నాగోబా జాతరకు ఏర్పాట్లు
ఈ నెల 28న మెస్రం వంశీయుల మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం కానుంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
శుక్రవారం శ్రీ 17 శ్రీ జనవరి శ్రీ 2025
8లోu
భీంపూర్ మండలం నిపాని గ్రామంలో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి బీ కిషన్ పర్యటించారు. ఈ గ్రామంలో సాగులో లేని భూమిని పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు నమోదు చేయించారు.
జిల్లా కేంద్రంలోని డీఆర్డీవో కార్యాలయంలో ఉద్యోగులు కొద్ది రోజులుగా ఉపాధిహామీ కూలీల జాబ్‌కార్డుతో ఆధార్‌ను ఆన్‌లైన్‌లో అనుసంధానం చేసే ప్రక్రియ చేపట్టారు. ఆ తర్వాత భూ భారతి పోర్టల్‌లోని వివరాల ఆధారంగా భూమిలేని కూలీలను గుర్తించే ప్రక్రియ శుక్రవారం నుంచి చేపట్టనున్నారు.
ఫీల్డ్ వెరిఫికేషన్‌లో భాగంగా సిరికొండ మండలం పొన్న గ్రామంలో గురువారం కలెక్టర్ రాజర్షిషా పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేకు సంబంధించి సూపర్‌చెక్ ప్రక్రియను పరిశీలించారు. సర్వే తీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్ కాలనీలో జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటేశ్వర్లు పర్యటించారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లారు. వారి వివరాలు సేకరించారు.
విధుల్లో చేరిన డీఈవో ప్రణీత
ఆదిలాబాద్‌టౌన్: అనారోగ్యంతో గతనెల 6 నుంచి సెలవులో ఉన్న డీఈవో ప్రణీత గురువారం విధుల్లో చేరారు. ఇప్పటివరకు ఇన్‌చార్జి డీఈవోగా కార్యాలయ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి వ్యవహరించిన విషయం తెలిసిందే.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment