చోడవరం రూరల్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ిస్కిల్ హబ్ ఆధ్వర్యంలో ఈ నెల 16న ఉదయం 9 గంటల నుంచి మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ పి.కిరణ్‌కుమార్, స్కిల్ హబ్ కో–ఆర్డినేటర్ వి.అప్పలనాయుడులు శుక్రవారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. మేళాలో ఎస్‌కేఎల్ అసోసియేట్స్, క్రెడిట్ ఆసిస్ గ్రామీణ్ బ్యాంకు లిమిటెడ్, డయాకిన్ ఎయిర్ కండిషనర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. చోడవరం, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు సమీప ప్రాంతాల్లోని తగిన అర్హతలు, ఆసక్తి గల నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. పూర్తి సమాచారం కోసం స్కిల్ హబ్ ఇన్‌స్ట్రక్టర్ శ్రీనివాస్‌ను 94947 91935 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment