16న సింహగిరిపై నెలగంట
సింహాచలం: సింహగిరిపై ఈ నెల 16న నెలగంట ఉత్సవాన్ని విశేషంగా నిర్వహిస్తున్నట్టు సింహాచలం దేవస్థానం ఈవో వి.త్రినాథరావు తెలిపారు. ఆ రోజు నుంచి నెల రోజులపాటు ధనుర్మాసం పూజలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. సింహగిరిపై డిసెంబర్, వచ్చే ఏడాది జనవరిలో జరిగే విశేష ఉత్సవాలకు సంబంధించిన వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఈ నెల 16న ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ రోజు ఉదయం 6.35 గంటలకు సింహగిరిపై రాజగోపురంలో నెలగంట మోగిస్తారు. స్వామి, గోదాదేవికి విశేష పూజలు, తిరువీధి నిర్వహిస్తారు. నెలగంట సందర్భంగా ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి స్వామి దర్శనాలు ప్రారంభమవుతాయి.
31 నుంచి అధ్యయనోత్సవాలు
శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఈ నెల 31 నుంచి వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరుగుతాయి. ఈ నెల 31 నుంచి జనవరి 9 వరకు పగల్‌పత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రతి రోజూ ఉదయం స్వామికి తిరువీధి ఉత్సవం(అయ్యవారి సేవ) జరుగుతుంది.
జనవరి 10 నుంచి 20వ తేదీ వరకు రాపత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రతి రోజూ సాయంత్రం 5 గంటలకు స్వామికి తిరువీధి జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment