● 26నుంచి పలు పథకాల అమలు ● కొనసాగుతున్న అర్హుల ఎంపిక ●
సాక్షి, ఆదిలాబాద్: ఈ నెల 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొన్ని పథకాల అమలుకు సిద్ధమవుతోంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలు లోకి తెచ్చి అర్హులకు ప్రయోజనం చేకూర్చేందుకు చర్యలు చేపడుతోంది. ఇందుకు ప్రస్తుతం అధికారులు, ఉద్యోగులు సర్వేలో బిజీగా ఉన్నారు. గురువా రం నుంచి ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రా రంభించారు. ఈనెల 20వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హుల జాబితాను రూపొందిస్తారు. 21 నుంచి గ్రామసభల్లో ఆ జాబితాను ప్రవేశపెట్టి ఆమోదం తీసుకుంటారు. ఆ తర్వాత జాబితాలను కలెక్టర్ కార్యాలయంలో అందిస్తారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయి పర్యటనలో పలు శాఖల అధి కారులు, ఉద్యోగులు బిజీబిజీగా ఉన్నారు. సర్వే ప్ర క్రియలో నిమగ్నమయ్యారు. ప్రజాపాలనలో భా గంగా దరఖాస్తు చేసుకున్న పథకాల్లో ప్రధానంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసాతో పాటు భూమి లేని కూలీలకు ఆర్థికసాయం అందించేందుకు సర్వే మొదలైంది. కలెక్టర్ మొత్తం ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిశీలిస్తున్నారు.
అమలయ్యే పథకాలివే..
రైతు భరోసా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అర్హుల జాబితా తయారు చేయడంలో నిమగ్నమైంది. సాగుకు యోగ్యం కాని భూములు, గుట్టలు, నివాసాలు కలిగిన ఇతర భూములు, వెంచర్లు, భూ సేకరణ కింద తీసుకున్న సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు, రైల్వే లైన్, రహదారుల కోసం తీసుకున్న భూముల వివరాలు అధి కారులు సేకరిస్తున్నారు. వ్యవసాయ అధికారులు రూపొందించిన జాబితాను క్షేత్రస్థాయిలో సిబ్బంది పరిశీలించాలి. రేషన్ కార్డు కోసం వచ్చిన దరఖాస్తుదారుల పూర్తి వివరాలు నమోదు చేయాలి. గ్రామీ ణ ప్రాంతాల్లో నివసించేవారి వార్షికాదాయం రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి రూ.2లక్షలకు మించి ఉండకూడదు. రేషన్‌కార్డుల్లో పేర్ల తొలగింపు, కొత్త పేర్లు చేర్చడం లాంటి ప్రక్రియ కూడా చేపట్టాలి. ఇందిరమ్మ ఇళ్ల సర్వే జిల్లాలో దాదాపు పూర్తయింది. అర్హుల జాబితా తయారు చేశారు. క్షేత్రస్థాయిలో మరోసారి ఆ జాబితాపై సమగ్ర పరిశీలన ప్రస్తుతం సూపర్‌చెక్ విధానంలో సాగుతోంది. భూమిలేని నిరుపేదలు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో కనీసం 20 రోజుల పాటు పనిదినాలు కలిగి ఉండాలి. వీరి వివరాలతో అర్హుల జాబితాను రూపొందించాలి. ఉపాధిహామీ కూలీల జాబ్‌కార్డుకు ఆధార్‌కార్డును అనుసంధానించాలి. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తయింది. ఆ తర్వాత భూ భారతి పోర్టల్‌తో మ్యాచింగ్ చేసి భూమిలేని వారి వివరాలు నమోదు చేయా లి. ఆ తర్వాత సంవత్సరానికి వారికి రూ.12వేల ఆర్థికసాయం ప్రభుత్వం అందించనుంది. ఇందుకు అధికారులు అర్హుల జాబితాను రూపొందించే పని లో పడ్డారు. మొత్తంగా ప్రస్తుతం అధికారులు, ఉ ద్యోగులు క్షేత్రస్థాయి పరిశీలనతో పాటు వార్డు సభలు, గ్రామసభల ద్వారా అర్హుల జాబితా రూపొందించే పనిలో ఉన్నారు. క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, ఏఈవోలు, ఉపాధిహామీ క్షేత్ర సహాయకులు, రెవెన్యూ సిబ్బందితో బృందాలను నియమించారు. ప్రస్తుతం గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో పర్యటించి సర్వే చేస్తున్నారు. మొత్తంగా జిల్లా అంతటా సర్వే సందడి కనిపిస్తోంది.
పకడ్బందీగా చేపడుతున్నాం
క్షేత్రస్థాయి పరిశీలన పకడ్బందీగా చేపడుతున్నాం. సమగ్ర పరిశీలన అనంతరం గ్రామసభల ద్వారా అర్హుల జాబి తా రూపొందిస్తాం. అర్హులందరికీ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా చూ స్తాం. ఈనెల 21నుంచి గ్రామసభల్లో అర్హుల జాబితా ప్రవేశపెట్టి ఆమోదం తీసుకుంటాం.
– రాజర్షిషా, కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment