సంక్రాంతి సంబురం..
తెలంగాణ సంస్కృతి ప్రతిబింభించేలా వేసిన ముగ్గు
గాలిపటాలతో చిన్నారులు, యువత
గాలిపటం ఎగురవేస్తున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్
జిల్లావ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించుకున్నారు. సోమవారం భోగి, మంగళవారం సంక్రాంతి, బుధవారం కనుమ పండుగ వేడుకల్లో జిల్లావాసులు
ఉత్సాహంగా పాల్గొన్నారు. యువతులు, మహిళలు వేకువజామునే లేచి ఇంటి ముంగిళ్లలో ముగ్గులు వేయగా, చిన్నారులు, యువకులు గాలిపటాలతో సందడి చేశారు. ఇక వంటిళ్లు పిండి వంటలతో ఘుమఘుమలాడాయి. సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ గాలిపటం ఎగురవేసి యువకుల్లో ఉత్సాహాన్ని నింపారు. – ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment