ఉత్సాహంగా గుర్రపు పరుగు పోటీలు
● విజేతలకు బహుమతులు అందజేసిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్
మునగపాక: మండల కేంద్రం మునగపాకలో కనుమ పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి గుర్రపు పరుగు పోటీలకు విశేష స్పందన వచ్చింది. మునగపాక నుంచి వాడ్రాపల్లికి వెళ్లే మార్గంలో సంతబయల యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. పోటీలను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ ప్రారంభించి, విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా కనుమ పండగ రోజున రాజకీయాలకు అతీతంగా గుర్రపు పరుగు పోటీలు నిర్వ హించడం సంతోషకరమన్నారు. ప్రజల్లో ఉత్సాహం నింపేందుకు ఇటువంటి పోటీలు దోహదపడతాయని చెప్పారు. హుషారుగా సాగిన ఈ పోటీలను తిలకించేందుకు వచ్చిన వారితో క్రీడాస్థలం కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పెంటకోట స్వామి సత్యనారాయణ,వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడుపాల్గొన్నారు.న్యాయనిర్ణేతగాఆడారిగోవింద్‌వ్యనహరించారు.
నూక హనుమాన్ గ్రుర్రానికి ప్రథమ బహుమతి :జిల్లాస్థాయి గుర్రపు పరుగు పోటీల్లో నూక హను మాన్ గుర్రం ప్రథమస్థానం పొందింది.పవన్ వాయుపుత్ర, ఉదయ్ దిలీప్,నవీన్,నవీన్ ధర్మలకు చెందిన గుర్రాలు ద్వితీయ,తృతీయ, చతుర్థ,పంచమ బహుమతులు పొందాయి.
Comments
Please login to add a commentAdd a comment