జాతీయ సదస్సుకు మంచాల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్
అవార్డు అందుకుంటున్న వెంకటలక్ష్మి
చీడికాడ: ఉత్తమ విద్యా విధానంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ఏపీ నుంచి మంచాల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కె.వెంకటలక్ష్మి హాజరయ్యారు. ఇటీవల ఢిల్లీలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ‘ఎక్సెంప్లర్స్ ఆఫ్ చేంజ్ అండ్ ఇన్నోవేషన్–2025’ సదస్సు నిర్వహించింది. రాష్ట్రం నుంచి ప్రిన్సిపాల్ వెంకటలక్ష్మి హాజరయ్యారు. ఈ సదస్సులో పాల్గొన్న ఆమె ఉత్తమ విద్యా విధానాల అభివృద్ధిపై ప్రసంగించారు. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న ఉపాధ్యాయులు ఎన్నో వినూత్న స్ఫూర్తిదాయకమైన విషయాలను నేర్చుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment