశారు. 55 మందిని పరీక్షించారు. 18 మందికి రక్త నమూనా పరీక్షలు చేశారు. ఇందులో 19 మంది బీపీ, 8 మంది మధుమేహ బాధితులు ఉన్నట్లు గుర్తించినట్లు స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి సద్దాం తెలిపారు. అలాగే గ్రామంలోని ఐదు చేతి పంపుల నుంచి నీటి శాంపిళ్లను సేకరించి నీటిపారుదల శాఖకు పంపించినట్లు పేర్కొన్నారు. అనంతరం గ్రామస్తులకు కిడ్నీ వ్యా ధులపై అవగాహన కల్పించారు. ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే పీహెచ్‌సీలో సంప్రదించి చికిత్స పొందాలన్నారు. అలాగే గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం ఉందని, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పర్యటించినప్పుడు వ్యాధుల వివరాలను తెలియజేయాలని పేర్కొన్నారు. ఇందులో హెచ్‌ఈవో పవార్ రవీందర్, హెల్త్ అసిస్టెంట్లు సంతో ష్, సాయన్న, ఏఎన్‌ఎం కల్పన, ఆశ కార్యకర్తలు కమల, గంగామణి, గంగుబాయి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment