కల్యాణం.. కమనీయం
తాంసి: భీంపూర్ మండలం నిపాని శ్రీభూగోదా సహిత వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం చివరిరోజు వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అంతకుముందు పద్మావతి, లక్ష్మీదేవి, వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ వ్యవస్థాపకుడు శివదత్తగిరి మహరాజ్, పండితులు నేరెళ్ల కళ్యాణాచార్యులు, ఉమాకాంత్ కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కల్యాణాన్ని వీక్షించేందుకు వివిధ గ్రామాల నుంచి భక్తులు అధికసంఖ్యలో రాగా, ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతాంగే బ్రహ్మనంద్, జిల్లా నాయకుడు పాయల్ శరత్ తదితరులు బ్రహ్మోత్సవాలకు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. సామాజిక కార్యకర్త బండారి దేవన్న, కొండయ్య చౌదరి తదితరులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశా రు. భక్తులకు ఆలయకమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment