ల బ్ధిదారుల ఎంపిక పక్కాగా ఉండాలి
సిరికొండ: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భ రోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డుల కోసం అర్హుల ఎంపిక పక్కాగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా సూ చించారు. గురువారం మండల కేంద్రంలో చేపట్టిన సర్వేను ఆయన పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. సాగుకు యోగ్యం కాని భూములను గుర్తించాలని సూచించారు. మండలంలోని రాయిగూడలో రేషన్ కార్డుల సర్వేలో భాగంగా దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లి నేరుగా వివరాలు సేకరించారు. మండలంలోని పొ న్న గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సూపర్ చెక్ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో శ్మశాన వాటిక నిర్మించాలని సిరికొండ గ్రామస్తులు కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వగా, ఆయన సానుకూలంగా స్పందించారు. ట్రైనీ కలెక్టర్ అభిజ్ఞన్, డీఎల్పీవో ఫణిందర్, తహసీల్దార్ తుకారాం, ఎంపీడీవో రవీందర్, ఎంపీవో సంతోష్‌కుమార్, వ్యవసాయశాఖ అధికారి శ్రద్ధారాణి, ఏఈవో ప్రవీణ్, సర్వేయర్ గణేశ్, పంచాయతీ కార్యదర్శులు అరుణ్‌కుమార్, నీతా, అజ్మత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment