ఆదిలాబాద్‌రూరల్: ఉద్యోగ, ఉపాధి, రాజకీయం, ఆర్థికంగా వెనుకబడి ఉన్న ఆదివాసీ పర్ధాన్ సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆదివాసీ పర్ధాన్ పురోహిత్ సంఘ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉయికే సుదర్శన్, మెస్రం కేశవ్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గాంధీపార్క్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 12న మాఘమాస పౌర్ణమి సందర్భంగా ఆదివాసీ పర్ధాన్ సమాజ్ కుల దైవం గురు హీరా సుక్కా లింగో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు ఆర తం అనసూయ, ఉపాధ్యక్షులు గంగాసారగ్, సెడ్మకి సుభాష్, మెస్రం నాగనాథ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆర్క శేషరావ్, సలహా దారులు పూసం ఆనంద్‌రావ్, కుస్రం సీతా రాం, కమిటీ సభ్యులు మడావి శంకర్, తొ డసం సీతారాం, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment