గాలిపటం ఎగిరేస్తూ.. బిల్డింగ్ పైనుంచి పడ్డ బాలుడు
గుడిహత్నూర్: పతంగి ఆట ఆ బాలుడి ప్రాణం మీదకు తెచ్చేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని ఇన్కర్‌గూడ గ్రామానికి చెందిన జాడి మురళి–విజేత దంపతు ల కుమారుడు వినయ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నాల్గోతరగతి చదువుతున్నాడు. సోమవా రం సాయంత్రం స్నేహితులతో కలిసి పక్కింటి బిల్డింగ్‌పైకి గాలిపటం ఎగురవేయడానికి వెళ్లా డు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు రిమ్స్‌కు తరలించారు.తీవ్రగాయాలతో బాలుడు కోమాలోకి వెళ్లగా.. మెరుగైన చికిత్స కోసం హైదరా బాద్ తరలించాలని వైద్యులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment