కూటమి మాటలకెన్నో అర్థాలున్నాయి... నోటినిండా అబద్ధాలే ఉం
6
సాక్షి, అనకాపల్లి :
ఎన్నికల ముందు చంద్రబాబు ప్రకటించిన హామీలన్నీ తుంగలో తొక్కారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఫీజు రీయింబర్స్‌మెంట్, 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం వంటి హామీలన్నీ గాలికొదిలేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని కూటమి సర్కారు ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తోంది.
విద్యార్థులపై ‘ఫీజు’ భారం..
కూటమి ప్రభుత్వంలో పేదోడికి చదువు భారంగా మారింది. ఇంటర్ చదివి అపై ఉన్నత చదువులు అభ్యసించే ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ, పీజీ విద్యార్థులపై ఫీజుల భారం పడింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కల్పించడంతో పేద విద్యార్థులంతా ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో ఉన్నత చదువుల కోసం చేరారు. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థులపై ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు ఫీజు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో సగంలోనే చదువులు ఆగిపోవడంతో అప్పులు చేసి ఫీజులు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో 1.2 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులపై ఫీజుల బారం పడింది.
ఏదీ.. తల్లికి వందనం
బడికి వెళ్లే పిల్లలందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయమన్న చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌తో ఈ ఏడాది తల్లికి వందనం ఇవ్వలేమంటూ ప్రకటించారు. తల్లులంతా ప్రభుత్వంపై మండిపడుతున్నారు. జిల్లాలో సుమారు 1,50,870 మంది తల్లులకు ప్రభుత్వం ఏటా రూ.15 వేల చొప్పున జమ చేసేది. ఇప్పుడు ఈ సాయం కోసం 2,18,190 మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.
నిరుద్యోగులకు ఆశాభంగం?
2014లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేసి, ఈ ఎన్నికల్లోనూ అదే హామీని ప్రధానంగా తీసుకొచ్చారు. ఈ పథకం పొందడానికి జిల్లాలోని 4,79,920 బీపీఎల్ కుటుంబాల్లో నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు.
మహిళలకు ఏం సమాధానం చెబుతారు?
గత ప్రభుత్వంలో మహిళలకు చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పేరిట సాయం అందేది. ఏ విధమైన పింఛన్ రాని 18 ఏళ్లు దాటిన మహిళలదరికీ నెలకు రూ.1500 చొప్పున అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జిల్లాలో 5,47,888 మంది మహిళలున్నారు.
ఉచిత బస్సు ఉత్తమాటేనా...
జిల్లాలో 18 ఏళ్లు దాటిన మహిళలు 6,53,500 మంది... 5 నుంచి 18 ఏళ్ల వయసున్న బాలికలు 84,814 మంది. వీరందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలి. ఇంత వరకు దాని గురించి ప్రస్తావన లేదు.
ఒకటే సిలిండర్‌తో సరి..
ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఒక్కటే సిలిండర్ ప్రకటించారు. జిల్లాలో 5,17,081 గ్యాస్ కనెక్షన్లను లబ్ధిదారులుగా గుర్తించారు. కానీ వీరిలో 3 లక్షల 60 వేల కనెక్షన్‌లకే ప్రభుత్వం సిలిండర్లు సరఫరా చేస్తుంది.
సూపర్–6 పేరుతో ప్రజలకు నయవంచన అన్నాక్యాంటీన్లు, సింగిల్ సిలిండర్, వెయ్యి పింఛను పెంపుతో సరి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు నిర్వీర్యం పడకేసిన విద్య, వైద్యం, సంక్షేమ రంగాలు అడుగడుగునా జిల్లాను దగా చేసిన కూటమి సర్కారు
Comments
Please login to add a commentAdd a comment