కలుషిత ఆహారంతో ఐదుగురికి అస్వస్థత
ఎస్.రాయవరం : పి.ధర్మవరం గ్రామంలో ఓ కుటుంబంలో పుడ్ పాయిజన్ జరిగి ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధిత కుటుంబ సభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో సోమవారం బోనాలు పండగ సందర్భంగా అడపా లోవ ఇంటికి అల్లుడు చిరంజీవి, కుమార్తె లక్ష్మి, వారి పిల్లలు లిఖిత,పల్లవి యలమంచిలి మండలం పులపర్తి నుంచి పి.ధర్మవరం వచ్చారు. సోమవారం రాత్రి ఇంటి వద్ద వరి నూక ఉప్మా వండుకుని తిన్నారు. తిన్న కాసేపటికి ఆయాసం, వాంతులతో ఇబ్బంది పడ్డారు. వారిని వెంటనే అనకాపల్లి ఎన్‌టీఆర్ ఆస్పత్రికి తరలించారు. పిల్లలు ఆరేళ్లు లిఖిత, పల్లవి, తండ్రి చిరంజీవి ఆరోగ్యం కాస్త నిలకడగా ఉంది. అడపా లోవ ఆమె కుమార్తె శానాపతి లక్ష్మి అపస్మారక స్థితికి చేరుకోవడంతో వారిని విశాఖ కేజిహెచ్‌కి తరలించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రమేష్‌బాబు బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment