బ్యాంకు ఉద్యోగుల సహకారంతో సైబర్ నేరాలకు చెక్
అనకాపల్లి: సైబర్ నేరాలను జరిగినప్పుడు బ్యాంక్ ఖాతాదారులు, ఉద్యోగులు గంటలోపు దగ్గరలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చినట్లయితే నగదును తిరిగి తీసుకురావచ్చని డీఎస్పీ ఎం.శ్రావణి అన్నారు. స్థానిక విజయ రెసిడెన్సీలో మంగళవారం రాత్రి పట్టణ పరిధిలో వివిధ బ్యాంక్ మేనేజర్లతో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెద్ద మొత్తంలో సొమ్ము విత్‌డ్రా చేసే ఖాతాదారులు సైబర్ నేర బాధితులేమోనని బ్యాంకు ఉద్యోగులు ఆరా తీయాలన్నారు. డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాల గురించి భయపడవద్దని, ఏ పోలీస్ అధికారి ఫోన్‌లో అరెస్టులు చేయరని వారికి వివరించి, ధైర్యం చెప్పాలన్నారు. అటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు 1930 నంబర్‌కు ఫోన్ చేసి తక్షణ సహాయం పొందవచ్చన్నారు. బ్యాంకు ఉద్యోగుల సహకారం ఉంటే సైబర్ నేరాలకు సులభంగా చెక్ పెట్టవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ టి.వి.విజయకుమార్, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment