మాజీ డిప్యూటీ సీఎం బూడి కారుకు ప్రమాదం
● వేగంగా వచ్చి ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం
దేవరాపల్లి: మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు కారును ద్విచక్ర వాహనం ఢీ కొట్టిందని స్థానిక ఎస్‌ఐ టి. మల్లేశ్వరరావు తెలిపారు. మాజీ మంత్రి తనయుడు బూడి వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. తారువ నుంచి మాజీ మంత్రి బూడి తన వాహనంలో బుధవారం మధ్యాహ్నం దేవరాపల్లి వస్తుండగా.. మారేపల్లి సమీపంలోని రోడ్డు మలుపు తిరిగే సమయంలో.. ఎదురుగా మితిమీరిన వేగంతో వస్తున్న ద్విచక్ర వాహనాన్ని గమనించి ముందుగానే తమ వాహనాన్ని నిలిపివేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి నిలిపివేసిన తమ కారును బలంగా ఢీకొట్టడంతో తమ వాహనం ముందు భాగంగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో ద్విచక్ర వాహనంపై నలుగురు యువకులు ప్రయాణిస్తుండగా, వేపాడ కిశోర్ ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కారును ఢీకొట్టి పడిపోయిన యువకులను మాజీ డిప్యూటీ సీఎం తనయుడు వెంకటేష్ మానవతా దృక్పథంతో దేవరాపల్లిలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది పరీక్షించిన అనంతరం ఇంటికి పంపించేశారు.
Comments
Please login to add a commentAdd a comment