40 వేల మెట్రిక్ టన్నులు
ధాన్యం కొనుగోలు లక్ష్యం
ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం 9,361 మెట్రిక్ టన్నులు
అందరికీ అన్నం పెట్టే అన్నదాత పరిస్థితి ఈ ఏడాది దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చేవరకు నానా ఇబ్బందులు పడ్డాడు. తీరా పంట చేతికొచ్చిన తరువాత గిట్టుబాటు ధర లేక దళారుల చేతిలో మోసపోతున్నాడు. కూటమి ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి రైతుకు ఇస్తామన్న పెట్టుబడి సాయం అందించలేదు. విపత్తుల సమయంలో అందించే ఉచిత పంట బీమాకు ఎగనామం పెట్టింది. పంట చేతికొచ్చిన తరువాత కూడా తేమ శాతం ఎక్కువగా ఉందంటూ చిన్నపాటి ముక్కిన ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు తిరస్కరిస్తున్నారు.
ముక్కిన ధాన్యం కొనని మిల్లర్లపై చర్యలు
జిల్లాలో 72 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపడుతున్నాం. ఇప్పటివరకు 9,361 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. కేంద్ర ప్రభుత్వం విధించిన నియమ నిబంధనల ప్రకారం తేమ శాతం 17 కన్నా అధికంగా ఉంటే తీసుకోకూడదు. 18 శాతం నుంచి 19 శాతం వరకు కూడా మేము అనుమతిస్తున్నాం. 17 శాతం కన్నా తేమ ఎక్కువగా ఉంటే ఎండలో ఆరబెట్టి తీసుకురమ్మని అవగాహన కల్పిస్తున్నాం. ముక్కిన ధాన్యం మిల్లర్లు తీసుకోకుంటే చర్యలు తీసుకుంటాం. చాలామంది రైతులు ఆర్‌జేఎల్ ధాన్యం బయట ప్రైవేట్ వారికి ఎక్కువ డబ్బులకు అమ్మేసుకుంటున్నారు. ఆర్‌జేఎల్ కానటువంటి ధాన్యమే మాకు అమ్ముతున్నారు.
– జయంతి, పౌరసరఫరాల శాఖ అధికారి
రైతు కష్టాలు
తడిసి మోపెడు
సాక్షి, అనకాపల్లి: ఈ ఏడాది ఖరీఫ్‌లో పంట ఆలస్యం కావడంతో ధాన్యం విక్రయించేందుకు రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో గతేడాదిలో భారీ వర్షాల కారణంగా సుమారుగా 3 వేల ఎకరాలకు పైగా పంట నీట మునిగింది. దిగుబడి తగ్గింది. ధాన్యం ముక్కిపోయాయి. మిల్లర్లు, ప్రైవేట్ దళారులు కొనడానికి ససేమిరా అంటున్నారు. దీంతో చాలా వరకు రైతులు పండిన పంట నూర్పులు చేయకుండా కుప్పలు వేసుకున్నారు. జిల్లాలో మందకొడిగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాగుతోంది. గతేడాది డిసెంబర్ మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జరుగుతోంది. ఆర్‌జేఎల్ ధాన్యం అయితేనే మిల్లర్లు, ప్రైవేట్ దళారులు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అనకాపల్లి మండల పరిధిలో తగరంపూడి, సీతానగరం, తుమ్మపాల, వెంకుపాలెం, రేబాక, శంకరం, ఆవఖండం భూములు, కశింకోట మండలంలో నూతలగుంటలపాలెం, ఏనుగుతుని, ఏఎస్ పేట, కశింకోట, వెదురుపర్తి, గొబ్బూరు, నర్సింగబిల్లి, నక్కపల్లి, పాయకరావుపేట, నాతవరం, నర్సీపట్నం, బుచ్చెయ్యపేట మండల పరిధిలో పంట నీటి మునకకు గురైంది.
72 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు
ఖరీఫ్‌లో పండించిన ధాన్యం కొనుగోలుకు జిల్లా అధికారులు మొత్తం 72 ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాదిలో 40 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని పౌరసరఫరాల అధికారులు లక్ష్యం పెట్టుకున్నారు. జిల్లాలో మొత్తం వరికోతలు పూర్తయ్యాయి. నూర్పులు కన్నా కుప్పలుగానే ఎక్కువగా వేశారు. ఈ ఏడాది 3.5 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. జిల్లాలో 50 రైతు సేవా కేంద్రాలు, 22 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ధ్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. డిసెంబరు మొదటి వారం నుంచి ధాన్యం సేకరణ చేపట్టారు. గ్రేడ్ ‘ఎ’ రకం ధాన్యం క్వింటాకు రూ.2,320, సాధారణ రకం అయితే రూ.2,300కు కొనుగోలు చేస్తారు. ధాన్యంలో తేమ శాతాన్ని కొలిచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.
జిల్లాలో ధాన్యం కొనుగోలు వివరాలు ఇలా..
జిల్లాలో 3,021 మంది రైతుల నుంచి ఇప్పటి వరకు
9,361 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
రూ.21.08 కోట్ల నగదు వారి ఖాతాల్లో జమ చేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు
72
ధాన్యం దిగుబడి
3.5 లక్షల మెట్రిక్ టన్నులు
ముక్కిన ధాన్యం కొనుగోళ్లకు మిల్లర్లు ససేమిరా
ఖరీఫ్ సీజన్‌లో రెండుసార్లు వరి పంట మునక
పూర్తి స్థాయిలో ముక్కిన ధాన్యం తీసుకోమంటున్న అధికారులు
జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు
దళారుల వలలో అన్నదాతలు
Comments
Please login to add a commentAdd a comment