‘గీత కార్మికులపై దౌర్జన్యాలు అరికట్టాలి’
ఆదిలాబాద్‌రూరల్: గీత కార్మికులపై దౌర్జన్యాలు అరికట్టాలని మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘ భవనంలో మోకుదెబ్బ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కమిటీల పేరిట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో గీత కార్మికులపై బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. వీడీసీ కమిటీల మాట వినని వారిని కుల, సంఘ బహిష్కరణలు చేస్తున్నారని ఆరోపించారు. వీడీసీ కమిటీలను వెంటనే రద్దు చేసి వీడీసీ బలవంతపు వసూళ్లను ఆపాలని కోరారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు, మోకుదెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగాగౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి బాలసాని నారాయణగౌడ్, రాష్ట్ర కార్యదర్శి రంగు నాగరాజుగౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పోతారం నర్సాగౌడ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రంగు శ్రీనివాస్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment