హామీలు అమలు చేయని కాంగ్రెస్
● మాజీ మంత్రి జోగు రామన్న
బేల: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను అప్పులపాలు చేస్తోందని రాష్ట్ర మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతుల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తాదిగా ఉండడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆయన నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇజ్జగిరి నారాయణ, ఠాక్రే గంభీర్, సతీష్ పవార్, జక్కుల మధుకర్, ప్రమోద్‌రెడ్డి, దేవన్న, తన్వీర్‌ఖాన్, వైద్య కిషన్, బాలచందర్, జితేందర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment