ప్రజావ్యతిరేక బడ్జెట్‌పై నిరసన
అనంతపురం అర్బన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పూర్తి ప్రజావ్యతిరేకంగా ఉందంటూ సీపీఎం నాయకులు ధ్వజమెత్తారు. బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ ఆదివారం అనంతపురంలోని టవర్‌క్లాక్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు వెంకటనారాయణ, ముత్తూజ, గోపాల్ మాట్లాడారు. బడ్జెట్‌లో రాష్ట్రం గురించి కనీసంగానూ మాట కూడా లేదన్నారు. గతంలో, ఇప్పుడూ బీహార్‌కు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించారన్నారు. రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీకి శాశ్వత మంగళం పాడినట్లైందన్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేలా పలు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. కొత్తగా ప్రతిపాదించిన బడ్జెట్‌లో ప్రధానమంత్రి కిసాన్ ధన్ ధాన్య పథకం పేరుతో 100 జిల్లాల్లో కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడమే నిదర్శనమన్నారు. సుధీర్ఘకాలంగా రైతులు పోరాడుతున్న వ్యవసాయ కొత్త చట్టాల రద్దు గురించి, రైతు ఆత్మహత్యల గురించి ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు. బీమా రంగంలోనూ వందశాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడంతో ఆ రంగం పూర్తిగా విదేశీ కంపనీల చేతుల్లోకి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ సంస్కరణలు అమలు చేసి అదనపు అప్పులకు అవకాశం ఇస్తామనడం అత్యంత దుర్మార్గమన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు గత ఏడాది రూ.8,622 కోట్లు కేటాయిస్తే, ఈ బడ్జెట్‌లో రూ.3,195 కోట్లు కేటాయించడాన్ని ఏలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. విభజన హామీల్లో భాగంగా కడప ఉక్కు ఫ్యాక్టరీ ప్రస్తావన లేదన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని ప్రజలు ఇప్పటికై నా గుర్తించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వలి, మసూద్, వెంకటేష్, బుల్లెరాజు, ఓబుళేసు, లతీఫ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment