తాంసి: భీంపూర్ మండలం అర్లి(టి)లోని వాతావారణ కేంద్రాన్ని తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈవో షేక్ మీరా మంగళవారం తనిఖీ చేశారు. అర్లి(టి)లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దష్ట్యా హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బందం స్వయంచాలిక వాతావరణ కేంద్రాల (ఏడబ్ల్యూఎస్)ను తనిఖీ చేశారు. అర్లి(టి) ఏడబ్ల్యూఎస్ నమోదైన ఉష్ణోగ్రతలతో మాన్యువల్‌గా సైక్లోమీటర్ ద్వారా సరిచూసి ఎలాంటి తేడా కనిపించలేదన్నారు. వేకువ జామున 5 నుంచి 6 గంటల వరకు వాతావరణ నమోదు కేంద్రం వద్ద ఉష్ణోగ్రత నమోదుపై ఆరాతీశారు. వారి వెంట జిల్లా టెక్నికల్ అధికారి మనోహర్, మండల ఏఎస్వో అభిలాష్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment