రావికమతం (చోడవరం): కోడిపందేలాటలపై పోలీసులు దాడి చేశారు. పందేలు ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేశారు. రావికమతం మండలం పి.పొన్నవోలు, జి.చీడిపల్లి, చినపాచిలి గ్రామాల్లో తోటల్లో కోడిపందాలు నిర్వహిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న రావికమతం, కొత్తకోట ఎస్‌ఐలు రఘువర్మ, శ్రీనివాస్ శుక్రవారం తమ సిబ్బందితో వెళ్లి ఆయా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఏడుగుర్ని అరెస్టు చేసి వారి నుంచి రూ.6,700, రెండు కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. జి.జీడిపల్లి తోటల్లో నలుగుర్ని, చినపాచిలో ముగ్గుర్ని అరెస్టు చేశామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment