గిరిజన ప్రాంతాల్లో విస్తృత అవగాహన
కై లాస్‌నగర్: జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో కళా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా నెల రోజుల పాటు విస్తృత ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ ఆవరణలో సాంస్కృతిక కళాజాత ప్రచార రథాన్ని బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులకు ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన ఉంటే సమీపంలోని సబ్‌సెంటర్, పీహెచ్‌సీ, వెల్‌నెస్ సెంటర్‌కు వెళ్తారన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్, డీఎంహెచ్‌వో డాక్టర్ నరేందర్ రాథోడ్, ఆర్‌టీవో శ్రీనివాస్, డీపీఆర్వో తిరుమల, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment