ఆదిలాబాద్: ఆర్టీసీ ఆదిలాబాద్ డిపో పరిధిలో గురువారం నిర్వహించిన ‘డయల్ యువర్ డీఎం’కు స్పందన లభించింది. డి పో మేనేజర్ కల్పన ప్రయాణికుల నుంచి వ చ్చిన విజ్ఞప్తులు, ఫిర్యాదులు, సమస్యలు న మోదు చేసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఆదిలాబాద్ నుంచి శంకర్‌గౌడ్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్–బెంగళూ రు మధ్య బస్సు నడపాలని కోరారు. నిర్మల్ నుంచి భారత్‌నాయక్ మాట్లాడుతూ.. ఆది లాబాద్–కరీంనగర్ బస్సును కడెం మీదుగా నడపాలని విజ్ఞప్తి చేశారు. బోథ్ నుంచి సురేశ్, ఆదిలాబాద్ నుంచి వినోద్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్–నాగపూర్ మధ్య 1, 6 గంటలకు బస్సు నడపాలని కోరారు. వీటిపై డీఎం సానుకూలంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment