యోగాలో ఆరేళ్ల చిన్నారి ఘనత
చోడవరం: యూనివర్సల్ యోగా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విశాఖ రుషికొండ సాయిప్రియ రిసార్టులో ఆదివారం జరిగిన వరల్డ్ యోగా కప్ 2024 యోగా పోటీల్లో చోడవరం గ్రామానికి చెందిన ముత్యాల దైవజ్జ ప్రతిభ కనబరిచింది. ఈ చిన్నారి చోడవరం పతంజలి యోగా శిక్షణ కేంద్రం యోగా గురువు పుల్లేటి సతీష్ దగ్గర యోగా విద్యను అభ్యసిస్తున్న ఆరేళ్ల చిన్నారి ముత్యాల దైవజ్జ ప్రథమ స్థానం సాధించి యోగా కప్పు కై వసం చేసుకుంది. కాగా ఈ చిన్నారి జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తుందని పలువురు ప్రశంసించారు. ఈ చిన్నారి మత్స్య ఆసనం, పద్మ సర్వంగాసనం, గండబేరుండ ఆసనంలో మంచి ప్రతిభ కనపర్చి విజయం సాధించిందని సతీష్ తెలిపారు. ఈ దైవజ్ఞను ప్రపంచ యోగా విజేతగా తీర్చుదిద్దినందుకు గురువు సతీష్‌ని దైవజ్ఞ తల్లిదండ్రులు నవీన్‌కుమార్, రమ్య అభినందించారు. దైవజ్ఞ సాధించిన ఘనతను పతంజలి యోగా శిక్షణ కేంద్రం సభ్యులు, చోడవరం ప్రముఖులు కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment