ఘనంగా పారువేట ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా పారువేట ఉత్సవం

Published Thu, Jan 16 2025 8:38 AM | Last Updated on Thu, Jan 16 2025 8:38 AM

ఘనంగా పారువేట ఉత్సవం

ఘనంగా పారువేట ఉత్సవం

● స్వయంభూ శ్రీ వరాహలక్ష్మీ నృసింహాస్వామి

చీడికాడ: మండలంలోని అర్జునగిరిలో శ్రీదేవి,భూదేవి సమేత స్వయంభూ శ్రీవరాహలక్ష్మీ నృసింహాస్వామి పారువేట ఉత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవంలో భాగంగా స్వామి వారి ఉత్సవ మూర్తులను పల్లకిలో ఆలయానికి సమీపంలో గల దేవుని పనుకు వద్దకు తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వరుణదేవుని కరుణకోసం గొర్రె పిల్లకు తొక కోసి విడిచిపెట్టారు. ఆ గొర్రె పిల్ల ఏ దిక్కుకు వెళితే ఆ దిక్కున ఈ ఏడాది అధిక వర్షాలు కురిసి, పంటలు బాగా పండుతాయన్నది నమ్మకమని ఆలయ అర్చకులు పానంగిపల్లి శ్రీనివాసాచార్యులు చెప్పారు. ఈ ఏడాది పుట్టిన మగగొర్రె పిల్లనే ఈ వేటలో వినియోగిస్తారు. తోక కోసి విడిచిపెట్టిన గొర్రెను పట్టుకుని పనుకుపైకి తీసుకు వచ్చిన యువకులను ఉలవకాయల దండలతో సత్కరించారు.దీంతో స్వామి పారువేట ఉత్సవం ముగిసింది. ఈ ఉత్సవాన్ని వందల సంవత్సరాలనుంచి భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్టు సర్పంచ్‌ బి.రమాదేవి,ఎంపీటీసీ అమ్మతల్లినాయుడు తదితరులు తెలిపారు.అనంతరం స్వామి ఉత్సవమూర్తులతో పల్లకీ సేవ నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement