ట్రాఫిక్ కష్టాలు తీరేదెలా?
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. వాహనాల సంఖ్య పెరిగి రోడ్లన్నీ రద్దీగా మారాయి. కొందరు వాహనాలను ఎక్కడబడితే పార్కింగ్ చేస్తుండటంతో ఈ సమస్య తలెత్తుతోంది. అశోక్ రోడ్, గాంధీచౌక్, అంబేడ్కర్‌చౌక్, శివాజీచౌక్, రైతుబ జార్, కలెక్టర్ చౌక్, బస్టాండ్, రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంటోంది. పలువురు రాంగ్‌రూట్‌లో వాహనాలతో వె ళ్తుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా యి. రోడ్డు మధ్యలోని డివైడర్‌కు ఇరువైపులా చి రువ్యాపారులు బండ్లు పెట్టుకుని వ్యాపారం చే స్తున్నారు. దీంతో రోడ్డుపై ద్విచక్రవాహనాలు వెళ్లలేని దుస్థితి నెలకొంది. పంజాబ్‌చౌక్ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా భారీ వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. రాంనగర్ ప్రాంతంలో ఇసుక ట్రాక్ట ర్లు, అశోక్ రోడ్, అంబేడ్కర్‌చౌక్, గాంధీ చౌక్ ప్రాంతాల్లో షాపుల ఎదుట వాహనాలు పార్కింగ్ చేస్తుండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది.
రోడ్డు పక్కన వ్యాపారాలు
జిల్లా కేంద్రంలో కొందరు ప్రధాన రోడ్లకు ఇరువైపులా వ్యాపారం చేస్తున్నారు. దీంతో రోడ్డు పక్క న నిలపాల్సిన వాహనాలు మధ్యలో నిలుపాల్సి వస్తోంది. ఈ కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కాన్వెంట్ పాఠశాల, బస్టాండ్ ప్రాంతంలోని స్కూళ్ల ఎదుట, వినాయక్ చౌక్‌లోని పాఠశాలల వద్ద నిత్యం ఈ సమస్య తలెత్తుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో అంబేడ్క ర్ చౌక్ నుంచి గాంధీచౌక్, అశోక్ రోడ్ నుంచి బంగారు దుకాణాలకు వెళ్లే తిర్పెల్లి రహదారి నిత్యం రద్దీగా ఉంటోంది. రోడ్డు ఇరుకుగా ఉండడంతో రెండు వాహనాలు దాటలేని పరిస్థితి ఉంది. దు కాణాల ఎదుటే వాహనదారులు పార్కింగ్ చే స్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏ ర్పడుతోంది. ముఖ్యంగా కలెక్టర్ చౌక్, అంబేడ్కర్‌చౌక్, గాంధీచౌక్, శివాజీ చౌక్, మున్సిపల్, తాంసి బస్టాండ్, సాత్నాల బస్టాండ్ తదితర ప్రాంతా ల్లో వ్యాపారులు రోడ్లపైకి వచ్చి వ్యాపారం కొనసాగిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. తోపుడు బండ్లు తొలగించాలని పోలీసులు సూచిస్తే వారితోనే వాగ్వాదానికి దిగుతున్నారు. రైతుబజార్ ఎదుట సా యంత్రం 4నుంచి రాత్రి 8గంటల వరకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పా ర్కింగ్ స్థలంలో కొందరు చిరువ్యాపారులు విక్రయాలు కొనసాగిస్తుండగా ఈ ప్రాంతం రద్దీగా మారి వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులేర్పడుతున్నాయి. వ్యాపారుల కోసం రైతుబజార్‌లో ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేసినా పార్కింగ్ స్థలంలోనే విక్రయాలు కొనసాగిస్తున్నారు.
జరిమానాలతోనే సరి పెడుతూ..
జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తున్నా ట్రాఫిక్‌ను నియంత్రించడంలేదనే ఆ రోపణలున్నాయి. రోడ్ల పక్కన, పార్కింగ్ స్థలం, ప్రధాన కూడళ్లలో చిరువ్యాపారులు విక్రయాలు కొనసాగిస్తున్నా నియంత్రించేవారే లేరని వాపోతున్నారు. రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ చేసే వా హనదారులపై చర్యలు తీసుకోవడంలేదని విమర్శిస్తున్నారు. భారీ శబ్దాలతో ద్విచక్ర వాహనదా రులు వెళ్తున్నా పట్టింపులేదని ఆరోపిస్తున్నారు.
ఎక్కడబడితే అక్కడే పార్కింగ్
ఫుట్‌పాత్‌లపైనే వ్యాపారాలు
అవస్థలు పడుతున్న జనాలు
నిబంధనలు పాటించాల్సిందే..
మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తాం. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాం. తరచూ నిబంధనలు అతిక్రమిస్తున్న వారిని గుర్తించి వారి వివరాలు రవాణాశాఖ అధికారులకు ఇస్తున్నాం. డ్రంకెన్ డ్రైవ్ చేపట్టి జరిమానా విధిస్తున్నాం. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. సైలెన్సర్లు లేకుండా భారీ శబ్దాలతో వెళ్లే వాహనాలను సీజ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే.
– ఎల్.జీవన్‌రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment