సంప్రదాయాలను మరువొద్దు
ఇచ్చోడ: ఆదివాసీ యువత సంస్కృతి, సంప్రదా యాలను మరిచిపోవద్దని మాజీ ఎంపీ సోయం బా పూరావు సూచించారు. గురువారం నారాయన్‌పూర్‌లో నిర్వహించిన గోండి ధర్మ సభలో పాల్గొని మా ట్లాడారు. ఏటా పవిత్ర పుష్యమాసంలో ప్రతి ఒక్క రూ ‘జై జంగో.. జై లింగో’ దీక్షలు స్వీకరించాలన్నా రు. పట్టుదలతో చదువుకుని కుటుంబాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని, మూఢ నమ్మకాలను వీ డాలని, ఆరోగ్య సమస్యలుంటే ఆస్పత్రులకే వెళ్లాల ని సూచించారు. దీక్ష గురువు భగవంత్ మహరాజ్ మాట్లాడుతూ.. ఆదివాసీ యువత మద్యం, మాంసాహారాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. వ్యసనాలకు బానిసైనవారు చిన్న వయస్సుల్లోనే మృత్యువాత పడుతున్నారని తెలిపారు. ఆదివాసీ పెద్దలు కుంర కోటేశ్వర్, జలై జాకు, కొడప నగేశ్, వివిధ గ్రామాల పటేల్‌లు, సార్‌మేడిలు, జంగో లింగో దీక్షాపరులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment