రైతన్న గొంతుకై ..
అందరికీ అన్నం పెడుతున్న రైతుల పొట్టకొట్టింది కూటమి ప్రభుత్వం. ఆరుగాలం శ్రమిస్తున్న అన్నదాతకు ‘భరోసా’ కల్పిస్తూ అండగా నిలవాల్సిన సర్కారు.. అనాథగా వదిలేసింది. కూటమి నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు సంతోషపడిన రైతు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వారి చేష్టలకు విసిగిపోయాడు. పొలంలో హలం పట్టాల్సిన కర్షకుడి కడుపుమండి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ప్లకార్డులు పట్టుకున్నాడు. కనీస మద్దతుధర కల్పించాలంటూ నినదించాడు.. పెట్టుబడి సాయం ఎక్కడంటూ ప్రశ్నించాడు. రోడ్డెక్కిన రైతన్నకు బాసటగా నిలుస్తూ.. ‘అన్నదాతకు అండగా వైఎస్సార్‌సీపీ’ అడుగేసింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు రైతులతో కలిసి నిరసనకు నడుం బిగించింది. వైఎస్సార్‌సీపీ చేపట్టిన తొలిపోరుకు మంచి స్పందన లభించడంతో.. అధికార పార్టీ నేతల్లో అలజడి మొదలైంది.
● ‘అన్నదాతకు అండగా వైఎస్సార్‌సీపీ’కి మంచి స్పందన ● కూటమి ప్రభుత్వ వైఖరిౖపైరెతులతో కలిసి నిరసన ప్రదర్శన ● ఇచ్చిన హామీలు నెరవేర్చాలని హోరెత్తిన నినాదాలు ● ఆదుకోవాల్సిన ప్రభుత్వం మోసం చేస్తే సహించేది లేదు ● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్యాలనాయుడు హెచ్చరిక ● అనకాపల్లి రింగ్‌రోడ్డు పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ
సాక్షి, అనకాపల్లి:
రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు.. అన్నదాత ఆనందంగా ఉంటేనే అందరికీ మేలు జరుగుతుంది.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చి మాట నిలుపుకోండి.. అని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఆరు నెలల పాలనలో రైతులు నష్టాల్లో కూరుకుపోయారని, ఆదుకోవాల్సిన ప్రభుత్వమే మోసం చేస్తే సహించేది లేదని మండిపడ్డారు. అన్నదాతకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ నిలుస్తుందన్నారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం వైఎస్సార్‌సీపీ ఉద్యమబాట పట్టింది. అనకాపల్లి టౌన్‌లో రింగ్ రోడ్డు వద్ద వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర భారీ బైక్ ర్యాలీ జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పాల్గొన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవికి బూడి ముత్యాలనాయుడు, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, కన్నబాబురాజు, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, మాజీ ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్, మాజీ జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చిక్కాల రామారావు, ముఖ్యనేతలు చింతకాయల సన్యాసిపాత్రుడు, దంతులూరి దిలీప్‌కుమార్, గొర్లి సూరిబాబు, మలసాల కుమార్‌రాజా, పైలా ప్రసాదరావు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలు మందపాటి జానకీ రామరాజు, రుత్తల యర్రాపాత్రుడు, పెంటకోట స్వామి సత్యనారాయణ, జాజుల రమేష్, పీలా శ్యామ్, పెదిశెట్టి గోవింద్, దంతులూరి శ్రీధర్‌రాజు, శ్రీనివాసరావు, దూళి నాగరాజు, బోదిపు గోవింద్, గొట్టిముక్కల శ్రీనుబాబు, కలగ గున్నయ్యనాయుడు, పీడీ గాంధీ, దగ్గుపల్లి సాయిబాబా, జగత శ్రీనివాస్, రాజేష్ కన్నా, శీరం నరసింహమూర్తి, గొర్లి బాబురావు, లొడగల చంద్రరావు, ఏవీ రత్నకుమారి, సునీత, పద్మ, లాళం జానకీరామ్, కురస జయమ్మ, కురస నారాయణమూర్తి, సుంకర శ్రీనివాసరావు, గొల్లవిల్లి రాజుబాబు, గొల్లవిల్లి స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment