క్రాస్ కంట్రీ జిల్లా జట్ల ఎంపిక
విశాఖ స్పోర్ట్స్: రాష్ట్ర క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపికను ఆదివారం పోర్ట్ స్టేడియంలో నిర్వహించారు. జిల్లా అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో మెన్, వుమెన్, అండర్ 20,18,16 బాల బాలికల విభాగాల్లో పోటీలు జరిగాయి. జనవరి ఐదో తేదీన రాష్ట్ర స్థాయి పోటీలు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరగనున్నాయని సంఘం కార్యదర్శి నారాయణరావు తెలిపారు. పోటీల్లో విజేతలకు విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ అధినేత మెడల్స్ అందించారు. పోటీల నిర్వాహణలో కోచ్‌లు రాంకుమార్, వైకుంఠరావు సహకారం అందించారు. మెన్‌లో వేదవ్యాస్, రమేష్, శ్యామ్ వుమెన్‌లో దివ్యదుర్గ, జ్యోతిదుర్గ, హేమంగిణి తొలి మూడు స్థానాల్లో నిలిచారు. అండర్ 20 బాలురలో చిన్న, సాయి యశ్వంత్, రాజవర్ధన్, బాలికల్లో హాసిని, వైశాఖి, రోహిణి, అండర్–18 బాలురలో జగదీష్, సాయివిగ్నేష్, సూర్యతేజ, బాలికల్లో ప్రవేశిక, భార్గవి, గాయత్రి లాస్య తొలి మూడు స్థానాల్లో నిలిచారు. అండర్–16 బాలురలో జీవన్‌కుమార్, జశ్విన్, అన్వేష్ బాలికల్లో రాగిణి, కావ్యమూర్తి, లక్ష్మీఅనూష తొలి మూడు స్థానాల్లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment