తమిళనాడు ఉన్నతాధికారి మత్స్యగుండం సందర్శన
సాక్షి,పాడేరు/హుకుంపేట: మత్స్యగుండం మత్స్య లింగేశ్వర స్వామివారిని శుక్రవారం తమిళనాడు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.గోపాల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.మత్స్యగెడ్డ వద్ద మత్స్య దేవతలకు ఆహారం అందించారు. ఆలయ విశిష్టతను స్థానికుల నుంచి తెలుసుకున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తమర్బ బాబూరావు, స్థానిక జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కొట్టగుళ్లి సింహాచలం నాయుడు, సర్పంచ్ మఠం శాంతకుమారి, ఆలయకమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. పాడేరులో మోదకొండమ్మతల్లి ఆలయాన్ని తమిళనాడు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.గోపాల్ సందర్శించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment